మెయిన్ ఫీచర్
బాలల హక్కులను కాపాడుదాం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవసమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్ 20వ తేదీన స్వీకరించడం జరిగింది. బాలల హక్కులు బాలల మనుగడ, గుర్తింపు, ఆహారం, పోషకాహారం మరియు ఆరోగ్యం, అభివృద్ధి, విద్య, మరియు వినోదం, కుటుంబం మరియు సుపరిచితమైన పర్యావరణం, బాలలపట్ల నిర్లక్ష్యం, బాలల రక్షణ, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైని పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని బాలల హక్కుల ప్రకటన చేయడం జరిగింది.
బాలల హక్కులపై
అంతర్జాతీయ ఒప్పందం
ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కులపై చట్టబద్ధమైన ఒక అంతర్జాతీయ ఒప్పందం ‘కనె్వన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్’ తీసుకురావడం జరిగింది. ఇందులో బాలలకు, పౌర, సాంస్కృతిక, ఆర్థిక సామాజిక, రాజకీయ హక్కుల వంటి మానవ హక్కులను అన్నింటిని చేర్చారు. వీటి అమలును కమిటీ ఆన్ ద రైట్స్ ఆఫ్ చైల్డ్ పర్యవేక్షిస్తుంది. దీనిలో నాలుగు అంశాలను వివరించడం జరిగింది.
జీవన హక్కు
పిల్లలకు ఉండే ఈ జీవించే హక్కు కిందకు కనీస అవసరాలైన పోషణ, తలదాచుకోవడానికి, గూడు, కనీస జీవన స్థాయి, వైద్య సేవల అందుబాటులో వుంచడం.
అభివృద్ధి హక్కు
పిల్లలు విద్య ఆటలు, విరామం, సాంస్కతిక కార్యక్రమాలు, సమాచారం తెలుసుకనే హక్కులు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, అభీష్టానికి అనుగుణంగా నడుచుకునే హక్కు కల్పించబడింది.
రక్షణ హక్కు
పిల్లలను అన్నిరకాల దుర్వినియోగాలు, నిర్లక్ష్యం, దోపిడీల నుంచి రక్షణ కల్పిస్తుంది. శరణార్థులుగా వచ్చిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, నేర విచారణ వ్యవస్థలో పిల్లలకు రక్షణ, ఉద్యోగాల్లో పిల్లలకు భద్రత, దోపిడీ, వేధింపులకు గురైన బాలలకు రక్షణ, పునరావాస కల్పన చేయాలి.
పాల్గొనే హక్కు
పిల్లలు తమ సొంత జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై భావాలను, ఉద్దేశాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను, సంఘాలలో చేరడానికి శాంతియుతంగా సమావేశం కావడం హక్కులుగా కల్పింపబడ్డాయి.
బాలల హక్కుల కనె్వన్షన్ ప్రభావం
బాలల హక్కులపై కనె్వన్షన్ అంతర్జాతీయ మానవ హక్కుల శాసనంలో ఒక మైలురాయిని దాటింది. బాలల హక్కులపై కనె్వన్షన్ ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూడానికి, పిల్లల హక్కుల పరిరక్షణలో, పిల్లల సమగ్ర అభివృద్ధి విస్తృతమైన చర్యలను చేపడుతుంది. భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో బాలలను కాపాడటం, బాలల ఎదుగుదలకు ప్రోత్సహించడం, పిల్లల హక్కులు రక్షించడానికి 2007 మార్చి నెలలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థను ఏర్పాటుచేయడం జరిగింది. చైల్డ్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ విభాగాలు, డ్వాక్రా గ్రూపులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడం జరుగుతుంది. బాలల హక్కుల ప్రకారం పిల్లల శారీరక మరియు మానసిక అనారోగ్యంలో పిల్లల రక్షణ, సంరక్షణ మరియు చట్టపరమైన రక్షణ చాలా అవసరం. బాలల హక్కులకు రక్షించడానికి టోల్‌ఫ్రీ నెంబరు 1098ను ఏర్పాటుచేయడం జరిగింది.
బాలల హక్కుల లక్ష్యాలు...
పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించాలి. వారిని అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలను అంచనా వేయడం, మానవ హక్కులన్నీ పిల్లలకు కూడా వర్తింపజేయడం, పిల్లలు సమాజంలో ప్రత్యేక గౌరవం పొందడానికి, వారి భద్రతను కాపాడటానికి, బాలల హక్కుల చట్టాలపట్ల చైతన్యం కలిగించడం, పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడం, పిల్లలలో జీవితంపట్ల భరోసాను కల్పించడం, సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడటం, బాలల హక్కుల రక్షణ అమలు తీరును సమీక్షించుకోవడం, పిల్లలకు 18 సంవత్సరాలు నిండేంతవరకు పిల్లలపట్ల తల్లిదండ్రుల బాధ్యతపై చైతన్యం కలిగించడం, లైంగిక దాడులు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతను గుర్తించినట్లుగా చైతన్యం కలిగించడం, బాలలపై హింసాకాండను తగ్గించడం లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని బాలల హక్కుల దినోత్సవ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది.
భారతదేశంలో పిల్లల హక్కుల పరిరక్షణ
ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణలో కొంతమేరకు పురోగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా భారతదేశం పిల్లల హక్కులను గుర్తించడంలో కొంతమేరకు వెనుకబడి ఉందని చెప్పవచ్చు. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కుల చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం. ఇలా చట్టాలు చేసినప్పటికీ వాటి అమలుకు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది.
శారీరకంగా శిక్షించడం నిషిద్ధం
2002 ఫిబ్రవరి 2018 నాడు నాటి విద్యా శాఖ కార్యదర్శి ఐ.వి.సుబ్బారావు పిల్లలను శారీరకంగా శిక్షించకుండా ఉండేలా ఒక జీవోను జారీ చేశారు. అది 1966లో జారీ చేసిన జీవోకు బదులుగా ఈ జీవో జారీ చేశారు. 2002లో జారీ చేసిన జీవో ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో పిల్లలని శారీరకంగా శిక్షించడాన్ని నిషేధించింది. అతిక్రమించినవారిని పీనల్ కోడ్ కింద కఠినంగా శిక్షించడం జరుగుతోంది.
పిల్లల మనసులపై ప్రతికూల ప్రభావం
శారరీక శిక్షలు పిల్లల మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. కసి, భయాందోళనలకు దారితీస్తుంది. శిక్షలకు గురి కావడంవల్ల వారిలో ఆగ్రహం, కోపం, ఆత్మన్యూనతాభావం ఏర్పడతాయి. తత్ఫలితంగా అవమానంతో కృంగిపోయి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇది పిల్లల సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వకపోగా వారిలో పగ, ప్రతీకారం వంటి వాటిని పెరిగేలా చేస్తుంది. పిల్లలు పెద్దలు చేసేదాన్ని అనుకరిస్తారు. ఫలితంగా వారి పెద్దలపైనే దాడికి దిగవచ్చు. చిన్నతనంలో ఇలా హింసలకు గురైనవారు ఎదిగాక అలాంటి హింసలనే తోటివారిపైనా, కుటుంబీకులపైనా ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక శిక్షలనేవి క్రమశిక్షణ నేర్పడానికి వాడే మార్గం కానే కాదు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్రమశిక్షణలోకి తేవడానికి పనికొస్తుంది. పిల్లల విషయంలో ఇది మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది. పిల్లలను దండిస్తే, వారు ఆ తప్పు మళ్లీ చేయరనడంలో కొంత నిజం ఉన్నా, శిక్షించడంవల్ల వారికి ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొనే అవకాశాన్ని మాత్రం ఇవ్వరు. బడి మధ్యలో మానేసిన పిల్లలు, రోడ్లపై తిరుగుతున్న చాలామంది వీధి బాలురు, హోటళ్లలో పనిచేసే పిల్లలు ఇంటినుంచి పారిపోవడానికి శారీరక హింసలే కారణం అని సర్వేలు చెబుతున్నాయి.
బాలల చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ఒక దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడానికి బాలల నైపుణ్యాల వృద్ధిపైనే ఆధారపడి వుంటుందనడంలో సందేహం లేదు. జీవన నైపుణ్యాలపై అవగాహన ద్వారా బాల్య దశ నుండే జీవిత విలువను గుర్తింపచేయవచ్చు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలి. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తుకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి.