మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఆ అపప్రథను మరచిపోయి, కర్కోటక శబ్ద నిర్వచనంలోకి వెళ్ళాలి.
కర్కోటక శబ్దంలో ‘‘కర్క-అట’’అని రెండు విభాగాలున్నాయి.
అందులో ‘‘కర్క’’ శబ్దానికి- ‘‘కరోతి కౌతుకం ఇతి కర్కః’’ (ఉబలాటాన్ని కలిగించేది) అని లియాభట్టీయ నిర్వచనం. ‘‘కరోతి అదిష్టం పాలయతి ఇతి కర్కః’’ (చెప్పింది చేసేవాడు) అని శబ్దకల్పద్రమ నిర్వచనం. ‘‘కర్కం కంటకమయత్వాత్ కఠోరం అటతి ప్రాప్నోతి- తద్రూపతయా కాయతి ప్రకాశతే ఇతి కర్కోటకః (పృషోదరాది గణం)- బిల్వవృక్షః’’ (కర్కమంటే ముళ్ళ కాఠిన్యం. వాటితో నిండి వుండి ప్రకాశించేది కర్కోటకం- అదే బిల్వవృక్షం) అని శబ్దకల్పద్రుమ నిర్వచనం.
కాగా, కర్కోటక శబ్దం ప్రధానంగా బిల్వవృక్షపరం. దీనిలో ఉబలాటాన్ని కలిగించే గుణము, ముళ్ళతో పొడిచే గుణము, శివ ప్రియత్వగుణము, శ్రీదేనివాసత్వ గుణము- అన్నీ కలిసి వున్నాయి. ఈ పేరునే కద్రూమాత తన కొడుకుకి పెట్టుకొంది. శివప్రియుడు, శివుడికి ప్రతినిధీ, కనుకనే, కర్కోటకుడు నలుడికి గురువుకావటంకోసం పాతాళంనుంచి పైకి రావలసి వచ్చింది. ఇది కూడా శివాజ్ఞకు ఫలితమేనని మనం ఊహించవలసి వచ్చింది.కథలో కర్కోటకుడి యొక్క గురుత్వాన్ని గురించిన విషయం ఏదీ ప్రస్ఫుటంగా లేని మాట నిజమే. కానీ, పరోక్షంగా వ్యాసమహర్షి ఆ సూచన చేయనే చేశాడు.
అడవిలో అగ్నిజ్వాలలో చిక్కుకొని వున్న కర్కోటకుడు నలుడ్ణి చూసి- ‘‘రాజా! నేను నాగరాజుని. ఒకప్పుడు నేను నారద మహర్షిని కాటు వేశాను. దానికి ఆయన కోపగించి కదలకుండా పడి వుండమని నన్ను శపించాడు. నలుడనేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ శాపం తీరుతుందని గూడా చెప్పాడు. కనుక, నన్ను రక్షించు’’అన్నాడు.
‘‘నారం జ్ఞానం దదాతీతి నారదః’’ (జ్ఞానాన్నిచ్చేవాడే నారదుడు) అనే నిర్వచనం సుప్రసిద్ధం. వాల్మీకి మహర్షి దగ్గరనుంచీ త్యాగరాజస్వామి దాకా ఉత్తమ సాధకులందరికీ వెంటపడి జ్ఞానోపదేశం చేసిన జగద్గురువు నారదుడని గూడా పురాణవేత్తలకు తెలుసు. అలాంటి మహాగురువును కర్కోటకుడు కాటువేశాడు.
ఆ తరువాత అతడే నలుడ్ణి కాటువేశాడు. ఆ కాటువల్లే నలుడ్ణి ఆవహించి వున్న కలిపురుషుడు, ఎండకు నల్లి మాడినట్లు మాడి, బయటకు వచ్చేశాడు. కలి ఎప్పుడు వదలుతాడు? మనిషికి జ్ఞానం కలిగితేనే వదలుతాడు! కనుక, కర్కోటకుడి కాటు అంటే, మారేడు ముల్లు కాటు వంటిది అన్నమాట! ‘‘ముచ్యంతే కంటకాఘాతాత్- కంటకేభ్యో హి మానవాః’’ (మారేడు ముల్లు గుచ్చుకుంటే, మానవులకు సంసారపు ముళ్ళు తొలగిపోతాయి.)అని బిల్వాష్టోత్తర శత స్తోత్రం కీర్తిస్తోంది.
కాగా, జ్ఞానగర్వలేశంవల్ల కర్కోటకుడు నారదుడికే కాటు వేయబోయాడు. అంటే, జ్ఞానోపదేశం చేయబోయాడు, అన్నమాట! అందుకే, ఆయన కర్కోటకుడ్ణి కదలకుండా పడి వుండమన్నాడు. ‘‘యే గత్యర్థాః తే జ్ఞానార్థాః’’ (కదలికను చెప్పే శబ్దాలన్నీ జ్ఞానాన్ని గూడా చెపుతాయి) అని వ్యాకరణ మర్యాద. కాగా, కదలకుండా పడి వుండటమంటే, జ్ఞానం లేకుండా పడి వుండటమే. అలా వున్నాడు గనుకనే కర్కోటకుడు గురువు కాగలిగాడు.

- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి