మెయన్ ఫీచర్

భరోసా లేని చోట.. బలిపశువు సామాన్యుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనాన్ని వెలికి తీయాలంటే ‘నోట్ల రద్దు’ను ఆయుధంగా వాడాలని ‘ది కర్స్ ఆఫ్ క్యాష్’ (్దళ షఖూఒళ యచి ష్ఘఒ్ద) అనే పుస్తకాన్ని రాసిన అమెరికా రచయిత కెనె్నత్ రోగఫ్ (ళశశళఆ్ద గ్యయఛిచి) కూడా మన ప్రధాని మోదీ తీసుకున్న చర్యల్ని తప్పుపట్టాడు. ఓ క్రమపద్ధతిలో చేపట్టాల్సిన చర్యల్ని ఒకే మంత్రదండంతో సాధించాలనుకోవడం పిచ్చి చేష్టలుగా ఆయన అభివర్ణించడం గమనించాలి. అమర్త్య సేన్ లాంటి ఆర్థికవేత్తలు కూడా మోదీ చేపట్టిన ‘నోట్లరద్దు’ సత్ఫలితాల్ని ఇవ్వదని వ్యాఖ్యానిస్తే, మోదీకి విధేయుడైన జగదీష్ భగవతి ఈ చర్యను సమర్ధించడం గమనార్హం. పెద్దనోట్ల రద్దు తర్వాత గత ఆరు వారాలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, దేశంలో దొంగలు పడడం కాదు, దేశం నిండా దొంగలే అని తేలిపోయింది. రోజువారి అవసరాలకై సామాన్యుడు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతుంటే, కోట్లల్లో కొత్త నోట్లు చేరాల్సిన వారికి చేరుతూనే వున్నాయి. నోట్ల ముద్రణ కేంద్రాల నుంచే దొంగల గూటికి చేరిన చందంగా నోట్లు పక్కదారి పట్టడానికి ఆర్‌బిఐ అధికారులు సహా, బ్యాంకు సిబ్బంది, పోస్టల్ సిబ్బంది తమ చేతి వాటాన్ని చూపించారు. దీన్నిబట్టి ఈ దేశంలో ఆర్థిక లావాదేవీల్ని నడిపే సంస్థల నిజాయితీ ఎంతటిదో తెలుస్తున్నది. ఇంతకాలం ఎవరికి సేవలు చేసారో, పేదరికాన్ని ఎంతగా తగ్గించారో, బడుగువర్గాల్ని ఆర్థికంగా ఎంతగా ఎదిగించారో కూడా బయటపడింది. బడా కాంట్రాక్టర్లే కాదు, ప్రభుత్వ పాలనలో ప్రధాన పాత్రను పోషించే పెద్ద తలకాయలే ప్రధాన దోపిడీదారులుగా బయటపడుతూంటే, వీరికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రాజకీయ పార్టీల, నాయకుల ముసుగు తొలిగితే, ఇంకా ఎలాంటి వార్తల్ని మనం వినాల్సి వస్తుందో తెలియదు.
నిజానికి కార్పొరేట్ పెద్దల, పారిశ్రామిక వేత్తల బండారం అసలు బయటనే పడలేదు. రానున్నవన్నీ మంచి రోజులే అంటున్న మోదీ , ఏ వర్గానికి మంచి రోజులో చెప్పలేని స్థితి! ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే- సామాన్యుడి బతుకు ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు’గా వుంటున్నది. పులుల వేటలో జింకల్ని బలి చేసినట్లు, అక్రమార్జన పరుల, దేశ సంపదల్ని కొల్లగొట్టే వారి వేట నెపంతో రెక్కల్నే పెట్టుబడిగా నమ్ముకున్న సామాన్యులనే త్యాగాలు చేయాలనడం, కష్టాల్ని భరించాలనడం.. చేయని నేరానికి శిక్షలు వేయడం లాంటిదే! ఎంత మంది నేరస్తులు తప్పించుకున్నా, ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదనే న్యాయసూత్రం ఈ దేశంలో ఎప్పుడూ ఆచరించబడడం లేదు. ఎల్లకాలాల్లో అతి సామాన్యుడే శిక్షల్ని అనుభవిస్తూ వున్నాడు.
