మెయిన్ ఫీచర్

భౌతిక సంపద... ఇహసంపదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
సర్వజ్ఞులైన శంకరాచార్యులవారికి శ్రుతి, స్మృతి వాక్యములు శిరోధార్యములు. అందువలన, వాటిని అనుసరించి ఇదే గ్రంథంలో (శ్లో.298) ఇలా స్పష్టంచేశారు. ‘‘త్యజాభిమానం కులగోత్రనామ రూపాశ్రమేష్వార్థ్ర శవాశ్రీతేషు లింగస్య ధర్మానపి కర్తృతాదీం స్త్యక్త్వా భవాఖడ్డసుఖస్వరూపః’’ (స్థూల శరీరమునకు సంబంధించిన కుల, గోత్ర, నామ, రూప, ఆశ్రమాదులపై అభిమానము త్యజించుము. సూక్ష్మదేహపరమైన కర్తృత్వ ధర్మములను సహితము విడచిపెట్టి అఖండ సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మములో ఐక్యమొందుము.
గార్గి, మైత్రేరుూ వంటి గృహిణులు వేదాంత పఠన పాఠనాదుల్లో పాల్గొని వారి మేథాశక్తిని ప్రదర్శించారని తెల్పుతున్న శ్రుతి వాక్యములే దీనికి ప్రమాణము (బృ.ఉ). విదురుడు దాసీపుత్రుడు, శాస్త్ర పరిచయముగలవాడు, అత్యంత సత్యనిష్ఠతోను, ధర్మనిష్ఠతోను ప్రవర్తించిన మేధావి (మ.్భ). అందువలన, బ్రాహ్మణత్వము, పురుషత్వము జ్ఞానప్రాప్తికి, మోక్షసిద్ధికి అనివార్యములు కావు.
3. దుర్లభం త్రయమేవైతద్ దైవానుగ్రహ హేతుకమ్‌
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః॥
మానవజన్మ, మోక్షము పొందాలనే కోరిక, మహాపురుషుల ఆశ్రయము అనే మూడు అదృష్ట ఫలములు అతి కష్టముగా దైవానుగ్రహమువలననే లభ్యమగును.
4. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం
తత్రాపి పుంస్త్వం శ్రుతి పారదర్శనమ్‌
యః స్వాత్మముకె్తై్య న యేతత మూఢధీః
స ఆత్మహా స్వం వినిహన్త్యసద్గ్రహాత్‌॥
ఏ సుకృతమువలనో దైవానుగ్రహముతో పురుషుడిగా దుర్లభమైన నరజన్మ పొంది, అటుపైన శాస్త్ర అధ్యయనముతో విద్యావంతుడై, నిరతిశయ సుఖమును ప్రసాదించే ముక్తికొరకు ప్రయత్నము చేయకున్నచో అతడు మూఢత్వంతో తననుతానే చంపుకునే వాడౌను. ఆత్మఘాతకులు పరబ్రహ్మ ఉనికిని ఎఱుగని అవివేకులు. తన హృదయస్థితమైన ఆత్మపరమాత్మ స్వరూపమని తెలుసుకోలేని వారినే ‘‘ఆత్మహనో జనాః’’అని శ్రుతి నిర్ధారించినది. వారికి అధోగతి తప్పదు. (ఈ.ఉ.3). స్మృతి అవివేకులైన మూఢులే పరమాత్మను విస్మరించెదరని ఇలా బోధిస్తున్నది-
‘‘అవజానంతి మాం మూఢాః మానుషీం తను మాశ్రీతం
పరంభావ మజానంతో మమ భూతమహేశ్వరమ్‌॥
(సర్వేశ్వరుడైన నాతత్త్వాన్ని తెలుసుకోలేని మూఢులు మానవ దేహమును పొంది కూడ నిర్లక్ష్యము చేయుదురు- భ.గీ.9-11
శాస్తవ్రిరుద్ధ కార్యాచరణకు అసుర ప్రవృత్తిగల అవివేకులే మూఢత్వంతో పాల్పడతారనే బోధన కూడా ఇలా జరిగినది-
‘‘కామమాశ్రీత్య దుష్పూరం దంభమానమదాన్వితాః
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే‚ శుచివ్రతాః॥
(అంతులేని కోరికలు, గర్వము, దురభిమానము, మదము ఇత్యాదులతో వివేకశూన్యులు మూర్ఖపు పట్టుదలతో దిగజారిపోయి, శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించుదురు- భ.గీ.16-10).
5. ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి
దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషమ్‌॥
అత్యంత దుర్లభమైన మానవజన్మను పురుషత్వసిద్ధితో పొందిన పిదప, శుభాశుభములు, మంచి చెడులను విస్మరించి, స్వార్థపరుడై అనాలోచితంగా ఆవేశముతో ఘోర విపత్తులో పడినవానికంటెను మూర్ఖుడు మరియొకడు ఉండడు.
6. పఠన్తు శాస్త్రాణి యజన్తు దేవాన్
కుర్వన్తు కర్మాణి భజన్తు దేవతాః
ఆత్మైక్యబోధేన వినా విముక్తిః
న సిద్ధ్యతి బ్రహ్మశతాన్తరే‚పి॥
శాస్తప్రఠనము ఎంతచేసినా, స్వర్గలోక వాసులైన దేవతల ప్రీతికొరకు యజ్ఞయాగాదులు చేసినా, నిత్యనైమిత్తిక కర్మలు ఆచరించినా, పలు దేవతలను కొలచి భజించినా, పరమాత్మలో ఐక్యమయే జ్ఞానము (ఆత్మబోధ) లేకపోయిన, యుగములు గడచిన పిదప కూడా ముక్తి లభించదు.
7. అమృతత్వస్య నాశాస్తి విత్తే నేత్యేవ హి శ్రుతిః
బ్రవీతి కర్మణో ముక్తే రహేతుత్వం స్ఫుటం యతః॥
యాజ్ఞవల్క్య మహర్షి గృహమును వీడి సన్న్యాసాశ్రమమును స్వీకరించ నిశ్చయించి, తన అనుంగు భార్య మైత్రేయిని పిల్చి నాకున్న యావదాస్తిని నీకును, నా పెద్ద భార్యయైన కాత్యాయినికి పంచివేసి పోదలచేనని చెప్పగా ఆమె ఆయనతో ఇలా అన్నది-‘‘యన్ను మ ఇయం భగోః సర్వాపృథివీ విత్తేన పూర్ణాస్యాత్ స్యాన్న్యహం తేనామృతా’’ (పూజ్యులైన స్వామీ! ఈ భూమి సమస్తము విత్తముతో నిండియున్నది. అయిననేమి ఈ ధనముచేత, నేను ముక్తిని పొందుదునా? ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యజ్ఞవల్క్యుడు ‘‘అహో నేతి నేతి యథైవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితగ్‌ం స్యాదమృతత్వస్య తు నాశా‚స్తి విత్తేనేతి॥
(నీవు ధనముతో ముక్తిని పొందలేవు, ఎన్నడూ పొందలేవు మైత్రేరుూ!
ధనముగలవారి జీవితము ఏ ప్రకారము గడచునో, ఆ ప్రకారమే నీ జీవితమూ గడచును. ధనముతో మోక్షము లభించే ప్రసక్తే(ఆశే) లేదు. మైత్రేరుూ - యాజ్ఞవల్క్య సంవాదము రెండు అధ్యాయములలో బృహదారణ్యకోపనిషత్తులో చేర్చబడినది (బృ.ఉ.2-4-2, 4-5-3) ఈ శ్రుతి వాక్యాలనే శంకరులవారు వక్కాణిస్తూ ధనమువలన ఎన్నడూ మోక్షము పొందబడదని ఈ శ్లోకంలో స్పష్టము చేస్తున్నారు.
8. అతో విముకె్తై్య ప్రయతేత విద్వాన్
సంన్యస్త బాహ్యార్థ సుఖస్పృహః సన్‌
సన్తం మహాన్తం సముపేత్య దేశికం
తేనో పదిష్టార్థ సమాహితాత్మా॥
నిత్యానిత్య వివేకముగలవాడు ఇహలోకమందుగాని, స్వర్గలోకమందుగాని అనిత్యమైన సుఖమును అనుభవించుటకు ఇష్టపడడు. వాని ధ్యేయము కైవల్యసిద్ధి. నిత్యవస్తువైన పరబ్రహ్మప్రాప్తిని ఆశించే సత్యానే్వషకులు సద్గురువును ఆశ్రయించవలెనని ముండకోపనిషత్తు ఇట్లు ప్రకటిస్తున్నది ‘‘తద్విజ్ఞానార్థం న గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రి యం బ్రహ్మనిష్ఠమ్’’
(విధివత్ శ్రోత్రియుడు, బ్రహ్మవాదియైన గురువునాశ్రయించి వానివద్ద ఆత్మతత్త్వమును అభ్యసించవలెను- ము.ఉ.1-2-12)
ఇంకాఉంది