మెయిన్ ఫీచర్

వంటిల్లు ఓ ఔషధశాల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి చిన్న విషయానికి ఆసుపత్రికి పరుగుపెట్టడం ఈరోజుల్లో మనకు అలవాటైపోయిందిగానీ, చిన్న చిన్న అనారోగ్యాలకు మన వంటిల్లే ఔషధశాలగా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మనం వంటల్లో ఉపయోగించే చాలా వాటిల్లో ఔషధ గుణాలు పుష్కలంగా వున్నాయి. అంతకుమించి ఇవి శరీరానికి ఎలాంటి హాని కూడా చేయవు. కాబట్టి తరచుగా వచ్చే చిన్నపాటి అనారోగ్యాలు, దెబ్బలు, గాయాలకు వంటిల్లే క్లినిక్ సెంటర్. మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌కోసం వెతుక్కునేముందు ఒకసారి వంటింట్లోకి వెళితే బాధితుల బాధకు దివ్యౌషధాలు దొరుకుతాయి.
నోటిపూతకు..
చాలామందికి నోటిపూత చాలా బాధిస్తుంది. అంతేకాదు మందులు వేసుకున్నా అంత త్వరగా తగ్గదు. ఒక్కోసారి నోట్లో పుళ్లు మానేసరికి వారాలు, నెలలు కూడా పట్టవచ్చు. నోటిపూతకు టీ బ్యాగులతో మంచి చికిత్స చేయవచ్చు. టీలో వున్న టానియన్స్ నోటిపూత బాధనుంచి వెంటనే ఉపశమనం కల్గిస్తుంది. ఇది పొక్కులపై పూతగా ఏర్పడి బాధను తగ్గిస్తుంది. టీ బ్యాగుని గోరువెచ్చని నీటిలో ముంచి తర్వాత దానిని నాలుకమీద వుంచుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచితే బాధ తగ్గముఖం పడుతుంది.
చక్కని శ్వాసకు..
శ్వాస సమస్యతో బాధపడే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు హఠాత్తుగా తమ ఇన్‌హేలర్ అయిపోతే వెంటనే ఒక కప్పు కాఫీ తాగమంటున్నారు పరిశోధకులు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను తొలగించే మందులు ఎలా పనిచేస్తాయో కెఫిన్ రసాయనిక చర్య కూడా అంత బాగా పనిచేస్తుంది. అయితే ఇన్‌హేలర్‌కు బదులు పూర్తి ప్రత్యామ్నాయంగా కాఫీనే వాడమని చెప్పడంలేదు. ఇన్‌హేలర్ అందుబాటులో లేనపుడు, అత్యవసర సమయాల్లో రెండు కప్పుల బ్లాక్ కాఫీతాగితే సరిపోతుంది.
పొట్ట సమస్యలకు..
అల్లం టీని చాలామంది వాడుతుంటారు. అది రుచికే కాదు వైద్యానికీ భేషైనది. అజీర్తి, కడుపులో తిప్పటం లాంటి బాధలు అల్లం టీతో వెంటనే సర్దుకుంటాయి. అలాగే వాంతులు వచ్చినట్లుండటం, తల తిప్పటం మొదలైన వాటిని కూడా తగ్గించగలుగుతుంది.
కాలిన గాయాలకు..
కాలిన గాయాలకు తేనె బాగా పనిచేస్తుంది. చర్మం కాలినపుడు జరిగే హాని చాలావరకూ గాయాలమీద కింద బొబ్బలవల్ల జరుగుతుంది. చర్మం కాలినపుడు బొబ్బలు, వాపు రాకుండా నివారించే చర్యలో తేనె బాగా పనిచేస్తుందని వైద్యులు పరిశోధనలు చేసి చెబుతూనే ఉన్నారు. చిన్నపాటి కాలిన గాయాలకు తేనెని వాడవచ్చు. ముందు చర్మంపై కాలిన ప్రదేశాన్ని నీటి ధార కింద ఒక నిమిషం పాటు ఉంచాలి. దీనివల్ల చర్మం ఇంకా లోపల ఉడికిపోవటం తగ్గుతుంది. తరువాత ఆ ప్రదేశంలో సున్నితంగా తేనెని రాసి బాండేజ్ వేయాలి. అయితే దీనిని చిన్న గాయాలకు మాత్రమే వాడటం మంచిది.
