మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందులోనూ ‘‘ఋతుపర్ణస్య రాజర్షేః’’ అంటూ అనామకుడైన ఋతుపర్ణుడ్ణి రాజర్షిగా కీర్తించటంలో ఔచిత్యమేమిటి? కథలో ఆ రాజుకి ఏ రకమైన ప్రాధాన్యమూ కనుపించటం లేదు కదా?!’’ - అని ఆలోచిస్తున్నారా?
ఇది తెలియాలంటే, కర్కోటకుడు నలుడికి ఏమి ఉపదేశం చేశాడో పరిశీలించాలి.
కర్కోటకుడు నలుడికి కొత్తగా ఏమీ ఉపదేశించలేదు. కానీ, అతడికి తీవ్ర తాపాన్నీ, విరూపత్వాన్నీ, కలిగించటం వంటి ప్రక్రియల ద్వారా అతడిలో గల నలత్వాన్ని, అనగా రంధ్ర సహితత్వాన్ని, తొలగించి, అనగా కలిపురుషుడ్ణి బయటకు గెంటేసి, అతడిని అంతర్గతంగా ప్రక్షాళన చేసి, పరిశుద్ధుడ్ణి చేశాడు. ఈ శుద్ధివలన నలుడిలో అంతకుముందే వున్న అశ్వవిద్య అధ్యాత్మవిద్యగా మారింది.
మంత్ర శాస్త్రంలోని రహస్య విద్యలన్నీ సామాన్యంగా ద్విముఖంగా వుంటాయి. అంటే, అదే మంత్రానికి సకామప్రయోగం ఒకటి, నిష్కామ ప్రయోగం ఒకటి వుంటుంది. గురువులు సకామ విద్యారహస్యాలను బయట పెట్టినంత సులభంగా నిష్కామ విద్యారహస్యాలను బయటపెట్టరు. దానికి కారణమేమిటంటే, శిష్యుడిలో సరియైన అర్హత రాకముందే వాటిని బయటపెట్టినా ఉపయోగం రవ్వంతకూడా వుండదు. అందుకే, పాశుపత మహావిద్యను కూడా సంపాదించిన మహామంత్రవేత్త అయిన అర్జునుడికి కూడా, 90 యేళ్ళ స్నేహం తరువాత గానీ, శ్రీకృష్ణ భగవానుడు నిష్కామ కర్మయోగోపదేశం చేయలేదు.
ఇక్కడ నలుడి పూర్వగురువు ఎవరో తెలియదుగానీ, ఆయన వద్దనుంచీ పొందిన అశ్వవిద్యను నలుడు యుద్ధోపయోగి అయిన సకామివిద్యగానే వినియోగించుకుంటూ వస్తున్నాడు. బాహుకరూపంలో ఋతుపర్ణుడి పంచన పడివున్న నలుడు, తీవ్ర పరితాపానికి గురియై, ఆత్మపరిశీలన చేసుకొంటున్న రోజులలో, నలుడిలోని సకామమైన అశ్వహృదయ విద్య క్రమంగా నిష్కామాశ్వవిద్యగా వికాసం చెందింది. ఈ వికాసం కర్కోటకుడి పుణ్యమే. ఈ వికాసమే నలుడిని అక్షహృదయ విద్యాస్వీకారానికి యోగ్యుడిగా తీర్చిదిద్దింది. ఇదికూడా కర్కోటకుడి పుణ్యమే.
అశ్వహృదయ- అక్ష హృదయాలు అనే విద్యలు పరస్పర పరిపోషకాలు. వీటిలో అక్షహృదయాన్ని సకామముఖంగా ఉపాసిస్తే సంఖ్యాగణన శాస్తమ్రు, పాచికల శాస్తమ్రు సిద్ధిస్తాయి. నిష్కామంగా ఉపాసిస్తే, అకారాది క్షకారాంత సర్వమంత్రాలూ స్వాధీనమయ్యే ఆత్మవిద్యగా పరిణమిస్తుంది. దానివల్ల అక్ష విజయం అనగా, ఇంద్రియాల మీది విజయము, వెన్నుముక మీది విజయము కూడా, సాధకుడికి సిద్ధిస్తాయి. ఈ సిద్ధులన్నీ అందుకున్నవాడే ఋతుపర్ణుడు.
‘‘ఋతు’’ శబ్దం ‘‘ఋ గతౌ’’ (గమనము, తెలివి, జ్ఞానము) అనే ధాతువునుంచి పుట్టింది. ‘‘పర్ణ’’శబ్దం ‘ప్రూ పాలన పూరణయోః’’ (రక్షించుట, నింపుట) అనే ధాతువునుంచీ పుట్టింది. ‘‘పర్ణయతీతి పర్ణః’’అని శబ్దకల్పద్రుమం. కాగా జ్ఞానాన్ని నింపేవాడు, రక్షించేవాడు, ఋతుపర్ణుడు అవుతున్నాడు. అందుకే ఋతుపర్ణమహారాజు ‘‘రాజర్షి’’అని కీర్తింపబడుతున్నాడు.

- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి