మెయిన్ ఫీచర్

‘పెద్ద’కష్టం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన దాహం ఎప్పటికీ తీరనిదే. కళ్ల ముందు కరెన్సీ నోట్ల కట్టలు పేర్చుకుపోతున్నారే తప్పా దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నామనే స్పృహే లేదు. అవినీతిపరులు, ఉగ్రవాద సంస్థల సమాంతర ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేయటం కొందరికి మోదం, ఖేదం కలిగిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల నల్లదొంగలు ఉలిక్కిపడ్డారు. అయితే, సామాన్యులు, మహిళలు, గృహిణులూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్ణయం మంచిదా? కాదా? అన్న అంశంపై ‘్భమిక’ కొంతమంది విద్యార్థినులు, మహిళల అభిప్రాయాలను సేకరించింది. వివరాలు వారి మాటల్లోనే..

రద్దు సబబే..
ప్రధాని మోదీ నిర్ణయం సబబే. దేశంలో ఎంతమొత్తంలో నల్లధనం ఉన్నది ఇప్పుడు వెలుగుచూస్తోంది. కరెన్సీ లావాదేవీలు స్పష్టమవుతాయి. అవినీతి వ్యవహారమూ ప్రజలకు తెలుస్తుంది. పేద, మధ్యతరగతి, నిజాయితీపరుల ఆర్థికస్థాయి పెరుగుతుంది. అయితే, ఒకరోజు ముందు లేదా కొన్ని గంటల ముందు ప్రకటించివుంటే ‘బ్యాంకు’ కష్టాలు ఉండేవికావు.
- బిందు

‘విలువ’ తెలిసింది
నల్లధన సంపన్నులు డబ్బు విలువ పూర్తిగా మర్చిపోయారు. ‘నోటు’ను ఒక చిత్తు కాగితంలా వాడారు. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటలా సాగిపోయిం ది. నిలదీసే నేత లేకపోవడంతో డబ్బు సంచులే దిండుగా మార్చుకొనే పరిస్థితికి దిగజారిపోయారు. ఆదాయానికి మించి ఆస్తి వుంటే చర్యలు తీసుకునేలా చట్టాలు తేవాలి. అప్పుడే దేశంలో అవినీతి చీకటి తొలగిపోతుంది.
- కెవిఎల్ సుచిత్రారావు

ఔషధం చేదుగానే ఉంటుంది
ఔషధం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యాన్నిస్తుంది. నిదానంగా పనిజరుగుతుంది. ఓర్పుతో ఉండాలి. నల్లధనం పోగుచేసే వ్యక్తులకే కాకుండా, నల్లధనం దాచాలి అనే వ్యవస్థకి, ఆలోచనకి ఇది హెచ్చరిక వంటిది. నల్లధనం బంధువుల ఖాతాలకు, భగవంతుని హుండీలకు చేరుతోంది. ప్రధాని ప్రవేశపెట్టిన విధానం దేశ ప్రగతికి సోపానాలు.
- పిఎన్‌వి ఝాన్సీరాణి

దేశభద్రతకు సహకరిద్దాం..
పెద్దనోట్ల రద్దు వల్ల దేశభద్రత మరింత పెరుగుతుంది. మన దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు ఉగ్రవాదులతో పన్నాగాలు పన్నుతున్న శత్రు దేశాలకు ఈ నిర్ణయంతో పెద్దదెబ్బ తగిలింది. దేశంలోని అవినీతిపరుల భరతం పట్టినట్టయింది. మోదీ విధానం మంచిదే.
- నర్మద

అక్రమార్కులకు చెంపదెబ్బ
వ్యవస్థలో అప్పుడప్పుడు ‘స్పెషల్ డ్రైవ్’ ఉండాలి. అప్పుడే పురోగతి ఉంటుంది. దేశం నలుమూలలా అవినీతి పెచ్చుమీరి, కంపు కంపుగా మారిపోయింది. సామాన్యుడు, దేశభక్తుడు, నిజాయితీపరునిపై చులకన భావం ఏర్పడిపోయింది. గూడు, గుడ్డ ధర లు పెరిగిపోయాయి. సామాన్యుడు వ్యాపారి చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులను అక్రమార్కులు తెచ్చిపెట్టారు.
- దీప్తి

రద్దు బాగుంది
భారత ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడం చాలా బాగుంది. ఇది మంచిది. ఎందుకంటే, మన దేశంలో డబ్బుకు బానిసై అవినీతిపరులుగా, లంచగొండులుగా మారుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన కష్టాలు తాత్కాలికమనే తెలుసుకోవాలి. కొత్త కరెన్సీ వల్ల కూడా నల్లధనం ఏర్పడకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుపరచాలి. - ఎ.జ్యోతిశ్రీవిద్య

ఎన్నో ఏళ్ళకు మంచిపని చేశారు
పెద్దనోట్ల రద్దుతో పేదలు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వీరిలో కొంతమంది కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ పొందడం లేదు. దేశాభివృద్ధిని పక్కనపెట్టిన స్వార్థపర శక్తులు తమ క్షేమానే్న చూసుకున్నాయి తప్ప ఇరుగు, పొరుగు వాడి సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. ‘వాస్తవ బతుకు’ కనిపిస్తోంది వారికి. ఈ పరిస్థితుల్లో ఈ నోట్ల రద్దులో వీరికి ఎవరు సాయపడతారు? ప్రభుత్వమే ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలి. - జి.యమున

దేశం కోసమే కదా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతీ కార్యమూ దేశం కోసమే కాబట్టి ప్రజలు సహకరించాలి. ఒక మంచిపని జరగాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ శ్రమే ‘బ్యాంకు కష్టాలు’ అన్న విషయాన్ని గ్రహించాలి. అయితే, కొత్తగా రూ.2 వేల నోటు ప్రవేశపెట్టకుండా, రూ. అయిదు వందల నోట్లు విరివిగా ప్రవేశపెట్టి వుంటే ప్రజలకు మేలు జరిగివుండేది. నోటు మార్పిడి అవస్థలు తాత్కాలికమేనని దేశభక్తితో గ్రహించాల్సిన తరుణమిది. - కె.శ్రీలత

సౌకర్యాలు కల్పించాలి
పెద్దనోట్ల రద్దు మంచిదే అయినా సామాన్యులకు తగినంతగా సౌకర్యాలు కల్పించలేదు. ఒక ఆర్‌బిఐ, కేంద్రమే కాకుం డా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కష్టాలపై దృష్టిపెట్టాలి. మోదీ నిర్ణయం వల్ల అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. నల్లధనం బయటపడి, దేశానికి లాభం చేకూరుతుంది. స్థిరాస్తి, నిత్యావసర ధరలు తగ్గుతాయి. సామాన్యుడి జీవితం సాఫీగా సాగుతుంది. మోదీ చేసిన ఈ పని వల్ల ఎన్నికల్లో ప్రాధాన్యం కనుమరుగవుతుంది. - శిరీష

- జి.కృష్ణమూర్తి