మెయన్ ఫీచర్

తుగ్లక్ నయమేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి యువకుడు. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డిగారి తనయుడు. వై.యస్.రాజశేఖరరెడ్డిపై సానుకూల, వ్యతిరేక భావాలున్నాయి. అయితే ఇచ్చిన మాట మీద నిలబడటం, నమ్మిన వ్యక్తుల్ని ఆదరించడం అతని సహజ స్వభావం. రాజశేఖరరెడ్డిపై ప్రజలకున్న గౌరవభావానికి ప్రతినిధిగా ‘రాజన్న రాజ్యం’ తీసుకురావడానికి ఒక్కసారి అవకాశమివ్వండని, జగన్ వేలాది కిలోమీటర్లు, సంవత్సరాల తరబడి పాదయాత్ర చేశారు.
అయితే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో జరిగిన ఎన్నికలలో 1.5% ఓట్లతో జగన్ ఓడిపోవడం, టిడిపి నాయకులు చంద్రబాబునాయుడు గెలిచి, ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆనాటి ఎన్నికలలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకున్నది. కేంద్రంలో మోదీ, చంద్రబాబు బాగా దోస్తీగా వ్యవహరించారు. ఎంత సఖ్యతగా చంద్రబాబునాయుడు, మోడీగారికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించినా మోదీజీ ఏపీ ప్రభుత్వానికి అంగీకరించిన ప్రత్యేక హోదా గానీ, జాతీయ ప్రాజెక్టుగా నామకరణం గావించబడ్డ పోలవరం ప్రాజెక్టుకు గానీ కేంద్రం సహకరించలేదు. దానికి కారణం ఒక్కటే నరేంద్రమోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, గుజరాత్‌లో జరిగిన హింసాకాండపై ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆనాటి పరిస్థితిలో చంద్రబాబు చేసిన కామెంట్ నరేంద్రమోదీజీ మరచిపోలేదు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై కక్ష, ఏపీ ప్రజలపై చూపారు. 2019 ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం మోదీజీ ప్రభుత్వానికి ఎదురు తిరిగి అవిశ్వాసం దాకా నడిపించారు.
ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించి పునాది రాయిని వేయించారు. ఆ సందర్భంలో కూడా మాటల వరకే గాక చేతల సాయం హామీ ఇవ్వలేదు. నూతనంగా ఏర్పడ్డ రాజధాని అంగరంగ వైభవంగా ఉండాలని చంద్రబాబు ఊహాజనిత పథకాలు వేశారు. సారవంతమైన భూమిని రైతులనుండి 33,771 వేల ఎకరాలు సమీకరించారు. ప్రభుత్వ పోరంబోకు, దేవాలయాల భూములు మరో 20వేల ఎకరాలు రాజధానికి సమీకరించారు.
అయితే సారవంతమైన భూమిని అక్విజిషన్ యాక్టు క్రింద తీసుకోవడానికి రైతులు అంగీకరించలేదు. అందుకే భూమి సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్)లో ‘‘్భమికి - భూమి’’ పథకం ప్రవేశపెట్టారు. రైతులు ఒక ఎకరా ఇస్తే వారికి ఒక ఇంటి జాగా, కమర్షియల్ ప్లాట్ ఇస్తామని అగ్రిమెంటు చేసుకున్నారు. అలాగే 10 సంవత్సరాలపాటు రైతుకు కౌలు రూపంలో పెన్షన్, అలాగే భూమి లేని వ్యవసాయ కార్మికులకు పెన్షన్ పథకాన్ని రూపొందించారు. అయితే అన్ని వేల ఎకరాలు అవసరం లేదని ఆనాడే సిపిఐ అభ్యంతరం పెట్టింది.
