మెయిన్ ఫీచర్

నిశ్చితబుద్ధితో చిత్తశుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
శుద్ధ మనస్కుడు కానివాడు, పవిత్రత లేని కారణంగా, దుఃఖభాగుడై వ్యాధి, జరామరణములను అధిగమించలేక పునఃపునః మృత్యుపాశంలో చిక్కుకొనును. అంతేకాదు, చేయకూడని దుష్కర్మలనుచేసి నరక లోకవాసము పొందును. ‘‘అయం లోకో నాస్తి పర ఇతి మానీ పునః పునర్వశమాపద్యతే మే’’ (అవివేకులకు ఈ లోకం తప్ప పరలోకభావనే ఉండదు. వారు పునఃపునః నావశమై మృత్యువాత పడుదురు- క.ఉ.2-1-6).
దేహాత్మభావనను త్యజించి, స్వయముగా నిశ్చితబుద్ధితో తాను శివస్వరూపమని ఎప్పుడు మానవుడు గ్రహించునో, అప్పుడే అతడు చిత్తశుద్ధిని పొంది శాంతమనస్కుడౌను; వాని సమస్త దేహేంద్రియ ప్రాణ మనోవికారములు నశించును.
‘‘సశరీరః ప్రియాప్రియాభ్యాం న హ వై సశరీరస్య సతః ప్రియాప్రియయోరపహతిరస్త్య శరీరం వావ సంతం న ప్రియాప్రియే. న్పృశత.’’ (శరీరమందు ఆత్మాభిమానము ఉన్నవానికి, ఇష్టానిష్టరూపమైన అనర్థము కల్గుతున్నది. శరీర విలక్షణమైన ప్రత్యగాత్మ స్వరూప నిష్ఠగలవానికి, దేహేంద్రియాది వికారములైన ప్రియాప్రియములతో సంబంధము లేదు. కనుక, అనర్థస్పర్శయు ఉండదు- ఛా.ఉ.8-12-1)
ప్రపంచ బాధ నివృత్తి
398. స్వాత్మన్యారోపితాశేషాభాసవస్తునిరాసతః
స్వయమేవ పరంబ్రహ్మ పూర్ణ మద్వయ మక్రియమ్‌॥
ఆత్మేతర పదార్థములైన అహంకారాదులు అభాసరూపములో ప్రకాశించి భ్రమను కలిగించును. తత్త్వజ్ఞానముతో ఈ భ్రమ తొలగిపోగా, పరిపూర్ణము, అద్వితీయము, క్రియాశూన్యమైన పరమాత్మ స్వరూపమునే నేను అనే జ్ఞానము కలుగును. తత్త్వవేత్తకు, ఇక చేయదగిన కార్యము ఏమీ ఉండదు.
‘‘స యో హ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి’’అని శ్రుతి తార్కాణము (పరబ్రహ్మమును తెలిసికొనిన బ్రహ్మవేత్త బ్రహ్మమే అగును- ము. ఉ. 3-2-9). సద్బ్రహ్మరూపమగు ఆత్మ లక్షణములను ఆత్మదర్శి స్వయముగా పొందును.
399. సమాహితాయాం సతి చిత్త వృత్తౌ
పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే
న దృశ్యతే కశ్చిదయం వకల్పః
ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః॥
సుస్థిర చిత్తవృత్తిని పొంది, మనస్సును ఆత్మలో విలీనము చేసి, నిర్వికల్ప పరబ్రహ్మ చింతనలో నిశ్చలుడైన వానికి వికల్పములు గోచరించవు. నామమాత్రకమైన దేహము ఉన్నా, జీవన్ముక్తుడై ప్రాపంచిక సంబంధము పూర్తిగా వీడిపోయి, కేవలుడై నిల్చి ఉండును.
400. అసత్కల్పో వికల్పో‚ యం విశ్వ మిత్యేకవస్తుని
నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః॥
ఈ జగత్తు అవాస్తవము; అజ్ఞాన కల్పితము. పరమాత్మ తప్ప ఇతర వస్తు సముదాయమంతా అశాశ్వతమని తెలిసికున్న ఆత్మవేత్తకు ప్రపంచ స్పృహ కలుగదు. ఆత్మజ్ఞాని దృష్టిలో ప్రపంచము లేనే లేదు. గగన కుసుమము ఎంత అసంభవమో, అంత అసంభవమే జగత్తు. ఇతరులకు, జగత్తు, కార్యరూపములో అభాసమై మిథ్యను కలుగజేస్తున్నది. ఈ అపోహ మృగతృష్ణ వంటిది, ప్రాతిభాసికము. ఎడారిలో భ్రమను కల్పించే జలాశయము వంటిది. పరమాత్మ ఏకవస్తువు, అద్వితీయము, ఆకార రహితము, వికార శూన్యము మరియు నిర్విశేషము అనగా ఎన్నడూ పరిణామము చెందనిది.
- ఇంకా ఉంది