మెయిన్ ఫీచర్

అనుభవంతో తెల్సుకోవాల్సింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత విలువైన వాటిల్లో కాలం ఒకటి. కాలాన్ని అదుపు చేయగలగడం అంటూ ఉండదు కానీ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనే ప్రజ్ఞ కనబడుతుంది. కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులు, క్షణాలుగా కూడా విభజన చేసుకొంటుంటాం. ఇది అంతా కాలంతో పాటు పరుగెత్తడానికే పనికివస్తుంది. కానీ కాలాన్ని అదుపు చేయ డానికి మాత్రం కాదు. అసలు సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వద్దన్నా కావాలన్నా వాటికవి జరిగిపోతూనే ఉంటాయ. కాలం చాలా విలువైనది శక్తివంతమైనది కూడా. చరిత్రని సృష్టించడం, ఆ చరిత్రని తనలో కలగలుపుకోవడం కాలానికున్న గొప్ప లక్షణం. కాలం ఎంతో వేగవంతమైనది. అంతేకాక మార్పు చెందేతత్వం కలిగియున్నది కూడా.
కాలం విలువ తెలుసుకున్న విద్యార్థి దాన్ని సక్రమంగా వినియోగించుకుని విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో ఉత్తముడు అవుతాడు. కాలం విలువ తెలుసుకొన్న విజ్ఞాని కాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అందరిచేత విజ్ఞానవంతుడనిపించుకుంటాడు. దానికి కారణం అతడు కాలాన్ని గౌరవించడమే. అజ్ఞాన్ని కాలాన్ని సద్వినియోగ పరుచుకోక కాలం నాకు చాలలేదనే చెబుతూ ఉంటాడు.
కాలం అందరికీ సమానంగా ఉంటుంది. కాలానికి తన మన భేదాలుండవు. కాలమే భగవంతుని స్వరూపం. కాలస్వరూపుడను నేను అని కూడా శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. భగవంతునికి రాగద్వేషాలుండవు. కాలానికి అతీతంగా ఎవరూ వెళ్లలేరు.
కాలాన్ని సద్వినియోగపర్చుకుంటే చాలు సిరిసంపదలు వాటికవే వచ్చి చేరుతాయ. సుఖసంతోషాలు ఒనగూడుతాయ. ప్రతిరోజు చేయవలసిన పని గురించి దానికి కావాల్సిన సమయం గురించి చక్కగా ప్రణాళిక వేసుకొని దానిప్రకారం పనిచేసుకొనేవారికి కాలం సరిపోవడం లేదు అన్న ప్రసక్తి ఉండదు.
కాలాన్ని దుర్వినియోగం చేసి నిద్రపోయో లేక పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూనే కాలం గడిపిస్తే చివరకు తాను చేయవలసిన పనికి కావాల్సిన సమయం దొరకదు. దానితో కాలం సరిపోలేదనే నింద వేస్తేస్తుంటారు.
కాలం తన ఉనికిని తాను కాపాడుకుంటూనే తనతోపాటు పయనించేవారి ఉనికిని కూడా కాపాడుతుంది. కాలం అనుక్షణం పరుగులు పెడుతుందే తప్ప అలసిపోదు, ఆగిపోదు. తనతోపాటు పరిగెత్తే వారిని కూడా అలసిపోనివ్వదు. ఓడిపోనివ్వదు. ఒక వ్యక్తి ఉన్న చోటనుండి ఉన్నతంగా ఎదిగేందుకు కాలం కలిసిరావాలి అంటారు. కానీ విజ్ఞులెపుడు చేతికందిన కాలాన్ని సక్రమమైన ప్రణాళిక వేసుకుని అనుకొన్న పనులను పూర్తి చేస్తాడు. దానివల్లనే కాలం అతనికి కలసి వచ్చింది అని కూడా చెప్పొచ్చు.
కాలాన్ని వృథా చేసుకొనేవారు వారు ఉన్నత స్థానాన్ని పొందలేకపోవడమే కాదు ఉన్నచోటు నుంచి అథఃపాతాళానికి కూడా పడిపోతారు. కాలం, సూర్యుడు క్రమశిక్షణకు మారుపేర్లు. కాలం ఎవరికోసం ఆగదు. సూర్యుడూ అంతే. నక్షత్రాలు, గ్రహాలు ఆకాశంలో తమ యొక్క నిర్దేశానుసారం చరిస్తుంటాయి. ఇవి కూడా కాలంతోపాటు కాలంలో కలగలసి పనిచేస్తుంటాయి. కాలం సూర్యుడు వీరిద్దరూతమ దారిన తాము తమ పని చేసుకుంటూ పోతుంటారు. తెలివైన వారు చేసేది అదే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపడుతూ కాలం వృధా చేసుకోరు. చేతిలోవున్న కాలానికి మెదడులో వున్న జ్ఞానాన్ని కలగలిపి మునుముందుకు దూసుకుపోతుంటారు.
పక్షులు, పశువులు కూడా సూర్యోద యానికి ముందే లేచి స్యూర్యోదయానికి స్వాగతం పలుకుతున్నట్టు వ్యవహరిస్తాయ. కానీ ఆధునిక మానవుడు మాత్రం సూర్యుని కన్నా ముందే మేల్కొనడం మరిచిపోతున్నాడు. రాత్రిళ్లు పనిచేయడం, లేక రాత్రిళ్లు అక్కరలేని విషయాలజోలికి వెళ్లి రాత్రి నిద్రించక సూర్యు డు వచ్చినా నిద్రాదేవి ఒడిలోనే జోగుతున్నాడు. దీనివల్ల ఎంతో నష్టానికి గురవుతున్నాడు కాని ఆ నష్టాన్ని గుర్తించలేక పోతున్నాడు.
గొప్ప, గొప్పవారు అంటే విజ్ఞానంలోకానీ, ధనసంపాదనలోకానీ గొప్పగా ఉన్నవారంతా సూర్యుని కన్నా ముందే మేల్కొంటున్నారు. వారెవరూ సూర్యునికి వారి పడకను చూసే స్థితిని కల్పించడం లేదు. ఈ విషయాన్ని సామాన్యుడు గుర్తించలేక పోతున్నాడు. అట్లాంటి గొప్పవారి విజయాలకు కారణం సూర్యునికన్నా ముందు నిద్రలేవడం అన్న విషయాన్ని విస్మరించకూడదు. చదువుకునే విద్యార్థులు సైతం బ్రాహ్మీ కాలంలో చదువుకుంటే వారికి జ్ఞాపక శక్తి ద్విగుణీకృతం అవుతుందని పెద్దలు వారి అనుభవసారంగా చెప్తున్నారు. కనుక కాలాన్ని గౌరవించడం అంటే పొద్దునే నిద్రమేల్కొనడం అన్న అర్థం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

- ఆర్. పి.