మెయిన్ ఫీచర్

భేదమా! తావులేదిక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అందువలన, భేదము కేవలము కల్పితము, నిరాధారము. పారమార్థికముగా, జగత్తు- పరమాత్మ అభిన్నములు.
401. ద్రష్టృ దర్శనదృశ్యాదిభావశూన్యైకవస్తుని
నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః॥
జ్ఞాతృ, జ్ఞానం, జ్ఞేయం లేక ప్రమాత, ప్రమితి, ప్రమేయం అనే భేదము పరబ్రహ్మమందు లేదు. అజ్ఞాన కల్పితమైన ఈ భేదము (త్రిపుటి) నిర్వికల్ప సమాధిలో ఉండగా నశించును. అందువలన, ముం దు సూచించినట్లు, అద్వితీయము, నిర్వికారము, నిరాకారము, నిర్విశేషమైన ఆత్మయందు భేదము అసంభవము. అందువలన, ఆత్మ ప్రకృతి, జగత్తు వికృతి అనే భేదభావన తగదు.
402. కల్పార్ణవ ఇవాత్యన్తపరిపూర్ణైకవస్తుని
నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః॥
యుగాంతములో యావత్ప్రపంచము పరమాత్మలో లయమై, ఏకమై మహాసముద్రమువలె జలమయమైనట్లు, పరిపూర్ణ ఏకైక వస్తువైన నిర్వికార, నిరాకార, నిర్విశేష ఆత్మయందు భేదము ఎట్లుండును?
తేజసీవ తమో యత్ర విలీనం భ్రాన్తితకారణమ్‌
అద్వితీయే పరే తత్త్వే నిర్విశేషే భిదా కుతః॥
అంధకారము సూర్యోదయముతో సమస్తవౌతున్నది. అదే విధముగా, అజ్ఞానము జ్ఞానోదయముతో అంతమగును. అద్వితీయము, నిర్వికారము, నిర్విశేషమైన పరబ్రహ్మతత్త్వమును తెలిసికొనిన పిదప జీవేశ్వరులందు కల్పితమైన భేదభావమూ నశించిపోతుంది. సర్వాత్మకమైన బ్రహ్మమే ప్రపంచములో సర్వత్ర వ్యాపించి ఉన్నదని స్పష్టవౌతుంది.
404. ఏకాత్మకే పరేతత్త్వే భేదవార్తా కథం భవేత్‌
సుషుప్తౌ సుఖమాత్రాయాం భేదః కేనావలోకిత.॥
ఏకైక స్వరూపమైన పరతత్త్వమందు భేదప్రసంగమే లేదు. సుషుప్తిలో దుఃఖానుభవము ఇసుమంతయు కలుగదుగదా! జీవాత్మ, పరమాత్మతో ఏకమైన కారణముగా పరిపూర్ణ సుఖమునే అనుభవిస్తున్నప్పుడు, దుఃఖానుభవము ఏమీఉండదు. అందువలన, భేదానుభవ ప్రసక్తి లౌకికమే కాని, పారమార్థికము కాదు.
శ్రుతిలో ఇందుకు తార్కాణము ఇట్లు వినబడుతున్నది- ‘‘యద్వైతన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి న హి ద్రష్టుర్దృష్టే ర్విపరిలోపో విద్యతే‚ వినాశిత్వాత్‌ న తు తత్ ద్వితీయమస్తి తతో‚ న్యద్విభక్తం యత్పశే్యత్’’ (ద్రష్టయగు ఆత్మయొక్క దృష్టి నశించనిది. అందుచేత ఆత్మ దృష్టికి నాశనములేదు. సుషుప్తిలో బుద్ధ్యాది సాధనములు లేకపోవుటచే, తనకు వేఱగా వస్తువులను చూడలేకపోయినను,
జాగ్రదవస్థయందు సుషుప్తిలో నేనేమి చూడలేదు, నాకు ఇచ్చట ఏమి జరిగినదో తెలియదని ప్రకటన చేయుటవలన ప్రజ్ఞానాత్మతో ఏకీభవించెనని అవగతవౌతున్నది కేవలము ద్రష్టస్వరూపమగు ఆత్మకంటె వేరైన ఇంద్రియములు, శబ్దాది విషయ జాతము సుషుప్తిలో లేనందువలన, స్వయంప్రకాశమైన ఆత్మయే ద్రష్టగా నిల్చి, ప్రపంచములో ఇతరములను గ్రహించలేకపోయిననూ, సమస్తమును చూచుచున్నదని తెలుస్తున్నది- బృ.ఉ.4-3-23).
‘‘యదా హ్యేవైష ఏతస్మిన్నదృశే్య‚- నాత్మ్యే‚ నిరుక్తే‚ నిలయనే ‚ భయం ప్రతిష్ఠాం విన్దతే అథ సో‚్భయం గతో భవతి’’(ఏ సాధకుడు అచోచరము, అశరీరము, వ్యక్తము చేయబడనిది, ఆధారరహితమైన పరమాత్మ యొక్క అభయమును మరియు ఏకత్వమును పొందునో అతడు నిర్భయుడగు- తై.ఉ.2-7).
కేవలము జ్ఞాన స్వరూపమైన సమాథిస్థితిలో స్థిరుడై ఉండగా, అజ్ఞానము పూర్తిగా నశించును. అందువలన, మిథ్యారూపమైన ప్రపంచము భిన్నముగాకానరాదు. ఆత్మస్వరూపమే గోచరించును.
405. న హ్యస్తి విశ్వం పరతత్త్వబోధాత్
సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే
కాలత్రయే నాప్యహి రీక్షితో గుణే
న హ్యమ్బుబిన్దు ర్మృగతృష్టికాయమ్‌॥
పరమాత్మ తత్త్వజ్ఞానము సిద్ధించిన పిదప మిథ్యారూపమైన ప్రపంచము లేనే లేదు. సత్స్వరూపము, నిర్వికల్పమైన బ్రహ్మమందు ప్రపంచమునకు అస్తిత్వములేదు. త్రాడు త్రికాలములలోను సర్పముకానేరదు. ఎండమావిలో బొగ్గునీరు లభ్యమగుట కూడ అట్లే అసంభవము. యథార్థజ్ఞానము పొందగా అపోహలకు తావులేదు.
406. మాయామాత్ర మిదం ద్వైత మద్వైతం పరమార్థతః
ఇతి బ్రూతే శ్రుతిః సాక్షా త్సుషుప్తా వనుభూయతే॥
దృశ్యరూపమగు ప్రపంచము భిన్నముగా మాయవలన కన్పడుతున్నది. వాస్తవికముగా, అద్వైతము, భేదశూన్యమైన బ్రహ్మాభిన్నమని ప్రత్యక్షముగా శ్రుతి నిర్ధారిస్తున్నది.
ఇంకా ఉంది