మెయిన్ ఫీచర్

సరైన తోడును వెతకాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎంతో అపురూపంగా పెంచుకున్న కూతుర్లకు, కొడుకులకు తగిన వయసు రాగానే వారికోసం తగిన జీవిత భాగస్వాములను వెతికి కట్టబెట్టడం చేస్తాము. కానీ అక్కడే మన ఎంపికలో ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు తమ తమ జీవిత భాగస్వాములతో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించాల్సి వుంటుంది లేదా ఆ ఇద్దరి నడుమ పొసగక అర్థాంతరంగా తెగతెంపులు చేసుకుని వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సి వుంటుంది. దుర్మార్గుడో, మూర్ఖుడో అమ్మాయికి భర్తగా లభిస్తే ఆ అమ్మాయి జీవితం దినదినగండం ఆయుష్షుగా మారుతుంది.
అలాగే ఏ గయ్యాళో, నోటిదురుసుతనం కలిగి భర్తను అత్తమామలపట్ల నిర్లక్ష్యవైఖరి కలిగిన ఏ అమ్మాయో భార్యగా లభిస్తే అతని జీవితం నరకప్రాయమే అవుతుంది. ప్రేమ వివాహాలు చేసుకుంటే అది వేరే సంగతి. ఎవరి ఖర్మకు వారే బాధ్యులు అన్నట్లు ఎవరి అవస్థలు వాళ్ళే పడుతారు.
పెళ్ళిసంబంధాలను చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను చూడమన్నారు. కాని ప్రస్తుత కాలంలో అలా కుదరటంలేదు. ఎవరికీ అంత ఓపికగాని సమయం కాని లేదు. నెట్‌లోనో లేదా పెళ్ళిళ్ళు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోల ద్వారానో కుదుర్చుకుంటున్నారు. అబ్బాయి ఏ అమెరికా నుండో సెలవుల్లో వచ్చేసరికి పిల్లను చూడటం, ముహూర్తాలు పెట్టుకుని సిద్ధంగా ఉండటం, అబ్బాయి రాగానే పెళ్లి జరిపెయ్యడం- ఆనక అన్ని ఏర్పాట్లు జరిగిపోయివుంటే అమ్మాయిని కూడా అక్కడికి పంపింజెయ్యడం జరుగుతోంది. అయితే అలా చేయడంవల్ల కొత్త కోడలికి అత్తవారికి నడుమ సరైన అవగాహన గాని సత్సంబంధాలు కాని ఏర్పడవు.
కొన్నాళ్ళు తమతోపాటు వుంచుకోవడమో లేదా తప్పనిసరి పరిస్థితుల్లో కోడలితోపాటు అక్కడికి వెళ్లి కొంతకాలం గడిపి రావడం ఉత్తమం. అబ్బాయి మరో ఊరిలో వున్నా కొత్త కాపురం పెట్టేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి.
కొత్త కోడలికి తమ ఇంటి ఆచార వ్యవహారాలు, అలవాట్లు, పద్ధతులతోపాటు వంటా వార్పు నేర్పించవలసి వుంటుంది. అంతేకాక అత్తామామలకు కోడలికి నడుమ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వీళ్ళు నావాళ్ళు అనే భావన కలుగుతుంది. లేదంటే ఎప్పుడైనా కొడుకు ఇంటికి వచ్చినపుడు చుట్టపు చూపుగా వచ్చిన బంధువుల్లా కన్పిస్తారు. అలాగే కోడలు అత్తారింటికి పండుగలకు, పబ్బాలకు వెళ్లినపుడు కూడా చుట్టపుచూపుగా వెళ్లినట్లు కన్పిస్తుంది తప్ప అది కూడా తన ఇల్లేనన్న భావన రాదు.
మరో ముఖ్యమైన విషయం- లక్షణమైన అమ్మాయో, అబ్బాయో మన కళ్ళముందు కన్పిస్తున్నా, వారిని విస్మరించి, వాళ్ళు తమ అంతస్థుకు తగరని, వారి కుటుంబాలలో మంచి స్నేహ సంబంధాలు లేవని పంతాలకు పట్టింపులకు పోయి కట్న కానులకు, వచ్చే ఆస్థులకు ఆశపడి తమ ఇంటికి తెచ్చుకుంటే తరువాత అనుభవించాల్సిందే.
పూర్వంలా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడకపోయినా కనీసం వారి వారి తల్లిదండ్రుల స్వభావాలను గుణగణాలను పరిశీలించి ముందడుగు వెయ్యాలి. వాళ్ళు సంస్కారం, విజ్ఞత కలిగినవారై ఉండాలి. తమ పిల్లలను సరైన దారిలో నడిపించేవాళ్ళుగా ఉండాలి.
ప్రస్తుతం చాలామంది పెద్దలు కోడళ్ళు తమను అవమానపర్చినా నిర్లక్ష్యవైఖరితో మెలిగినా వారి సంసారంలో జోక్యం చేసుకోకుండా వారి మానాన వారిని జీవించమని వదిలేస్తున్నారు. తాము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదెంతో బాధాకరం.
వృద్ధాప్యంలో కొడుకు కోడలు మనవళ్ళతో హాయిగా గడిపెయ్యాలని చూస్తారు పెద్దలు. కాని వారినే దూరం చేసుకుంటే ఇక ఎవరిని చూసుకుంటూ శేషజీవితం గడపాలి వాళ్ళు.
చివరగా చెప్పేదేమిటండీ. మీ కొడుక్కి కూతురికి సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకుని పెళ్లిచేయండి. బంగారం, ఆస్తి అంతస్థులు లేకపోయినా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.

- పి. షహనాజ్ 9346263070