మెయిన్ ఫీచర్
స్వచ్ఛతే లక్ష్యంగా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తరతరాలుగా తరగని సమస్యలలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేకపోవడం ఒక తీరని సమస్య. స్ర్తిలే కాదు, పురుషులు, పిల్లలు అంతా కలిపి దేశంలో దాదాపు 73 కోట్లమందికి టాయిలెట్ సౌకర్యం లేనట్లు 2017లో వాటర్ ఎయిడ్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన ‘అవుట్ ఆఫ్ ఆర్డర్, ది స్టేట్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్’ అనే నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు 35 కోట్లకు మందికిపైగా బాలికలు, మహిళలకి పారిశుద్ధ్యంలో మన వెనుకబాటును అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపడంలో అనివార్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఐదేళ్ల క్రిందట ‘స్వచ్ఛ్భారత్’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ‘స్వఛ్‌భారత్’ కింద మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడి వంటి పనులకోసం ఏటా రూ.60 కోట్లు విడుదల చేస్తోంది. మరుగుదొడ్ల సౌకర్యం లేని పాఠశాలల్లో బాలికలు ఇబ్బంది వర్ణనాతీతమే కాకుండా పాఠశాల వయస్సుగల మధ్యలోనే చదువు ఆపివేసే పరిస్థితులకు దారితీస్తోంది. చదువు మధ్యలోనే ఆపేస్తున్న బాలికల్లో దాదాపు 23 శాతం మంది తన నెలసరి సమయంలో పాఠశాలల్లో సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడమే తాము చదువు మానివేయడానికి కారణం అని చెప్పడం జరిగింది. 2016లో ఒక సిటిజన్ ఫోరం నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో దాదాపు 88 శాంతంపైగా కుటుంబాలు మొబైల్ సదుపాయాలు కలిగివుండగా, 56 శాతం కన్నా తక్కువ కుటుంబాలు మాత్రమే టాయిలెట్ సదుపాయాలు కలిగివున్నాయట. ఉదాహరణకు బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ డయేరియా అత్యధికంగా 10.2 శాతంగానూ, స్ర్తిలలో రక్తహీనత కూడా అత్యధికంగా 58.3 శాతంగానూ నమోదైందట. టాయలెట్లు లేకపోవడంవల్ల స్ర్తిలు చీకటి పడే వరకు ఆగి బహిర్భూమికి వెళ్తే అక్కడ లైంగిక దాడులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే భారత ప్రభుత్వం ‘మరుగుదొడ్లు’కు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించి ప్రచారం చేసింది.
భారతదేశాన్ని బహిరంగ మల మూత్ర విసర్జనరహిత (ఒడిఎఫ్) దేశంగా ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ దీనికి సంబంధించి ప్రకటన చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం నాడు గాంధీజీ పిలుపు సత్యాగ్రహం అయితే ఇపుడు అదే ‘స్వచ్ఛాగ్రహ్’ అయిందని తెలిపారు. నేడు గ్రామీణ భారతంలోని గ్రామాలన్నీ కూడా తమంతట తాముగా పారిశుద్ధ్యతకు పట్టం కట్టాయని, బహిరంగ విసర్జనను త్యజించాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో కేవలం 60 నెలల్లో 60 కోట్ల మందికి 11 కోట్ల టాయ్‌లెట్ల నిర్మాణం జరిగిందని స్వచ్ఛ్భారత్ దివస్ సందర్భంగా ప్రధాని తెలిపారు. స్వచ్‌భారత్ ఉద్యమంలో బహిరంగ విసర్జ రహిత లక్ష్యసాధనే కీలకం. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంలో నిలిచిందని, ప్రపంచ దేశాలన్ని ఈ విషయంలో సాధించిన భారత్ విజయాన్ని కొనియాడుతున్నాయని పలు అంతర్జాతీయ పురస్కారాలు దక్కుతున్నాయని తెలిపారు.
1986లో ప్రారంభించిన కేంద్రీయ గ్రామీణ పారిశుద్ధ్య పథకం ద్వారా ప్రభుత్వం విస్తృతంగా సబ్సిడీలు అందించి ప్రజలకు టాయిలెట్లు నిర్మించుకోవాల్సిందిగా ప్రోత్సహించింది. తర్వాత 1999తో మొదలైన సంపూర్ణ పారిశుద్ధ్యం పథకం దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున టాయిలెట్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రయత్నాలు చేసింది. కేవలం టాయిలెట్ల నిర్మాణమే గాక వాటి ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరిచే వైపుగా ఈ పథకం దృష్టి పెట్టింది. ఈ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు స్వచ్ఛ్భారత్ ఆరంభించినప్పటినుంచి ఉత్తర భారత్‌లో 26 శాతం తగ్గింది. మరుగుదొడ్ల లభ్యత 37 నుంచి 71 శాతానికి పెరిగింది. పట్టణాల్లో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలు సాధించామని స్వచ్‌భారత్ మిషన్ నిర్దేశకులు వి.కె.జిందాల్ అన్నారు. స్వచ్‌భారత్ ఉద్యమానికి, పారిశుద్ధ్య, ఆరోగ్య ప్రయోజనాల ప్రచారానికి మెచ్చి బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మోదీని ప్రపంచ లక్ష్య రక్షకుడు (గ్లోబల్ గోల్‌కీపర్) బిరుదుతో సన్మానించింది.
