మెయిన్ ఫీచర్

ఆత్మనిత్యనిర్మలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
ఆత్మ నిర్వికారి, నిష్క్రియి. ఏపనీ చేయదు: శరీరంలోనున్న ఏ ఇంద్రియాన్ని ప్రేరేపించదు. శరీరధారుడి కోరికలు తీర్చే అనే కర్తవ్యాన్ని జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు నిర్వహించును. బుద్ధి నిర్ణయించిన ప్రకారము వాటి వాటి కార్యనిర్వహణకొరకు ఇంద్రియములకు తగు శక్తినిచ్చి, కేవలం సాక్షిగా పరీక్షించే ఆత్మ, కర్తాకాదు, భోక్తాకాదు.
132. అహంకారాది దేహాన్తా విషయాశ్చ సుఖదాయః
వేద్యనే్త ఘటవద్యేన నిత్యబోధ స్వరూపిణా॥
ప్రకాశవంతమైనపుడు, ఘటాదులు ఏ రూపములో ఉన్ననూ వాటి ఉనికి, రూపాది విశేషములు స్పష్టవౌతున్నవి. అదే విధంగా స్వతఃసిద్ధముగా జ్ఞాన స్వరూపమైన ఆత్మద్వారా, దేహములో ఇమిడి ఉన్న అహంకారము ఇత్యాదులతోసహా పంచకోశముల పర్యంతము జడములైనా, సమస్తము ప్రకాశవంతమై, సుఖాదుల యొక్క అనుభూతి శరీర ధారునకు నిరాటంకముగా అవగతవౌతున్నది.
దృక్-దృశ్యము భిన్న ధర్మములు కలవి. ఆత్మ, దృక్ చేతనత్వమున్నది, స్వయంజ్యోతిస్స్వరూపము మరియు నిత్యత్వము కలది. ఆత్మనిత్యనిర్మలము, పరిశుద్ధమైనది. కాని, మలిన పదార్థములైన రుధిర, మాంసాదులతో ఉపాధివశాత్తు శరీరంలో సహజీవనము చేస్తున్నా, శరీర గుణములతో ఎన్నడూ ప్రభావితము కాదు.
133. ఏషో‚ న్తరాత్మా పురుషః పురాణో
నిరన్త రాఖణ్డసుఖానుభూతి?
సరైన రూపః ప్రతిబోధమాత్రో
యేనేషితా వాగసవ శ్చరన్తి॥
వికార రహితము, వృద్ధిక్షయములు పొందక నిత్యమూ ఏకరూపములో ఉండే అంతరాత్మ హృదయస్థానములో స్థిరముగా శరీరములో ఉంటున్నది. దాని సాన్నిధ్యముచేత ప్రభావితమై వాక్కు, ప్రాణకార్యము, సకల మనోవ్యాపారము నిరంతరము జరుగుతున్నవి.
133. ఏషో‚ న్తరాత్మా పురుషః పురాణో
నిరన్త రాఖణ్డసుఖానుభూతి?
సరైన రూపః ప్రతిబోధమాత్రో
యేనేషితా వాగసవ శ్చరన్తి॥
వికార రహితము, వృద్ధిక్షయములు పొందక నిత్యమూ ఏకరూపములో ఉండే అంతరాత్మ హృదయస్థానములో స్థిరముగా శరీరములో ఉంటున్నది. దాని సాన్నిధ్యముచేత ప్రభావితమై వాక్కు, ప్రాణనకార్యము, సకల మనోవ్యాపారము నిరంతరము జరుగుతున్నవి. అందువలన, సనాతనము, ఆద్యంతములు లేని పరమాత్మ అంశమైన అంతరాత్మ, అఖండానందమును నిత్యమూ అనుభవిస్తూ ఈ శరీరములోనే శయనిస్తున్నది (పురి శరీరే శేత ఇతి పురుషః అని నిర్వచనము).వయసుతోపాటు శరీరములో వచ్చే మార్పులేవీ ఆత్మను ప్రభావితము చేయవు. ఆత్మ సూక్ష్మాతిసూక్ష్మమైనది. దాని అవలోకనము సూక్ష్మబుద్ధిగలవారికే జ్ఞాననేత్ర ఉన్మీలనతో సాధ్యమని శ్రుతి స్పష్టము చేస్తున్నది (క.ఉ.1-3-12).
