మెయిన్ ఫీచర్

అతడొక శాంతి సముద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్ఞానాంధకారంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న వారికి జ్ఞానజ్యోతిని చూపిన కరుణాంతరంగుడు శ్రీరమణుడు. ‘రమణ’లోనే ‘మరణ’మున్నదని జనన మరణ చక్రములనుండి తప్పించడానికి తరలివచ్చిన పరమదయానిధి శ్రీరమణుడు.
తన్నుదా తెలుసుకోడానికి ఆత్మవిచారణ మార్గమును జూపి అవ్యయానంద పదవికి చేర్పవిచ్చేసిన గురుమూర్తి శ్రీరమణుడు.
శ్రీరమణ భగవాన్ అచలమైన అద్వైతి. విలక్షణమూర్తి. ఏ ఇతర మార్గాలను ఖండించలేదు. భగవద్గీతలో చెప్పిన జ్ఞాన, భక్తి, కర్మయోగాలను శ్రీరమణులలో చూడవచ్చును. వారు మహామనీషి. వారి కరుణకు ఎల్లలు లేవు. శ్రీరమణులు నిరుపమానులు. జీవితం నిరుపమానం. ఆతని ఉపదేశం నిరుపమానం. రాజాధిరాజుల నుంచి, సామాన్యులవరకు వారిని దర్శించి తరించారు.
వెంకట్రామన్ అరుణాచలంలో బ్రాహ్మణస్వామిగా పిలువబడుతున్నవానిని గణపతి ముని దర్శించి తన తప్ఫఃలితంగా స్వామిలో భగవానునే సాక్షాత్కరింపజేసుకున్నారు. నాటినుంచి బ్రాహ్మణస్వామి భగవాన్ శ్రీరమణ మహర్షిగా ఆసేతు హిమాచలం ఆతని తేజస్సు నలుదిక్కులా ప్రసరించింది. పాల్ బ్రింటన్ యూదుడు. ఆంగ్లంలో గొప్పశైలి కలిగిన రచయిత. దేవుడికోసం తహతహలాడుతూ, మత గ్రంథాలన్నిటినీ ఔపోసన పట్టాడు. మత గురువులందర్నీ కలిసాడు.అష్టాంగయోగాలను అభ్యసించాడు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి హైందవ మతంలో తన ఆకాంక్ష నెరవేరుతుందనీ భారతదేశం వచ్చాడు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరానందస్వామి వారిని కలిశాడు. బ్రింటన్ ఆక్రోశాన్నీ, అభిలాషనీ గమనించిన స్వామివారు ‘‘మీరు తిరువణ్ణామలైలోని శ్రీరమణ భగవాన్‌ని దర్శించండి. మీ వాంఛ నెరవేరుతుందని’’ మార్గదర్శనం చేశారు.
బ్రింటన్ అరణాచలంలో శ్రీ్భగవాన్‌ని దర్శనం చేసుకున్నాడు. రోజుల తరబడి వస్తూ పోతున్నాడు. ఒకనాడు భగవాన్ తదేకదీక్షతో బ్రింటన్ కళ్ళలోకి చూశారు. వారి శక్తిప్రసారానికి బ్రింటన్ కళ్ళు మూసుకుపోయి సంచలనం సృష్టించింది. మనోవృత్తుల ఉద్వేగం అణగింది. ఏకాత్మ భావాన్ని అనుభవించాడు. అతనిలో సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. ఒళ్ఘూష్ద జశ ఒళషూళఆ నిశజూజ్ఘ (నిగూఢ భారతావనిలో సత్యానే్వషణ) అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. భగవాన్ అంతర్గత శక్తులను చాలా గొప్పగా, మహర్షి ప్రశాంత గాంభీర్యాన్నీ వర్ణించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రంథం ప్రాచుర్యం పొంది వేలాదిగా విదేశీయులను అరుణాచలం ఆకర్షించింది.
ఇలా దేశీయులకు కావ్యకంఠ గణపతిముని, విదేశీయులకు బ్రింటన్ కారణంగా అరుణాచలం, భగవాన్ శ్రీరమణ మహర్షి చేరువయ్యారు. అరుణాచలం, శ్రీరమణాశ్రమం ఒక తీర్థక్షేత్రమే అయింది. అనునిత్యం శ్రీరమణాశ్రమం మాన్యులనుంచి సామాన్యుల వరకు వస్తూ శ్రీరమణ దర్శనం చేసుకుంటూ తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు.
అలా దర్శించుకున్న కొందరి అనుభవాలను తెలుసుకుందాం.
అతడు తమిళుడు. వృత్తిరీత్యా డాక్టర్. మలయాలో ఉద్యోగం. ఎంతో భగవత్ చింతన కలవాడు. ఉద్యోగాన్ని విడిచి స్వదేశం వచ్చాడు. భగవాన్‌ను సందర్శించాడు. జీవితమే మారిపోయింది. ఋషీకేశ్‌లో శ్రీ విశ్వానందస్వాముల వద్ద సన్యాసం స్వీకరించి శ్రీ శివానంద భారతిగా సన్యాసనామం పొంది ళ్పజశళ జజచిళ డ్యషజళఆక నీ, క్యూఘ ళజ్ఘూశఆ్ఘ యూళఒఆ శ్రీశజ్పళూఒజఆక నీ ఋషీకేశ్‌లో స్థాఫించి భగవాన్ పరిపూర్ణావతారాన్ని తమ రచనల్లో వ్యక్తంచేశారు ఆయనే స్వామి శివానంద.