హైదరాబాద్ నగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భాగ్యనగరాన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత నగరం (ఓడిఎఫ్)గా స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రకటించింది. స్వఛ్ సర్వేక్షన్ 2018 మొత్తం 41 నగరాలు పోటీ పడ్డాయి. హైదరాబాద్‌ను ఓడిఎఫ్‌గా ప్రకటించంపై అందరూ హర్షించారు. కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం 2014లో దేశంలో బహిరంగ మలవిసర్జన చేసి వారి సంఖ్య 55 కోట్లగా, 2018-19 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు తగ్గిందట. ఇపుడైతే ఓడిఎఫ్‌గా ప్రకటించడం హర్షణీయం. ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ మరుగుదొడ్డి దినాన్ని 19-11-2013 నాడు నిర్వహించాలని నిర్ణయించింది. మరుగుదొడ్లు లేకపోవడంవల్ల పరిసరాల పరిశుభ్రత లోపించి కోట్లాది మంది రోగాల బారిన పడుతున్నారన్నది వాస్తవం. మనకు వస్తున్న రోగాల్లో అత్యధికం మలవిసర్జన ఫలితమే. గతంలో ఇంట్లో వినోదానికి కలర్ టవీ పెట్టుకునేవారు- మూత్ర విసర్జనకు మాత్రం మరుగుదొడ్డి ఉండేది కాదు. బహిరంగ మలవిసర్జనవల్ల వ్యాపించే కొంకి పురుగులు కారణంగా డయేరియా, రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయని, వీటివలన పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని ప్రచారాలు చేయడవంవల్ల ప్రతి ఇంటికొక మరుగుదొడ్డి కట్టుకుంటున్నారు. నిర్మించుకునేవారికి కొంత నగదు అందించడమేగాక నిర్మాణంలో సహకారం అందించడం కూడా జరిగింది. కానీ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం అనుకున్న ఫలితాలు అందివ్వకపోవడంతో దీనిని తిరిగి కొన్ని మార్పులతో 2012లో ‘నిర్మల భారత్ అభియాన్’ పేరుతో 2014లో స్వఛ్‌భారత్ పేరిట తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశంలో పారిశుద్ధ్య లక్ష్యసాధన పౌరుల భాగస్వామ్యం లేనిదే సాధ్యమయ్యే విషయం కాదు. పారిశుద్ధ్యం స్వాతంత్య్రం కన్నా అత్యంత ఆవశ్యకమైనదని ఆనాడే గాంధీగారు చెప్పడం జరిగింది.
ప్రపంచ మరుగుదొడ్ల దినాన్ని 2001 సంవత్సరం నుండి ప్రపంచ టాయిలెట్ సంస్థ ద్వారా జరుపుకుంటున్నారు. అందరికోసం పారిశుద్ధ్యం రిజల్యూషన్ ద్వారా యుఎన్ జనరల్ అసెంబ్లీ 61వ సెషన్ అనుమతి తర్వాత ఈ డబ్యుటిడి 2013 జూలైలో అధికారికంగా యుఎన్ దినోత్సవంగా మారింది. మరుగుదొడ్డి లేనివారికి కట్టుకోవడానికి ప్రభుత్వం 15వేలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. భారత్‌లో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ‘అందరికీ మరుగుదొడ్లు’ ప్రచారాన్ని ప్రారంభించింది. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోటిమంది జనాభాకు మరుగుదొడ్లను నిర్మించింది.
2019 సంవత్సర ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ నినాదం ‘లీవింగ్ నోవన్ బిహైండ్..’. మరుగుదొడ్డి అనేది ప్రతి ఒక్కరికి ఓ స్నేహితుడి వంటిది. మరుగుదొడ్డి అనేది డ్రాయింగ్‌రూం అంత శుభ్రంగా ఉండాలి అని మహాత్మాగాంధీ అనేవారు. మరుగుదొడ్ల ప్రాధాన్యత గురించి అందరిలో చైతన్యం నింపాలి. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు. అందుకే ఈ దినోత్సవం.