పైగా రోజుకో ప్రకటననిస్తూ, బంగారంపై కూడా నియంత్రణ విధిస్తామనే ప్రచారం ప్రజల్లో మరింతగా భయాన్ని కలిగిస్తోంది. మోదీ తప్పుడు చర్యలు- జనాలను కనీసం నిరసన తెలపలేని స్థితిలోకి నెట్టివేశాయి. మొన్నటికి మొన్న వెనిజులా దేశంలో నోట్లరద్దు వ్యవహారం ఆ దేశాధ్యక్షునికి నెత్తిన బొబ్బ కట్టించాయి. ఇదే స్థితి ఈ దేశంలో జరిగి వుంటే, లక్షకు పైగాగల బ్యాంకు శాఖల్లో , రెండు లక్షలకు పైగాగల ఎటిఎంల్లో ఎన్ని బద్దలయ్యేనో తెలియదు. కాలికింద భూమి కదిలినా, చలించక ఓర్చుకునే తత్త్వం గల భారతీయులు తమకు జరిగిన దోపిడీ కూడా తమ కర్మనే అనుకుంటారు. ప్రజలకున్న ఈ భావజాలమే దేశ పాలకులకు రక్షణ కవచంలా పనిచేస్తున్నది. అందుకే విడుదలైన 220 కోట్ల విలువగల కొత్త 500, 2000 నోట్లలో ప్రజలకు చేరింది తక్కువ కాగా, బడాబాబుల దగ్గరకు చేరిందే వంద కోట్లు దాటడం గమనించాలి. డిసెంబర్ 19 నాటికి జరిగిన 677 దాడుల్లో 3,185 కోట్ల విలువగల గుప్త్ధనం బయటపడిందని, బయట పడాల్సింది ఇంకా వుందని, ఇప్పటికే 3,500 మందికి నోటీసులు జారీ చేసామని ఆదాయపు పన్నుశాఖ తెలపడాన్ని బట్టి, ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా కొనసాగుతున్నదో తెలుస్తున్నది. దీనంతటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటున్న మోదీ , ఇందులో వాజపాయి హయాం కూడా వుందని మర్చిపోతున్నారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్టు- విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించడం సాధ్యం కాదని, నోట్లరద్దు వ్యవహారాన్ని మోదీ ముందేసుకున్నట్లు కనపడుతున్నది.
ఏదైనా, ఓ కీలక నిర్ణయం వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతపరంగా, పార్టీ విధాన నిర్ణయంగా రూపొందాలి. దీన్ని ఆచరించగలిగిన బలమైన క్యాడరు వుండాలి. దానికి అనుగుణంగా పాలనా యంత్రాంగాన్ని ఎదిగించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ఆచరణలోకి తీసుకెళ్ళాలి. అప్పుడైనా పూర్తి ఫలితాలు రావు. అనుకున్నది సాధించడానికి సుదీర్ఘకాలం పడుతుంది. నోట్లరద్దుతో నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందని మోదీనో, విధిలేక మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లాంటి వారో అనుకుంటే సరిపోదు. ముందుగా బిజెపి కార్యకర్తలు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, వివిధ స్థాయిల్లోని రాజకీయ నాయకులు నిజాయితీగా ఎదగాలి. దీనికి ప్రజల ఆమోదం ఎలాగూ వుంటుంది కాబట్టి, పాలనా యంత్రాంగాన్ని, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లను ఎదిగించుకోవాలి. కాని ఇవేవి జరక్కుండానే, జరిగే సూచనలు లేకుండానే, నోట్లరద్దుతో ఉన్నఫళంగా ఏదో జరుగుతుందని భ్రమింపజేయడం ప్రభుత్వ ఆధిపత్య ధోరణికి నిదర్శనం. మోదీ పాలన మొదలుపెట్టిన 2014లోనే గాంధీ జయంతి రోజున ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. నాయకులకు, ప్రచారకర్తల ప్రకటనలకే పరిమితమైన ఈ నినాదం ఆచరణలో ఎలా వుందో ఏ మహానగరాన్ని చూసినా తెలుస్తుంది. క్యాష్‌లెస్ ఆవాస ప్రాంతాల్ని ప్రకటించినట్లే, చెత్తరహిత గ్రామాల్ని చాలా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రకటించాయి. నిజంగా చెత్త పోయిందా? పోతుందా అంటే పోదని నాయకులకూ తెలుసు. క్రమశిక్షణ లేని ఆలోచన- ఆచరణలో ఎప్పుడూ వైఫల్యమే చెందుతుంది. అలాగే నీటి లభ్యత గూర్చి, సరఫరా గూర్చి పట్టించుకోని స్థానిక ప్రభుత్వాలు, నూటికి నూరుశాతం మరుగుదొడ్ల పథకం అమలౌతున్నట్లు ప్రకటనల్ని గుప్పిస్తూనే వున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త వ్యవస్థలో ‘క్యాష్‌లెస్’ విధానం అమలు జరుగుతుందా? అంటే- నాయకుల మాటల్లో జరుగుతాయి కూడా. గుణాత్మకమైన విద్యను సాధించిన, అభివృద్ధి చెందిన దేశాలైన బెల్జియంలో 90 శాతంగా, ఆస్ట్రేలియాలో 86 శాతంగానే అమలుగా వున్న ఈ విధానం- బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డబ్బు జమచేసే ఫారాలను నింపలేని అశేష ప్రజానీకమున్న మన దేశంలో క్యాష్‌లెస్ విధానం ఎలా విజయం సాధిస్తుందో తెలియదు. బాగా చదువుకొని ఉద్యోగాలు వెలగబెట్టేవారే తమ ఉన్నతాధికారికి ఓ దరఖాస్తు రాయలేని అక్షరాస్యత మనది. కావాలంటే- ఏ పాఠశాలకు వెళ్లయినా కొందరు ఉపాధ్యాయులు రాసే సెలవు దరఖాస్తులను పరీక్షించుకోవచ్చు. మన చదువులకు గీటురాయి ఇంతకన్నా వేరే అక్కర్లేదేమో! ఇలాంటి స్థితిలో చేయాల్సిన వాటిని చేయకుండా, జరగాల్సిన వాటిని జరపకుండా, నోట్లరద్దును ‘క్యాష్‌లెస్’కు ప్రభుత్వం ఎందుకు లంకె పెడుతుందో అర్థం కాని ప్రశ్న కాదు. రోగాన్ని అంటువ్యాధిలా వ్యాప్తిచేసే గుణమొకటి కార్పొరేట్ ప్రపంచానికి వుంటుంది. వారి ఉత్పత్తుల్ని అవసరం లేకున్నా జనాలు ఉపయోగించేలా చేసి సొమ్ము చేసుకోవడం వాటికి తెలిసిన అమోఘమైన విద్య ఇది. వీటికి ప్రచారం చేయడమే భారత్ లాంటి దేశాల్లో కొందరు నేతల పని. ఇప్పుడు మోదీ చేస్తున్నది, చేయాలనుకుంటున్నది కూడా ఇదే!
ఇప్పటికే ఏటిఎం వినియోగం 80 శాతానికి పైగా తెలియని జనం వున్న దేశంలో గీకుడు (డతీజఔళ) యంత్రాలు ఎంతమంది జనాలకు గోకుడును తగిలిస్తాయో తెలియదు. యంత్రాన్ని నియంత్రించే వ్యక్తి, కార్డును ఉపయోగించే వినియోగదారుడు ఏ చిన్న తప్పుచేసినా మోసం వేలు, లక్షలు దాటుతుంది. ఏటిఎం మిషన్లను వినియోగం లోకి తెచ్చినప్పుడు ఇలాంటి ఉపన్యాసాలే ఇచ్చారు. ఇప్పుడూ అదే తంతు. దీనికన్నా గతంలో వలే వస్తుమార్పిడి విధానం ఎన్నో రెట్లు మెరుగు. మోసానికి తావులేని ఈ విధానం 50 ఏళ్ల క్రితం వరకూ గ్రామగ్రామాన వుండేది. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఈ విధానం కొనసాగుతూనే వున్నది. నిజానికి భద్రతతో కూడుకున్న వ్యవస్థ ఏర్పడాలి. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. కాని, బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న ప్రభుత్వం విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి, ప్రభుత్వ సేవారంగాన్ని పూర్తిగా అవినీతి మయంగా మార్చి, ప్రజలు మాత్రం అందమైన కలల్ని కనాలని ఉద్భోదించడం నేలవిడిచిన సాము కాదా?
లాభాలతో నడుస్తున్నా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతూ, వేలాది మంది కార్మికుల్ని వీధిపాలు చేస్తున్న ప్రభుత్వాలు సేవారంగాల్ని కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో ప్రజలు తమ భద్రతని తామే చూసుకోవడం సహజం. ఇది పొదుపు రూపంలో కావచ్చు, స్థిర, చరాస్తుల రూపంలో కావచ్చు. కడుపును చంపుకొని పోగుచేసుకునే బడుగుజీవుల్ని, ధనమదాంధులతో, అక్రమ వ్యాపారులతో పోటీకి నిలబెట్టడం ఎలాంటి ప్రజాస్వామ్యమో తెలియదు. భూసంస్కరణల్ని పట్టించుకోకుండా, ప్రభుత్వరంగ సంస్థల్ని సక్రమంగా నడపకుండా, సేవారంగాల్ని జవాబుదారీగా వుంచకుండా, అక్రమ ఆస్తుల బదలాయింపుపై నియంత్రణ పెట్టకుండా ఏదో నియంత్రిస్తాననడం జనాల్ని మరికొంతకాలం మోసగించడమే అవుతుంది. నోట్లరద్దుతో ధరలు తగ్గుతాయన్న మాట పెట్రోలుపై ధరల వడ్డనతో తేలిపోగా, టమాటాల ధర పడిపోవడంలో మాత్రం నిజమైంది మరి! ఇదే మోదీ మార్కు సంస్కరణ అన్నమాట. *

- జి.లచ్చయ్య సెల్: 94401 16162