మెయన్ ఫీచర్

ఆర్థిక సవాళ్లు సరే.. అభివృద్ధిలో తెలంగాణ మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక మాంద్యం ప్రభావం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోయినా, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలకు సవాళ్లను తట్టుకుని నిధులు సేకరించి అమలు చేయడం కత్తిమీద సవాలు లాంటిది. త్వరలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్ ఏ సైజు ఉంటుందనే దానిపై స్పెక్యులేషన్లు పక్కనపెడితే, పాలకులకు సంక్షేమం, అభివృద్ధి పట్ల దార్శనికత ఉంటే చాలు. ప్రస్తుతం తెలంగాణలో స్థిరమైన రాజకీయ నాయకత్వం వల్ల రాజకీయంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో రాజకీయ అస్థిరత్వం లేదు. ఆందోళనలు అసలేలేవు. శాంతి భద్రతలు బాగున్నాయి. 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని ఇంతవరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అప్రతిహతంగా ముందుకెళుతోంది.
ఒక్క లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జాతీయవాద రాజకీయాలు, ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం వల్ల టీఆర్‌ఎస్ ఆశించిన సీట్లు సాధించకపోయినా, బూత్ స్థాయి నుంచి బలమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. విపక్ష పార్టీలు బలహీనంగా ఉండడం వల్ల కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఆశించిన స్థాయిలో జనంలోకి తీసుకుని ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నాయి. 2023లో జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, వచ్చే ఎన్నికల్లో మాదే అధికారమంటున్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు తమ సొంత ఇంటిని మరమ్మత్తు చేసుకోలేకపోతున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ జన్మదినవేడుకల సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటే, టీఆర్‌ఎస్ పార్టీ చెక్కుచెదరని పునాదులు ఉన్నాయని, కేసీఆర్ బలమైన నాయకుడని, సమీప భవిష్యత్తులో కేసీఆర్‌ను ఢీ కొనే నేత ఉన్న పార్టీ వస్తే తప్ప అంతవరకు జనం కేసీఆర్ వెంటనే ఉంటారని ప్రజాభిప్రాయంగా ఉంది.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. నగరాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం వెల్లివిరియాలని, ప్రణాళిక బద్ధమైన ప్రగతి జరపాలని, జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ ప్రజలను కోరడం విశేషం. నగరాల అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, ఇతర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు నెలకు రూ. 70 కోట్ల చొప్పున విడుదల చేయాలని కేసీఆర్ ఆర్థిక సంఘాన్ని ఆదేశించడం స్వాగతించాల్సిన పరిణామం. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిదులు కలిపి పట్టణ ప్రాంతాలకు నెలకు రూ. 148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 811 కోట్లలో రూ. 500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, రూ. 311 కోట్లు జీహెచ్‌ఎంసీలకు కేటాయించాలి. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పారిశుద్ధ్య పనుల కోసం మొత్తం 3100 వాహనాలు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 600 వాహనాలు వచ్చాయి.
కేసీఆర్ రాష్ట్రంలో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఆరు కిలోల బియ్యం, కేసీఆర్ కిట్స్, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాలు. రాష్ట్రంలో 40 సంక్షేమ పథకాలకు సాలీనా రూ. 40 వేల కోట్లను ఖర్చుపెడుతున్నారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా రంగంలో సంస్కరణలను ప్రజలు ఆమోదం తెలిపారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని, కొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ మండలాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పల్లె ప్రగతి పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేవారు. కేసీఆర్ సర్కార్ 2014-18 మధ్యనే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో గతంలో టీడీపీ సర్కార్ విఫలమైంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా పరిపాలనా రంగంలో సంస్కరణలు తేవడం, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో కాలాపహరణం చేస్తోంది. కమిటీల పేరుతో సమయాన్ని వృథా చేయడం మినహా మరో ప్రయోజనం లేదు. జగన్ ఈ విషయంలో కేసీఆర్‌ను చూసి కొత్త జిల్లాల ఏర్పాటులో సత్వరమే నిర్ణయం తీసుకోవడం మంచిది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లను విశే్లషిస్తే 38,34,253 మంది లబ్థిదారులకు సాలీనా రూ.12 వేల కోట్లను ఖర్చుచేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఈ పెన్షన్లు పొందే వారి సంఖ్య 46 లక్షలకు పెరగనుంది. రైతు బంధు పథకం కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాలకు రూ. 8వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. ఈ స్కీం కింద రైతులకు ఆర్థిక సాయాన్ని 2019 ఖరీఫ్ నుంచి అందిస్తున్నారు. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఏటా రూ. 12వేల కోట్ల ఖర్చు చేస్తోంది. సుమారు 56 లక్షల మంది రైతులకు లబ్థి కలుగుతోంది. ఏదేని కారణం వల్ల రైతు మరణించినా, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించినా రైతు బీబా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో పాలసీకి ప్రీమియం రూ. 2271.50 ఉంటే, 2019-20లో సంవత్సరంలో ప్రీమియం రూ. 3,556కు పెరిగింది. మొత్త సొమ్మును ప్రభుత్వమే చెల్లిచి దాదాపు 31లక్షల మందికి బీమా సదుపాయం కల్పించారు. ప్రభుత్వం ఈ పథకం కోసం సాలీనా రూ. 1100కోట్లను ఖర్చు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి 19 వేల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ. 5లక్షల చొప్పున బీమా సొమ్మును అందించారు.
రాష్ట్రంలో కొత్తగా 9335 మంచి పంచాయతీ కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పల్లెలు ప్రగతి సాధించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కొత్త పచాయతీ రాజ్ చట్టాన్ని 2018లో తెచ్చింది. ఈ చట్టం వల్ల గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నెరవేరుతోంది. 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నారాయణ్‌పేట, ములుగు జిల్లాలను, కొల్హాపూరర్, కోరుట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులు 36వేల మంది ఉన్నారు. వీరి వేతనాలను నెలకు రూ.8500కు పెంచారు. గ్రామ పంచాయతీ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వం చైర్మన్, ఇద్దరు సభ్యులతో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ కొత్త పంచాయతీ సవరణ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల వివాదాల అప్పీళ్లను విచారించి తీర్పు చెబుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు స్కీంను ఎకనామిక్ సర్వే ప్రశంసించింది. ఈ ఏడాది కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టకముందు ఎకనామిక్ సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందు ఉంచిన సంగతి విదితమే. ఈ సర్వేలో వ్యవసాయ ఫుడ్ మేనేజిమెంట్ సెక్షన్‌లో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రస్తావించారు. రైతులకు ఉపయోగపడే మంచి ప్రొగ్రాం అని ఎకనామిక్ సర్వేలో తెలిపారు. 2018లో తొలిసారిగా ఖరీఫ్ సీజన్‌లో రైతు బంధును అమలు చేశారు. కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు రైతు బంధు స్కీంను ఆదర్శంగా తీసుకుని అమలు చేసిన విషయం విదితమే. రైతు బంధు స్కీం తర్వాతనే కేంద్రం కదిలి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టింది. ఒడిశా ప్రభుత్వం కృషక్ అసిస్టెంట్స్ ఫర్ లివిలీహుడ్ అండ్ ఇన్‌కమ్ ఆగ్‌మెంటేషన్ స్కీం, జార్కండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కృషీ ఆశీర్వాద్ యోజన స్కీంను అమలు చేసింది. తెలంగాణ రైతు బంధు పథకం విశిష్టత ఏమిటంటే భూకమతాలపై పరిమితులు లేవు. 2019తో దేశం మొత్తం మీద నిలకడతో కూడిన సమీకృతాభివృద్ధి పథకాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేర్కొనడం విశేషం. సస్టయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్‌ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మంచి ఆర్థిక, పారిశ్రామిక రంగంలో మంచి ప్రగతిని, సామర్థ్యాన్ని నమోదు చేసింది. అసమానతలను తగ్గించడం, పరిశుద్ధమైన ఇందనం, క్లైమేట్ యాక్షన్, నగరాలు, సామాజిక సమూహాల విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నట్లు యూఎన్‌డీపీ పేర్కొంది.
పారిశ్రామిక రంగాన్ని విశే్లషిస్తే త్వరలో ఫార్మా సిటీ రానుంది. వౌలిక సదుపాయాల కల్పన పనులు చకాచకా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో రూ. 1.68 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయి. ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలు సేకరించారు. ఫార్మా సిటీకి రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా. గత నాలుగు సంవత్సరాల్లో లైఫ్ సైనె్సస్ రంగంలో సాలీనా రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఐటీ రంగం పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్ర స్కీంకు విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో రాష్ట్రంలో తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద 37 అర్బన్ లోకల్ బాడీస్‌లో, రెండవ దశ కింద 22 యూఎల్‌బీల్లో జీఐఎస్ బేస్ మ్యాప్‌లను రూపొందిస్తున్నారు.
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాష్టమ్రని, జీఎస్‌టీ వసూళ్లు బాగా చేసే రాష్టమ్రని ప్రశంసించారు. జీఎస్‌టీ బకాయిలను రెండు విడతల్లో చెల్లిస్తామని సూచించారు. వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గుతున్నట్లు సంకేతాలు అందినా, మార్చి నెలల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో లోటుపాట్లు ఏమైనా ఉంటే కేంద్రం సరి చేయాలి.

- కె. విజయశైలేంద్ర, 9849998097