మెయన్ ఫీచర్

ఇంటర్‌నెట్ మాత్రమే ప్రాథమిక హక్కు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్‌నెట్ వినియోగం ప్రాథమిక హక్కు కిందకు వస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఇంటర్‌నెట్ వినియోగం ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, న్యాయపరిధిని దాటి వ్యక్తం చేసిన ఆవేదన నేటి పరిస్థితిని అద్దం పడుతోంది.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు పాఠం చదువుతూ చార్లెస్ డికెన్స్ రాసిన ఏ టేల్ ఆఫ్ టు సిటీస్ (రెండు మహానగరాల కథ)లోని వాక్యాలతో ప్రారంభించారు. ఈ వాక్యాలు ఆనాటివే అయినా, అవి నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
‘‘అదో వైభవోజ్వల మహాయుగం- వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం- బ్రహ్మజెముడులా అజ్ఞానం, భక్తివిశ్వాసాల పరమ పరిధవం - పరమ పాషండాల ప్రల్లదకల్లోలం, ఉజ్వల చైతన్యానికి ఉత్పుల్లమహోదయం - అంధాంధతమసాల అవ్యక్త నిశీదం, అశాకుసుమాల పుష్పించిన ఆ మధుర వసంతం- నైరాశ్యపు చలి గుబుళ్లు ఈచుకున్న శశిరాస్యం, సర్వ సంపత్సమృద్ధి సర్వోతోముఖ క్షామం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం- నడుస్తున్నారు నరకానికి సూటిగా... అరుస్తున్నాయి అధికారిక కంఠాలు- అంతా అమోఘంగా ఉందని... అని జస్టిస్ ఎన్వీ రమణ ఇంటర్‌నెట్‌కు సంబంధించి వెలువరించిన తీర్పులో ఉటంకించారు.
భూతల స్వర్గంగా కశ్మీర్ మన హృదయాల్లో నిలిచినా, ఈ అందమైన ప్రాంతం చరిత్ర హింస, తీవ్రవాదంతో కూడుకుని ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక న్యాయమూర్తుల గుండెకోతను కూడా అర్థం చేసుకోవచ్చు. చట్టంలో లోపాలను తమకు చుట్టంగా మలుచుకుంటున్న కొంత మంది హక్కుల పేరుతో చేసే హింసను అదుపు చేయడం ప్రాథమిక హక్కులను భంగం కలిగించడమే అవుతుందా? లేదా హింసను చూసి నిరంతరం ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం నైతికం అవుతుందా? భారతీయులకు లిఖితపూర్వకమైన రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించింది. దేశంలో ఎక్కడో ఒక చోట ఏదో రీతిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతునే ఉంది. దానికి కారణాలు ఏమిటి? అదో పార్శ్వం దాని లోతుల్లోకి వెళ్తే సుదీర్ఘ వివాదాంశం అవుతుంది. కశ్మీర్‌లో జరుగుతున్నదదే. కేంద్ర ప్రభుత్వం తనకు ఉన్న విశేష అధికారాలతో టెలికం సేవలను తాత్కాలికంగా నిలిపివేసే 2017 చట్టం కింద కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించింది. ఈ చట్టం కింద ఎంత కాలం ఆంక్షలు కొనసాగించవచ్చనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. నిషేధ ఆజ్ఞలకు కాలపరిమితి లేదు. అయితే రూల్ 2(5) కింద మాత్రం సమీక్ష కమిటీని నియమించాలని ఉంది. సమీక్ష కమిటీని నియమించినా, వెంటనే సమీక్షించాలనే నిబంధన కూడా లేదు. దాంతో కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో మానవ హక్కులకు, ప్రాథ మిక హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంబా లు ప్రాథమిక హక్కులు. భారతీయు సంపూర్ణ వికాసానికి, అభివృద్ధికీ వీటిని రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుండి 35 వరకూ ఉన్న అధికరణాలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తాయి. వీటిని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. వీటికి న్యాయ రక్షణ కూడా ఉంది. 1950 జనవరి 26న రాజ్యాం గం అమలులోకి వచ్చినపుడు ఏడు ప్రాథ మిక హక్కులున్నాయి. సమానత్వపు హక్కు (14-18 ఆర్టికల్స్), స్వాతంత్య్రపు హక్కు (19-22 ఆర్టికల్స్), దోపిడీని నిరోధించే హక్కు (23-24 ఆర్టికల్స్) మత స్వాతంత్య్రపు హక్కు (25- 28 ఆర్టికల్స్), సాంస్కృతిక విద్యా హక్కు (29-30 ఆర్టికల్స్), ఆస్తి హక్కు (31వ ఆర్టికల్), రాజ్యాంగ పరిహార హక్కు (32వ ఆర్టికల్), భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును (31వ ఆర్టికల్), ఆస్తి స్వేచ్ఛను (ఆర్టికల్ 19(1)(ఎఫ్))ను తొలగించారు. రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300ఎ ను చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు మాత్రమే.
