మెయిన్ ఫీచర్

క్రిస్మస్ వేడుకలు ఇక్కడ అదుర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ నెల.. శీతాకాలంలో వచ్చే క్రిస్మస్ పండుగ క్రైస్తవ భక్తుల గుండెకు క్రీస్తు ప్రేమ సందేశం వెచ్చదనాన్ని తీసుకువస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా అనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే క్రిస్మస్‌కు మన దేశంలో చాలా ప్రదేశాలు ప్రసిద్ధి. వీటిలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాలలో క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకుంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

షిల్లాంగ్
చలికాలంలో సందర్శించే ప్రాంతాలలో షిల్లాంగ్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి కెథడ్రల్ చర్చి చాలా ప్రసిద్ధిచెందింది. ఈ చర్చిలో అర్ధరాత్రి జరిగే క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా ఉంటాయి. స్థానిక క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా టూరిస్ట్‌లు సైతం ఈ వేడుకలు తిలకించేందుకు వస్తుంటారు. వందేళ్లనాటి ‘్ఫర్’ అనే మహావృక్షం ఈ చర్చిలో ఉంది. ఈ చెట్టు కింద సమావేశమైన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని మతాధికారి వివరిస్తారు. ఈ చర్చిలోనే కాదు షిల్లాంగ్ అంతా క్రిస్మస్ చెట్లను అందంగా అలంకరిస్తారు. విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. క్రైస్తవ సోదరులు వెచ్చటి ఆలింగనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకునే దృశ్యాలు కనిపిస్తుంటాయి. షిల్లాంగ్‌లోనే కాకుండా తూర్పు భారతదేశంలో క్రిస్మస్‌ను కన్నుల పండువగా నిర్వహిస్తారు. సందర్శకులు ఈ ప్రాంతాలకు వచ్చి మధురానుభూతులను మూటగట్టుకుని వెళతారు.

కేరళ
క్రిస్టియన్ స్టేట్‌గా పిలువబడే కేరళలో ఈ పండుగ సమయంలో క్రైస్తవుల ఇళ్లల్లో ఆనందాల హరివిల్లే. సిరియా సంప్రదాయ పద్ధతులతో పాటు పశ్చిమ ప్రాంత ఆచారాలు, స్థానిక సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ పండుగ జరుపుకుంటారు. చిన్నారులు ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. ఇళ్లను ఫ్యాన్సీ క్రిస్మస్ ట్రీలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ గీతాలు వినిపిస్తుంటాయి. పండుగకు వచ్చిన అతిథులకు ఇంట్లో తయారుచేసిన వైన్‌ను అందిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంగా కర్ర పెండలంతో బిర్యానీ చేసి వడ్డిస్తారు. అలాగే మటన్, చికెన్ కూరలు, అప్పాలు, రోజ్ కుకీస్ వంటి పిండి వంటలు తయారుచేసుకుంటారు. స్నేహితులు, బంధువులు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి ఈ పండుగ వేళ ఆనందాలను పంచుకుంటారు.

పాండిచ్చేరి
ఈస్ట్‌కోస్ట్ ప్రాంతమైన పాండిచ్చేరిలో అత్యంత సుందరమైన, రమణీయమైన సందర్శనీయ ప్రాంతాలున్నాయి. మన దేశ చిన్న ఫ్రాన్స్‌గా పిలుచుకునే పాండిచ్చేరిలో క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహిస్తుంటారు. బాసిలికాకు చెందిన చర్చి ఇక్కడ ప్రముఖమైంది. యేసు జన్మించిన పవిత్రమైన ఈ రోజును క్రైస్తవులు సమూహంగా సమావేశమై ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.
అరోవిల్లి, ప్రొమెనాడే బీచ్ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, పర్యాటకులు సమావేశమై ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు.

గోవా
సముద్రతీర ప్రాంతమైన గోవా విందులు, వినోదాలకే కాదు ప్రయాణీకుల కు క్రిస్మస్ పండుగ వాతావరణాన్ని కలిగిస్తోంది. ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుక లు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రపం చ నలుమూలల నుంచి ఇక్కడకు కేవలం క్రిస్మస్ వేడుకలను కన్నులారా చూసేందుకూ, ఆ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తుంటారు. ప్రపంచంలో క్రిస్మస్ వేడుకలు జరిగే ప్రదేశాలలో గోవా సైతం ప్రత్యేకతను సంతరించుకుంది. అం దంగా ముస్తాబైన చర్చిల ఎదుటి వేలాది మంది క్రైస్తవులు సమా వేశ మవు తా రు. గోవా బీచ్‌లో ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో నడుచుకుంటూ వెళ్లవచ్చు. ఆకాశాన్నంటే వెలుగులు మిరుమిట్లు గొలుపుతుంటాయి. అందంగా ముస్తాబైన చర్చిలలో ప్రార్థనలు జరిపే క్రైస్తవ భక్తులతో కళకళలాడుతుంటాయి. పబ్‌లు, క్లబ్‌లన్నీ కూడా ప్రయాణీకులతో సందడిగా ఉంటాయి. సంగీతాన్ని ఆస్వాదిస్తూ బంధుమిత్రులు భోజనాలు చేస్తుంటారు.

ముంబయి
విభిన్న సంస్కృతులు, ఆచారాలకు కేంద్రమై దేశ ఆర్థిక నగరమైన ముంబయిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ అనేక చర్చిలు కొలువుదీరి ఉన్నాయి. అన్నింటికంటే బంద్రాలోని వౌంట్ మేరీస్ బసిల్లికా చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించటానికి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఆరోజు బింద్రా అంతా విద్యుత్ దీపాల వెలుగులు మెరిసిపోతుంటుంది. వేలాది మంది భక్తులు గుమిగూడతారు. రహదారులకు ఇరువైపుల దీపాలతో అలంకరించిన క్రిస్మస్ ట్రీలు దర్శనమిస్తుంటాయి. చాలా మంది పర్యాటకులు ముంబయిని డిసెంబర్‌లోనే ఎక్కువగా సందర్శిస్తుంటారు. మరింకెందుకు ఆలస్యం ఈ క్రిస్మస్ సెలవులను క్రీస్తు బోధించిన ప్రేమ, సహజీవనం అనే చల్లటి గాలులు వీచే ప్రదేశాలకు పయనమవ్వండి.