మెయిన్ ఫీచర్

ప్రేమికులకు ప్రత్యేకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీ యువకులు ఉంటారా? ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దగ్గరలో రాబోతున్నది. ప్రేమికుల రోజును ఒక వేడుకల జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోతారు. ఇక ఆ రోజు ఏ ప్రదేశాలకు వెళ్లాలి? ఎక్కడ గడపాలి? అని ప్లాన్లు వేసుకునే ప్రేమ పక్షులు ఎన్నో.. మనసుపడ్డ వారికి మదిలోని ప్రేమను ఎక్కడ? ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి జంటల కోసం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు పరచుకున్న ఆ ప్రదేశాలు ప్రేమికులను అద్భుత లోకాల్లో విహరించేలా చేస్తాయి. అలాంటి ప్రదేశాల్లో మన హైదరాబాద్ కూడా ఒకటి. మరి హైదరాబాద్‌లో అలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..
హైదరాబాద్ అందమైన సిటీ మాత్రమే కాదు చారిత్రక కట్టడాలు, రొమాంటిక్ వాతావరణం కలిగిన ప్రదేశం. వాలెంటైన్స్ డే రోజును ప్రేమ జంటలు తిరగడానికి అనేక రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ డేటింగ్‌తో మీ ప్రియుడు/ప్రేయసిని ఆశ్చర్యపరచవచ్చు. ప్రేమికులు మనస్సును ఆహ్లాదపరిచేవిధంగా హైదరాబాద్‌లో వాటర్ ఫాంట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఫర్‌ఫెక్ట్ రొమాంటిక్ సెట్టింగ్‌ను కలిగి ఉన్నాయి. నెక్లెస్ రోడ్ నుండి హుస్సేన్ సాగర్ లేక్, దుర్గం చెరువు, ఫలక్‌నామా ప్యాలెస్ వరకు అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమలో ఉన్నవారి మధ్య బంధం మరింత బలపడటానికి అనువైన ప్రదేశాలు. మరి వీటితో పాటు మరికొన్ని రొమాంటిక్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
ఫలక్‌నామా ప్యాలెస్
19వ శతాబ్దకాలం నాటి ఒక అద్భుతమైన కట్టడం ఫలక్‌నామా ప్యాలెస్. రాజసాన్ని ఉట్టిపడేలా చేసే ఈ ప్రదేశం ప్రేమజంటలకు చాలా అద్భుతమైన
ప్రదేశం. ఇక్కడ రెస్టారెంట్లో డిన్నర్ చేసి, కొంత సమయాన్ని గడపవచ్చు. కాబట్టి.. మీ పార్టనర్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
హుస్సేన్‌సాగర్ లేక్
ఇది మానవ నిర్మిత సరస్సే అయినప్పటికీ హుస్సేన్ సాగర్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాయం సంధ్యలో ప్రకృతి.. ప్రేమ పక్షులు.. ఎంతో బాగుంటాయి. ఇందులో నీటికి సంబంధించిన ఆటలు కూడా ఉన్నాయి. ఇక్కడికి మీ పార్టనర్‌ను తీసుకెళ్ళడానికి అనువైన ప్రదేశం ఇది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇది ప్రేమికులను ఆహ్వానిస్తుంది. సంధ్యాసమయంలో ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. హుస్సేన్ సాగర్‌తో పాటు దగ్గరలోని లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, ఈట్‌స్ట్రీట్ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.
గోల్కొండ
ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం గోల్కొండ కోట. ఫిబ్రవరి 14న మీ పార్ట్‌నర్‌తో డేటింగ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశం గోల్కొండ కోట. మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి ఒక ఉత్తమ ప్రదేశం గోల్కొండ. ఇతర ప్రేమ జంటలు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్లు, రొమాంటిక్ ప్రదేశాల్లో రద్దీగా ఉన్నప్పుడు మీరు ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకున్నప్పుడు గోల్కొండ కోట రొమాంటిక్ ప్రదేశం.
కేబీఆర్ పార్క్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతున్న పార్క్ ఇది. ప్రేమజంటలు చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగేవారు, ఇప్పటికే మునిగినవారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.
గుఫా
థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఇది. పార్ట్‌నర్‌కు ఒక సరికొత్త నార్త్ ఇండియన్ వంటకాలను రుచి చూపించడానికి ఒక సరైన ప్రదేశం ఇది. ఒక గుహలోపల క్యాండిల్ లైట్ డిన్నర్‌కు చాలా మంచి ప్రదేశం. ప్రేమికుల రోజున ఇక్కడ భోజనం మరింత ఉత్సాహాన్నిస్తుంది.
