మెయన్ ఫీచర్

ఆర్థిక ఉగ్రవాదానికి అంతం ఎపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారీచుడు బంగారులేడి రూపంలో వచ్చి సీతమ్మవారిని భ్రమింపజేసినట్లే స్వతంత్ర భారతంలో రాజకీయవేత్తలు, సినీనటులు, నిర్మాతలు, చైనా, పాకిస్తాన్ దేశాలు కలిసి ‘నల్లజింక’ను ప్రవేశపెట్టి మనల్ని భ్రమింపజేశారు. నల్లధనంపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించాక ఎందుకోగాని కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి విపక్షనేతలు అసహనం ప్రకటిస్తున్నారు. అనగనగా యుపిలో ములాయం సింగ్ అనే ఆధునిక దశరథుడు.. ఆయనకు ఇద్దరు భార్యలు.. పెద్ద భార్య కొడుకు అఖిలేష్‌కు పట్ట్భాషేకం జరగటం కైకేయికి ఇష్టం లేకపోయింది. అందుకని ఆమె రెండు వరాలు కోరింది. మొదటిది అఖిలేశ్‌ను సిఎం పదవి నుండి తొలగించటం, రెండవది తన కొడుకు ప్రతీక్‌కు పట్ట్భాషేకం చేయటం. దీంతో యుపి రాజకీయాలు వీధినపడ్డాయి. ఈలోపల ఓ విభీషణుడు రాముల వారిని కలిసి దశరథుని వద్ద నల్లధనం ఉందన్న రహస్యం చెప్పాడు. ఇంకేముంది.. రాత్రికిరాత్రే వెయ్యి రూపాయల నోట్లు రద్దుఅయిపోయాయి.. ఇలాంటి సరదా కథనాలు ఇపుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.
‘ఇంత తొందరెందుకు? పార్లమెంటులో చర్చించి నెల రోజులు గడువుఇచ్చి నినాదంగా నోట్లు రద్దుచేయవచ్చుకదా? అని కొందరు విపక్ష నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. బెంగాల్‌లో మమతమ్మ శారదా చిట్‌ఫండ్ స్కాంలో ఇరుక్కుపోయింది. బంగ్లాదేశీ వలస ముస్లిం సంతుష్టీకరణపై ఆమె నల్లధనం రద్దుచేయకూడదని అంటున్నది. రాహుల్ గాంధీ పాపం నాలుగువేలు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకు వద్ద ఎండలో నిలబడి ఫొటోకోసం పోజుఇచ్చాడు. ఆయన నిర్భయుడు. ఎందుకంటే సోనియా కుటుంబానికి చెందిన నల్లధనం విదేశీ బ్యాంకుల్లో బీనామీల పేర్లమీద ఉందట!
పెద్దనోట్లు రద్దుచేసి మోదీ తన గోతిని తానే తవ్వుకున్నాడని సినీనటుడు శివాజీ అన్నాడు. మోదీపై సినీనటులకు ఇంత కక్ష ఎందుకు? భారీగా కలెక్షన్ల కనకవర్షం కురిసిన సినిమాలకు సంబంధించి నిర్మాతలు, నటీనటుల వద్ద నల్లధనం లేదా? ‘బాహుబలి’ నిర్మాతల ఇళ్లలో ఐటి సోదాలు జరిగినపుడు భారీగా డబ్బుకట్టలు దొరకలేదా? కరుణానిధి, జయలలిత, షారుఖ్ ఖాన్, చినబాబు, పెదబాబు ఇలా ఒకరేమిటి? అందరి దగ్గరా ఎకౌంట్లలోకి రాని నల్లధనం ఉంది. పెద్దనోట్లు ఇక చెల్లవని తెలిశాక చాలామంది ఘరానా నేతలు బంగారం, వజ్రాల రూపంలో నల్లధనాన్ని దాచుకుంటున్నట్లు కూడా ఐటి విభాగానికి ఉప్పు అందింది. నల్లధనం అనగానే సినీనటులు, రాజకీయ నేతలే కాదు.. లలిత్ మోడీలు, విజయ్ మాల్యాలు వంటి వ్యాపార దిగ్గజాలూ గుర్తుకొస్తారు. ఇక, వక్ఫ్‌బోర్డుల మాటేమిటి? ఆశారాం బాపూల సంగతేమిటి? హెలీపాడ్‌లు నిర్మించుకున్న స్వాముల ‘స్కాములు’ ఈ పరిధిలోకి రావలసి ఉంది. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ‘సంస్థాన్’ల జోలికి పోవడానికి పాలకులు భయపడుతారు. ‘పన్ను ఎగవేత’ మాత్రమే ఉగ్రవాదం కాదు. క్రికెట్ సీజన్‌లో భారీగా మ్యాచ్ ఫిక్సింగులకు పాల్పడేవారిని, కోట్లలో పారితోషికాలు తీసుకునే నటీనటులను ఆర్థిక ఉగ్రవాదులుగానే చూడాలి.
