మెయిన్ ఫీచర్

పరమావధి పరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
మాయ అనే మత్తుచే ప్రభావితుడై వివేకహీనుడు, నానాత్వభావనతో, ఇతడు, నీవు, నేను అని నామరూపాది భేదములనే గ్రహించి వ్యవహరిస్తాడు. ఏకాత్మకతాభావముగల జ్ఞానికి ఏవిధమైన భేదదృష్టి ఉండదు.
393. క్రియాసమభిహారేణ యత్ర నాన్యదితిశ్రుతిః
బ్రవీతి ద్వైతరాహిత్యం మిథ్యాధ్యాసనివృత్తయే॥
‘‘యత్ర నాన్యత్పశ్యతి నాన్యచ్ఛృణోతి నాన్యద్విజానాతి సభూమా’’అనే ఛాందోగ్య శ్రుతి, ఎక్కడైతే ఇంకొక దానిని చూడడో, ఇంకొక దానిని వినడో, ఇంకొక దానిని తెలిసికొనడో అదియే భూమ, మిక్కిలి విశాలమైనది, నాశరహితమైనదని వక్కాణిస్తున్నది. జగత్తుకు ఆధారము అనంతమైన పరబ్రహ్మము (్ఛ.ఉ.7-24-1). కావున, అవాస్తవికము, భ్రమను కల్పిస్తున్న ప్రపంచమును బ్రహ్మమందు విలీనముచేసి, ద్వైతభావన నశింపజేసికొనిన, బ్రహ్మైక్యత సిద్ధించునని ఉపదేశింపబడుతున్నది.
394. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప
నిస్సీమ నిష్పందన నిర్వికారమ్‌
అన్తర్బహిఃశూన్య మనన్య మద్వయం
స్వయం పరంబ్రహ్మ కిమస్తి బోధ్యమ్‌॥
పరబ్రహ్మము ఆకాశమువలె అత్యంత నిర్మలమైనది. పవిత్రమైనది. అఖండము, ఏకరూపముగలది. ఎట్టి పరిధులు లేక నిశ్చలమైనది మరియు పరిణామరహితము. పరిపూర్ణము కావున అంతర్బాహ్య భేదములేనిది. తత్సమానమైనది కాని, దానికి మించినదికాని మరేదియూలేనందున అద్వితీయము. అట్టి పరబ్రహ్మ స్వరూపమైన ప్రత్యగాత్మను తెలిసికొనిన పిదప తెలిసికొనదగినది మరింకేదియు ఉండదు.
‘‘పరుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతిః’’
(పరబ్రహ్మమునకు మించినదేదీ లేదు. అదియే పరమావధి, సర్వశ్రేష్ఠమైన గమ్యస్థానమని శ్రుతి నిర్ధారణ- క.ఉ.1-3-11).
395.
వక్తవ్యం కిము విద్వతే‚ త్ర బహుధా బ్రహ్మైవ జీవః స్వయం
బ్రహ్వైతజ్జగదాపరాణు సకలం బ్రహ్మాద్వితీయం శ్రుతేః
బ్రహ్వైవాహమితి ప్రబుద్ధమతయః
సన్త్యక్తబాహ్యాః స్ఫుటం
బ్రహ్మీభూయ వసన్తి సన్తత చిదానన్దాత్మనైవ ధ్రువమ్‌॥
జీవ పరమాత్మల ఏకత్వ విషయములో బహువిధాలుగా ప్రస్తావించుటకు ఏమియూ లేదు. ‘‘జీవో బ్రహ్మైవ నాపరః’’(జీవుడు బ్రహ్మమే వేరుకాదు), ‘‘తత్త్వమసి’’(్ఛ.ఉ.6-8-7), ‘‘అయమాత్మా బ్రహ్మ’’(బృ.ఉ.2-5-19), ‘‘అహం బ్రహ్మాస్మి’’(నేనే బ్రహ్మను- బృ.ఉ.1-4-10) ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జాలానిత శాంత ఉపాశీత’’ (బ్రహ్మమునుండి ఉద్భవించి, అందే నిల్చి, దానియందే లయమగుటచే ఈ ప్రపంచమంతా బ్రహ్మమనియే శాంతముగా సేవించుము- (్ఛ.ఉ.3-14-1). ‘‘ఏకమేవాద్వితీయమ్’’ (్ఛ.ఉ.6-2-1), ఇత్యాది శ్రుతి వచనముల అనుసారము పరబ్రహ్మమే ప్రపంచములో ఉన్న సమస్తమునకు మూలాధారము. అదియే జీవాత్మగా భాసిస్తున్నది. స్వస్వరూపముగా హృదయస్థిర పరమాత్మను దర్శించుకొనిన తత్త్వవేత్తలు, బ్రహ్మభూతులై పరిపూర్ణమైన చిదానందరూపమందే స్థిరులై ఉందురు. వారు ముక్తిని పొందుట తథ్యం.
396. జహి మలమయకోశే‚ హంధియోత్థాపితాశాం
ప్రసభ మనిలకల్పే లింగదేహే‚పి పశ్చాత్‌
నిగమగదితకీర్తిం నిత్యమానన్దమూర్తిం
స్వయమితి పరిచీయ బ్రహ్మరూపేణ తిష్ఠ॥
మలిన పదార్థములతో కూడుకొన్న స్థూల దేహమును, కోశ సంబంధముతో ఉత్పన్నవౌతున్న దేహాభిమానమును, గట్టి పట్టుదలతో అహంకారమును అంతమొందించుము. అటు పిమ్మట వాయువువలె కంటికి కనిపించని లింగ శరీరముపై ఆశను వదలిపెట్టుము. సర్వవేదములచే కీర్తించబడిన, సత్స్వరూపమైన పరబ్రహ్మమే పరిపూర్ణ జ్ఞాన స్వరూపము, నీ స్వస్వరూపమైన ప్రత్యగాత్మ అని నిశ్చితబుద్ధి కలిగి సదా ఉండుము. కృతనిశ్చయముతో బ్రహ్మస్వరూపుడవై ఆత్మసాక్షాత్కారమును చేసికొని నిరవధిక ఆనందమును పొందుము.
397. శవాకారం యావద్భజతి మనుజస్తావదశుచిః
పరేభ్యః స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధినిరయాః
యదాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం
తదా తేభ్యో ముక్తో భవతి హి తదాహ శ్రుతిరపి॥
మనుష్యుడు దేహముమీద అభిమానముతో, ఎంతవరకు దేహమునే ఆత్మగా భావించి, తాదాత్మ్యము చెంది పూజించునో అంతవరకు, మనస్సు పలు వికారములకు లోనై, పరిశుభ్రతను పొందడు.
ఇంకా ఉంది