మెయిన్ ఫీచర్

సత్వర న్యాయం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిశ’ హత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖండిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని న్యాయవ్యవస్థల్లో జాప్యం వల్ల తప్పించుకుని తిరుగుతున్న రేపిస్టులకు తెరదించే పనిలో పడింది కేంద్రం.
*
నేడు మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్త లేని దినపత్రిక ఉందా? లేదనే విషయం అందరికీ తెలుసు. మహిళలపై వరుస నేరాలు నిత్యకృత్యమయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార కేసుల్లో శిక్షలు పడే కేసులు ఎన్నో తెలుసా? కేవలం నాలుగు శాతం లోపేనట. జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదిక చెబుతున్న గణాంకాలు ఇవి. అంటే వందకు 96 కేసుల్లో నిందితులు బయటపడుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ మహిళలపై జరిగే అన్ని నేరాల్లో 6.2 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అత్యాచార కేసులను పరిశీలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.
నేడు ‘దిశ’ ఘటనతో మరోసారి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రస్తావన వచ్చింది. సత్వర న్యాయం అందించడానికి ‘్ఫస్ట్‌ట్రాక్’ పేరుతో తీసుకువచ్చిన కోర్టుల్లో కూడా అంతే జాప్యం జరుగుతోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం వీటిని ఏర్పరస్తున్నారు. సంచలన కేసుల విషయంలో ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడం మునుపు మనం చూశాం. పాత కేసుల పరిష్కారానికి 2000 సంవత్సరంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కేంద్రం ఏర్పాటు చేసింది. దీనికింద తెలంగాణలో 36 కోర్టులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో జిల్లా జడ్డి కోర్టులు 22 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుగా పనిచేస్తుండగా వీటిలో తొమ్మిది కోర్టులను పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో మరో 16 సబార్డినేట్ కోర్టులు పనిచేయడం లేదు. అత్యాచారం, పోక్సో కేసులు సుమారు 5598 ఉండగా, 36 కోర్టులను కేటాయించారు. ఇందులో పది కోర్టులు కేవలం పోక్సో కేసులను, 26 కోర్టులను అత్యాచారం, పోక్సో కేసుల విచారణకు నిర్దేశించారు. వరంగల్లో తొమ్మిది నెలల పిల్లను అత్యాచారం చేసి చంపిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా 61 రోజుల్లోనే దర్యాప్తును పూర్తిచేసి నిందితుడికి కోర్టు ఉరిశిక్షను విధించింది. నిందితుడు హైకోర్టుకు వెళితే దాన్ని యావజ్జీవంగా మారు స్తూ నిందితుడికి చివరి శ్వాస వరకూ జైలులోనే ఉంచాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఐదేళ్ల క్రితం అభయ అత్యాచారం కేసులో విచారణను తొమ్మిది నెలల్లో పూర్తిచేసి ఇద్దరు నిందితులకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ రెండు కేసులు మినహా సత్వర న్యాయం జరిగిన కేసులు తక్కువే.
నేరాలు-శిక్షలు
జాతీయ నేరాల నమోదు సంస్థ 2017లో వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో న్యాయవిచారణ చేపట్టిన కేసులు 1,46,201 అయితే ఇందులో శిక్ష పడిన కేసులు కేవలం 5,822 మాత్రమే.. ఇందులో కొట్టేసిన కేసులు 11, 453. అదే రాష్ట్రంలో అయితే 2017కు గాను 17, 521 కేసులు నమోదయ్యాయి. ఇందులో శిక్షలు పడిన కేసులు 426 మాత్రమే.. మిగిలిన కేసులు ఎప్పుడు కొలిక్కి వస్తాయో, నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుందో ఆ దేవుడికే తెలియాలి.
మనదేశంలో కోర్టు తీర్పులు వెలువడడానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకించి చెపాల్సిన అవసరం లేదు. నిర్భయ కేసే దీనికి మంచి ఉదాహరణ. ఇలా చట్టం వల్ల ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుని. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించనుంది. ఇకపై ఎవరైనా రేప్ చేస్తే హైకోర్టు కూడా బైపాస్ చేస్తూ నేరుగా ఉరిశిక్ష విధించే వీలుంటుంది. అప్పుడు ఆ సదరు ముద్దాయికి సుప్రీం కోర్టుకు తప్ప వేరే కోర్టును ఆశ్రయించే ఆప్షన్ లేదు. తద్వారా న్యాయం జరగడానికి జరిగే జాప్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. నిర్భయ సంఘటన 2012 డిసెంబర్‌లో జరిగితే.. 2013 సెప్టెంబర్‌లో కింది కోర్టు తీర్పును వెలువరించింది. ఆ తరువాత నిందితులు హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. 2014 హైకోర్టులో కింద కోర్టు ఇచ్చిన తీర్పు వేసిన మరణ దండన సరైందేనని చెప్పింది. వారు ఆ తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2017లో సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష విధించాల్సిందేనని చెప్పినప్పటికీ ఇంతవరకు వారిని ఉరి తీయలేదు. ఇప్పటికీ వారు తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఇలాంటి జాప్యాలను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి కఠిన చట్టాలైనా ఇలాంటి కామాంధులను ఆపుతాయో లేదో చూడాలి.. *