మెయన్ ఫీచర్

ఏది రాజ్యాంగ అతిక్రమణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఐఎన్‌ఎక్స్ మీడియా’ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిం ది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ ఈనెల 24 వరకూ కొనసాగనుంది. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ నిధులను సమకూర్చడంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను చిదంబరం ఎదుర్కొంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు 21న చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద ప్రస్తుతం ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో పరిశీలించిన అంశం ‘ఆయన ఎంతకాలంగా కస్టడీలో’ ఉన్నారన్నదే. ఆయన జైలుకు వెళ్లి 60రోజులు దాటింది. వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న వారిని సీబీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడం పరిపాటి. ప్రశ్నించే సమయంలో వారిచ్చే సమాచారంతో సమగ్ర ఎఫ్‌ఐఆర్‌లను కోర్టు ముందు దాఖలు చేయాలి.
నిందితులను తమ కస్టడీలో వారం, పది రోజులు, పది హేను రోజులు ఉంచాలని దర్యాప్తు సంస్థలు కోర్టులను కోరుతుంటాయి. కేసు తీవ్రత ఆధారంగా కోర్టులు కస్టడీని పొడిగిస్తూ వస్తుంటాయి. విచారణలో వారు సహకరించలేదనే సాకుతో పాలిగ్రాఫీ, సత్యశోధన పరీక్షలు నిర్వహించాలని మరికొంత కాలం తమ ఆధీనంలో కొనసాగించే సందర్భాలుంటాయి. ఒకే కేసులో వివిధ పార్శ్వాలను పరిగణనలోకి తీసుకుని, ఆయా అంశాల్లో నిధుల ప్రవాహం ఎలా జరిగిందో లేదా ఎటువంటి ప్రయోజనాలను పొందారనే దానిని దర్యాప్తు సంస్థలు పసిగడతాయి. తమకు నచ్చిన సమాచారం రాబట్టే వరకూ దర్యాప్తు సంస్థలు ఒక వ్యక్తిని నిరంతరం తమ కస్టడీలో కొనసాగించరాదనే నిర్ధిష్టమైన చట్టాలు ఉన్నా ఎలాంటి సహేతుకత లేకుండానే కస్టడీ కొనసాగించిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల తెలంగాణ హైకోర్టు సైతం పోలీసుల తీరుపై మండిపడింది. ఒక కేసులో నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పదే పదే కౌంటర్ పిటీషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు మండిపడటమే గాక, అసలు ఆ వ్యక్తిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో సమగ్ర నివేదికతో హాజరుకావాలని ఆదేశించింది. చట్టం అమలుకు సంబంధించి చాలా స్పష్టమైన వివరణలు ఉన్నా దర్యాప్తు సంస్థలు తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు గుర్తించినపుడు న్యాయస్థానాలు వాటిని సరైన మార్గంలో పెట్టేందుకు తమ అధికారాలను పరిపూర్ణంగా వినియోగించుకుంటాయి.
న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో, నిర్వచించడంలో , పునర్‌నిర్వచనంలో వచ్చిన సాంకేతిక సమస్యలతో కొన్ని సందర్భాల్లో నిందితులు ఎలాంటి విచారణకు నోచుకోకుండా దశాబ్దాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. జైళ్లు నిండిపోయి కొత్త వారిని సర్దుబాటు చేయలేకపోవడమే గాక, జైళ్ల నిర్వహణ ఆర్ధిక భారంగా మారుతోంది. అందుకే ఇటీవలి కాలంలో జైళ్ల స్వరూపాన్ని మార్చి అందులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, నిందితుల సేవలను వినియోగించుకుని సేవల రంగం ద్వారా స్వీయ ఆర్థిక స్వావలంబనకు జైళ్లు ప్రయత్నిస్తున్నాయి. వివిధ ఉత్పత్తులను రూపొందించి వాటిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సరఫరా చేస్తూ ఆదాయం పొందుతున్నాయి.
