మెయన్ ఫీచర్

సంస్కరణ పథంలో ఇది తొలి అడుగు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదే కానీ- ఆచరణలో సామాన్యులు అవస్థల పాలవుతున్నారని కొందరు విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది.. రూపాయి విలువ పెరుగుతుంది.. ప్రజల్లో కొనుగోలుశక్తి స్థిరీకరింపబడుతుంది.. ఉగ్రవాద చర్యలు ఆగిపోతాయి.. ఇలాంటి వాదనలూ లేకపోలేదు. పెట్రో డాలర్లు అంటే చమురు దేశాల నుండి వచ్చే ధనం. మత మార్పిడుల కోసం కొంతమందికి అందిన ధనం.. వీటికి ఇప్పుడు లెక్కచూపాలి. నోట్ల రద్దు తర్వాత కాశ్మీరులో రాళ్లు రువ్వటం ఆగిపోయిందన్న వార్తలూ విన్నాం. నల్లధనాన్ని పోగేసుకున్న మాయావతి లాంటి విపక్ష నేతలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. పలు రాష్ట్రాల్లోని మావోయిస్టుల డంప్‌ల నుంచి నల్లధనం బయటకు రావటం మరొక పరిణామం. పన్ను బకాయిలను ప్రజలు చెల్లించడంతో స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం పెరిగింది. మరోవైపు చలనచిత్ర పరిశ్రమ దాదాపు స్తంభించింది. వేలాది చలనచిత్ర నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. కాకుంటే ఈ రంగంలో బడాబాబుల దగ్గర ఉన్న వేల కోట్లు ఇంకా ఎకౌంట్‌లోకి రాలేదు. ఇంకోవైపు ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి.
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం’ ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనలో తొలి అడుగు మాత్రమేనని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి విదేశీయ నల్లధనం వెనక్కి రాలేదేమని అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెబుతూ, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోందని అంటున్నారు. బిజెపి నేతల ప్రకటనలను విశే్లషిస్తే గనుక- మరి కొన్ని ఆర్థిక సంస్కరణలు రాబోతున్నాయని, విదేశీయ బ్యాంకుల్లోని ధనాన్ని వీలువెంబడి భారత్‌కు రప్పించే ప్రయత్నం జరుగుతుందని అవగతమవుతుంది. అంటే- విజయ్ మాల్యా, లలిత్ మోడీ, గాలి జనార్దన రెడ్డి వంటి ఘరానా వ్యక్తులు ఎల్లకాలం తప్పించుకోలేరని అర్థం. దేశంలో నల్లధనం ఐదువేల చోట్ల కేంద్రీకృతమై ఉన్నదని ప్రాథమిక అంచనా. ఆ జాబితాలో పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రముఖంగా ఉన్నారు. ఏ రంగం వారినీ ఉపేక్షించకుండా నల్లకుబేరులందరినీ బోనులో నిలబెట్టాలి. భారీగా నగదును దాచుకునేందుకు ఆస్కారం కలిగించేలా ఉన్న రెండువేల రూపాయల నోట్లను కూడా రద్దు చేయాల్సిందే. కరెన్సీ చెలామణిలో చిన్ననోట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నోట్లరద్దుతో దేశానికి చాలావరకూ మేలు జరుగుతుండగా ప్రతిపక్ష నాయకులు ఊరేగింపుగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి- ‘పెద్దనోట్ల రద్దు దుర్మార్గం’ అని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి సంస్కరణలు చేపట్టినపుడు స్వాగతించిన వామపక్షాలు ఇపుడు ఎందుకు అల్లరిచేస్తున్నాయి? పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, దిల్లీ సిఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, సిపిఎం నేత ప్రకాష్ కారత్ వంటి విపక్ష నేతలు రాజకీయ కోణంలో విమర్శలు సంధిస్తున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వంటివారు మోదీ నిర్ణయాన్ని