మెయిన్ ఫీచర్

గర్భిణులకు కోవిడ్-19 ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా దేశంలోని వూహాన్ సిటీలో బయటపడ్డ కరోనావైరస్ (సార్స్-సీఓవీ-2) అనే కొత్తరకం వైరస్ దీనినే ‘‘కోవిడ్-19’’ అని పిలవడం జరుగుతోంది. దీని ప్రభావం గర్భవతులపైన ఉందా? లేక ఉంటుందా? గర్భస్థ శిశువు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయమై కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వసుంధర చీపురుపల్లి గారి మాటల్లో....
ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో విజృభించి మనదేశంలో కూడా తన తీవ్రతను చూపించేందుకు ఉరకలు వేస్తున్న ఈ కరోనా వైరస్ మొదట్లో జంతువుల నుండి సంక్రమించిందనే ప్రచారం విపరీతంగా వ్యాప్తి చెందింది. అయితే ఇది మనుషుల్లోనే ఒకరి నుండి మరొకరికి అతి వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం వెలుగులోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇలాంటి సమయంలో ఈ వైరస్ ప్రభావం గర్భిణి మీద ఆమె గర్భంలో ఉన్న బిడ్డ మీద ఎంతమేరకు ప్రభావం చూపుతుందనే సమస్య ఉత్పన్నమైంది.
ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు డాక్టర్ వసుంధరగారు గర్భిణి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను తెలిపారు. గర్భిణులే కాకుండా సామాన్య జనం కూడా ఈ క్రిందివి పాటిస్తే ఈ వైరస్ దరిచేరదు.
1. దగ్గు వస్తున్నప్పుడు మోచేయి అడ్డుపెట్టుకోవడం
2. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండటం
3. చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడంతో పాటు ఆల్కాహాల్ కలిగి ఉన్న శానిటైజర్‌ను వినియోగించడం తప్పనిసరి అంతేకాకుండా అత్యుత్తమం కూడా.
అయితే ఎక్కువ శాతం మహిళలు కేవలం చిన్నపాటి జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారంటే అవి ఆ వైరస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే విపరీతమైన దగ్గు, జ్వరం, గాలి పీల్చలేకపోవడం కూడా ఈ వైరస్ లక్షణాలే. ఈ వైరస్ తీవ్రత కలిగిన వారు న్యూమోనియా, గాలి పీల్చలేకపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆ వ్యక్తులు కోవిడ్-19 వైరస్ బారినపడినట్టే చెప్పుకోవచ్చు. అయితే ఈ లక్షణాలు ఎక్కువశాతం వయస్సు నిండిన వారిలో కనపడుతుంది. ఎందువలనంటే వారికి రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వారు గత కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతూ కాని, క్యాన్సర్ వ్యాధితో కాని, ఊపిరితిత్తుల వ్యాధితో కాని బాధపడుతున్న గర్భిణులను గుర్తించి వారికి సమయానుకూలంగా వైద్యం అందించాలి.
ఇక దీని ప్రభావం గర్భస్థ శిశువుపై, అప్పుడే గర్భం దాల్చినట్లు నిర్ధారించిన స్ర్తిలపై దీని ప్రభావం ఉన్నట్లుగా ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేదు. కానీ ప్రభావం ఉన్నవారికి కొద్దిపాటి రిస్క్ ఉండటం అన్నది సహజమే కదా...
అయితే గర్భిణులు తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలతో పాటు కనీస లక్షణాలు కనిపిస్తుంటే వారు తప్పక 14 రోజుల పాటు గృహ నిర్భందంలో ఉండటం ఆరోగ్యకరం. అంతేకాకుండా ఎవరితోనూ కలవకుండా ఉండటం శ్రేయస్కరం. అలాగే ఈ లక్షణాలున్న వారు జనసమద్ధంలోకి రాకుండా ఉండటం, స్కూల్స్, ఉద్యోగాలకు వెళ్లకుండా ఉండటం, ప్రజా రవాణాను వినియోగించకపోవడం, ఇంట్లోనే ఉంటూ అతిథులను ఎవరినీ ఆహ్వానించకపోవడం, గదిలో పూర్తిస్థాయి గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవడం అనేది చెప్పదగ్గ సూచనలు. ఇంట్లోని సభ్యులకు దూరంగా ఉండేందుకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాలి. అలాగే ఈ వైరస్ లక్షణాలున్న వారు ఉపయోగించే వస్తువులను మరెవ్వరూ వాడకుండా చూడడమే కాకుండా వారికివ్వాల్సి వస్తే దూరంగా ఉంటూ ఇవ్వడం అన్నది పాటించాల్సిన నియమం.
అలాగే ఈ వైరస్ బారినపడిన స్ర్తిలు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ అత్యవసర సమయాల్లో తప్పితే వారిచ్చిన సలహా మేరకు నిర్భంధంలో ఉండటం ఎంతో శ్రేయస్కరం.
అలాగే ఇంటివద్దనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవడం, ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన ఆహారం, తాజా పళ్లు, కూరగాయలు తినడం, అలాగే గర్భంలోని శిశువు కదలికలను గమనించడం, డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడటం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను అనుసరిస్తే ఈ వైరస్‌బారిన పడిన గర్భిణులు కోలుకోవడం పెద్ద సమస్యేమీ కాదు.
అదృష్టవశాత్తూ ఇప్పటివరకూ నమోదైన ఒకటి, రెండు కేసులు కూడా తల్లికి శ్వాసతీసుకునే ఇబ్బందులు కలుగడంతో త్వరగా డెలివరీలు జరిగాయే తప్ప కోవిడ్-19 వైరస్ వల్ల ఏ మాత్రం కాదని నిర్ధారణ అయ్యింది. అయితే ఏ మాత్రంగానైనా సూచనలు డెలివరీ అయిన తరువాత కనిపిస్తే ఆ తల్లి నుండి బిడ్డను 14 రోజుల పాటు దూరంగా ఉంచడం, తల్లికి తగిన విధంగా వైద్యం అందించడం చెప్పదగిన సలహా.
అలాగే పాలిచ్చే తల్లులు బిడ్డలకు పాలిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శిశువుకు ఎటువంటి పరిస్థితుల్లో వైరస్ సోకే వీలుండదు.
బిడ్డను తాకే ముందు చేతులను శుభ్రపర్చుకోవాలి. అలాగే పిల్లలకు పాలుపట్టే బాటిల్స్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
బ్రెస్ట్ఫీడింగ్ చేసే తల్లులు ఫేస్‌మాస్క్ వేసుకుని పిల్లలకు పాలివ్వాలి.
అతిజాగ్రత్తగా పిల్లలను చూసుకునే వారికి చంటిపిల్లలను అప్పగించడం వల్ల పిల్లలను కాపాడుకున్న తల్లులు కాగలరు. డాక్టర్ వసుంధరగారు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ గర్భిణులను, చంటిబిడ్డలను, తల్లులను కూడా కాపాడుకోవడం పెద్ద సమస్యేమీ కాదు.
*

-వసుంధర