నిందితులను అదే పనిగా ప్రశ్నించడం లేదా దీర్ఘకాలిక విచారణ సైతం వ్యక్తి వేధింపుల కిందకే వస్తుందని అమెరికా గత వారం తీర్పు చెప్పింది. విచారణలో నూతన పద్ధతుల పేరిట పరిమితికి మించి ప్రశ్నించడం వ్యక్తి స్వేచ్ఛను కాలరాయడమేనని అమెరికా కోర్టు స్పష్టంగా చెప్పింది. మన దేశంలో కార్యపద్ధతి న్యాయశాస్త్రం ద్వారా సిద్ధాంత న్యాయశాస్త్రాన్ని వర్తింపచేస్తాయి. భారత శిక్షా స్మృతి, భారత కాంట్రాక్టు చట్టం, అపకృత్య న్యాయం మొదలైనవి కార్యపద్ధతి న్యాయశాస్త్రం అనుకుంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రోసీజర్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వంటివి కార్యపద్ధతి న్యాయ శాస్త్రంగా మనం పరిగణిస్తాం. బెయిల్ తదితర అంశాలతో పాటు శిక్షను ఖరారు చేసే దశలో సాక్ష్య చట్టం అనేది చాలా కీలకం అవుతుంది. భారత సాక్ష్య చట్టాన్ని 1872లో రూపొందించారు. ఈ చట్టానికి మూలం ఆంగ్లేయుల సాక్ష్య చట్టమే. అన్ని రకాల కోర్టు మార్షల్స్‌తో పాటు అన్ని రకాల ప్రమాణ పత్రాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. గతంలో సాక్ష్యానికి సంబంధించిన సూత్రాలు ఇంగ్లీషు, భారతీయ శాసన వ్యవస్థల్లో స్పష్టంగా లేకపోవడంతో ముందరి ఇంగ్లీషు న్యాయశాస్త్రం, కఠిన పరీక్షలు, నేరస్తుడు కోరుకున్న సాక్ష్యం లేదా న్యాయస్థానం గురించి పందెం, యుద్ధం ద్వారా విచారణే నిరూపక పద్ధతులుగా అమలులో ఉండేవి. హిందూ న్యాయశాస్త్రం పద్ధతిలో కొన్ని మార్లు దైవ సంబంధితంగా ఉండేవి. అంటే ఒట్టు వేయడం, దేవుని మీద కుటుంబ సభ్యుల మీద ఒట్టు వేసి కేసుల శిక్షల నుండి తప్పించుకునే వారు.
ప్రస్తుత సాక్ష్య చట్టంలో కొన్ని భాగాలు మధ్య యుగాల కాలానికి గుర్తులుగా చెప్పవచ్చు. 16వ శతాబ్దం- 17వ శతాబ్దం కాలంలో న్యాయనిర్ణయక సంఘం సాక్షుల సాక్ష్యం మీద కేసులను పరిష్కరించడం అనేది ప్రారంభించింది (సోర్సెస్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ ఇంగ్లీషు లా -హోల్డ్స్‌వర్త్). ప్రపంచంలో మొట్టమొదటి సాక్ష్యం గురించి ఒక పుస్తకాన్ని చీఫ్ బారన్ గిల్‌బర్డ్ రాశాడు. ఆయన 1726లో మరణించాక, ఆ పుస్తకాన్ని 1756లో ప్రచురించారు. బ్రిటిష్ కాలంలోని సాక్ష్యాలకు సంబంధించిన సూత్రాలనే స్వాతంత్య్రానికి ముందు భారత్‌లోనూ చెన్నై, ముంబయి, కోల్‌కత ప్రెసిడెన్సీ పట్టణాల్లోని న్యాయస్థానాల్లో వర్తింపచేశారు. కానీ ప్రావిన్షియల్ పట్టణాల్లో మాత్రం ఇంగ్లీషు సాక్ష్య చట్టాన్ని అనుసరించలేదు. ప్రావిన్షియల్ పట్టణాల్లోని కోర్టులను మఫిసిల్ కోర్టులని, ప్రెసిడెన్సీ పట్టణాల్లోని కోర్టులను క్రౌన్ కోర్టులని వ్యవహరించేవారు. కంపెనీ కోర్టులు మాత్రం ప్రోవిన్షియల్ చట్టాల ప్రకారమే నిర్వహించేవారు. కాలం గడిచిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. భారత శాసన నిర్మాణ మండలిలో చట్టాలను 1835 నుండి 1853 మధ్య ఆమోదించారు. మొదటిసారి సాక్ష్య చట్టం క్రోడీకరించాల్సిన ఆవశ్యకతను సంస్కర్తలు గుర్తించారు. మూడో లా కమిషన్ 1868లో ఇచ్చిన ఐదో రిపోర్టులో ముసాయిదా బిల్లును సమర్పించింది. 39 క్లాజులు మాత్రమే ఉండటంతో అది చాలా స్వల్పంగా ఉండేది. 1868లో ముసాయిదా బిల్లును శాసనపరిషత్‌లో ప్రవేశపెట్టారు. బిల్లు అసంపూర్తిగా ఉందని, దానిని సెలక్ట్ కమిటీకి పంపించారు. 1871లో సర్ జేమ్స్ స్టీఫెన్ తయారుచేసిన మరో ముసాయిదాను పరిషత్‌లో ప్రవేశపెడితే దానిని 1872లో భారత సాక్ష్య చట్టం పేరుతో ఆమోదించారు.