తెగిన గాయాలకు..
చర్మం తెగి గాయమైతే అది మరింత హాని చేయకుండా తెగిన చోట వెంటనే చిటికెడు నల్ల మిరియాల పొడిని చల్లాలి. దీనిలో వున్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని త్వరగా మానేలా చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్ ఎలాగైతే మంటపుడుతుందో అలాగే నల్ల మిరియాల పొడి కొన్ని సెకన్లపాటు మంటపుడుతుంది. ఇది చర్మ కణాలకు ఎలాంటి హాని చేయదు.
వెక్కిళ్ళకు..
వెక్కిళ్ళు ఒక్కోసారి చిరాకు అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. వీటిని ఆపడం అసాధ్యమవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదారను తింటే చాలు. వెక్కిళ్ళు వాటంతట అవే తగ్గిపోతాయి.
దోమలు, తేనెటీగలు కుడితే..
తేనెటీగ కుట్టి బాధపడుతున్నపుడు, దోమలు కుట్టినపుడు వచ్చే దురదలకు బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించడమే కాకుండా వాపుని రాకుండా ఆపుతుంది. అలాగే మచ్చలు కూడా ఏర్పడవు.
జలుబుకు..
తగిన శాస్ర్తీయాధారాలు లభించినప్పటికీ జలుబుకి మసాలాలు దట్టించిన ఆహారం, కోడిమాంసం వంటివి తీసుకుంటే ఉపశమనంగా ఉండటం గమనించవచ్చు. జలుబుకు చేపల కూర పులుసు మరీ బెస్ట్.
మురికిని వదిలించేందుకు..
స్నానానికి ఉప్పు వాడకం వింటున్నాం కానీ ఇదో కొత్త పద్ధతి. ఒక కప్పు పంచదార తీసుకుని పేస్టులా కలపాలి. దీనిని ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేయడంద్వారా మురికి బాగా వదులుతుంది. మీకిష్టమైన క్లెన్సర్‌ను కూడా దీనితోపాటు వాడవచ్చు.
పాలిచ్చే తల్లులకోసం..
తల్లికి పాలు గడ్డకట్టడంవల్ల రొమ్ముల్లో వచ్చే వాపు, నొప్పులకు క్యాబేజీ ఆకులు ఉపశమనం ఇస్తాయి. చెస్ట్‌పై క్యాబేజీ ఆకులను పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటే నొప్పులు తగ్గడమే కాకుండా వాపు తగ్గుతుంది. అలాగే బహిష్టుకి ముందు వచ్చే రొమ్ము నొప్పికి క్యాబేజీ ఆకులు ఉడికించి కట్టడంవల్ల మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజీకి ఆకులు (పైపొరలు) పెద్దవి చేసి వాటిని మెత్తబడేవరకు ఉడికించి, వీటిని గోరువెచ్చగా అయ్యాక నొప్పిగా వున్న రొమ్ములమీద బాగా చల్లారేదాకా ఉంచితే ఉపశమనం తప్పక ఇస్తుంది.
గొంతు నొప్పులకు..
గొంతు నొప్పిగా వుంటే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు కలుపుకుని బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు చేయవచ్చు. అలాగే బాగా వేడి చేసి నోరు పూసినవారు కూడా ఇలానే చేస్తే ఉపశమనం ఇస్తుంది.
శిరోజాలకు..
నూనె, గుడ్డు, పాలు కలుపుకుని ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని స్నానం చేయడంవల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. అందంగా శిరోజాలకు మెరుపును సంతరించుకుంటుంది. వెంట్రుకలు వూడిపోకుండా మిశ్రమం బాగా పనిచేస్తుంది.
కళ్ళకు..
బంగాళా దుంపలను చక్రాలుగా కోసుకుని ఐదారు నిమిషాలు కళ్ళపై ఉంచుకుంటే కళ్ళకింద చర్మం జారడం, కళ్ళకు కలిగిన శ్రమ తగ్గుతాయి. ఇలాగే దోసకాయ కూడా పనిచేస్తుంది. కళ్ళు మంటలు తగ్గుతాయి. అందానికి, ఆరోగ్యానికి ఇవన్నీ దివ్యౌషధాలే!