మెయిన్ ఫీచర్

చిరునవ్వు వెల ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరునవ్వు వెల ఎంతంటే సిరిమల్లె పువ్వంతా? అబ్బే కాదు అది సిరులతో కొనలేనంత! అందుకేనేమో అన్నాడో కవి! ‘‘మగువలెపుడు మగవారిని చిరునవ్వుతో గెలవాలని..’’! అసలు మగవారిని మగువలూ కాదు - మగువల్ని మగవారూ కాదు- ఒక మనిషి మరో మనిషి మనసుని గెలవాలంటే సిరులూ, సంపదలూ కాదు- కావాల్సిందో అందమైన చిరునవ్వు. స్వచ్ఛమైన చిరునవ్వు! ఓ ఆప్యాయతతో నిండిన చల్లని పలకరింపులు చాలు!
చిరునవ్వుతో చూస్తే ‘చిత్తు’కాని వారుండరు. ఎప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వులు చిందిస్తున్న ముఖం చూస్తే అందరికీ మురిపమే! అందుకే నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఓ రోగం అన్నాడో కవి! నిజమే కదా!
ముఖ్యంగా ఎల్లప్పుడూ ఒకటిగా కలిసి వుండే భార్యా, భర్తల మధ్య వుండవలసింది అందమైన ఈ చిరునవ్వే! ఎదుటి మనిషి మనసు గాయపడకుండా, సున్నితంగా మసలుకోవడం ఉభయులకి ఆరోగ్యదాయకం, ఆనందప్రదం! కత్తికన్నా గాయపరచేవి కఠినమైన పదజాలాలలు కదూ! ఒకరినొకరు అర్థం చేసుకుని, సమయస్ఫూర్తిగా, సందర్భానుసారంగా చక్కని సంభాషణ జరిపితే ఎంత బాగుంటుంది? ఒకరికోసం మరొకరు జీవిస్తున్నారన్న భావన కలిగి వుండడం ఆనందదాయకం!
అలా ఉభయులూ ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకుంటే అటువంటి జంట తాము ఆనందంగా వుండడమే కాక చూపరులకు ఆనందం కలిగిస్తారనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి దాంపత్యం ఎదుటివారికి ఆదర్శప్రాయమే గాక మార్గదర్శకత్వం కూడా కదూ?
ధనం పోసి కొనలేనిదీ, విలువ కటకట్టలేనిదీ, మాయ, మర్మం లేనిది, కల్ల, కపటం, కల్మషం ఏవీ లేనిది ఓ చల్లని చిరునవ్వు! ఓ అప్యాయత కురిపించే చక్కని పలకరింపు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
చిరునవ్వు వెల ఎంత? అని నేనంటే, మీరు మల్లెపువ్వంత అనగానే, మరుమల్లె వెలెంత? అంటే ‘సిరులేవీ కొనలేనంత’ అని వెంటనే అంటారు కదూ!
ఎదుటి మనిషిని ఆప్యాయతా, అనురాగాలతో, ఓ చిరునవ్వుతో పలకరిస్తే మనసుకెంత హాయి? నవ్వినప్పుడు ముఖంలో కండరాలకు మంచి వ్యాయామం కలిగి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అందరిలో ఈ నవ్వే స్వభావం వుండాలి మరి!
ఎదుటివారిని ఆకట్టుకోవడానికీ, మనసుల్ని, మనుషుల్నీ ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా వుంచడానికీ వెలలేని ఓ చిరునవ్వు చాలు కదూ!

- శివాని