కేరళలో నారాయణ జన్మించారు.దళితుడు పిన్ననాటనే ఆత్మదర్శనం చేసుకున్నవాడు నారాయణ. సంఘసేవా పరాయణుడేగాక, ఆధ్యాత్మిక శిఖరాలు అందుకున్నవాడు. నారాయణ ఏ ఒక్క మహాత్ముణ్ణీ దర్శించలేద- ఒక్క శ్రీరమణులను తప్ప. వారిరువురూ కలుసుకున్నప్పుడు వౌనంగా ఏం మాట్లాడుకున్నారో ఏమో! భగవాన్‌ను స్తుతిస్తూ సంస్కృతంలో శ్లోకాలు రచించి భగవాన్‌కు సమర్పించి సెలవు తీసుకున్నాడు. ‘నారాయణగురు’గా కీర్తి గడించాడు.
బాలకృష్ణమీనన్ కేరళ వాసి. రమణాశ్రమానికి వెళ్ళి భగవాన్‌ను దర్శించారు. మహర్షి మీనన్ వంక ఒక్క క్షణంపాటు చూసారు.ఆ చూపుతో మీనన్‌లో చైతన్యం ప్రసరించింది. ఈ సంగతి మీనన్ తానే స్వయంగా వెల్లడించారు. హిమాలయాల్లో తపోవన్ మహారాజ్‌వద్ద సన్యాస దీక్షను స్వీకరించి స్వామి చిన్మయానందగా సన్యాస నామం పొందారు. హిమాలయాల్లో తపస్సు చేసి చిన్మయ కేంద్రాన్ని స్థాపించారు. సాందీపని ముని పేర బొంబాయి (ముంబై)లో శ్రీ సాందీపనీ సాధనాలయాన్నీ ఆంధ్రలో కడప జిల్లాలో చిన్మయారణ్యం పేరున ఆశ్రమాన్ని నిర్మించడమేకాక, దేశ విదేశాల్లో చిన్మయామిషన్లను నెలకొల్పి వందలాదిగా గీతాజ్ఞానయజ్ఞాలను నిర్వహించారు. లెక్కకు మిక్కిలిగా భారతీయ తత్త్వంపై ఆంగ్లంలో పలు గ్రంథాలను రచించారు. విద్యాలయాలను నెలకొల్పారు.
మహాత్మాగాంధీ శ్రీరమణ మహర్షిని దర్శించాలనుకున్నారు. శాంతిభద్రతలకు ముప్పు కలుగుతుందని తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయినా ఆయనకు మహర్షిపై గల విశ్వాసం తక్కువేమీ కాదు. ఎవరైనా నిరాశా నిస్పృహలకు లోనైనవారు తనను కలిస్తే ‘‘ఒక్కసారి రమణాశ్రమం వెళ్ళి మహర్షిని దర్శించి బ్యాటరీని చార్జ్ చేసుకురండి’’ అని సలహా ఇచ్చేవారు.
శ్రీరమణ మహర్షిని సందర్శించిన వారిలో సాధూవాస్వానీ, శ్రీకృష్ణాశ్రమ వ్యవస్థాపకుడు దిలీప్‌కుమార్ రాయ్, జమునాలాల్ బజాజ్, భారత మాజీ రాష్టప్రతులు బాబూరాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్నగు వారెందరో జ్ఞానులు, మహాత్ములు ఉన్నారు. భగవాన్ శ్రీరమణ మహర్షిని దర్శించిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ రచయిత, అరవిందుల పట్ల అచంచల భక్తులు అయిన శ్రీ హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ- ‘‘మహోన్నత శక్తివంతమైన వ్యక్తిత్వం కలవాడు శ్రీ అరవిందుడు వ్యక్తిత్వం లేని మహోన్నత శక్తివంతుడు శ్రీరమణుడు’’ అన్నారు.
శ్రీ అరవిందులే శ్రీ రమణ మహర్షి గురించి చెబుతూ హళ జఒ ఘ ఔజశషళ యచి -ళ్ఘషళ (రమణుడొక శాంతి సముద్రం) అని వర్ణించారు.
చార్విక్ మరొక ఆంగ్లేయుడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మేజర్‌గా పనిచేస్తున్నప్పుడు మారణహోమాన్ని చవిచూసాడు. దుఃఖించాడు. యుద్ధం ముగిసింది. వైరాగ్యం ఆవహించింది. ‘‘చావు పుట్టుకల మధ్య ఈ మూన్నాళ్ళ ముచ్చట ఏమిటి? ఈ బ్రతుక్కు అర్థమేమిటి?’’ సమాధానం దొరక్క భగవాన్ సన్నిధిని చేరాడు. శరణాగతి చెందాడు. రమణానుగ్రహం పొం దేడు. ‘‘సాధుఅరుణాచల’’ అని పేరు మార్చుకుని శ్రీరమణాశ్రమంలోనే ఉండిపోయేడు. అతణ్ణి గురించి మహర్షి ‘‘చార్విక్ మనవాడే. కారణాంతరం చేత పశ్చిమ దేశంలో పుట్టాడు’’ అన్నారు శ్రీ భగవాన్. భూత భవిష్యద్వర్తమానాలు రమణ మహర్షికి కరతలామలకం. భగవతాంశ సంభూతులు కదా!
ఇలా ఎందరెందరివో ప్రత్యక్ష పరోక్ష అనుభూతులు చెప్పుకుంటే పెద్ద గ్రంథమే అవుతుందు. ఇక శ్రీమహర్షులు హాస్యపల్లవి, చమత్కారాలు, మహత్తులు చెప్పుకోవాలంటే ఇక్కడ సాధ్యంకాదు. అవకాశముంటే వాటి గురించి మరోసారి.

- ఎ.సీతారామారావు