సమర్ధించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఒకచోట బస్తాలకొద్దీ పెద్దనోట్లు లభించగా, మరొకచోట పాతనోట్లను తగలబెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొందరైతే విమానం, రైల్వే టికెట్లను వెయ్యి రూపాయల నోట్లిచ్చి కొనుగోలు చేసుకున్నారు. అంటే- ఈ డబ్బును జాతీయ బ్యాంకుల్లో పౌరులు జమ చేయలేదని అర్థం. కర్ణాటకలో ఒక బడాబాబు తన అనుయాయులైన వందమందికి తలా లక్ష రూపాయలు ఇచ్చి తెల్లధనంగా మార్చుకోవాలని, ఆ తర్వాత మరలా ఆ డబ్బును తనకు తెచ్చి ఇవ్వాలని షరతు పెట్టినట్టు కూడా వార్త వచ్చింది. కొందరు నల్లకుబేరులైతే రద్దయిన నోట్లతో రాత్రికిరాత్రి భారీగా బంగారం కొనుగోలు చేశారు. ఇలా శతకోటి దరిద్రాలకు అవినీతి భారతదేశంలో అనంతకోటి ఉపాయాలు కనుక్కుంటున్నారు. ఇందుకు కారణం కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అని మాత్రమే భావించలేము. బడాబాబుల్లో నీతి నిజాయితీ కొడిగట్టినట్టే- సగటు మానవునిలో సౌశీల్యం, సౌజన్యం రెండూ కొరవడ్డాయి. జాతికి మేలు చేయడానికి బదులు- సంపన్నులు విసిరే నోట్ల ఉచ్చులో చిక్కుకున్న సామాన్యులూ ఉన్నారు.
పెద్దనోట్ల రద్దు ఫలితంగా భవిష్యత్‌లో తమ బతుకులు బాగుపడతాయని పేద, మధ్యతరగతి ప్రజలు ఆశావాదంతో కష్టాలను భరిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొందరు బడాబాబుల వద్ద గుట్టలు గుట్టలుగా కొత్త కరెన్సీ బయటపడుతోంది. అంటే నల్లధనంతో ఘరానా వ్యక్తులు రాజ్యాధికారం సంపాదించుకొని సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు. బాత్‌రూముల్లో, రహస్య లాకర్లలో బంగారం, వజ్రాలు, కరెన్సీ కట్టలు దాచుకుని కొందరు హాయిగా కాలక్షేపం చేస్తుండగా- అసంఘటిత కార్మికులు తిండి లేక మలమల మాడుతున్నారు.
పాకిస్తాన్‌పై జరిపిన ‘సర్జికల్ స్ట్రయిక్’తో సీమాంతర ఉగ్రవాదం అంతం కానట్లే, ఆర్థిక వ్యవస్థపై జరిపిన ‘సర్జికల్ స్ట్రయిక్’ వల్ల దేశంలో నల్లధనం సమస్య తీరిపోతుందని ఎవరూ భ్రమించటం లేదు. ఈ మాటను స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. కాకుంటే ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పేందుకు ‘నోట్లరద్దు’ నిర్ణయం ఒక మంచి చర్య మాత్రమే. ఇలాంటి చర్యలు మరికొన్ని తీసుకోక తప్పదని జైట్లీ అనడంతో ఆ కొత్తచర్యలు ఏమిటి? అన్న చర్చ మొదలైంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇపుడు మరికొన్ని ధర్మసందేహాలు బయలుదేరాయి. దేశంలో ఉన్న 14 లక్షల కోట్ల రూపాయల నల్లధనంలో పాకిస్తాన్, చైనా నుంచి వచ్చిన నకిలీ నోట్లు కూడా కలిసిపోయాయి కదా? నల్లధనంలో అసలైన నోట్లు ఎన్ని? నల్లకుబేరులు దాచుకున్న వంద రూపాయల కట్టల మాటేమిటి?. ఈ లెక్కన ఇకముందు వంద రూపాయల నోట్లను కూడా రద్దుచేస్తే ఇక మిగిలేది 10, 20 రూపాయల నోట్లే. నల్లధనం అనేది నోట్ల రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. హవాలా రూపంలో ఉండవచ్చు. ప్రపంచంలో ఎనిమిదవ వింత ఏమిటంటే- కమ్యూనిస్టులు నేడు నోట్లరద్దును వ్యతిరేకించడం. ఇదే కమ్యూనిస్టులు కాంగ్రెస్ హయాంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి నిర్ణయాలను సమర్థించి రాజకీయంగా లబ్ధి పొందారు. నోట్లరద్దు వల్ల వర్గ సమానభావన ఏర్పడి సమీకరణలు మారుతాయనేది కాలేజి విద్యార్థికి కూడా తెలిసిన సత్యం. మరి ఘనత వహించిన వామపక్ష సిద్ధాంతకర్తలకు ఎందుకు తెలియటం లేదు?