రాజధాని భవనాల నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయి లో నిపుణులతో చర్చలు జరిపారు. సింగపూర్, మలేషియా నమూనాల స్థాయిలో నిర్మాణానికి పూనుకున్నారు. అయితే కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. దీనితో సమీకరించిన భూమిని స్వయం ఆర్థిక రాజధాని (సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ కాపిటల్)గా రూపొందించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,744 మంది రైతుల నుండి 34,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని, దానినుండి 12,000 ఎకరాలు ప్లాట్ల రూపంలోరైతులకు కేటాయించారు. 15,000 ఎకరాలు రోడ్లకు, వౌలిక సదుపాయాలకు కేటాయించారు. ఇప్పటికే 176 కోట్ల రూపాయలతో హైకోర్టు భవనం నిర్మించారు.
విధానసభ మరియు విధాన మండలి భవనాలను 526 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. సెక్రటేరియట్‌కు, పోలీసు అధికారులకు, న్యాయ వ్యవస్థకు, మంత్రులు, ఎంఎల్‌ఎలకు, ఉద్యోగస్తులకు భవన నిర్మాణాలకు భూమి ని కేటాయించి 80% వరకు నిర్మాణాలు జరిగిపోయాయి. విద్యుత్ సౌధ, ఆర్‌పిబి, ఎపిఐఐసి, దేవాదాయశాఖ, పోలీసు కంట్రోల్ రూమ్, గెజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగస్తుల గృహాల నిర్మాణం జరుగుతున్నది.
ఇంకా 12వేల ఎకరాలు భూమి ప్రభుత్వం చేతిలో ఉంది. దీన్ని స్వయం సంపాదనతో రాజధాని నిర్మాణం చేయాలనేదే గత ప్రభుత్వ పథకం. భారీ ప్రాజెక్టుకు పథకాలు వేయడంతో ఎక్కువ సమయం కేటాయించబడింది. పరిపాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయాడు. శాసనసభ్యుల అవినీతి పెరిగిపోయింది. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు అటు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యక్ష పాదార్థిక సహకారం, కేంద్రం సహకారం, కేంద్రం అన్నివిధాల చంద్రబాబు ప్రభుత్వాన్ని కట్టుదిట్టం చేసింది. గత టిడిపి ప్రభుత్వంలోనే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆనాటి ప్రతిపక్ష నాయకులైన జగన్‌మోహన్‌రెడ్డి కూడా అంగీకరించారు.
* * *
టీడీఆర్: ట్రాన్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్, ఈ విధానంలో కచ్చితమైన భవనాలపై ఆయా సంస్థలకు, భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి.
అయితే ఎన్నికల సమయంలో గానీ, వైసిపి ఎన్నికల ప్రణాళికలో గానీ రాష్ట్రంలో అమరావతితోపాటు మరో రెండు రాజధానులు చేస్తామని జగన్‌మోహనరెడ్డి ప్రకటించలేదు. వారు ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా జుడీషియల్ రాజధానిగా కర్నూలు, పాలనా రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు. అప్పటివరకు రాష్ట్ర ఇరువైపులకు సమాన దూరంలో ఉన్న అమరావతి రాజధానిగా అన్ని రాజకీయ పార్టీలు, 13 జిల్లాల ప్రజలు మానసికంగా అంగీకరించారు. ఒక్కసారిగా ఊహించని పరిణామం మూడు ముక్కల రాజధాని ప్రకటన ఒక్క వైసిపి తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతాంగం హతాశులయ్యారు. ఇప్పటికే 22 మంది వరకు ఈ విఘాతంతో చనిపోయారు. ప్రజల ప్రత్యక్ష ఆందోళనలకు భయపడిన ముఖ్యమంత్రి రాజధానికి చేరే రోడ్డు కూడా మార్చుకున్నారు. గ్రామాలలో వేలాది మంది పోలీసులతో మకాం వేశారు. గ్రామాలకు, గ్రామాలకు మధ్య సంబంధాలు బంద్ చేయడానికి కందకాలు తవ్వి, దేవాలయాలవద్ద పూజలు కూడా చేసికోనివ్వలేదు. ఒక విధంగా అప్రకటిత ఎనర్జెన్సీని విధించారు. అయితే ఎగువ సభలో టిడిపికి మెజారిటీ ఉంది. ఎంఎల్‌సిలను, కౌన్సిల్ ఛైర్మన్‌ను అదిరించి, బెదిరించి, ప్రలోభాలకు పాల్పడ్డారు. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా 22 మంది మంత్రులు సభలోకి ప్రవేశించి ఛైర్మన్‌పై వత్తిడి తెచ్చారు. ముగ్గురు మంత్రులైతే పోడియం బెంచీలు కూడా ఎక్కి దుర్భాషలాడారు. చివరికి కౌన్సిల్ ఛైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు.
