మెయిన్ ఫీచర్

మహిళా రక్షణే ధ్యేయంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తొలి ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే ‘దిశ’ మొబైల్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టారు. ఈ దిశ యాప్ ఎస్.ఓ.ఎస్. టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా సత్వరమే పోలీసుల నుంచి బాధితురాలికి సాయం అందుతుందని ప్రభుత్వం తెలిపింది.
‘దిశ’ యాప్ ఎలా పనిచేస్తుందంటే? దిశ యాప్ ఎస్.ఓ.ఎస్.యాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. బాధితురాలు ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కితే 10 సెకన్ల ఆడియో వీడియో కట్ అయి కంట్రోల్ రూంలోకి వెళుతుంది. బాధితురాలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే స్టిక్ చేసినా ఆ ట్రిగ్గర్ కంట్రోల్ రూంకు చేరుతుంది. వెంటనే బాధితురాలి లొకేషన్‌కు దగ్గరగా ఉన్న పోలీసు వాహనానికి ఈ సమాచారం చేరుతుంది. వెంటనే పోలీసు వాహనంలో ఉండే సిబ్బంది బయల్దేరి ఐదు నిమిషాల్లో బాధితురాలి దగ్గరకు చేరుకుంటారు. ఇందుకు అవసరమైన అన్ని ఎస్.ఓ.ఎస్. ఫీచర్లన్నీ దిశ యాప్‌లో పొందుపరిచారు. ‘దిశ’ యాప్‌లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా యాడ్ చేసి ఉంది. అందులోని మ్యాప్స్ ఆధారంగా బ్లడ్ బ్యాంకు, మెడికల్ ఫెసిలిటీ ఇలా అన్ని సర్వీసులను వినియోగించుకోవచ్చు. ‘దిశ’ చట్టం, యాప్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసింది. అడ్వాన్స్‌డ్ ఇనె్వస్టిగేషన్ పరికరాలు, సైంటిఫిక్ పరికరాల ద్వారా క్రైం సీన్ 3డీ-3డీ వీవేర్‌తో ఒడిసిపట్టుకునే సాంకేతికతను సైతం తీసుకొచ్చింది. ఇక బాధితుల వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి హ్యాష్ ట్యాగ్ వాల్యూతో పనిచేస్తుంది. దిశ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్స్, డయల్ 100, 112 అన్నీ మహిళలకు చేసే ఫిర్యాదులను స్వీకరిస్తాయి. ఈ రెండింటిని కలిపి ఇంటిగ్రేట్ చేస్తంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌లో ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరు సి.ఐ.లు, ఐదుగురు ఎస్.ఐ.లు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు. దీనివల్ల లాభం ఏంటంటే కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ పోలీసు స్టేషన్‌లో అయినా బాధితులు ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయవచ్చు. ఈ జీరో ఎఫ్.ఐ.ఆర్ ఎవరైతే అమలుచేయరో వారిపై ఐపీసీ సెక్షన్ల కింద శిక్షలు ఖరారు చేస్తారు. అలాగే ప్రతి జిల్లాలోనూ దిశ వాహనాలను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఈ డ్రాపింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఈ డ్రాపింగ్ వాహనాలు పనిచేస్తుంటాయి. మహిళలు ఉచితంగా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సహాయం అందించేందుకు, రక్షణ కల్పించేందుకు పోలీసు శాఖ ‘దిశ’ పేరుతో మొబైల్ యాప్ రూపొందించింది. ఆపదలో ఉన్నవారు యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ (ఎస్.ఓ.ఎస్) బటన్‌ను నొక్కి పోలీసుల సహాయం కోరే సమయం కూడా లేనప్పుడు, ఫోన్‌ని అటూ ఇటూ గట్టిగా ఊపినా (షేక్ ట్రిగ్గర్) కంట్రోల్‌రూంకి క్షణాల్లో సమాచారం వెళ్లేలా దీన్ని రూపొందించారు.
‘దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవీ. ఆండ్రాయిడ్, ఐ.ఓ.ఎస్. ప్లాట్‌ఫాంలపై అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా యాప్ పనిచేస్తుంది. ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కితే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ ఫోన్‌నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీసు కంట్రోల్‌రూంకి వెళతాయి. ఫోన్ లొకేషన్, 10 సెకన్ల నిడివి గల వీడియో, ఆడియో కూడా కంట్రోల్ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి. ఈ యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’ అని ఒక ఆప్షన్ ఉంది. ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రాంతం, గమ్యం నమోదు చేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్ రూం నుంచి గమనిస్తారు. నమోదు చేసిన మార్గంలో కాకుండా ఆటో మరో మార్గంలోకి వెళ్తే వెంటనే పోలీసు కంట్రోరూంని, స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ సందేశం వెళుతుంది. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారం పంపేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్ నెంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నెంబర్లు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎస్.ఓ.ఎస్. సందేశం పంపినా, ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగించినప్పుడు వాహనం దారి తప్పి వెళుతున్న పోలీసులతో పాటు, ఈ ఐదు నెంబర్లకూ సందేశం వెళుతుంది. ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కగానే ఆ సమాచార్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్ రూం నుంచి ఆటోమేటిక్ కాల్ డిస్పాచ్ విధానంలో పంపిస్తారు. జీపీఎస్ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్ డాటా టెర్మినల్’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్ మ్యాప్ అందులో కనిపిస్తుంది. దాన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 100/112 నెంబర్లకూ సహాయం కోసం ఫోన్ చేయవచ్చు. యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్ సెంటర్లు, ఇతర ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచి (నావిగేషన్)లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన నెంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ వారికి జైలు శిక్ష లేదా మరణ దండన విధిస్తున్నారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన దిశ చట్టం ద్వారా రేప్ చేసిన వారికి తప్పనిసరిగా మరణ శిక్ష విధిస్తారు. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. ఏపీ దిశ చట్టంలో దీన్ని 21 రోజులకు కుదించారు. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్లయితే, వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తయి, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ ముగిసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడుతుంది.
ఏడు రోజుల్లో పోలీసు విచారణ పూర్తి చేయడం సాధ్యమేనా? అంటే పోలీసు శాఖ కచ్చితంగా చేస్తామని చెబుతోంది. విచారణ పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను దిశ చట్టంలోకి చేర్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జీ సెక్షన్లను అదనంగా చేర్చింది. ఫోక్సో, గ్యాంగ్ రేపు వంటి కేసల్లో ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని దిశ చట్టం చెబుతోంది. దీనిపై పద్నాలుగు పని దినాల్లోగా న్యాయ విచారణ పూర్తి కానుంది. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.
దిశ చట్టం అమలు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక్కో కోర్టు చొప్పున మొత్తం 13 దిశ కోర్టులు, 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం నియమించనుంది. విచారణ కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా అయితే ఎమ్మార్వో, మెడికల్ రిపోర్ట్, ఎడ్యుకేషన్, డాక్టర్ల దగ్గర నుంచి రిపోర్టులు రావడానికి కనీసం 2 నెలల సమయం పడుతుంది. అయితే ఆ సమయాన్ని 7 రోజులకు కుదిస్తూ దిశా చట్టంలో పొందుపరిచారు. ఇందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సి.ఎం. జగన్ రూ.87 కోట్లు విడుదల చేశారు. 14 రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి కావాలంటే, రోజువారీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అప్పీల్ టైమ్ 180 రోజుల సమయం ఉండగా దాన్ని 45 రోజులకు కుదించారు. రేప్, గ్యాంగ్ రేప్ నేరాలకు పాల్పడితే మరణ శిక్ష విధించడం, జీవిత ఖైదు వంటి శిక్షలు విధించనున్నారు. ఇప్పటి సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్ధిష్టంగా లేవు. దిశ చట్టం ప్రకారం మెయిల్స్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాతి తప్పుకు నాలుగేళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు.

- వాసిలి సురేష్ 9494615360