మెయిన్ ఫీచర్

జగన్మాత వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయాలను నిరంతరం విశ్వానికందించి రక్షించి కాపాడే జగదంబిక, జగజ్జనని, తల్లిగా ఉపాసింపబడే దైవంగా జగన్మాత పార్వతీదేవి పలురూపాలలో శరన్నవరాత్రులలో సకల జనులచే ఆరాధించబడుతున్నది.
జగన్మాత సర్వదా వరణనాతీత ప్రేమ నిలయమై, శాంతం, దయ, మాతృవాత్సల్యం వెల్లి విరిసే దివ్యశక్తి. భక్తులను జాగరూకతతో కాపాడే విశ్వమాత. అజ్ఞానాంధకారంలో మునిగి జనులకు సన్మార్గం చూపుతూ, జ్ఞానదాయినిగా విలసిల్లే జనని. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నండి తదియ వరకు మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా ఆరాధింపబడుతున్నది ఈ జగదంబనే అని దేవీ భాగవతం చెబుతుంది.
దుర్గాసప్తశతిలోని శ్లోకాలను పఠించినా ఈ శరన్నవరాత్రుల్లో దేవి అనుగ్రహం లభ్యమవుతుందని అంటారు. ఈ తొమ్మిది రోజులు నిరతాన్న ప్రసాదాలతో దీనజన సేవలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో భక్తిశ్రద్ధలతో దేవిని పూజిస్తుంటారు. ఈ మహామాయ ఆద్యశక్తిగా తన మహాకాళీ స్వరూపంతో తామసిక గుణంతో ఎందరో రాక్షసులను దునుమాడింది. రాజసిక స్వరూపంతో మహిషాసుర మర్ధినియై మహిషుడిని సంహరించింది. సాత్విక గుణంతో మహాసరస్వతిగా శుంభ నిశుంభులనే రాక్షసులను మట్టుపెట్టింది. ఈ దేవికే చండి అనే మరో పేరుకూడా ఉంది.
దేవీసూక్తంలో దేవియే ‘నేనే లోకనాయకురాలిని, నన్ను ఆరాధించే అందరికీ సకల సంపదలనిస్తాను. భూమ్యాకాశాలలో అంతటా నిండి ఉంటాను. సృజనాత్మక శక్తితో అన్నిటినీ సృజియిస్తూ ఉంటాను’ అని చెప్పింది.
బ్రహ్మదేవుడు ఈ దేవిని సర్వలోకపాలకురాలిగా స్తుతించాడు.
దేవతలంతా త్రిమాత్రికగా - అ,ఉ,మ్‌అనుమాత్రల కూడిక ‘ ఓమ్’ కారంగా భావించి ఓం కార స్వరూపిణిగా స్తుతిస్తారు. ఈ మహామాయ మహాజ్ఞానిగా, మహాబుద్ధిగా, స్మరణశక్తిగామహాభ్రాంతిగా కూడా మహాదేవిని ఆరాధిస్తారు.
ఈ తల్లి అవిధేయులకు మహాభయంకర రూపిణిగా కనిపిస్తుంది. అజ్ఞానాంధకారంతో ప్రజ్వరిల్లితే వారిని నామరూపాలు లేకుండా సర్వ నాశనం చేసేస్తుంది. అమ్మను శరణు వేడితే అన్ని కాలాల్లో తోడునీడయై కాపాడుతుంది. దాటశక్యంగాని సంసార సాగరాన్ని దాటించే నావయే దుర్గారూపిణి. అట్టి జగన్మాత వైభవాన్ని వేనోళ్ల కీర్తించినా అలవికానిది. వర్ణించడానికి అక్షరాలు చాలనిది.
ఓం నమో మహాదేవ్యై నమః అని చేతులు జోడించుదాం.

- పి.వి. సీతారామమూర్తి 9490386015