మెయన్ ఫీచర్

‘నోటు’కు రెండోవైపు చూడరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ మీడియా రానురానూ విశ్వసనీయతను కోల్పోతోందా? నిష్పాక్షికంగా వార్తలను ప్రజలకు చేరవేయాల్సిన టీవీ వార్తా మాధ్యమాలు వాటి సొంత ఎజెండాలను, అభిప్రాయాలను వీక్షకుల నెత్తిన బలవంతంగా రుద్దాలని చూస్తున్నాయా? ప్రభుత్వ పథకాలపై విమర్శలకు, ప్రజాభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను చానళ్లు గుర్తించలేకపోతున్నా యా? వాస్తవాలతో సంబంధం లేకుండా కొన్నిసార్లు ప్రజాభిప్రాయాన్ని పక్కకుపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయా? తమకు అనుకూలమైన వాదనలను వినిపించేలా చానళ్ల యాంకర్లు ప్రశ్నలు వేస్తున్నారా? చర్చా వేదికల్లో తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని అర్ధంతరంగా ఆపివేస్తున్నారా? ప్రభుత్వ విధానాలను మొండిగా విమర్శించడమే భావప్రకటనా స్వేచ్ఛ అనే తప్పుడు అభిప్రాయానికి చానళ్ళ నిర్వాహకులు లోనవుతున్నా రా? ఏదైనా విధాన నిర్ణయం ఒక పార్టీ చేస్తే సబబు, మరొక పార్టీ చేస్తే బేసబబు అన్న అభిప్రాయం కలిగేలా ఇవి ప్రవర్తిస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే సమాధానం అనివార్యమవుతోంది. వాస్తవ స్థితిగతులకు దూరంగా టీవీ మాధ్యమాలు జరిగిపోతున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ఆధార రహితమైన లేదా అసంబద్ధమైన వార్తను రోజంతా బలవంతంగా రుద్ది చానళ్ళు సాధించదల్చుకున్నది ఏమిటో అర్థం కాక ప్రజలు ప్రత్యామ్నాయం వెతుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిఆర్‌పి రేటింగ్‌ల కోసం తమ సహనశక్తిని ఇవి పరిహసిస్తున్నాయని ప్రజలు భావించడం తరచూ వినపడుతున్న మాటే. ప్రభుత్వాలకు వత్తాసు పలకడం వార్తాసంస్థల పనికాదు. అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం అన్నట్లుగా వార్తలు చూపించాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టడం వీటి కర్తవ్యం, బాధ్యత. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని తెలుగు చానళ్ళు ఈ పనిని చేయడంలో విఫలం అవుతున్నట్లుగా కనిపిస్తున్నది. బలహీనమైన, ఏకపక్షమైన మీడియా ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుంది. తమ వాదనను జనంపై రుద్దేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తే, వక్తలను ఎన్నుకుంటే- వాటికి భవిష్యత్‌లో జరిగే నష్టం అపారం.
బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ‘పెద్దనోట్ల రద్దు’ విధాన నిర్ణయం నేపథ్యంలో కొన్ని చానళ్ళ పనితీరును గమనిస్తే ఇవి ప్రజాభిప్రాయానికి దూరంగా, తమ సొంత ఎజెండాకు అనుగుణంగానే వ్యవహరించాయన్న భావన కలుగుతున్నది. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించవద్దని కానీ, దానివల్ల జనం పడుతున్న అవస్థలను చూపించవద్దని కానీ ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను, వాటి అమలును ఒక్క కోణంలోనే చూస్తూ అదే నిజమని ప్రజలను నమ్మబలకడం ఎంతవరకూ సబబు? పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్లకు కొరత ఏర్పడి, ప్రజలు గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చిందనడంలో సందేహం లేదు. వీటిని చూపించాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు అనేక భద్రతా సమస్యలకు పరిష్కారం చూపే కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు- దానికి మద్దతుగా ప్రజలను కూడగట్టాల్సిందిపోయి- ఆ నిర్ణయం వౌలిక లక్ష్యమే దెబ్బతినేలా ప్రవర్తించడం చానళ్ళకు సబబేనా? దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు జవాబు చె ప్పాలి. ఇందుకు ఉదాహరణలు కొన్ని..
ప్రపంచమంతా స్వాగతించింది..
