మెయిన్ ఫీచర్

గుట్టు రట్టు చేస్తే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆలుమగల కలహాలు అద్దంమీద ఆవగింజలు’ అన్నమాటలకు అర్థం లేకుండా పోయంది. ఇపుడు అవి ఫ్యామిలీ కోర్టులకు ఎక్కి విడాకుల పరిష్కారాన్ని చూపుతున్నాయి. అంతేకాదు, టీవీ చానళ్లకెక్కి సినిమా గిరాకీ లేని హీరోయిన్ల చేతిలో పడి ఏడుపులు, పెడబొబ్బలు.. దిక్కుమాలిన కౌన్సిలింగ్‌లతో వివాహ వ్యవస్థను రచ్చ రచ్చ చేస్తున్నాయి. కోర్టులు చెయ్యాల్సిన పనిని ఇపుడు టీవీ చానళ్లు చేయటంతో ఆలుమగల పరువు ఇపుడు ఇంటింటి వినోదంగా మారిపోయింది.
**

ఇంటి గుట్టు భద్రంగా ఉంటేనే ఆ మనిషి పరువు ప్రతిష్ఠలు, కుటుంబ గౌరవం సమాజంలో పదిలంగా ఉంటాయి. వెనకటి కాలంలో ఈ విషయాన్ని గుర్తించి.. విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు గనుకనే ‘కాలు జారినా తీసుకోవచ్చుగానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం’- ‘ఇంటి గుట్టు ఈశ్వరునికే ఎరుక’ వంటి సామెతలు పుట్టాయి. ఆనాటి ఉమ్మడి కుటుంబాలలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతా ఒక ఇంట్లో, ఒక చూరు కింద కలిసి కాపురం చేసినా.. పైకి ఎంత కలివిడిగా వున్నా.. లోలోపల కుటుంబ కలహాలు, చికాకులు లేకపోలేదు. అయినా అవన్నీ నాలుగు గోడలమధ్యనే వుండేవి తప్ప.. గడపదాటి.. పెదవి దాటి బయటికి వచ్చేవి కావు. మూడో కంటికి కనిపించేవి కావు.. పొరుగువాడికైనా వినిపించేవి కావు. ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ అన్న సామెత చందాన సాగాల్సిన సంసారాలు ‘అంతా బట్టబయలు’ చేసుకుని నలుగురి నోళ్లలో నానుతున్నాయి.‘ఆలుమగల కలహాలు అద్దంమీద ఆవగింజలు’ అన్నమాటలకు అర్థం లేకుండా పోవటంతో ఇపుడు అవి ఫ్యామిలీ కోర్టులకు ఎక్కి విడాకుల పరిష్కారాన్ని చూపుతున్నాయి. అంతేకాదు, టీవీ చానళ్లకెక్కి సినిమా గిరాకీ లేని హీరోయిన్ల చేతిలో పడి ఏడుపులు, పెడబొబ్బలు.. దిక్కుమాలిన కౌన్సిలింగ్‌లతో వివాహ వ్యవస్థను రచ్చ రచ్చ చేస్తున్నాయి. కోర్టులు చెయ్యాల్సిన పనిని ఇపుడు టీవీ చానళ్లు చేయటంతో ఆలుమగల పరువు ఇపుడు ఇంటింటి వినోదంగా మారిపోయింది.
‘గుప్పిట మూసి ఉన్నంతవరకే గుట్టు.. గుప్పిట తెరిస్తే అంతా బట్టబయలే’ అని గడిచిన కాలపు పెద్దలు ‘గుట్టు’ను గుట్టుగానే వుంచాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. కానీ ఇప్పుడు ఎవరూ ఆ సూక్తులను పాటిస్తున్న దాఖలాలు లేవు. ఏ ఒక్క పిడికిలీ మూసుకుని కనిపించటం లేదు. అంతా బహిరంగమే.. కుటుంబ వ్యవహారాలు వీధి పోరాటాల స్థాయికి దిగజారిపోయి సామాజిక కార్యకర్తలకు ఆందోళన కలిగించేలా తయారయ్యాయి. టీవీ వాళ్ల స్పెషల్ మసాలాల దట్టింపును తోడుచేసుకుని ప్రతిరోజూ వీక్షకులకు నయనానందాన్ని బోలెడు కాలక్షేపాన్ని కలిగిస్తూనే ఇంకెక్కడి గుట్ట అని గుండెలు బాదుకునేలా కూడా చేస్తున్నాయి. మనిషి విలువ, గౌరవం, ఆత్మాభిమానం, సామాజిక కట్టుబాట్లు మటుమాయమై వాటిస్థానంలో విచ్చలవిడితనం, అసభ్యత, మితిమీరిన స్వేచ్ఛ, ఎవరేమనుకుంటే నాకేంటన్న మొండివైఖరి చోటుచేసుకుని గుట్టుగా బ్రతకాల్సిన మనుషులు రోడ్డుమీద పడుతున్నారు.
టీవీ చానెళ్ల ద్వారా ప్రత్యక్ష, పరోక్ష వ్యక్తిగత విమర్శలు సామాన్య ప్రజానీకానికి వీనులవిందు చేస్తూనే వున్నాయి. ‘గుట్టు’ అది చిన్నదయినా పెద్దదయినా వ్యక్తిగతమైనా.. దేశ సంబంధి అయినా గుట్టు గుట్టే! వ్యక్తిగత విషయాలు రెండో వ్యక్తికి తెలియకుండా ఎలా దాచుకోవాలో జాగ్రత్తపడాలి. అప్పుడే గౌరవంతోపాటు భద్రతా సాధ్యమై వ్యక్తికి సుఖశాంతులు లభ్యవౌతాయి. ఇవన్నీ ఆలోచించకుండా గుట్టు రట్టు చేయాలని చూస్తే అది స్వయంకృతాపరాధమే అవుతుంది.

- డా కొఠారి వాణీ చలపతిరావు