ఇప్పుడు ప్రభుత్వం 14లక్షల కోట్ల రూపాయల పెద్దనోట్లను రద్దు చేసింది. దీంతో ద్రవ్యోల్బణం గణనీయంగా పడిపోతుందని అంచనా. 1970లో అమరావతి వద్ద ఎకరం పదివేలు, 1990లో ఎకరం లక్ష, 2015లో ‘రాజధాని’ ప్రకటన వెలువడ్డాక ఎకరం కోటిన్నర రూపాయల పైమాటే. నోట్లరద్దుతో ఇది అరవై లక్షలకు పడిపోయింది. గతంలో ఎనభై శాతం నగదును బ్లాక్‌లో, ఇరవై శాతం వైట్‌లో ఇవ్వాలి. ఇపుడు మొత్తం డబ్బు వైట్‌లోనే ఇవ్వాలట. ఈనెల 1న తులం బంగారం 30 వేలు, పెద్దనోట్ల రద్దు వెంటనే 34,000. ఇవాళ తులం యాభైవేలు దాటింది.
సమాంతర ఆర్థికవ్యవస్థ నడుపుతున్న నల్లకుబేరుల వద్ద ఉన్న డబ్బు మొత్తం 14 లక్షల కోట్లు. దీన్ని దేశంలోని 85,000 బ్యాంకు శాఖల్లో ఎంత జమచేసినా 20 శాతం ఇంకా బయటే ఉంటుందని విశే్లషకుల అంచనా. ఈ డబ్బు ఫలానా రాజకీయ పార్టీ మాత్రమే దాచిందని చెప్పలేము. వామపక్ష పార్టీల నుండి బూర్జువా పార్టీల వరకూ అందరి వద్ద లెక్కలు చూపని ధనం ఉంది. దేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. పాక్ ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్, తాజాగా ఆర్థిక రంగంలో సర్జికల్ స్ట్రయిక్ రాత్రే జరిగింది. ఆరు దశాబ్దాలుగా సాగుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థపై మోదీ దెబ్బతీశారు. పాకి, చైనాల నుండి భారత్‌లోకి నకిలీనోట్లు ప్రవహించాయి. మరోవైపు దేశంలోనూ దొంగనోట్లను ముద్రించడం ఓ పరిశ్రమగా వర్థిల్లుతోంది. అవినీతి డబ్బు కేవలం కరెన్సీ రూపంలోనే ఉండనక్కరలేదు. బంగారం, భూమి,షేర్లు, సినీరంగం, ఎన్నికలు, హవాలా వంటి రూపాలల్లో ఉండవచ్చు. మమతా బెనర్జీ, మనీష్ తివారీ, మాయావతి, లల్లూప్రసాద్ వంటి వారు మోదీ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిఎస్‌పి, ఆర్‌జెడి వంటి పార్టీల నల్లధనం మీదే తమ పార్టీల అస్థిత్వం కొనసాగిస్తున్నాయని అర్థం. మాయావతికి గతంలో ఎవరో పూలదండకు బదులు నోట్లదండ వేస్తే- ‘ఇకపై నోట్లదండలే నాకు వేయండి’- అని ఆమె అన్నదట! ఒక నటుడు కోట్లాది రూపాయల పారితోషికం అడుగుతున్నాడంటే అంత డబ్బు సంబంధిత నిర్మాతలకు ఎలా వచ్చింది? చైనా, పాకిస్తాన్‌ల నుండి నకిలీ కరెన్సీ, గల్ఫ్ దేశాల నుండి పెట్రో డాలర్లు భారత్‌లోకి జీహాదీ ఉగ్రవాదులు ప్రవేశపెట్టారు. ఈ సంగతి యుపిఎ హయాంలో చిదంబరానికి, మన్మోహన్‌సింగ్‌కు తెలుసు. అయినా అప్పుడు వారెందుకు కళ్లుమూసుకున్నారంటే- ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసమే.
కాగా, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని బిజెపికి అండగా నిలిచే వ్యాపారవేత్తలూ ఆగ్రహించారు. అయినా మోదీ జాతి ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ఈ సాహసం చేశారు. ఇక, ఎపి సిఎం చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు. రాజకీయంగా తన ప్రత్యర్థుల మీద ‘ఆర్థిక దాడి’ జరిగిందని తాత్పర్యం. ఇలాంటి ఉత్సాహం తెలంగాణలో ఎందుకో కనిపించటం లేదు. ఈ ‘లక్షిత దాడి’ వల్ల తెలంగాణ సర్కారు ఆదాయానికి నెలకు రెండువేల కోట్ల నష్టం వస్తుందంటున్నారు. కేంద్రానికి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్లు తదితర రంగాల్లో ఆదాయం స్తంభించింది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల నుండి 1000 కోట్లు రాష్ట్రానికి రావలసి ఉండగా 600 కోట్లు రావడం ఈ సర్జికల్ స్ట్రయిక్ ప్రభావమే. పాకిస్తానీ జిహాదీ ఉగ్రవాదం, చైనా ప్రేరేపిత తీవ్రవాదం వంటిదే ‘అవినీతి నోట్ల ఆర్థిక ఉగ్రవాదం’ అని విదేశాంగ కార్యదర్శి సుజాతామెహతా అన్నారు. ఆర్థిక ఉగ్రవాదం ఎన్నో దశాబ్దాలుగా దేశాన్ని పీడిస్తున్నా గత పాలకులు అందులో పట్టించుకోలేదు.
రామాయణంలో పిడకల వేట కూడా ఉంది. ఇండియన్ నేషనల్ లీగ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ మద్రాసు హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. నోట్లరద్దు రాజ్యాంగ విరుద్ధమని అహ్మద్ అనే పాక్ దేశభక్తుడు వాదించాడు. మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ ఈ పిల్‌ను కొట్టివేస్తూ, సీమాంతర ఉగ్రవాదానికి ఊతాన్ని ఇచ్చే ఆర్థిక ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని తీర్పునిచ్చింది. పెద్దనోట్ల రద్దుతో సామాన్యప్రజలు నానా ఇబ్బందులకు లోనవుతున్నారు. మోదీని బలహీనపరచేందుకు ఇదే తరుణమని కొన్ని విపక్షాలు ఆరాటపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతో కలిసి పనిచేయాలంటూ ఎపి సిపిఐ నాయకుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. దీని సారాంశం ఒక్కటే. ఆర్థిక సంస్కరణలు ఎవరికీ పట్టవు, దేశరక్షణ అసలు అక్కరలేదు. ఓట్ల రాజకీయాలు చాలు.
ఇక, మోదీ ‘మూడవ సర్జికల్ స్ట్రయిక్’ జరపాలని అనుకుంటే అది అంతర్గత శత్రువులపైననే కావచ్చు. నోట్లరద్దుపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ స్వాగతించటం ఎవరికైనా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీరైస్ మాట్లాడుతూ , భారత్ తీసుకున్న చర్య స్వాగతింపదగిందే’ అన్నారు. మోదీ నిర్ణయాల ఫలితంగా ‘ఆదాయ స్వచ్ఛంద ప్రకటన’ ద్వారా ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ధనం లక్షా ఇరవై ఐదువేల కోట్లు. కాశ్మీరీ ఉగ్రవాదులకు ఆగిపోయిన మొత్తం 3,000 కోట్లు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనం 65 లక్షల కోట్లు. స్వదేశీ కుంభకోణాల ధనం 12 లక్షల కోట్లు. చత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు దాచినది 7,000 కోట్లు. 2015లో మార్కెట్‌లోకి చేరిన నకిలీ నోట్లు 400 కోట్లు. చెలామణిలో ఉన్న నోట్లలో నల్లధనం 37.4 శాతం ఉంది. ఆర్‌బిఐ అంచనాల ప్ర కారం దేశంలో దాచిన నల్లధనం 30 లక్షల కోట్లు.
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు ఇపుడు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటానికి రకరకాల మార్గాలు అనే్వషిస్తున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీలవాళ్లు తమ ఉద్యోగులకు రాబోయే రెండు నెలల జీతం ముందే పాతనోట్ల రూపంలో ఇస్తున్నారు. తులం బంగారం 50 వేలు దాటినా పాతనోట్లతో చాలామంది నగలు కొంటున్నారు. రైల్వే, విమానం టిక్కెట్లు బుక్ చేసుకొని కేన్సిల్ చేసుకొని కొత్త డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తిరుపతి వంటి ప్రఖ్యాత ఆలయాల్లోని హుండీల్లో పాతనోట్లను కట్టలు కట్టలుగా వేస్తున్నారు.
70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా నల్లకుబేరులపై వేటు పడింది. దీన్ని సామాన్య పౌరులు మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నారు. ‘అవినీతిని అంతమొందిస్తాం’ అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ వంటి వారు నల్లకుబేరుల కొమ్ముకాస్తున్నారు. అవసరమైతే కమ్యూనిస్టులతో కలిసి మోదీకి వ్యతిరేకంగా పోరాడుతానని మమతా బెనర్జీ అంటున్నారు. ఎనె్నన్నో కుంభకోణాలకు నిలయమైన కాంగ్రెస్ ఇపుడు మోదీని వ్యతిరేకిస్తోంది. ‘పెద్దనోట్ల రద్దును ఉపసంహరించుకోకపోతే ప్రజలు తిరగబడుతారు’ అని కేజ్రీవాల్ బెదిరిస్తున్నారు. యుపి, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలోనే వీరంతా ఇలా మాట్లాడుతున్నారా? నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే కారులో 4వేలు విత్‌డ్రా చేసుకునేందుకు రాహుల్ గాంధీ ఎటిఎం వద్దకు రావడం ఓ ప్రహసనం. ఈ చేష్టలన్నీ ఎవరిని వంచించడానికి? నల్లధనానికి కొమ్ముకాసే కొన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఇది కూడా జనం సహించరానిది.

-ముదిగొండ శివప్రసాద్