తాజాగా ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రజల ప్రాథ మిక హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిం ది. ఇంటర్‌నెట్ స్వాతంత్య్రపు హక్కు కిందకు వస్తుందని, ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం, శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వాతంత్య్రం, సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే స్వాతంత్య్రం, దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడానికి స్వాతంత్య్రం, దేశం అంతా స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్య్రం, ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేసుకునే స్వాతంత్య్రం దక్కుతాయి. ఇందులో భాగంగానే ఇంటర్‌నెట్ సైతం ప్రజల హక్కేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది. నిబంధనల పేరుతో దీర్ఘకాలం పాటు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయడం కుదరదని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు కేవలం జమ్మూ, కశ్మీర్‌లకే పరిమితం కాదు, ఈ తీర్పు వల్ల యావద్దేశానికే లబ్ది చేకూరుతుంది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలను దీర్ఘకాలం కొనసాగించడం ఎంత మాత్రం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందడం వమల్ల ప్రభావం తీవ్రంగా ఉంటోందని , అది కశ్మీర్‌లో హింసకు దారితీస్తోందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జమ్మూ, కశ్మీర్‌లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించడానికి నిరాకరించిన ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అక్కడ విధించిన నియంత్రణలను తక్షణమే సమీక్షించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా లేని ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కూడా స్పష్టం చేసింది. 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా దీర్ఘకాలంగా ఫోన్లు, ఇంటర్‌నెట్ సేవలపై ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ అజాద్. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం కీలకమైన తీర్పును ఇచ్చింది. ఇంటర్‌నెట్ ద్వారా చేసే భావ ప్రకటన, వృత్తి, వ్యాపారం, వాణిజ్యం కూడా రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం ప్రాథమిక హక్కు కిందకే వస్తాయని తీర్పు చెప్పింది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 144ను పదే పదే విధించడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని ఈ సెక్షన్ కింద జారీ చేసే ఉత్తర్వులు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిం ది. ప్రజాజీవితంపై పరిమితులు విధించేలా ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని తప్పనిసరి బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఆంక్షలు ఎప్పుడూ పరిమితంగా నిష్పక్షపాతంగా ఉండాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఇంటర్‌నెట్ ద్వారా భావప్రకటన, వృత్తి, వ్యాపారం, వాణిజ్యం చేసుకునే స్వేచ్ఛ దేశ పౌరులు అందరికీ ఉంది. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(బీ) రక్షణ కల్పిస్తున్నాయి. ఇలాంటి ప్రాథమిక హక్కులపై విధించే ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), 19(3) లకు లోబడి ఉండటం తప్పనిసరి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధ ఆజ్ఞల వెనుక రాజకీయ ఉద్దే శ్యాలు ఉన్నాయా లేదా అనే విషయాల జోలికి ధర్మాసనం వెళ్లలేదు. భద్రత, పౌరుల స్వేచ్ఛ మధ్య సమతుల్యం ఉందా లేదా అన్న అంశం వరకే సుప్రీంకోర్టు పరిమితమైంది. ప్రజల హక్కులకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని, మానవ హక్కులు, సమతుల్యతను పాటించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇంటర్‌నెట్ ద్వారా భావ వ్యక్తీకరణ ఇటీవలి కాలంలో అత్యవసరంగా మారిందని, సమాచార వ్యాప్తికి ఇదో ప్రధాన వనరుగా ఉంది కనుక దానిపై ఆంక్షలు సరికాదన్నది ధర్మాసనం ప్రధాన ఆదేశం. అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే ఉండాలి, వాటిని ఎప్పటికపుడు సమీక్షించాలి. వ్యాపారం, వాణిజ్యాలకు ఇంటర్‌నెట్ అత్యవసర సాధనం, కొన్ని వాణిజ్యాలు పూర్తిగా దానిపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్‌నెట్ ద్వారా వాణిజ్యం వినియోగం, లభ్యతను పెంచుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద ప్రసాదించిన భావ ప్రకటన, మాట్లాడే స్వేచ్ఛపై అవసరమైన సమయంలో పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఎపుడూ ఉంటుంది. అయితే అది ఆర్టికల్ 19(1)(ఏ) కు లోబడే ఉండాలని ధర్మాసనం పేర్కొంది. వ్యక్తుల ప్రాధమిక హక్కులపై పరిమితులు విధించేందుకు ఉద్ధేశించిన ఉత్తర్వులు జారీ చేసేటపుడు అధికారులు వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ పరిమితులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనవిగా ఉండాలే తప్ప అణచివేతకు దారితీయకూడదు. నియంత్రణ చట్టాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వివిధ హక్కులపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మానవ హక్కుల విషయంలో వీటిని సాదాసీదాగా వినియోగించకూడదు. ప్రస్తుతం అమలులో ఉన్న టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జన్సీ- పబ్లిక్ సేఫ్టీ ) యాక్టు రూల్స్ -2017 కింద కాలానుగుణ సమీక్ష గానీ, సేవల నిలిపివేతకు పరిమితి లేదు. ఈ లోపాన్ని సరిదిద్దేంతవరకూ అందులో రూల్ 2(5) కింద ఏర్పాటయ్యే రివ్యూ కమిటీ వారానికోమారు సమీక్షించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఉగ్రవాదాన్ని ఏరివేసే పేరుతో అమెరికా బలగాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా పాగావేశాయో అందరికీ తెలిసిందే, తాజాగా ఇరాన్‌పై దాడులు కూడా ఎంత వరకూ తీసుకువెళ్తాయనే భయాందోళన ప్రపంచంలో అందరికీ కలిగేలా అమెరికా పావులు కదుపుతూనే ఉంది. ఇది ప్రభుత్వాల దుర్నీతికి ప్రతీక. అయితే ఇంటర్‌నెట్‌లో దుర్వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, విద్వేషపూరిత రాతలు, అశ్లీలత లేదనీ, ఇంటర్‌నెట్‌ను పరిమితులు లేని రీతిలో వాడుకునే స్వేచ్ఛ ఉండాలనే మరికొంత మంది వాదననూ సమర్ధించలేం. చట్టాలతో ఆంక్షలు విధించడం కన్నా పౌరులే నైతికంగా మెలిగినపుడే ఆ సమాజం మానవీయ సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే అంటారు, ఏదీ అతి పనికిరాదు...

- బీవీ ప్రసాద్ 9963345056