అనంతగిరి హిల్స్
నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్.. రొమాంటిక్ డెస్టినేషన్‌గా ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కొండల నుండి జాలువారే జలాలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో అనంతగిరి హిల్స్ ప్రకృతి ప్రేమికులను మైమరిచిపోయేలా చేస్తుంది. నగరం నుండి సుమారు ఒక గంట ప్రయాణం చేస్తే అనంతగిరి కొండలను చేరుకోవచ్చు. ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన హిల్ స్టేషన్ ఇది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి దృశ్యం మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేర్చే శృంగార ప్రదేశం.
షామీర్‌పేట్ లేక్
ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిలరాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.
సీక్రెట్ లేక్
ఒకప్పుడు సీక్రెట్ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజ సిద్ధమైన చెరువు ప్రేమికులకు మాత్రమే.. ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ చెరువు లోయలో, కొండల మధ్య అత్యంత సుందరంగా ఉండేది, అయితే ఈ ప్రదేశం ఎక్కువమందికి తెలియకపోవడం చాలా కొద్దిమంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్ లేదా రహస్య చెరువు అని మారుపేరు ఉంది. ఇప్పటికీ తన సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.
తారామతి-బారాదరి
చరిత్రలోకి తొంగిచూస్తూ మధుర స్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి-బారాదరి కూడా పర్‌ఫెక్ట్ వాలెంటైన్ డే ప్లేస్ అని చెప్పవచ్చు. సుఫీ అండ్ గజల్స్, ఖవ్వాలీ సింగర్స్‌తో ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. ఒకప్పుడు భగ్మతి అనే ప్రముఖ నృత్యకారుడు ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసేవారట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా థియేటర్‌గా మారింది. ఇది ఇప్పుడు గజల్స్ మరియు డాన్స్ నైట్స్ నిర్వహించబడుతోంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రదేశానికి వెళ్లడం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది.
ఫిబ్రవరి.. ప్రేమ జంటలకు చాలా ముఖ్యమైన మాసం. పర్యటనలకు ఈ నెలలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ ప్రేమికుల రోజును జరుపుకునేందుకు ఒక మంచి ట్రిప్‌ను ప్లాన్ చేయడం ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. సరికొత్తగా ప్రపోజ్ చేయవచ్చు. ఈ క్షణాలను మరపురాని జ్ఞాపకాలుగా మలచుకోవాలంటే ఈ రొమాంటిక్ గైడ్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. *
వాలెంటైన్స్ వీక్
ప్రేయసి/ప్రేమికుడు తమ మనసులోని భావాలను చెప్పేందుకు వాలెంటైన్స్ డేనే సరైన సమయమని భావిస్తుంటారు. ఇందుకు వారికి తోచినట్లుగా, స్థాయికి తగినట్లుగా తమ ప్రేయసి/ప్రియుడికి ఏదో ఒక బహుమతి ఇచ్చి మనసులోని మాటను చెబుతుంటారు. ఇలా చెప్పడానే్న ప్రపోజ్ చేయడమంటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపోజ్ డే..గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేతో పాటు వాలెంటైన్స్ వీక్ కూడా ఉందని మీకు తెలుసా.. వారం రోజుల ముందుగానే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7న రోజ్ డే మొదలుకొని ప్రపోజ్ డే వరకు చాక్లెట్స్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. చివరగా వాలెంటైన్స్ డే.. ఇలా వారం రోజుల పాటు ప్రేమ పండుగను ఆస్వాదించవచ్చు. ఫిబ్రవరి 7న రోజా పువ్వు ఇవ్వడంతో మొదలుపెట్టి లవ్ కొటేషన్ ఉన్న మంచి గ్రీటింగ్ కార్డో.., ఇంట్లో నిత్యం వాడుకునే వస్తువో.. ఇస్తూ ఐ లవ్ యూ చెప్పవచ్చు. ప్రేమ తెలుపకపోతే అవతలివారికి మీపై ఫీలింగ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? మీకు వారంటే ఇష్టం లేదని వారు అడ్వాన్స్ అవ్వకపోయే అవకాశం లేకపోలేదు. పెన్ను కదపడం కాస్త అలవాటుంటే చాలు.. సొంతంగా ప్రేమను తెలుపుతూ ప్రేమలేఖ రాయటం ఉత్తమం. సంగీతవాద్యాలపై పట్టు ఉంటే.. వాటిని ప్తే చేస్తూ మంచి సమయం చూసి ప్రేమ విషయాన్ని చెబితే ప్రయోజనం ఉంటుంది. అబ్బాయిలైతే.. ఒక ఎర్రటి రోజూ పువ్వుతో పాటు ప్రేమలేఖను ఇవ్వచ్చు.