మెయిన్ ఫీచర్

అనాత్మ రూపములు దుఃఖహేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అంతర్ముఖుడై, బాహ్యవిషయాదులపై దృష్టిసారించని యోగికి అహంభావము నశించును. దేహాత్మభావన నశించగా, బ్రహ్మాత్మభావన స్థిరమై, దుఃఖహేతువులైన అనాత్మరూపములు ప్రకాశించవు. అందువలన, మనస్సు వికార శూన్యమై పూర్తిగా శాంతించును. మనఃప్రసన్నతతో బ్రహ్మానంద రసానుభూతిని పొందిన ముని పరవశించును.
‘‘సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే॥
(కొందరు యోగులు ఇంద్రియముల క్రియలను, ప్రాణముల క్రియలనూ, జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమ యోగాగ్నిలో హవనము చేయుదురు. వారు పరమాత్మయందే స్థిరులై ఉన్న కారణంగా, ప్రాణ మరియు ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. వారి బుద్ధిలో పరబ్రహ్మము మాత్రమే నిలిచి ఉండును
373. అస్తస్త్యాగో బహిస్త్యాగో విరక్తస్వైవ యజ్యతే
త్యజత్యన్తర్బహిః సంగం విరక్తస్తు ముముక్షయా॥
374. బహిస్తు విషయైః సంగస్త్ధాన్తరహమాదిభిః
విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠితః॥
పై రెండు శ్లోకములకు కలిపి వ్యాఖ్యానము వ్రాయబడినది.
దేహములలోపల ఉన్న అనాత్మ పదార్థములను త్యజించుట, దేహము వెలుపలనున్న అనాత్మ పదార్థములను త్యజించుట విరాగికి మాత్రమే సాధ్యము. మోక్షేచ్ఛగల విరాగి అహంకారమును, మమకారమును పూర్తిగా త్యజించును. శబ్దరూపాది విషయములతోను, తనవారితోను కలయిక, బాహ్యసంగమము. మనోబుద్ధ్యహంకారములతోను, దేహము మరియు ప్రాణాదుల సంగమముతో ఏది మిథ్యారూపమైన తాదాత్మ్య భావన కల్గిస్తున్నదో అది అంతఃసంబంధము. సదా బ్రహ్మనిష్ఠతో కాలము గడిపే వైర్యప్రవృత్తి ఉన్నవానికే ఈ విధములైన సంగపరిత్యాగము సాధ్యవౌను.
375. వైరాగ్యబోధౌ పురుషస్య పక్షివత్
పక్షౌ విజానీహి విచక్షణ త్వమ్‌
విముక్తి సౌధాగ్రత లాధిరోహణం
తాభ్యాం వినా నాన్యతరేణ సిద్ధ్యతి॥
భవబంధ విముక్తిని పొందగోరే వివేకవంతుడవైన ఓ శిష్యా! వైరాగ్యము, ఆత్మజ్ఞానము అనే రెండు సాధనలూ, పక్షికి రెండు రెక్కలవంటివని తెలిసికొనుము. పక్షి రెండు రెక్కలలో ఏ ఒకదానికి విఘాతము కల్గినా, ఎట్లు ఎగురలేదో, అట్లే మోక్షముకోరే వానికి వైరాగ్యతోపాటు, ఆత్మయథార్థ స్వరూపజ్ఞానము అనివార్యము. ఈ రెండింటిని సాధించవలెను. ఇంకొక విధముగ ముక్తి అనే సౌధముయొక్క చివరి మెట్టును నీవు చేరుకొనలేవు.
376. అత్యస్త వైరాగ్యవతః సమాధిః
సమాహితస్యైవ దృఢ ప్రబోధః
ప్రబుద్ధ తత్త్యస్య హి జన్ధముక్తిః
ముక్తాత్మనో నిత్యసుఖానుభూతిః॥
తీవ్రమైన వైరాగ్యదీక్షగల యోగి మాత్రమే బ్రహ్మనిష్ఠతో సమాధి స్థితిని పొంది, బ్రహ్మమందే మనస్సును లయముగావించును. అట్టి సాధకుడే దృఢమైన ఆత్మజ్ఞానము పొందును. బ్రహ్మతత్త్వమును పరిపూర్ణముగా ఆకళించుకొనినప్పుడే ఆత్మ శరీర బంధమువీడి పరమాత్మలో లయమగును. బంధవిముక్తిపొందిన ముక్తాత్మకు, భవబంధము అంతమై శాశ్వత సుఖానుభూతి ప్రాప్తించును.
377. వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి పశ్యాత్మనః
తచ్చే చ్ఛుద్ధతరాత్మ బోధ సహితం స్వారాజ్య సామ్రాజ్యధుక్‌
ఏతద్‌ద్వార మజస్రముక్తి యువతేః యస్మాత్త్వమస్మాత్పరం
సర్వత్రాస్పృహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురుశ్రేయసే॥
ప్రాణాయామాది యోగసాధనలతో దేహేంద్రియములను పూర్తిగా తన వశము చేసికొనిన వ్యక్తికైననూ, వైరాగ్యమునకు మించి మనఃప్రాసాదమును కల్గించేది మరేదియూ లేదు. వైరాగ్యముతోపాటు, పరిపూర్ణ ఆత్మస్వరూప జ్ఞానమున్నచో అది అత్యంత సుఖదాయకవౌను. విరాగి సర్వస్వతంత్రుడు. విషయేచ్ఛ విడచి జితేంద్రియుడైనవాడు ఇంద్రియాధీనుడు కాడు. స్వేచ్ఛతో ఆత్మసామ్రాజ్యమును అనుభవించే స్వతంత్రము తప్ప, ఆత్మకాముడు కోరుకునేది ఇంకేమీ ఉండదు. ఆత్మసామ్రాజ్యములో ప్రవేశించి, ప్రశాంత మనస్కుడవై, నిర్వికల్పసమాధి స్థితిలో సదా ఉండుము.
378. ఆశాం చిన్ధి విషోపమేషు విషయేష్వేపైన మృత్యోః సృతిః
త్యక్త్వా జాతికులాశ్రమేష్వభిమతిం ముంచాతి దురాత్క్రియాః
దేహాదావసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని
త్వం ద్రష్టాస్యమలో‚సి నిర్ద్వయ పరబ్రహ్మాసి యద్వస్తుతః॥
విషతుల్యమైన విషయములందు ఆశ అనర్థదాయకము. విషయాసక్తి నిన్ను ప్రలోభపరచి ఆత్మనిష్ఠకు భంగము కలిగించును. అందువలన, విషయాసక్తిని అంతమొనర్చును. అట్లే, జాతి, కుల, ఆశ్రమ వ్యవస్థ మొదలగు వాటికనుగుణముగా ఆచరించే కర్మలయందు అభిమానమును పూర్తిగా త్యజించుము. కార్యప్రపంచములో దృశ్యవౌతున్న సమస్తమునకు నీవు ద్రష్టవు, సాక్షివి మాత్రమే. దేహాదులందు అహంభావమును విడచి, ‘అహంబ్రహ్మాస్మి’అనే భావనతో నిర్వికల్ప సమాధిలో, అద్వైత నిర్గుణ పరబ్రహ్మములో ఐక్యము చెందుము.

-ఇంకావుంది