మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(బంధించేవాడు నలుడు, బంధింపబడేవాడు నలుడు) అనేవి రెండు నిర్వచనాలు.
‘‘నలం’’అనే శబ్దానికి ఛిద్రము, లేక రంధ్రము అని అర్థం. దీని మీద నుంచీనే నాళము, నాళిక, ప్రణాళిక వంటి శబ్దాలు ఉత్పన్నమయినాయి. వీటన్నింటిలోనూ వ్యుత్పత్తిపైన చెప్పుకొన్నదే.
ఈ నిర్వచనాలన్నీ నలమహారాజుకు ఎలా అన్వయిస్తాయో చూద్దాం.
నలుడు నిషధ దేశపు రాజు. ఇది హిమాలయాలకు దగ్గరలోవున్న చిన్న అనామక రాజ్యం. దీని ఉత్పత్తి గురించి భారతంలోని నల చరిత్రలో లేకపోయినా, ఇతర పురాణాలలో వుంది. నలుడు పరాక్రమవంతుడై ఈ చిన్నరాజ్యాన్ని బాగా పెంచి, శత్రువులను తన వశంచేసుకొని, నల చక్రవర్తిగా మారాడు. కనుక, ‘‘అన్నిటినీ తన వశంచేసుకొంటాడు’’అనే నిర్వచనం ఇతనికి అతుకుతోంది.
అదిగాక, నరుడు నారాయణాంశ సంభూతుడు కనుక, నలనామకుడైన నరుడిలో నారాయణాంశ విశేషంగా వుందనే సూచననుగూడా ఈ నిర్వచనం మనకు అందిస్తోంది.
రెండవ నిర్వచనం బంధించేవాడు, బంధింపబడేవాడు- అని రెండు అర్థాలు చెపుతోంది. నలుడు హంసను బంధించాడు. కలిచేత, కర్కోటకుడి చేత బంధింపబడ్డాడు. అదీకాక, ఎంత ఉత్తముడైనా, ఆత్మజ్ఞాని కాదు కనుక, అజ్ఞానబంధంలో చిక్కుకునే వున్నాడు.
మూడవ నిర్వచనం ‘‘రంధ్రంకలవాడు’’అని చెపుతోంది. నలుడిలోగల ప్రధాన రంధ్రం (దోషం) ద్యూతప్రీతే. దానివల్లే, ఇతడు కలిపురుషుడికి లొంగిపోయాడు. ఈ విషయాన్ని నొక్కిచెప్పడంకోసమే వ్యాస భగవానుడు కథాప్రారంభంలోనే నలుడ్ణి ఒకప్రక్క పొగుడుతూనే-
‘‘అక్షప్రియ స్సత్యవాదీ మహాన్ అక్షౌహిణీపతిః’’
(నలుడికి పాచికలంటే మోజు. అతడు సత్యవాది, గొప్పవాడు, అక్షౌహిణీ సేనకు అధిపతి) అన్నాడు. ఈ శ్లోకంలో ‘‘అక్ష’’శబ్దాన్ని రెండుసార్లు వాడటాన్ని మనం గమనించకుండా వుండకూడదు. అక్షాలంటే పాచికలు, అక్షాలు అంటే ఇంద్రియాలు, అక్షలంటే సేనా విభాగాలు. ఇవన్నీ వ్యసనాలకు మార్గాలే. ఇవే నలుడిలోని రంధ్రాలు.
ఈ రాజుకి బలము, బలహీనతాకూడా అశ్వవిద్యే. ఈ విషయాన్నికూడా వ్యాసమహర్షి కథాప్రారంభంలోనే చొప్పించేశాడు-
‘‘ఉపపన్నో గుణై రిష్టైః రూపవాన్ అశ్వకోవిదః’’
(ప్రజలకు ప్రియమైన గుణాలుకలవాడు, అందగాడు, అశ్వవిద్యలో ఆరితేరినవాడు)- అని. అశ్వవిద్యను గురించిన చర్చ దగ్గరకు తరవాత వద్దాం.
కాగా, నలుడు ఐహికంగానూ, ఆధ్యాత్మకంగానూ కూడా ఎంతో ఉన్నత జీవి అయినా కూడా, మానవ సహజమైన రంధ్రాలు (దోషాలు) అతడికి వున్నాయి. కాకపోతే, అవికూడా సద్గుణాలంత ప్రబలంగానే వున్నాయి- అని పై మూడు నిర్వచనాలూ సూచిస్తున్నాయి.
దమయంతీ నామ నిర్వచనం:
ఇక కథలోని రెండవ ప్రధాన పాత్ర దమయంతి. ‘‘దమయతి నిగృహ్ణాతి దమయంతీ’’ (నిగ్రహించేశక్తి దమయంతి) - అనే నిర్వచనం. దానికి తగ్గట్టే వ్యాస మహర్షి ఆమె చరిత్రను ‘‘దమ’’శబ్దంతో నింపివేశాడు. ఆమె దేశం పేరు విదర్భ. (విశేషమైన దర్భలు కలది, యజ్ఞాలు కలది.)
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి