మెయిన్ ఫీచర్

మహిళా మేలుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జీవన విధానంలో మహిళ యొక్క పాత్ర ఎంతో విశిష్టమైనది. పూర్వకాలంలో స్ర్తిపురుష భేదం ఎక్కువగా కనిపించదు. రాణిరుద్రమ, చాంద్‌బీబీ, పల్నాటి నాగమ్మ వంటి స్ర్తిమూర్తులు రాజకీయంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. భూమాత, గోమాత, గంగామాత, భారతమాత అన్నింటిలో మాతృమూర్తిని పూజించుకునే విశిష్ట లక్షణం మన భారతీయ సంస్కృతిలో ఉండేది. భారత స్ర్తి ప్రపంచ స్ర్తిలందరికీ ఆదర్శవాదిగా నిలుస్తోంది. రాజకీయ వేత్తలుగా, శాసనకర్తలుగా, శాస్తవ్రేత్తలుగా, విమాన చోదకులుగా, అంతరిక్షంలో వ్యోమగాములుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా అన్ని రంగాల్లో స్ర్తిలు ముందడుగు వేస్తున్నారు. నేడు మహిళా లోకం స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ పురుషాధిక్యత సమాజంలో ఆడవారు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా తిరగ గలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం, దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళల పరిస్థితిని గమనించి తెలుసుకోవచ్చు అని పెద్దల కలలు, ఆశయాలు నేటికీ అలాగే ఉండిపోయాయి అనడానికి ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. ఇప్పటికీ మహిళలు ధైర్యంగా రాత్రిపూట బయటికి ఒంటరిగా వెళ్ళలేరు. నేటికీ వివిధ రంగాలలో మహిళలు వెనకబడి ఉన్నారు.
స్ర్తి వివక్ష- దాడులు
అంతరిక్షంలోకి అడుగుపెట్టినా, ఆర్మీ చీఫ్ కమాండర్‌గా ఎదిగినా, విద్యాధికులైనా, ఉద్యోగులైనా స్ర్తి వివక్షకు గురవుతూనే ఉంది. ప్రస్తుతం ఆధునిక వేధింపు ఏమిటంటే యాసిడ్ దాడులు. తన మాట వినకపోయినా, ప్రేమించకపోయినా యాసిడ్ పోసేయటమే. ఆ అమ్మాయికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయని ఆలోచన లేదాయే. ఆకాశంలో సగం అని చెప్పుకోవడమే గానీ రాజకీయాలలో, ప్రాధాన్యత రంగాలలో స్ర్తిల శాతం ఎంత ఉన్నది? అతి కొద్దిమంది మాత్రమే ఉన్నత పదవులలో ఉంటున్నారు. అన్నింటిలో వివక్ష కొనసాగుతునే ఉన్నది. మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. గతంతో పోల్చిచూస్తే ఇటీవలి కాలంలో స్ర్తిలలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరిలోనూ వారి భద్రత పట్ల మరింత అవగాహన పెంచుకునే దిశగా మహిళలు ఆలోచనా సరళిని విస్తృతం చేసుకుంటున్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి గళం ఎత్తుతున్నారు. విద్యా, కార్పొరేట్ రంగాల్లో తమదైన శైలిలో మహిళా లోకం దూసుకుపోతోంది. అయితే, ఇది చాలదు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నేడు ఎంతోమంది మహిళలు తమతమ రంగాల్లో రాణిస్తున్నా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే సంకల్పం క్రిందిస్థాయి వరకు చేరడం లేదు.
స్ఫూర్తిగా తీసుకోవాలి
ఉగ్రవాదంపై బ్రహ్మస్త్రం... మలాలా... పదకొండేళ్ళ వయసులో మలాలా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. వాటిని వెలిబుచ్చడానికి మలాలా సోషల్ మీడియాను మార్గంగా చేసుకుంది. ‘గుల్ మకారు’అనే కలం పేరుతో బిబిసి ఉర్దూలోని బ్లాగులో ముస్లిం దేశంలో ఆడపిల్లగా పుట్టినందుకు చదువుకోకూడదా అని ప్రశ్నించింది. ఈ వివక్షపోవాలని గళం విప్పిన శాంతి బహుమతి తీసుకున్న మలాలాయే ఆదర్శం.
క్రీడాస్ఫూర్తి..
సైనానెహ్వాల్... క్రీడారంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేరు సైనా నెహ్వాల్. భారత మహిళా బ్యాడ్మింటన్‌కు విశ్వఖ్యాతినార్జించిన తొలి మహిళ ఎవరంటే... సైనా పేరు చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళా క్రీడాలోకానికి ఆమె స్ఫూర్తిదాయక మహిళ.
శాంతి కుసుమం...
ఇలాభట్... భారతీయ మహిళా లోకం గర్వపడే ‘శాంతి’ కుసుమం ఇలాభట్. రాష్టప్రతి చేతుల మీదుగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్న ధీర వనిత ఇలాభట్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) సంస్థ స్థాపించి సమగ్ర మహిళా సాధికారతకోసం కృషిచేసినందుకు, జీవిత విజయాల పరంపరకుగాను ఈ శాంతి పురస్కారాన్ని అందజేసింది భారత ప్రభుత్వం.
ఎందరో మరెందరో...
ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్. లుగా, మహిళా కలెక్టర్లుగా సుమితాదావ్రా, స్మితా సబర్వాల, దేవసేన, సిధూశర్మ... భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలిగా సిరిమావో బండారు నాయకె అత్యుత్తమ సేవలందించి చరిత్రలో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే. భారత రాష్టప్రతిగా ప్రతిభాపాటిల్, లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్, యుపిఏ చైర్‌పర్సన్‌గా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్, సీపీఎం పార్టీ ప్రతినిధిగా బృందాకారత్, ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, విజయశాంతి, కేంద్ర మంత్రులుగా పురందరేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లీ కృపారాణి, జయప్రద, హేమామాలిని, ఎమ్మెల్సీగా నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలుగా పద్మా దేవేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, గల్లా అరుణ, ప్రముఖ గాయకులుగా పి.సుశీల, ఎస్.జానకి, వాణీజయరాం, ఎల్‌ఆర్ ఈశ్వరి, జిక్కి, జమునారాణి, లతామంగేష్కర్, ఆశాభోంస్లే, భానుమతి, సావిత్రి, జమున, సూర్యకాంతం... ఇలా ఎందరో మరెందరో తమతమ పదవుల్లోనూ... కళాకారులుగా... వివిధ వృత్తుల్లో కొనసాగుతూ... ఎదుగుతూ... ఒదిగి ఉంటున్నారు.

- అట్ల శ్రీనివాస్‌రెడ్డి