134.
అత్రైవ సత్త్వాత్మని ధీగుహాయా
మవ్యాకృతాకాశ ఉరుప్రకాశః
ఆకాశ ఉచ్చై రవివత్ప్రాకాశతే
స్వతేజసా విశ్వమిదం ప్రకాశయన్‌॥
స్థూల సూక్ష్మకారణ శరీరములు మూడింటిని అధిష్ఠించి హృదయాంతరాళములో ఆత్మ ఉన్నది. పైన ఆకాశములోనున్న సూర్యుడు నలుదిశలా వ్యాపించి, యావత్ప్రపంచమును ఎట్లు ప్రకాశవంతము చేయుచున్నాడో, అదే విధంగా స్వయంజ్యోతిః స్వరూపమైన ఆత్మ, మాయను సహితము అధిగమించి సర్వత్ర శరీరములో ప్రకాశిస్తున్నది. సూర్యచంద్రాదులు పరబ్రహ్మ కారణంగా తేజోమయమై ప్రకాశిస్తున్నవి. అందువలన, పరమాత్మను ‘‘పరంజ్యోతి’’అని ఛాందోగ్యశ్రుతి (్ఛ.ఉ.8-12-3) మరియు ‘‘జ్యోతిషాం జ్యోతిః’’అని బృహదారణ్యక శ్రుతి నిర్దేశిస్తున్నవి (బృ.ఉ.4-4-16). భారూపమైన ప్రత్యగాత్మ మనోబుద్ధులను, అవ్యక్తరూపమైన మాయను అధిగమించి, త్రివిధ శరీరములను ప్రకాశవంతము చేస్తున్నది.
135. జ్ఞాతా మనో‚ హంకృతి విక్రియాణాం
దేహేన్ద్రియ ప్రాణకృత క్రియాణామ్‌
అయో‚ గ్నివత్తాననువర్తమానో
న చేష్టతే నో వికరోతి కించన॥
దేహాతీతమైన ఆత్మ, దేహభాగములైన మనస్సు, బుద్ధి అహంకారాదుల వికారములను, బాహ్యేంద్రియములు ఇతర శరీర అంగములు, పంచ ప్రాణముల యొక్క క్రియలను వెనె్వంటనే జ్ఞాతగా తెలిసికొంటున్నది. ఇనుప వస్తువు కొలిమిలో కాలి, కార్యరూపంలో నానాప్రకారముల పరివర్తన చెందుతున్నది. భారూపమైన జీవాత్మ, సమస్త దేహభాగములను ప్రకాశవంతము చేస్తున్నది, కాని ఇంద్రియములను అనుసరించి ఏ పరిణామమును తాను పొందదు. దేహసంబంధ క్రియలకు ప్రత్యగాత్మ కర్తకాదు. ఆత్మ వికార రహితము, దేహములో ఏ వికారములను తాను సృష్టించదు. కామము, కోపము ఇత్యాది వికారములు ఆత్మ జనితములు కావని శ్రుతి ‘‘కామఃకర్తా నాహం కర్తాకామః కారయితా నాహం కారయితా’’, ‘‘మన్యుకర్తా నాహం కర్తా మన్యుః కారయితా నాహం కారయితా’’అని సూచిస్తున్నది (మ.ఉ.అను.62).
136. న జాయతే నో మ్రియతే న వర్ధతే
న క్షీయతే నో వికరోతి నిత్యః
విలీయమానే‚ పి వపుష్యముష్మిన్
న లీయతే కుంభ ఇవాంబరం స్వయమ్‌॥
ఆత్మ నిత్యమైనది. దానికి పుట్టుక మరణము అనే ధర్మములు లేవు. అది వృద్ధి చెందదు, క్షీణించదు. వికారము లేవియు కలిగించదు. శూన్యకుంభము నశించగా అందు వ్యాప్తిచెందిన ఆకాశము, మహాకాశములో కలిసిపోయినట్లు, శరీర పతనముతో ఆత్మ నశించక పరమాత్మలో ఏకమగును.‘అస్తి, జాయతే, విపరిణమతే, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి’ (పుట్టుక, ఉనికి, పెరుగుట, పరిణామము చెందుట, తరుగుట, నాశనమగుట) అనే ఆరు, శరీర ధర్మములు. ఆత్మ సద్రూపము.
- ఇంకావుంది...