మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సందేహం తీరాలంటే మనం ఆపస్తంబ మహర్షిని ఆశ్రయించవలసిందే. ఆయన తన గృహ్యసూత్రాలలో నామకరణ సంస్కార ప్రకరణంలో,- ‘‘దైవదత్తం నామ పితరౌ ధాస్యతుః’’అన్నాడు. అంటే, పుట్టిన మానవ జీవికి ముందుగా నామకరణం చేసేవారు దేవతలే. తల్లితండ్రులు ఇద్దరూ కలిసి, ఇటూ అటూ గింజుకొని, చివరికి ఆ పేరే పుట్టిన సంతానానికి పెడతారు- అని మంత్రద్రష్టఅయిన ఆ మహర్షి సూత్రీకరించాడు. ఈ సూత్రాన్ని మనస్సుకి బాగాపట్టించుకొని, మనం పురాణగాథలను పరిశీలించాలి. నలదమయంతుల వంటి జీవులు మనవంటి సాదాసీదా వంకాయ కూర జీవులు కాదు. వారు యుగసంధులలో జన్మించిన విశిష్టజీవులు. అందుకే, వారికి పేరుపెట్టే దేవతలుగానీ, తెలియకుండానే ఆ పేర్లను అనువదించే తల్లితండ్రులు గానీ, నిరర్థక నామధేయాలను పిల్లలకు అంటగట్టడం సాధ్యంకాదు. వ్యాస భగవానుడు అటువంటి ప్రత్యేక జీవుల కథలనే మనకు పురాణాల ద్వారా అందించాడు. వాటిలో నలోపాఖ్యానాదులు ప్రముఖమైనవి.
కనుక, నలచరిత్రలోని చరిత్ర భాగమూ సత్యమే. సంకేతార్థ్భాగమూ, సత్యమే. కథను కాలక్షేపకథగాగాక, సంకేతార్థస్ఫోరకమైన కథగా చెప్పగలగడం మాత్రం వ్యాసభగవానుడి శిల్పనైపుణ్యమే. కనుకనే, నల చరిత్రకు ఫలితాంశరూపంగా అక్ష హృదయ- అశ్వహృదయ విద్యాద్వయాన్ని వ్యాసమహర్షి చెప్పాడు.
దీన్నిబట్టి ఈ కథలోగల కీలకాంశాన్ని మనం ఆ విద్యలలో వెతుక్కోవాలి. కథాపాత్రలలో కాదు.
ఈ దృష్టితో చూసినప్పుడు, నలదమయంతులనే స్ర్తిపురుషులు సాధు స్వభావులనీ, అందుకనే వారికి పరమేశ్వరుడు దాంపత్యం కలిగించాడనీ, కానీ, కాలప్రభావంవల్ల వారి సాధన చెడిపోయిందనీ, దానివల్లే వారు కష్టాలపాలయ్యారనీ, అలాంటి దశలో మళ్ళీ పరమేశ్వరుడే గురువు రూపంలో దిగివచ్చి, ఈ జీవులిద్దరికీ సత్సాంగత్యాన్ని ఏర్పాటుచేసి, వారి పాపాలను ప్రక్షాళన చేసి, వారికి సదుపదేశాలను లభింపచేసి, తద్వారా వారి కష్టాలు తొలగించి, సుఖాలు కలిగించి, చివరికి పరిపూర్ణత్వాన్ని కూడా ప్రసాదించాడనీ, ఈ నలచరిత్ర మనకు బోధిస్తోంది. అందుకే మనబోటి కలిజీవులందరికీ నలచరిత్ర కావలసిందే! ఇందులో సందేహమే లేదు!!
గురూపదేశం:
మా జనక పితృపాదులు, సాంగస్వాధ్యాయ భాస్కరులు బ్రహ్మాజీ కుప్పా లక్ష్మావధానులుగారు తురీయాశ్రమ స్వీకారం చేసి, శ్రీశ్రీశ్రీ జనార్ధనానంద సరస్వతీ నామధేయధారులై, జీవన్ముక్తస్థితిని అందుకున్న తరువాత, 90 యేళ్ళు దాటిన వయస్సులో హాస్పటల్ పాలై ఐసియులో పడి వుండవలసి వచ్చింది. ఆ రోజులలో అక్కడ విజృంభిస్తున్న కలివిలాసాలకు సాక్షీభూతులై, రాగద్వేషాతీతులై వున్న ఆ స్వామివారు ఒకరోజు నన్ను పిలిచి, ‘‘ఇది కాలదేవుడి నాట్యంరా! దీన్ని చూసి ఆనందించాలి గానీ, దీనిలో కలిసిపోరాదు రా!’’అని ఉపదేశిస్తూ, దానితోపాటు నలచరిత్రలోని అంతస్సూత్రాలు కొన్నిటిని నాకు సూత్రప్రాయంగా అందించి, ‘‘మిగిలినవి వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకో. నువ్వు తెలుసుకున్నవి ప్రజలకు అందించు’’అని ఆదేశించారు.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి