మెయిన్ ఫీచర్

విశ్వంభరుని విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వంలో ఎక్కడ విశేష వైభవము కన్నులకు గోచరించునో అది అంతయూ భగవద్విభూతియే. విశేష వైభవము లన్నియూ భగవద్విభూతులే అను విషయము మనకు అర్థమైన ఎడల ఆయా వస్తువులపై ఆరాధనాదృక్పథమే ఏర్పడును గాని అనురాగ దృక్పథము ఏర్పడదు. భగవదైశ్వర్యమే విభూతి. భగవద్విభవాతులన్నియు రామాయణ మహాభారత పురాణ గ్రంథాలలో అత్యంత వైభవంగా ఎంతో విశేషంగా తెలుపబడినవి. భగవానుని వ్యక్తరూపము లే విభూతులు. భగవద్విభూతులను లోకానికందించుట కొరకే వ్యాస భగవానుడు మహాభారతాన్ని లోకానికందించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన అంశచేతనే ఈ జగత్తు నంతటను తాను వ్యాపించి యున్నట్లు అర్జునునకు విశదపరచారు. సృష్టియంతయు భగవానుడు వ్యాపించియున్నారు. కాని అన్ని వస్తువులను అన్ని ప్రాణులను అన్ని రూపములను ఒకేసారి చూడలేదు కదా. ఆ సదవకాశము తనకు కలిగించుమని అర్జునుడు పరమాత్ముని వేడుకుంటాడు. తన విశ్వరూపమును సందర్శించుయోగ్యత అర్జునుని కున్నదని వాసుదేవుడు ప్రసన్నతతో ఆ అవకాశాన్ని పార్థునకు కలిగించెను. భగవానుని దర్శించుట యనగా భగవంతుని కేవలం నేత్రముల ద్వారానే దర్శించుట అని అర్థం. అపరిమితుడైన భగవంతుడు పరిమితమైన నేత్రములతో చూచే అవకాశము లేదు. ఆ అనంతుని గాంచే నేత్రములు కూడా అనంతమయ్యే యుండాలి. ఆ అనంతమైన నేత్రమే అద్భుతనేత్రము ఒక విధంగా చెప్పాలంటే అది జ్ఞాన నేత్రము. ఆ జ్ఞాన నేత్రాన్ని గోవిందుడు అర్జుననకు అనుగ్రహించి దాని ద్వారా తన విశ్వరూపమును సందర్శింపచేసేను. సహజముగా మనం విశ్వములో ఎన్నో వస్తువులను దర్శిస్తుంటాము. కాని ఒక దాని తర్వాత వేరొక దానిని మాత్రమే చూస్తాము. ఒకేసారి అన్నింటిని దర్శించలేము. ఇది అసాధ్యము. వస్తు పరిచ్ఛేదమై తెలియవచ్చు వస్తువులు దేశ పరిచ్ఛేదముచే పరిమిత మై కాల పరిచ్ఛేదము వలన భేదమునుకలిగి యుండును. వస్తు వీక్షణముతో భేద దర్శన మునకు అలవాటు పడిన అంతఃకరణము అభేద స్వరూపమైన వస్తు రహిత చైతన్యమును దర్శించుదు. అందువలన వస్తురహిత చైతన్యమైన భగవానుని దర్శించుట సర్వవస్తువులను తత్త్వతః చైతన్యము నందే ఒక స్ఫూరితో దర్శించుట యని అర్థం. అది కాలాన్ని అధిగమించిన కమనీయస్థితి . అన్నింటిని అధిగమించిన దైవ స్థితి అది. అదియే విశ్వరూప సందర్శనము. భగవద్దర్శనము. ఇది ఒక అత్యంత అద్భుత దివ్య స్వరూపము. విశ్వములోని విశ్వనాథుని విశేష స్వరూపము. విశ్వముతో విడదీయుటకు వీలు లేనటువంటి పూర్ణత్వముతో నిండినది. ఈ పూర్ణత్వము నందు భాగములు లేనందున మనము కూడా ఆ పూర్ణత్వము నందే యున్నాము. ఇది అర్థమైన చో సర్వత్రా మనకు ప్రేమయే గోచరిస్తుంది. అదియే నిజమైన భక్తి తో పరిపూర్ణత. విశ్వరూప దర్శనము భగవానుడు ప్రదర్శించిన బాహ్య ప్రదర్శన వల్ల ఎంతమాత్రము కాదు అర్జునునితో కలిగిన నిత్య స్వరూపాను భూతియే విశ్వరూపము. విశ్వరూప సందర్శనము పూర్ణస్థితియని కూడా భావించరాదు. ఎందుకనగా విశ్వరూప సందర్శనముతో భగవానుని సందేశము పూర్తికాలేదు. విశ్వరూప సందర్శనము ఒక అద్భుత మహోన్నత ఆధ్యాత్మిక అనుభూతి. ఇంకొక విధముగా అతి ఘోరమైన అద్భుత ప్రదర్శనము. అందువలన అది చూచిన అర్జునుడు ‘‘దృష్టాహి త్వాం ప్రవ్యధితాన్త రాత్మా , దృతింభవిన్దామి శమంచ విష్ణో’’ అన్నాడు.
‘‘ఓ పరమాత్మా! అనంతమైన నీ రూపమును చూచి భీతిచెంది ధైర్యమును శాంతిని పొందలేక పోవుచున్నాను. నాయందు దయతో నీ ప్రసన్న రూపమును ప్రదర్శింపుమని దీనంగా వేడుకొంటాడు. ఫల్గునుని ప్రార్థన మన్నించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడగుతాడు.

- పెండెం శ్రీధర్