తర్వాతి కాలంలో సాక్ష్య చట్టంలో అనేక కొత్తక్లాజులు వచ్చి చేరాయి. భారత సాక్ష్య చట్టం 1872 మూడో భాగం సెక్షన్లు 118 నుండి 134 వరకూ సాక్షుల సమర్ధత, బలవంతపెట్టడంపైనే చాలా స్పష్టత ఇచ్చింది. సెక్షన్లు 118 నుండి 120 వరకూ సాక్షుల సమర్ధతను నిర్వచిస్తాయి. సెక్షన్ 118 సాక్షుల సమర్ధతపై సాధారణ నియమాన్ని చెబుతుంది. సెక్షన్ 119 మూగ సాక్షుల గురించి, సెక్షన్ 120 సివిల్ దావాలో పార్టీలు , పార్టీ భర్త, లేదా భార్య గురించి వివరిస్తుంది. నేరవిచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వమని లేదా వారి ప్రవర్తన, నడవడిక గురించి ఏదైనా సమాచారాన్ని బయటపెట్టమని బలవంతం చేయరాదని సెక్షన్ 121 చెబుతుంది. సెక్షన్ 122 నుండి 132 ప్రత్యేకాధీకృత సందేశాల గురించి ఏర్పాటు చేశారు. సెక్షన్ 122 వివాహబంధంలోని సమాచారం, సెక్షన్ 123 రాష్ట్ర వ్యవహారాల అంశం, సెక్షన్ 124 అధికారిక సమాచారం, 125 అపరాధం చేయడానికి సంబంధించి, సెక్షన్ 127, సెక్షన్ 126 క్లయింట్ల రహస్యపత్రాలు బయటపెట్టకుండా నిరోధిస్తుంది. సెక్షన్ 128 స్వచ్ఛందంగా సాక్ష్యమిచ్చే విశేష హక్కును వదులుకోకూడదని చెబుతుంది. సెక్షన్ 129 న్యాయ సలహాదారులతో రహస్య సంబంధాలు గురించి చెబుతుంది. ఎలాంటి పొరపాటు చేయకుండా కేసుల్లో ఇరుక్కున్న నిర్భాగ్యులకు శిక్ష పడకూడదనే ఉద్దేశంతో చేర్చిన ఈ నిబంధనలు ఇపుడు కుట్రపూరితమైన ప్రణాళికతో నేరాలు చేస్తున్న వారికి సైతం ఊతం ఇస్తున్నాయి. సాక్షుల అసమర్ధతను చూపింపి తేలికగా కేసుల నుండి తప్పించుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో సాక్షులను చేర్చడం ద్వారా కేసుల్లో గందరగోళాన్ని సృష్టించి చిట్టచివరికి సాక్షులు కేసు పూర్తికాకముందే మరణించడంతో వాటిని తప్పుదారి పట్టించడానికి కూడా చట్ట నిబంధనలను వాడుకుంటున్నారు.
*చిత్రం... కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం

-బీవీ ప్రసాద్ 99633 45056