మెయిన్ ఫీచర్

సర్వమూ చిత్స్వరూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
388. యత్ర భ్రాన్త్యా కల్పితం యద్వివేకే
తత్తన్మాత్రం నైవ తస్మాద్విభిన్నమ్‌
భ్రానే్త ర్నాశే భ్రాన్తి దృష్టాహితత్త్వం
రజ్జుస్తస్మాద్విశ్వ మాత్మస్వరూపమ్‌॥
ఏ వస్తువు అధిష్ఠానమందు భ్రాంతిచేత కల్పింపబడినదో యథార్థ జ్ఞానము పొందిన పిదప, భ్రాంతిచే అలా కల్పించబడినది మరి కనబడదు. అధిష్ఠానమే యథారూపంలో కన్పించును. సర్పమనే భ్రాంతిని కలుగజేసింది అధిష్ఠానమైన రజ్జువు, వివేకము కలిగిన పిదప రజ్జువు నిజస్వరూపంలో కన్పించును గాని సర్పరూపములోకాదు. అదే విధముగా, సర్వాధిష్ఠానమైన బ్రహ్మమే జగత్తుకు ఆధారభూతము. ప్రపంచము అభాసమై మిథ్యను కల్పిస్తున్నది. అధిష్ఠానమైన బ్రహ్మమే సత్యము. బ్రహ్మములో విలీనవౌతున్నది మిథ్యారూపమైన ప్రపంచము. అధిష్ఠానమైన పరబ్రహ్మము మటుమాయము కాదు; ఆద్యంతములు లేక నిత్యమూ జగదాధారంగా భాసిస్తున్నది ఏకమాత్ర బ్రహ్మమే.
389. స్వయం బ్రహ్మా స్వయం విష్ణుః
స్వయమింద్రః స్వయం శివః
స్వయం విశ్వమిదం సర్వం
స్వస్మాదన్యన్న కించన॥
పరమాత్మ అద్వితీయము. అదియే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, శివుడు ఇత్యాది నామములతోను, స్వరూపములతోను లోక వ్యవహారములో నిర్దేశించబడుతున్నది. ఈ జగత్తులో సమస్త చరాచరములలో ఉన్నది బ్రహ్మమొక్కటే, తద్భిన్నమైనది ఇంకేదియు లేదు. ‘‘స ఏకః’’, ‘‘ఖల్విదం బ్రహ్మ’’అనే శ్రుతి వచనములే దీనికి తార్కాణము.
‘‘స బ్రహ్మ, స శివః, స హరిః సేంద్రః సో‚ క్షరః పరమస్వరాట్’’ (అతడే శివుడు, అతడే హరి, అతడే ఇంద్రుడు, అతడే అక్షరుడు, అతడే స్వయంభూ పరమస్వరాట్టు- తై.ఆ.4-10-13). ఇలా వినిపిస్తున్న నారాయణ సూక్తంలోని శ్రుతివాక్యములే, పై శ్లోకంలో అనుసరించబడినట్లు గ్రహించవచ్చు.
390. అన్తః స్వయం చాపి బహిః స్వయం చ
స్వయం పురస్తా త్స్వయమేవ పశ్చాత్‌
స్వయం హ్యవాచ్యాం స్వయమప్యుదీచ్యాం
తథోపరిష్టా త్స్వయమప్యధస్తాత్‌॥
ఆత్మ స్వయముగా మూర్తామూర్తములన్నింటి లోపల, వెలుపల ఉన్నది. అదియే ఎదుటను, వెనుకను, దక్షిణమును ఉత్తరమునను పై భాగమునను అధోభాగమందును సర్వత్ర జగత్తులో వ్యాపించిఉన్నది.
‘‘ఆత్మైవాధస్తాత్ ఆత్మోపరిష్టాత్ ఆత్మా పశ్చాదాత్మా పురస్తాత్ ఆత్మా దక్షిణత ఆత్మోత్తరత ఆత్మైవేదగ్‌ం సర్వమితి’’అని ఛాందోగ్యోపనిషత్ ప్రకటన (్ఛ.ఉ.7-25-2) పై శ్లోకమునకు ఆధారము. పరమాత్మ ఐశ్వర్యము అనంతము. విరాట్పురుషుడైన పరబ్రహ్మము ‘‘్భమా’’విశ్వమంతా వ్యాపించి ఉన్నదనే మరో శ్రుతి ప్రకటన ఇలా వినిపిస్తున్నది ‘‘బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మపశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠమ్’’(ము.ఉ.2-2-11). ఈ శ్రుతిని ముందు శ్లో.316-317 వ్యాఖ్యానంలో కూడ ఉదహరించడమైంది.
391. తరంగ ఫేనభ్రమ బుద్బుదాది
సర్వం స్వరూపేణ జలం యథా తథా
చిదేవ దేహాద్యహమన్త మేతత్
సర్వం చిదేవైకరసం విశుద్ధమ్‌॥
సముద్ర తరంగములు, సుడులు, నురుగు, బుడగలు సమస్తము యథార్థముగా సర్వమూ ఎట్లు జలస్వరూపములో, అట్లే దేహము మొదలు, అహంకార పర్యంతము సర్వమూ చిత్స్వరూపమే. కేవలము జ్ఞాన స్వరూపమైన చిదాత్మ అఖండము, పరిపూర్ణము మరియు పరిశుభ్రమైనది.
‘‘ఆ లోమభ్యః ఆ నఖాగ్రేభ్యః’’అని శ్రుతి తార్కాణము. (శరీరములో సర్వత్ర ఆత్మయే వ్యాపించి, నఖశిఖ పర్యంతము చైతన్యవంతము చేస్తున్నది- ఛా.ఉ.8-8-1).
392. సదేవేదం సర్వం జగదవగతం వాఙ్మనసయోః
సతో‚ న్యన్నాస్త్యేవ ప్రకృతిపరసీమ్ని స్థితవతః
పృథక్కిం మృత్స్నాయాః కలశఘట కుంభాద్యవగతం
వదత్యేష భ్రాన్తస్త్వహమితి మాయామదిరయా॥
కార్యప్రపంచములో ఉన్న సమస్తము వాక్కుచేతను, మనస్సుచేతను అవగతవౌతున్నది. ప్రకృతిని అధిగమించి బ్రహ్మయందు స్థితుడై ఉన్నవానికి సద్రూపమైన (సత్తామాత్రమైన) ఆత్మకన్న భిన్నమైనది మరేదియు ఉండదు. మృణ్మయమైన కలశఘటకుంభాదులు మట్టికంటెను భిన్నము కావుకదా!

ఇంకా ఉంది