మోదీ సర్కారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ఐ. ఎం. ఎఫ్, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్ధించాయి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడయితే-‘నేను మోదీ అభిమానిగా మారిపోయాన’ని ప్రకటించారు. వివిధ అంతర్జాతీయ పత్రికలు మోదీ నిర్ణయాన్ని స్వాగతించాయి. ‘్ఫర్బ్స్’ పత్రిక- ‘్భరత్‌లో నోట్ల మార్పిడి మంచి ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే 30 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ చేసే డబ్బు భారతీయ బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నా మొత్తం మీద ఇది ఒక తెలివైన పథకం’- అని పేర్కొన్నది. న్యూయార్క్ టైమ్స్ - ‘చివరి వరకూ అత్యంత రహస్యంగా ఉంచిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది. భారత్‌ను ఉన్నత దిశగా తీసుకువెళ్ళేందుకు ఉపయోగపడే ప్రయోగమిది’ అని రాసింది. వాషింగ్టన్ పోస్ట్ - ‘నల్లధనంపై మోదీ ప్రకటించిన పోరాటం ఇది. భారత్‌లో ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువచేసే నల్లధనం ఉన్నట్లు అంచనా’- అని పేర్కొన్నది. సింగపూర్ నుంచి వెలువడే ‘ద ఇండిపెండెంట్’ పత్రిక మోదీని ఆ దేశ ప్రముఖ నాయకుడు లీ కున్‌యాతో సమానంగా పోలుస్తూ అనూహ్య రీతిలో పొగిడింది. ప్రఖ్యాత అమెరికన్ ఆర్థిక రంగ పత్రిక బ్లూమ్‌బర్గ్‌లో స్పెస్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఒక వ్యాసం రాస్తూ ఆస్ట్రేలియా కూడా భారత్ పద్ధతిని అనుసరించి ఆ దేశపు పెద్ద నోట్లను రద్దుచేయాలని సూచించింది. మోదీ నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా స్వాగతించారని మన చానళ్ళు ఎందుకు చెప్పడం లేదు?
దొంగనోట్లకు అడ్డుకట్ట..
మన నిఘా సంస్థల అంచనా ప్రకారం దేశంలో దొంగనోట్ల చె లామణి ద్వారా పాకిస్తాన్ సాలీనా 500 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ నకిలీ కరెన్సీ విలువపై 30 నుంచి 40 శాతం లాభం సంపాదిస్తోంది. ఒక నకిలీ వెయ్య రూపాయల నోటును ముద్రించడానికి పాకిస్తాన్ 39 రూపాయలు ఖర్చుపెడుతూ 350 నుంచి 400 రూపాయలకు అమ్ముతోంది. మన ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడానికే పాకిస్తాన్ పెద్ద ఎత్తున మన కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టింది. ఇందుకోసం దుబాయ్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్‌ను పాకిస్తాన్ నిర్వహిస్తోందని నిఘా సంస్థలు ప్రకటించాయి. ఈ దొంగనోట్లన్నీ నేపాల్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ద్వారా భారత్‌లోకి చేరుతున్నాయి. ఇటీవలి కాలంలో శ్రీలంక, మలేషియా,్థయిల్యాండ్, చైనా, సింగపూర్, ఓమన్, హాలెండ్ ద్వారా దొంగడబ్బును భారత్‌లోకి చేర్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి పాక్ దొంగతనంగా పెద్దమొత్తంలో సిరా (ఇంక్) కొంటున్నది. తన కరెన్సీ నోట్లను ముద్రించేందుకు అవసరమైన కాగితానికి కొన్ని రెట్లు అధికంగా కాగితాన్ని సేకరిస్తున్నది. తన దేశపు కరెన్సీ కంటే అధిక సంఖ్యలో భారత కరెన్సీని పాక్ ముద్రిస్తున్నదనడానికి అనేక ఆధారాలున్నాయి. పాక్ తన దేశంలోని హబీబ్ బ్యాంక్ ద్వారా దొంగనోట్లను నేపాల్ ద్వారా మన దేశంలోకి చొప్పిస్తున్నది. మోదీ నిర్ణయం దొంగనోట్ల చెలామణికి అడ్డుకట్టవేస్తుందని చానళ్ళు ఎందుకు చెప్పలేకపోయాయి?
హవాలా దివాలా..
మోదీ నిర్ణయం జాతి వ్యతిరేక శక్తుల నడి విరిచింది. వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రికి మార్చివేయగలిగిన హవాలా వ్యాపారులు ఒక్క దెబ్బతో దివాలా తీశారు. హవాలా అన్నది సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ. రాజకీయ నాయకులు, టెర్రరిస్టులు, అవినీతిపరులు, లంచగొండులు, పన్ను ఎగవేతదారులు, అండర్‌గ్రౌండ్ డాన్‌లు, మాదకద్రవ్యాల వ్యాపారులు హవాలా వ్యవస్థను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కేరళలోనే ఏటా 23వేల కోట్ల రూ పాయల హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని ఒక అంచనా. బెంగుళూరు ఐఐఎంకు చెందిన ప్రొఫెసర్ ఆర్.వైద్యనాథన్ రూపొందించిన నివేదిక ప్రకారం గత ఆరు దశాబ్దాలలో భారతదేశం సుమారు 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ఆదాయాన్ని పన్ను ఎగవేతల వల్ల నష్టపోయింది. ఇందులో 40 శాతం డబ్బు హవాలా ద్వారా మాయమైంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడగానే ముంబయికి చెందిన ఒక హవాలా వ్యా పారి 500 కోట్ల కరెన్సీని తగులబెట్టాడని వార్తలు వచ్చాయి. దేశంలో రోజుకు 2 వేల నుంచి 3 వేల కోట్ల రూపాయల హవాలా వ్యాపారం జరుగుతోందని అంచనా. హవాలా వ్యాపారం అడుగంటి పోయిందని చానళ్ళు ఎందుకు చెప్పలేకపోయాయి?
ఉగ్రవాదులకు ఆగిన నిధులు..
నల్లధనంలో అధిక శాతం తీవ్రవాదులకు ఆర్థిక సహాయంగా మారుతున్నదని, వారికి నిధులు చేరకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని, ఈ చర్యను స్వాగతిస్తున్నామని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆసియా ఖండంలో తీవ్రవాదానికి పెద్ద దెబ్బతగులుతుందని భారతదేశంలో ఆఫ్ఘన్ రాయబారి సాయిదా అబ్బాలీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కేంద్రంగా భారత వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దావూద్ ఇబ్రహీం, జమ్మూ కాశ్మీర్‌లోని హిజ్బ్-ఉల్- ముజాహిదీన్ లాంటి సంస్థలు బలవంతపు వసూళ్ళ ద్వారా సేకరించిన వేల కోట్ల రూపాయలను పెద్దనోట్ల రూపంలో దాచిపెట్టి, వాటిని తీవ్రవాద కార్యక్రమాలకు వాడుతున్నారు. ఇటీవలి కాలంలో కాశ్మీర్‌లో ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులను, పాఠశాలలను ధ్వంసం చేయడానికి కూలీలకు ఈ డబ్బుని అందచేశారు. ఆయుధాల సేకరణకు ఉగ్రవాదులు ఈ డబ్బునే వాడుతూ వచ్చారు. రాత్రికి రాత్రి ఈ కరెన్సీ వీరికి చిత్తు కాగితంలా మారిపోయింది. పెద్దనోట్లకు విలువ లేకపోవడంతో కాశ్మీర్‌లో సైన్యంపై రాళ్ళ దాడులు ఆగిపోయాయి, మూతపడ్డ స్కూళ్ళు తెరుచుకుంటున్నాయి. ఉద్యమకారులు లేరు. ఆందోళనలు లేవు. తీవ్రవాదులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా మోదీ అ డ్డుపడ్డారని చానళ్ళు ఎందుకు చెప్పలేకపోయాయి?
ఈ విశే్లషణల నేపథ్యంలో టీవీ చానళ్ళ తీరు హాస్యాస్పదంగా, అపరిపక్వంగా కనిపిస్తున్నది. ‘చిల్లర లేక వెలవెలపోయిన మ ద్యం దుకాణాలు’, ‘మందుబాబుల ఇక్కట్లు- పడిపోయిన మద్యం అమ్మకాలు’, ‘తాగుదామంటే సారా లేదు- కొందామంటే చిల్లర లేదు’ లాంటి అసంబద్ధ వార్తలు, ఇందుకు మద్దతుగా తాగుబోతుల ఇంటర్వ్యూలు ప్రసారం చేసి ఏ సందేశాలు ఇవ్వదల్చుకున్నారో చానళ్ల నిర్వాహకులు స్పష్టం చేయాలి. ‘మాకు ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే, అయితే- ఒక మహత్తర ప్రయోజనం కోసం కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడడానికి సిద్ధమే’ అని ప్రజలు పదే పదే చెబుతున్నా వారి నుంచి వ్యతిరేక అభిప్రాయాల్ని చెప్పేందుకు టీవీ రిపోర్టర్లు, యాంకర్లు చేస్తున్న చేష్టలతో ప్రజలు విసిగిపోయారు. ఇలా విశ్వసనీయతను ఇంకా కోల్పోతే రాబోయే రోజుల్లో ప్రజలు టీవీలు కట్టేస్తారేమో!
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113