మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే, ఇతడు అయోధ్యాధిపతి. ‘‘దేవానాం పూరయోధ్యా’’(దేవతల నగరమైన హృదయపద్మమే అయోధ్య) - అని శ్రుతి!
కర్కోటకుడి గురుత్వం:
గురువులు చేసే ఆత్మవిద్యోపదేశక్రమంలో శిష్యులకు సత్సాంగత్యం కలిగించడం ఒక ప్రధాన సోపానం. ‘‘సత్సంగత్వే నిస్సంగత్వం’’అని గదా ఆదిశంకరుల అమరసూక్తి! ఈ సత్సాంగత్యసిద్ధికోసమే కర్కోటకుడు నలుడ్ణి ఋతుపర్ణుడి దగ్గరికి ప్రత్యేకంగా చెప్పి పంపించాడు.
దానికోసం నలుడికి విరూపత్వం కలిగించడం దేనికి?
అందుకు మూడు ప్రయోజనాలు వున్నాయి. ఒకటి, నలుడికి శత్రువులనుంచి రక్షణ. రెండు, నలుడికికి గల సౌందర్య గర్వపరిహారం. నలుడు వికృతమైన బాహుకరూపంలో వున్నా గూడా, దమయంతి అతడిని ప్రేమిస్తూనే వుందనే విషయాన్ని నలుడు ద్వితీయ స్వయంవర ప్రసక్తి సందర్భంలో గుర్తించాడు. దీనివల్ల, తన శారీరక సౌందర్యానికిగల విలువ ఏమిటో నలుడికి బాగాతెలిసివచ్చి, అతడి సౌందర్యగర్వం పూర్తిగా బూడిద అయిపోయింది.
దానితోపాటు, దమయంతి యొక్క నిస్స్వార్థ ప్రేమభావన ముందు తన ప్రేమ ఎంత నిస్సారంగా వుందో గూడా అర్థమైంది. మూడు, ఒకే జీవితంలో ఒకే వ్యక్తికి రెండు వేరువేరు శరీరాలు లభిస్తే, ఆ వ్యక్తికి ‘‘నేను ఈ శరీరాన్ని కాను’’అనే జ్ఞానం ఎవరూ చెప్పకుండానే వస్తుంది.
దానితోపాటు ‘‘అయితే నేనెవరు?’’అనే విచారణ కూడా ప్రారంభమవుతుంది. ఇవన్నీ అధ్యాత్మ విద్యలో క్రమసోపానాలే. నలుడికి ఇవన్నీ కర్కోటకుడు పెట్టిన భిక్షలే.
ఈ భిక్షలు నలుడిలో సరిగా జీర్ణంకావటానికి సహకారం చేసింది ఋతుపర్ణ సాంగత్యమే.
స్వయంగా మహారాజైనవాడు మరో మహారాజుకి వంటవాడై, అన్నం పెట్టే ఆంతరంగిక సేవకుడైనప్పుడు, భోగశీలుడైన తనకూ, జితేంద్రియుడై, జిహ్వాది చాపల్యరహితుడై, అకారాది క్షకారాంత విద్యామనన తత్పరుడైవున్న రెండవ రాజుకూగల భేదాన్ని మొదటివాడు తేలిగ్గా గుర్తించగలుగుతాడు. నలుడికి ఈ అవకాశం కల్పించింది కర్కోటకుడే.
కాగా, ఋతుపర్ణుడి యొక్క అంతస్సారాన్ని గుర్తించగల శక్తి, దానితోపాటు నలుడికి అతడి సాంగత్యాన్ని కలిగించి నలుడిలో అంతస్సారాన్ని నింపగల శక్తీకూడా కర్కోటకుడికి వున్నాయి. అందుకే, అతడు వేరే ఉపదేశం చేయకపోయినా, నలుడికి గురుస్థానీయుడే అవుతున్నాడు.
నలుడిలో అశ్వవిద్య అధ్యాత్మిక విద్యగా వికాసం చెందినప్పటికీ, అతడు ఋతుపర్ణుడ్ణి విదర్భ దేశానికి తీసుకువెళ్ళే సమయానికి ఆ వికాసం పరాకాష్ఠకు చేరలేదు. అందుకే, ఋతుపర్ణుడిలోని అక్షహృదయ విద్యను గమనించిన బాహుకుడు- ‘‘నా అశ్వహృదయ విద్యను నీకిస్తాను. నీ అక్షహృదయ విద్యను నాకివ్వు’’అని బేరం పెట్టాడు.
ఆప్తకాముడై, ఆత్మకాముడై, పరిపూర్ణాత్మకుడై వున్న ఋతుపర్ణుడు మాత్రం ‘‘ముందు నువ్వు అక్షహృదయాన్ని స్వీకరించు, తరువాత నేను అశ్వహృదయాన్ని స్వీకరిస్తాలే’’అనగలిగాడు. ఇది నిష్కామత్వ పరిపూర్ణమైన రాజర్షిత్వానికి పరాకాష్ఠ. అందుకే, వ్యాసమహర్షి ఋతుపర్ణుడ్ణి ‘‘రాజర్షి’’అని కీర్తిస్తున్నాడు.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి