మెయన్ ఫీచర్

జనం దెబ్బకు తెల్లబోయిన ‘నల్లదొరలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును.. జనం గెలిచారు. కొన్ని దశాబ్దాలుగా అవినీతిపరులు, తీవ్రవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటున్న దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు రెక్కలు విప్పుకుని బ్యాంకుల్లో వచ్చిపడడమే జనం గెలిచారనడానికి నిదర్శనం. అవినీతిపరులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ధర్మయుద్ధానికి మద్దతుగా జనసామాన్యం గత నెలరోజులుగా బ్యాంకులు, ఎటిఎం క్యూల వద్ద సహనంతో నిలబడి మరీ గెలిచారు. ఖర్చులు తగ్గించుకుని, ఉన్న కొద్దిపాటి డబ్బుతో తమ అవసరాలు తీర్చుకుంటూ వారు గెలిచారు. సంతకం పెట్టడం కూడా రాని ‘నిశానీగాళ్ళు’ మొబైళ్ళ ద్వారా, కంప్యూటర్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏం జరుపుతారంటూ ఎదురైన అవహేళనలు, అవమానాలను ఎదిరించి మరీ గెలిచారు. బడుగువర్గాల ఆర్థిక స్వావలంబన కోసం తెరిచిన ‘జనధన్’ అకౌంట్లలో అక్రమార్కులు లక్షలాది రూపాయలు వేసినపుడు- పాపపుసొమ్మును అడ్డుకుని జన సామాన్యం గెలిచింది.
దేశ స్వాతంత్య్రం కోసం అలనాడు మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రజలు సంఘటితంగా పోరాడిన స్ఫూర్తి ఇపుడు ఆర్థిక సంస్కరణల కోసం మళ్లీ కనపడిందనడం అతిశయోక్తికాదు. అనేక వ్యవస్థలతో పెనవేసుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకలించడానికి ప్రజలు ఉద్యుక్తులయ్యారు. వారికి మోదీ నాయకత్వం దొరికింది. సహనంతో, సంఘటిత శక్తితో నల్లకుబేరులపై పోరాటం చేశారు. బ్యాంకులో తక్కువ డబ్బు ఇచ్చినా, ఒక్కోసారి డబ్బు చేతికి అందకపోయినా బాధపడలేదు. ఎక్కడా ధర్నాలు లేవు. ఆందోళనలు లేవు. పూర్తి క్రమశిక్షణతో పోరాడారు. కొన్ని టీవీ చానళ్ళ రిపోర్టర్లు రెచ్చగొట్టడానికి ఎంతగా ప్రయత్నించినా రెచ్చిపోలేదు. ‘ఈ కష్టాల్ని ఇష్టపూర్వకంగా అనుభవిస్తున్నాం. ఇవాళ కొన్ని గంటలపాటు క్యూలో నిలబడడం వల్ల రేపటి బంగారు భారత్‌కు బాటలు వేస్తున్నామని భావిస్తున్నాం’ అన్నారే తప్ప ఎక్కడా నోరు జారలేదు. ప్రజల్లో అసహనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన ప్రసార మాధ్యమాలు మాత్రం ఓడిపోయాయి.
పెద్దనోట్ల రద్దుతో పెళ్లిళ్లకు తప్పని ఆటంకాలని జరిగిన ప్రచారం నిజం కాదంటూ యువత వినూత్న పద్ధతులలో వివాహాలు చేసుకున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భరత్ పర్‌మార్, దక్షలు కేవలం అయిదువందల రూపాయల ఖర్చుతో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు కేవలం మంచినీళ్ళు, చాయ్ మాత్రమే ఇచ్చి మర్యాదలు జరిపారు. విజయవాడ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఎఎస్ అధికారిణి డాక్టర్ సలోని సిదాన, మధ్యప్రదేశ్ ఐఎఎస్ అధికారి ఆశీష్ వాధిష్ఠిల వివాహం కూడా కేవలం 500 రూపాయల ఖర్చుతోనే జరిగింది. ఈ 500 రూపాయలను వివాహ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పడ్డ అవాంతరాలను అధిగమించడానికి జనం సిద్ధంగా ఉన్నారనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
మరోవైపు బ్యాంకుల వద్ద ‘క్యూ’లో ఉన్న వారికి సహాయం చేసేందుకు సామాన్య జనం ముందుకొచ్చి మంచినీళ్ళు, చాయ్, అరటిపండ్లు అందించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. కొందరైతే చందాలు వేసుకుని నీళ్ళు, తేనీరు, పండ్లు అందించారు. చదువురాని వారికి అప్లికేషన్లు నింపి ఇచ్చారు. గుర్తింపు కార్డులకు ఫొటోకాపీలు అందచేశారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినపుడే ప్రజలు ఇలా స్పందించడం చూస్తాం. అదే స్ఫూర్తితో, అదే సేవాభావంతో ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం ప్రజలు స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసేందుకు జరుగుతున్న మహాయజ్ఞంలో తమవంతు పాత్రను పోషించడానికి జన సామాన్యం ఉద్యమరూపంలో ముందుకు వచ్చింది. వీరి పోరాటపటిమ ముందు ‘చిల్లర’ కష్టాలు పటాపంచలైపోయాయి. పట్టణ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం ఆశ్చర్యాన్ని కలిగిస్తే, గ్రామీణ భారతం చూపిన సమయస్ఫూర్తి, సంఘీభావం ప్రపంచానికే ఆదర్శంగా మారుతుంది. చాలా గ్రామాలు వస్తుమార్పిడి పద్ధతిని సమర్ధవంతంగా నిర్వహించాయి. కొన్ని చోట్ల వ్యాపారస్తులు ప్రజలకు కావాల్సిన వస్తువులను వడ్డీలేని అరువుగా ఇచ్చారు. నిత్యావసర సరకులకు, అత్యవసర కార్యక్రమాలకు ఏ ఒక్కరికీ ఇబ్బంది లేని విధంగా ఊరు ఊరంతా ఒక్కటిగా నిలబడ్డారు. పట్టణాల కంటే పల్లె ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. జన్‌ధన్ ఖాతాలు తెరిచే సమయంలో అందించిన ‘రూపే’ కార్డులు ఇపుడు బాగా ఉపయోగపడ్డాయి. గ్రామాలకు గ్రామాలు ఇపుడు పది రూపాయల నుంచి లక్షల వరకూ డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. మహారాష్టల్రోని థానే జిల్లా దాసై గ్రామంలో నూటికి నూరు శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపు 5వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఒక జాతీయ బ్యాంకు, రెండు ఎటిఎం సెంటర్లు ఉన్నాయి. మహారాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ గ్రామానికి 150 స్వైప్ మెషీన్లు అందించారు. చుట్టుపక్కల ఉన్న మరో 25 గ్రామాలు తమ అవసరాల కోసం దాసై గ్రామంపై ఆధారపడ్డారు. సావర్కార్ ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ కారణంగా ఇక్కడ లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లా అకోదరా అనే కుగ్రామం పూర్తిగా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తోంది. 220 గడపలున్న ఈ గ్రామంలో పాలు, పెరుగు, కూరగాయలు, గుడ్లు.. ఒకటేమిటి అన్ని కొనుగోళ్లనూ డిజిటల్ లావాదేవీల రూపంలో జరుపుకుంటున్నారు. ఊరు మొత్తాన్ని ‘వైఫై’ చేశారు. అందరి దగ్గరా మొబైళ్ళు ఉన్నందున వాటికి బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేశారు. క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. కిరాణాకొట్టు యజమానులు కూడా పది రూపాయలకు మించి జరిగిన ప్రతి కొనుగోలుకు డిజిటల్ పద్ధతిన డబ్బు తీసుకుంటారు. రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే చేరతాయి. చిన్న చిన్న గ్రామాల్లో ‘ఈ-వాలెట్’ ద్వారా అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతాయని నెల రోజులముందు ఎవ్వరూ ఊహించలేదు. బిహార్‌లోని కుగ్రామాల్లో కిళ్ళీబడ్డీలు, కూరగాయల వ్యాపారస్థులు, పానీపూరీ అమ్ముకునే బండ్లవారు కూడా ‘ఈ-వాలెట్’ ద్వారా తమ లావాదేవీలు కొనసాగిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు ఊతం ఇస్తూ సాధారణ జనం సాధించిన ఘన విజయం ఇది.
పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ దాదాపు అయిదువేల మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. అవినీతిపరులైన నేతలు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి మావోలు కోట్లాది రూపాయలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం నుంచే మావోలకు చెందిన ఏడువేల కోట్ల రూపాయలను స్వాధీన పరుచుకున్నట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. మావోలకు చెందిన దాదాపు 1500 కోట్ల రూపాయలు నిరర్ధకంగా మారిపోతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బలవంతపు వసూళ్ళు ద్వారా సేకరించిన వేల కోట్ల రూపాయలతో వీరు అక్రమ పద్ధతిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విధ్వంసక పరికరాలను సేకరించి ప్రజలను చంపుతూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్టల్రోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గత నెలరోజులుగా హింసాత్మక సంఘటనలు దాదాపుగా ఆగిపోయాయి. దాచిపెట్టిన బస్తాలకొద్దీ డబ్బు ఉపయోగపడక పోవడంతో వారు నిరాశకు లోనై అసహనంతో రగిలిపోతున్నారు. పేదల కోసం పోరాడుతున్నమని చెప్పుకునే మావోలు ఇపుడు ‘జన్‌ధన్’ ఎకౌంట్లలో పాతనోట్లు వేసి కొత్త కరెన్సీని తమకు ఇవ్వాలని పేదలను బాధపెడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ప్రజల మద్దతు లభించడంతో మావోల ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. దేశంలో అంతర్గత భద్రత బలపడింది.
మోదీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో హిజ్రాలు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా రూపొందించి ఊరూరా ర్యాలీలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు నిర్వహించిన ‘ఆక్రోశ్ దివస్’ను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను మార్చేందుకు, ప్రపంచంలోనే దీటైన ఆర్థిక వ్యవస్థగా తయారుచేసేందుకు సగటు మానవుడు నడుం బిగించాడు. దేశం అన్నిరంగాలలో అగ్రగామిగా నిలవాలంటే పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండాలి. విద్య, వైద్యం, రవాణా, ఉపాధి రంగాల్లో మేలు జరగాలంటే డబ్బుకావాలి. మన శాస్తస్రాంకేతిక విజ్ఞానానికి, తెలివితేటలకు తగిన గుర్తింపురావాలంటే పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ఇందుకు ఇబ్బడిముబ్బడిగా రీసెర్చి సెంటర్లు నెలకొల్పాలి. ఇందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం. గత పాలకుల హయాంలో వీటికి అవకాశం లేకుండా పోయింది. వేల కోట్ల రూపాయలు అటు విదేశీ బ్యాంకులకు తరలింపబడడమో లేదా దేశంలోనే నల్లధనంగానో మారిపోవడమో జరిగింది. నల్లధనాన్ని బయటకితీస్తే తప్ప కొత్తగా ఎటువంటి పథకాలను చేపట్టలేని దుస్థితి ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని వాంఛిస్తున్న ప్రజలకు మోదీ రూపంలో నేడొక ఆయుధం లభించింది. అందుకే పూర్తివిశ్వాసంతో ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఇబ్బందులు పడ్డారు, అవమానాలు భరించారు. అవినీతిపరులకు, వారికి మద్దతు పలుకుతున్న శక్తులకు సరైన సమాధానం చెప్పారు. దీంతో బెంబేలెత్తిన నల్లకుబేరులు తమ డబ్బును ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ ప్రకటనలలో నిజానిజాలను నిగ్గుతేల్చిన తరువాత వాటిపై పన్నులను విధిస్తారు. ఏ లెక్కన చూసినా ఇందులో సగభాగం పైగా ధనం ప్రభుత్వానికి చెందుతుంది. దీంతో అభివృద్ధి వేగవంతం అవుతుంది. భారతదేశం ప్రపంచానికే తలమానికం అవుతుంది. ఇది కచ్చితంగా జన విజయం.

*కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113