‘లోక్‌సభ అనగానేమి?’ అని టీచర్ ప్రశ్నించగా- ‘బాగా భోజనం చేసి.. అది అరిగేవరకూ పెద్దగా అరిచే చోటు’ అని ఓ విద్యార్థి జవాబిచ్చాడట! ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కానీ, అంతకుముందు చాలా ఏళ్లుగా ఇలాంటి సన్నివేశాలను ప్రజానీకం ‘దూరదర్శనీయం’గా చూచి తరించింది. పార్లమెంటు ఉభయ సభల్లో నల్లధనం గురించి ఎందుకంత పెద్దగా అరుస్తున్నారు? దీనివల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల జనంలో విశ్వాసం పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది.
మనువు నుండి బసవన్న వరకూ ‘శ్రమించకుండా భుజించకూడదు’ అని బోధించారు. ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన జపాన్ స్వయంకృషితో అభివృద్ధిలోకి వచ్చింది. ఈ పరిస్థితి ఇండియాలో లేదు. అవినీతి డబ్బును విదేశీ బ్యాంకుల్లో దాచుకోవటమే మన దేశంలో పెద్ద పరిశ్రమ. భూ సంస్కరణలు, బంగారంపై నియంత్రణ వంటి చర్యలు లేనందున సంపద కొందరికే పరిమితమై పోయింది. పారిశ్రామిక అభివృద్ధికి అడ్డుపడుతూ సమ్మెలు చేయించే అరాచక శక్తులపై చర్యలు లేకుండా జాతీయాభివృద్ధి సాధించటం ఎలా? ‘తెల్లనివన్నీ పాలుకావు..
నల్లనివన్నీ నీళ్లుకావు’ అన్నట్టు విపక్షాల, వామపక్షాల ఐక్యతా నినాదాలు పైకి కన్పడుతున్నంతగా వాస్తవంలో లేవు. రాష్టప్రతి భవన్‌కు ప్రతిపక్షాలు ఊరేగింపుగా వెళ్తే క్రెడిట్ అంతా మమతా బెనర్జీకి ఇవ్వటం ఇష్టం లేని పక్షాలు తప్పుకున్నాయి. నల్లధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నందున యుపి సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2019 ఏప్రిల్ వరకు వాయిదావేస్తే ఎలా ఉంటుందో మోదీ ఆలోచించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. మన దేశంలో ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీచేసే వారు ఎంత భారీగా నల్లధనం ఖర్చు చేస్తారో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో చేసే ఖర్చు రాజ్యాంగ పరిధిలోకి రానిదని, ఎన్నికల కమిషన్ అజమాయిషీ కిందకు వస్తుందని మరో వాదం ఉండనే ఉంది. వాదాల సంగతి ఎలా ఉన్నా ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బుకు ఎకౌంట్లు సరిగ్గా ఉండవు. దీనిని ఎలా అరికట్టగలరు?

- ముదిగొండ శివప్రసాద్