మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో ఒక కర్మశేషలేశం చేత శాశ్వత నిర్వికల్ప సమాధిలో వుండటం కుదరనివారే గురువులు కాగలుగుతారనీ, పరిపూర్ణ జ్ఞాననిష్ఠగలవారు లోకవ్యవహారంలోకి రానే రారు గనుక, వారు శిష్యోపదేశ కృత్యాన్ని గూడా చేపట్టరనీ, వేదాంత గ్రంథాల్లో స్పష్టంగా చెప్పనే చెప్పారు. యోగ వాసిష్ఠం వంటి గ్రంథాలలో ఈ విషయాలు మరింత వివరంగా వున్నాయి.
కర్కోటకుడు జ్ఞాననిష్ఠ గలవాడనీ, ఆ నిష్ఠ శాపంవల్ల తాత్కాలికంగా నిరుద్ధమైందనీ, మూల కథలో ఎక్కడుంది? కథలో లేదు. కథాంతంలోని సూత్ర శ్లోకంలో వుంది. అక్కడ ‘‘కర్కోటకస్య నాగస్య’’అని వుంది. అంటే, కర్కోటకుడికి ‘‘నాగుడు’’అనే విశేషణం వేయబడింది.
‘‘నాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థవాచకాః’’ (వ్యాఘ్రము, సింహము, నాగము వంటి పదాలు శ్రేష్ఠత్వాన్ని చెపుతాయి) అని అమరకోశం. కనుక, కర్కోటకుడు శ్రేష్ఠుడు. అధ్యాత్మ విద్యలో గురువే శ్రేష్ఠుడు. గురుశబ్దం గూడా శ్రేష్ఠవాచకమే కదా!
‘‘గమ్‌ల్ గతౌ’’ (కదలుట) అదే ధాతువునుంచీ ‘‘గః’’(కదిలేవాడు) అనే ఉపపదం ఏర్పడుతోంది. గత్యర్థకాలాన్నీ జ్ఞానార్థకాలు గనుక, ‘‘గః’’అంటే జ్ఞాని. దానిమీంచి, ‘‘న గచ్ఛతీతి అగః’’ (కదలనివాడు అగుడు)- అనే రూపం వచ్చింది. దీని మీంచి, ‘‘న అగః-నాగః’’ (కదలనివాడు కానివాడు నాగుడు) అనే రూపం వచ్చింది. (న అభాగః నాభాగః అన్నట్లుగా.) ఈ పదానికి, పాము, పర్వతజన్యము, ఏనుగు, సీసము వంటి అర్థాలున్నాయి.
ఇక్కడ ‘‘కదలుట’’అనే పదానికి ‘‘జ్ఞానము’’అనే అర్థాన్ని తీసుకుంటే, ‘‘నాగః’’అనే పదానికి ‘‘జ్ఞానం లేనివాడు కానివాడు’’ అనే అర్థం వస్తుంది.
నలుడి ప్రథమ దర్శన సమయంలో కర్కోటకుడి పరిస్థితి అదే. అతడు కదలిక లేనివాడు కాదు. కానీ, కదలకుండా పడివున్నాడు. జ్ఞానం లేనివాడు కాదు. కానీ, అజ్ఞాని లాగా వున్నాడు. అతడు స్వయంగా శ్రేష్ఠుడు. అందుకే, అతడు ‘‘నాగుడు’’. అందుకే, అతడు గురుస్థానీయుడు.
అందుకే, ‘‘కర్కోటకస్య నాగస్య’’అనే కలినివారకమంత్రంలో అతడికి ప్రప్రథమస్థానం లభించింది.
ఆ శ్లోకానికి అంత ప్రాధాన్యం ఇవ్వాలా?
వ్యాస రచనలోనూ, ఇతర మహర్షుల రచనల్లోనూ, ఉపక్రమోపసంహారాలలో గల శ్లోకాలకు అనేక నిగూఢార్థాలు అంతర్లీనంగా వుండటం పండితులకు తెలిసిన విషయమే. ఉదాహరణకు, సప్తశతీ గ్రంథంలోని ప్రథమ శ్లోకంలో ‘‘సావర్ణిస్సూర్యతనయః’’ అంటూ కథాప్రస్తావనే బయటకు కనిపిస్తున్నా, దానిలో దేవీనవార్ణ మహామంత్రోద్ధారం వుంది. సుందరకాండ ప్రారంభంలోని ‘‘తతో రావణనీతాయాః’’ శ్లోకంలో అనేక మంత్ర రహస్యాలున్నాయని వ్యాఖ్యాతలు నిగ్గుదేల్చారు. అలాగే, ‘‘కర్కోటకస్య నాగస్య’’ శ్లోకంలో గూడా ప్రతిపదమూ మంత్రాత్మకమే, పరిపూర్ణ భావగర్భితమే. కనుకనే, ఆ శ్లోకానికి అంత ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.
ఋతుపర్ణుడి రాజర్షిత్వం:
‘‘అలా అయితే, ఆ శ్లోకంలో, నాయికా నాయకులైన దమయంతీ నలులకు ఏ విశేషణమూ వేయకుండా, కర్కోటకుడికీ, ఋతుపర్ణుడికీ మాత్రమే ఎందుకు వేశారు?
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి