మెయిన్ ఫీచర్

శ్రీమధ్భగవద్గీత.. సర్వ శాస్త్ర సారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటియైనది, దీనికి మించినది మరియొకటి లేదు. మతాల ప్రసక్తికి అతీతంగా అందరూ చదవవల్సిన గ్రంథం. ఏ మతానికి చెందిన వారికైనా సకల మానవాళి శ్రేయస్సును కోరేదీ, జ్ఞానాన్ని ప్రసాదించేదీ భగవద్గీత. పరిశీలనం చేస్తే సర్వమత సిద్ధాంతాలకనుగుణంగా ఉన్న ఏకైక గ్రంథం భగవద్గీత.
గీతను గురించి భక్తులు ‘్భక్తి’ని ప్రబోధిస్తుందనీ, జ్ఞానులు ‘విజ్ఞాన భాండార’మని, ‘కర్మకాండకే ప్రాధాన్యమ’ని మేధావులు, సామాన్యులు అంటారు. ఈ అభిప్రాయాలు యథార్థమే అయినా, ఏ సంప్రదాయానికి చెందిన వారైనా గీతను తమకనుకూలంగా ఉపదేశించబడిన గ్రంథంగా చెప్పుకుంటారు.
పంచమ వేదంగా ప్రస్తుతించబడిన మహాభారతం భీష్మపర్వంలో శ్రీ వేదవ్యాసులు గీతను ప్రత్యేకంగా చొప్పించారు. కురుక్షేత్ర యుద్ధారంభంలో అర్జునునికి శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశించినట్లుగా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మయే గీతాజ్ఞానం అనాదియని, అనంతకాలం నుండి ఉన్న ఈ జ్ఞానాన్ని మరల నీకు ఉపదేశిస్తున్నానని అర్జునునితో అన్నాడు. భగవద్గీత ఉపనిత్తుల సారం. ఈ మాటను పదునెనిమిది అధ్యాయాల కడమ ‘‘్భగవద్గీతాను ఉపనిషత్సు’’ అని చెబుతూనే గీతాశాస్త్రం బ్రహ్మవిద్య అని కూడ పేర్కొన్నాడు. ఏడువందల శ్లోకాలుగల భగవద్గీత, ఇందులో ఉపదేశించిన సిద్ధాంతాలు దేశకాలాలకు పరిమితం కావు. సార్వత్రికాలు ఇందు చెప్పిన ధర్మాలు సర్వమానవాళి ఆచరింపదగినవి.
గీతోపదేశాలన్నీ వయస్సుతో ఏమాత్రం నిమిత్తం లేకుండా అందరూ ఆచరింపదగ్గవే. గీతామార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తే, అందులో చెప్పిన మాటలను ఆచరిస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సుఖమయం చేసుకుంటారనడంలో సందేహం లేదు. లేత వయస్సులోనే పిల్లలచే చదివించి, అర్ధాలను అందించినట్లయితే, ఆ పిల్లల్లో జ్ఞాన విజ్ఞానాలు పెంపొందుతాయి.తమ కర్తవ్యనిర్వహణలో మున్ముందు కృతార్థులు కాగలరు. అంతేకాదు- విద్యార్థులు విద్యాధ్యయనకాలంతో గీతను ఒక పాఠ్యాంశంగా చేర్చితే, మానవీయతను అలవర్చుకుని ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడం, సేవాత్యాగ భావాలను పెంపొందించుకునే వీలు కలుగుతుంది. గీతాజ్ఞాన సముపార్జనంలో ఎన్నో లౌకిక, పార లౌకిక విషయాలున్నాయి. ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకుందాం:
కర్తవ్యబుద్ధితో ఫలితాన్ని ఆశించకుండా కార్యము ఆచరించాలి. సకల ప్రాణికోటిని ఆత్మసమానంగా భావించాలి. సుఖదుఃఖాలు, మానావమానాల వంటి ద్వంద్వాలను సమాన దృష్టితో చూడాలి. ప్రియమైన వాటికి పొంగిపోక, అప్రియమైన వాటికి కృంగిపోక జీవించాలి. శత్రువులను, మిత్రులను, సాధువులను, దుర్మార్గులను సమానంగా చూడాలి.
ఇంద్రియాలను, మనస్సును నియంత్రించడం, అహంభావానికి ఆమడ దూరంలో ఉండడం, అరిషడ్వర్గాలను అణచడం కర్తవ్యంగా భావించాలి. తన మతం పరమతానికంటె దుచ్ఛమైనదిగా భావించి విడిచిపెట్టాలన్న ఆలోచనకు ఎట్టి పరిస్థితులలో మనస్సులో చోటీయవద్దు. ఎవరినీ ద్వేఃచవద్దు. సత్యం, అహింస, త్యాగం, సేవ మనిషికి ఉత్తమ గుణాలు. నిర్మల చిత్తం, దృఢ విశ్వాసం, భగవంతునిపై భక్తి, భగవచ్ఛరణాగతి అతి ముఖ్యమైనవి. భగవత్సేవ పాపాలను తొలగించి ముక్తిని కలిగిస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి.అందువల్ల గీతను గురించి తెలుసుకోవాలి. భగవద్గీత భగవంతుని హృదయం. ఆమాట గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. జన్మతఃకాక, గుణాలవల్ల వర్ణ వ్యవస్థ రూపుదిద్దుకుందని వివరణాత్మకంగా చెప్పాడు. ‘‘గీతానుగీతా కర్తవ్యా’’ అంటూ ఉపనిషత్సారాన్ని వివరించాడు. అద్వితీయమైన ఈ భావాన్ని హృదయంగమం చేసుకుని జీవిత మనుగడను సాధించాలి. గీత భగవచ్ఛరణాగతిని ఉద్భోదించింది. అలా శరణాగతుడైతే ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంత్వాసర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః’ తెలిసి లేక తెలియక చేసిన పాపాలనుండి విముక్తిచేసి ముక్తినిస్తానని భరోసా ఇచ్చాడు.
వైదిక ధర్మాన్ని ఆచరించే భారతీయులకు ఆత్మవిచార మార్గాన్ని తెలియజేసేది ప్రస్థానత్రయం. వీటికి త్రిమతాచార్యులతోపాటు ఎందరో భాష్యం వ్రాసారు. ఆ కారణంగా భారతీయులు ప్రస్థాన త్రయాన్ని ఆదరిస్తున్నారు. ఉపనిషత్తులను ‘వైదిక ప్రస్థానం’గా, బ్రహ్మసూత్రాలను ‘దార్శినిక ప్రస్థానం’గా చెప్పి, భగవద్గీతను ‘స్మార్త ప్రస్థానం’గా పేర్కొన్నారు. కారణమేమంటే గీత వేదాలతో, దర్శనాలతో సమానమైనది కావడంవల్ల. మానవుడు నిత్య జీవితంలో అనుసరించవల్సిన విషయాలను సూటిగా చెప్పింది. అర్జునుని మానవాళికి ప్రతినిధిగా చేసుకుని శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని బోధించాడు.
మార్గశిర శుద్ధ ఏకాదశినాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు. ఆనాడే భారతదేశమంతటా గీతాజయంతి జరుగుతుంది. సాధారణంగా అవతార పురుషులకు, దేవీదేవతలకు, జాతిని తీర్చిదిద్దిన ప్రముఖులకు ప్రపంచంలో జయంతిని జరుపుతుంటారు. కాని ఒక గ్రంథానికి జయంతి జరుపడం విశేషం. భగవద్గీత ఆ ప్రత్యేకతను కలిగి వుంది. గీతపై వ్రాయబడినన్ని టీకలు, భాష్యాలు మరొక గ్రంథం పై లేవు. దాదాపు ప్రపంచ భాషలన్నింటిలో గీతానువాదాలున్నాయి. పద్మపురాణంలో గీతామహత్మ్యం గురించి విస్తారంగా ఉంది. మహాభారతంలో శ్రీకృష్ణుని ముఖం నుండి వెలువడిన గీతను ఎంతగానో శ్లాఘించాడు వ్యాసుడు.
మహాభారతం భీష్మ పర్వంలో ‘‘మనువు సర్వవేదమయుడైనట్లు, గంగ సకల తీర్ణ రూపిణి యైనట్లు, శ్రీహరి సర్వదేవమయుడైనట్లు, భగవద్గీత సర్వశాస్తస్రారం’’ అన్నాడు వ్యాసుడు.
సర్వశాస్తమ్రరుూ గీతా సర్వదేవమయో హరిః
సర్వతీర్థమరుూ గంగా సర్వవేదమయో మనుః
గీతా జయంతినాడు ప్రతి ఒక్కరూ భగవద్గీతను పూజించి, పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాలను ఆచరించడానికి సంకల్పించుకుంటే శ్రీకృష్ణపరమాత్మ కృపకు తప్పక పాత్రులవుతారు.

- ఎ. సీతారామారావు