దీనితో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అసహనంతో అసెంబ్లీలో కౌన్సిల్ రద్దు చేస్తూ తీర్మానం చేయించారు. ఇక రకరకాల లిటిగేషన్‌లో పడిపోయింది.
1. సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళాక, కౌన్సిల్‌ను రద్దుచేయటం సాధ్యమా?
2. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇప్పుడు వ్యవసాయానికి పనికిరావు. మరి రైతుల పరిస్థితి ఏంటి?
3. ఇప్పటికే ప్రభుత్వం రూ.5వేల కోట్లు ఖర్చుపెట్టింది.
4. అభివృద్ధి కావాలంటే పాలనా యంత్రాంగాన్ని విభజిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధి అవుతాయా?
దీనికంతా కారణం ఒక్కటే. చంద్రబాబు మార్కు పాలన కనబడకూడదు. అలా కనపడకుండా ఉండాలంటే అమరావతి రాజధాని రూపం లేకుండా చేయాలి. ఇది ఒక విధంగా రాజకీయ విబేధాలకన్నా, రాజకీయేతర కక్ష కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది.
సిపిఐ- ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు కూడా విజయవాడ రాజధాని కావాలని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ విజయవాడలో కమ్యూనిస్టులకు బలం ఉంది గనుక, రాజధానిని కర్నూలులో ఏర్పాటుచేసింది. తరువాత హైదరాబాద్‌కు మార్చబడింది. తెలంగాణ నుండి విడిపోయినప్పుడు కూడా విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలని సిపిఐ ప్రకటించింది. అమరావతి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సమ దూరంలో ఉంటుంది. మొదటినుండి సిపిఐ రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యలో వుండాలనే విధానానికి కట్టుబడే వుంది.
*
రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు
*
విభాగం సంఖ్య భూమి(ఎకర) ఎకర ధర (లక్షల్లో)
*
విశ్వవిద్యాలయాలు 4 400 50
పాఠశాలలు 11 42 50
ఆస్పత్రులు 4 177 50
క్రీడా సంస్థలు 2 24 25
హోటళ్లు 15 38 150
రిసార్టులు 1 3.5 ఆదాయంలో సిఆర్‌టిఎ వాటా
కనె్వన్షన్ 2 47 --
మెరీనా 1 8.34 --
రిటైల్ కం ఎంటర్‌టైన్‌మెంట్
సెంటర్ 1 7 --
ఆధ్యాత్మిక, మత సంస్థలు 5 57.50 1నుంచి 5
ఇతరులు 11 51.35 1నుండి 5
కేంద్ర ప్రభుత్వ సంస్థలు 25 197.57 కొన్నింటికి ఉచితం
కొన్నింటికి 100 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 24 185.60 డిటిఆర్‌వో
కేంద్ర ప్రభుత్వ సంస్థలు 18 23.03 400
రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 4 11.27 200
ఐఏఎస్ అధికారుల గృహాలకు 1 38.48 24
జడ్జీలు రిజిస్ట్రార్ జనరల్,
రిజిస్ట్రర్ల గృహాలకు 1 1.92 24
మొత్తం 130 1293.42 --

- డాక్టర్ కె.నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి