మెయిన్ ఫీచర్

ఆలోచించారా! ఎపుడైనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీ.శే. కళాప్రపూర్ణ డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారి గేయం మన మహాత్మా గాంధీగారిని ‘స్వంతంత్ర భారతపితా’ అని సంబోధించినది. ఈ సంబోధన అన్నివిధాలా సమంజసమైనదిగా తోచుచున్నది. అందుచేత శ్రీ గాంధీజీని ‘జాతిపిత’అని అవమానపరచకుండా ‘స్వతంత్ర భారతపిత’ అని సంబోధిస్తూ వారి యెడల గౌరవం ప్రకటించుకోవడం ఉత్తమమనిపిస్తోంది.

‘గాంధీతాత’ అనేది చాలా ఆత్మీయమైన సంబోధనయేగాక మహాత్మాజీని యావత్ సమాజానికి పెద్దగా గౌరవిస్తూ సంబోధిస్తూ పలికే పదము. ప్రతి ఏటా వారి జయంతి, వర్థంతులు జరుపుకుంటున్నాం. ఆ సందర్భాలలో మహాత్మాజీ గుణగణాలు, మన సమాజానికి, దేశానికి చేసిన సేవ, మార్గదర్శనం గూర్చి ప్రసంగిస్తూంటాం. అలవోకగా వారిని ‘జాతిపిత’ అని సంబోధించడం చాలామందికి అలవాటు అయిపోయింది.
ఈ సంబోధన వినగానే నాకు మనస్సులో చివుక్కుమంటుంది. చాలామంది తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు. సమాజంలో కొంతమంది వారన్నది కాదంటే మరేమీ ఆలోచించక మనల్ని చెరిగేస్తారు. మీరూ ఆలోచించండి. గాంధీతోనే మన జాతి ఉద్భవించిందా?
అలాగయితే మనం నిజంగా మెకాలే మానసపుత్రులమయిపోయాం. మెకాలే ఒక మోసగాడు. మన దేశంలో ఉత్తర దక్షిణాలకి, తూర్పు పడమరలకు చాలా ప్రయాణం చేసేనని, తాను ఒక్క దొంగని కాని, మోసగానినిగాని చూడలేదని తానే చెప్పేడు.
‘‘ఇంత నిజాయితీగల ప్రజలను, నమ్మకస్థులను, ధార్మిక ప్రవృత్తిగల వార్ని మనమెలా పాలించగలం?’’
‘‘నావద్ద ఒక విద్యా ప్రణాళిక ఉన్నది. దానిని అమలుపర్చితే భారతీయులు నల్లగా వున్నా, గోధుమరంగు వారయినా తెల్లవారి మానసపుత్రులుగా మారతారని’’ అంటాడు. తన విద్యా ప్రణాళికను మన జాతిపై రుద్దేడు.అతి పురాతనమయిన భారతజాతిని దిగజార్చే విధంగా, ఇక్కడ వున్న ఉన్నత వ్యవస్థలను పనికిరానివిగాను, అనాగరికమైనవిగాను చిత్రించి, ఇక్కడున్న మేధావి వర్గాల మస్తిష్కాలను చెరిపే ప్రయత్నాలకు పునాదివేశాడు.
గాంధీజీ ఈ దేశంలో రామరాజ్య వ్యవస్థ విలసిల్లాలని, మన జాతి ఆధ్యాత్మిక విలువలనలవరచేందుకు భగవద్గీతను బోధించాలని తెలిపేరు. వారు జీవించియున్న కాలంలో ఎవరైనా వారిని ‘జాతిపిత’ అంటే సహించి ఉండేవారు కాదేమో!
మన స్వాతంత్రోద్యమంలో వందేమాతర నినాదం ఒక మంత్రంలా పనిచేసింది. వందేమాతరం అంటే తల్లికి నమస్కారము.
మన తల్లి జాతికి అన్వయిస్తే భారతమాత. భారతమాతను భక్తిపురస్సరంగా ఆరాధిస్తూ బహుపురాతనమైన శ్లోకం మనం జపిస్తుంటాం. అది
సముద్ర వసనే దేవి పర్వతస్థనమండలే!
విష్ణుపత్నీ నమస్త్భ్యుం పాదస్పర్శం క్షమస్వమే!
భారతమాతను విష్ణుపత్నిగా భావిస్తున్నాం. మన జాతిపితయని ఎవర్నైనా సంబోధించాలంటే ఆ శ్రీమహావిష్ణువునే అలా సంబోధించాలి.
మహాత్మాగాంధీ గారిని జాతిపిత అని సంబోధించడం- నిజంగా వారిని గౌరవిస్తున్నామా లేక అవమానపర్చుతున్నామా? ఆలోచించ ప్రార్థన.
రాముడ్ని, కృష్ణుణ్ణి కూడా భారతమాత కన్న వీరులుగా, రత్నాలుగా భావించి గర్విస్తున్నాం. ఎందరో మహావీరులు ఆమె గర్భాన జన్మించి, ఆమె క్షేమానికై అనేక త్యాగాలు చేసి ఆమెకు ఆనందమును చేకూర్చేవారు.
వారందరూ ఆమెకు గర్వించదగ్గ వీరపుత్రులే. మహాత్మాగాంధీజీ కూడా అలాగే భారతమాత గర్వించదగిన మేటి పుత్రరత్నమే. ఈ విషయం వ్రాయడంవలన మహాత్మాగాంధీగారిని గూర్చి అశేష జనవాహిని వాక్కుని తక్కువ చేయడంలేదు. భారతమాత సంతతిలో ఒక భక్తుడుగానే మనసులోని మాటను తెల్పుతున్నాను.
ఈ జాతి నిన్నమొన్నటిది కాదు. వేదకాలం (చరిత్రకు అందనికాలం) నుండి వస్తున్న పురాతన జాతి. బ్రిటీష్‌వారు ఆధునిక లిబరల్స్, కాంగ్రెస్‌వారు, సామ్యవాదులు అంటున్నట్లు మనం రూపుదిద్దుకోవలసిన జాతి కాదు.
తీళ ఘూళ శ్యఆ ఘ శ్ఘఆజ్యశ జశ ఆ్దళ ఘౄరీజశ. తీళ ఘూళ ఘ శ్ఘఆజ్యశ ఛ్యిౄ ఆజౄళఒ జౄౄళ్యూౄజ్ఘ)
ఈమధ్య ఒకటి రెండు రోజులనుండి వార్తలలో వింటున్నది ఏమనగా శ్రీ నరేంద్ర మోదీగారిని జాతిపిత అని పిలిచి గౌరవిస్తే బాగుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారని తెలిసింది. దానిపై దుమారం కూడా ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న మన జాతిపిత శ్రీమహావిష్ణువే.
తక్కిన వారెంత గొప్పవారయినా మన భారతమాత కన్న మహారత్నాలే. వారిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని గాని, వారు చేసిన మహాకార్యాలను చౌకబారు విమర్శలకు గురిచేయరాదని నా మనవి. అసలు ఫాదర్‌గా గౌరవించడం పాశ్చాత్య సంప్రదాయం. భారతీయ యోచన కాదు.
ఈమధ్య మన స్వాతంత్య్ర సంగ్రామ సాహిత్యం పరిశీలిస్తోంటే కీ.శే. కళాప్రపూర్ణ డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు వ్రాసిన ఒక గేయంలో మన గాంధీజీని గూర్చి ఒక మంచి సంబోధన లభించినది. ఆ గేయం ఇలా ఉంది-
‘‘ఇదె జోతా! నీకిదె జోతా!
ఓ స్వతంత్ర భారతపితా!
ఎన్నికగలిగిన నరజాతులలో
మన్నికగలదోయ్ మన జాతియునని
మాకొక దేశం, మాకొక జెండా,
మాకొక ఉన్నతినిచ్చిన నేతా
ఇదె జోతా! ఓ స్వతంత్ర భారత పితా!’’ అని.
ఈ గేయం మన మహాత్మా గాంధీగారిని ‘స్వంతంత్ర భారతపితా’ అని సంబోధించినది. ఈ సంబోధన అన్నివిధాలా సమంజసమైనదిగా తోచుచున్నది. అందుచేత శ్రీ గాంధీజీని ‘జాతిపిత’అని అవమానపరచకుండా ‘స్వతంత్ర భారతపిత’ అని సంబోధిస్తూ వారి యెడల గౌరవం ప్రకటించుకోవడం ఉత్తమమనిపిస్తోంది. మరి ఇతర పెద్దలను ఎవరినీ జాతిపిత అని మాత్రం అనవద్దు. మరే రత్నమనేనా అందాము. వారికిచ్చే ప్రశంసా నామమును వివాదగ్రస్థం చేయవద్దని ప్రార్థన.

-ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం 9440156018