మెయిన్ ఫీచర్

ముందంతా.. జాతరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటిలాగే -సినిమా డైరీలో ఏడాది మారింది. కొత్త ఏడాదిలో కొత్త సినిమాలకు తెలుగు హీరోలు కాల్షీట్లు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పెద్ద, చిన్నా దర్శకులు సైతం తమ ప్రాజెక్టుల్ని స్క్రీన్స్‌కు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది మాదిరిగానే -ఈ ఏడాదీ ఊపునిచ్చే సినిమాలు ఆడియన్స్‌ని
అలరించబోతున్నాయి. సహజంగానే -సంక్రాంతి సినిమా సీజన్ కనుక, సమరం అక్కడినుంచే ఆరంభమవుతోంది. కాకపోతే -‘అతి’కిపోయి దెబ్బతిన్న అనుభవాలు తెలుగు ఇండస్ట్రీలో చాలానే కనుక -ఫెస్టివల్ సినిమాలను ప్లాన్డ్‌గానే తెస్తున్నారు. ఇక గతంలో -సక్సెస్ రూట్‌లో పరుగులు పెట్టిన
సినిమాలకు సీక్వెల్సూ రెడీ అవుతున్నాయి. ఈ ఏడాదిలోనూ సీక్వెల్స్, రీమేకుల జాబితా పెద్దగానే
కనిపిస్తోంది. అలాగే -కొన్ని హిట్టు కాంబినేషన్లూ ఈ ఏడాది రిపీటయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఎలా చూసినా -గడచిన ఏడాదిలా ఈసారీ ప్రేక్షకులకు సినిమా జాతరేననడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి క్యాలెండర్ మారడానికి రెండు నెలల ముందునుంచే -సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రకటించుకున్న సినిమాలతోపాటు, అటూ ఇటూగావున్న సినిమాలూ సంక్రాంతి బరిలో నిలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు సినిమా బలాన్ని నలుగురికీ చెప్పుకునేలా -్భరీ బడ్జెట్ సినిమాలూ రాబోతున్నాయి.
సంక్రాంతి హంగామా
బాస్ ఈజ్ బ్యాక్ -ఇదీ గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమలో వినిపిస్తున్న నినాదం. మాస్ హీరో చిరంజీవి మళ్లీ స్క్రీన్స్‌కు వస్తున్నాడన్నది సారాంశం. రాజకీయాల నుంచి ‘రైట్’ టర్న్ తీసుకుని ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత ఫ్యాన్స్ కోసం చిరంజీవి వేస్తున్న వన్ ఫిఫ్టీయెత్ స్టెప్. సో.. -కథ నుంచి కో-ఆర్టిస్టుల వరకూ కేర్ పేరిట కేక పుట్టించాడు మెగాస్టార్. చిరు అట్ ది రేట్ ఆఫ్ 150ని ఎవరు డీల్ చేయబోతున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు జాబితాలు మారిపోతూ వచ్చాయి. చిట్టచివరకు వినాయక్ చేతికి ఆ చాన్స్ దక్కింది. తమిళ రీమేక్ ‘కత్తి’ని ఓకే చెయ్యడం, ఆచితూచి మొదలెట్టిన సినిమా ఆఘమేగాలమీద పూర్తి చేయడం జరిగిపోయింది. చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘ఖైదీ’ గుర్తుకొచ్చేలా.. చిరు పూర్తి చేసిన సినిమాల రికార్డు నెంబర్‌కు సరిపోయేలా.. -సెకెండ్ ఇన్నింగ్స్ స్టామినా చూపించనున్న చిత్రానికి ‘ఖైదీ నెం 150’ టైటిల్ పెట్టారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 150వ మెగా సినిమా ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతోంది. ఇక సంక్రాంతి సినిమా ఫైట్‌లో మరో సీనియర్ హీరో బాలకృష్ణ చిత్రాన్నీ ప్రకటించారు. 100వ సినిమా రికార్డుతో బరిలోకి దిగుతున్న బాలకృష్ణ -‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా కనిపించనున్నాడు. దర్శకుడు క్రిష్ కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన బాలకృష్ణ -ఈ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ గత ఏప్రిల్‌లోనే సినిమా మొదలెట్టారు. ఎపిక్ కనుక సంప్రదాయబద్ధమైన సంక్రాంతిని టార్గెట్ చేస్తూ అనుకున్న సమయానికే సినిమా తెస్తున్నారు. నిజానికి ‘గమ్యం’, ‘వేదం’తో తానేంటో నిరూపించుకున్న క్రిష్ -తరువాత చేసిన సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. 2015లో ‘కంచె’ను చూపించి ఆడియన్స్‌తో మళ్లీ ఓకే అనిపించుకున్న క్రిష్ -‘శాతకర్ణి’ తన కెరీర్‌లో మైల్‌స్టోన్ కాబోతోందని మెగాఫోన్ గుద్దిమరీ చెప్తున్నాడు. ట్రైలర్‌తోనే ఆసక్తిని టాప్‌కు తీసుకెళ్లిన క్రిష్ -సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తాడన్న అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటు చిరు, అటు బాలయ్య ఒకేరోజు స్క్రీన్స్‌ని టచ్ చేస్తారని నిన్నటి వరకూ ఉత్కంఠ రేకెత్తినా, చివరిక్షణంలో ఒకరోజు అటూ ఇటుగా చిత్రాలు విడుదలవుతున్నాయి. జనవరి 11న ‘ఖైదీ నెం 150’ థియేటర్లకు వస్తుంటే, ఒకరోజు వెనుకగా జనవరి 12న ‘శాతకర్ణి’ విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలతో పోటీ పడేందుకు కుర్ర హీరో శర్వానంద్ సైతం ‘సంప్రదాయ’ పోరుకు సై అన్నాడు. గత ఏడాది సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’గా వచ్చి హిట్టు మార్కు అందుకున్న శర్వా -ఈ ఏడాది ఆ ట్రేడ్ మార్క్ నిలుపుకోవాలని ఆరాటపడుతున్నాడు. హిట్టును రిపీట్ చేసే యోచనతో సినిమా కోసం కసిగా కష్టపడ్డానని చెబుతున్న శర్వాకు -‘శతమానం భవతి’ ఎలాంటి టానిక్కునిస్తుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా రప్పించుకోవాలో దిల్ రాజుకు బాగా తెలిసిన విద్య కనుక -ఈవారం నుంచే శతమానం భవతి ప్రమోషన్స్‌కు స్పెషల్ ట్రాక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తన బ్యానర్‌లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ తరహా మంచి సినిమా అంటున్న దిల్‌రాజు -తాతా మనవళ్ల అనుబంధాన్ని రుచి చూపించడంలో సక్సెస్ అయ్యామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే, పెద్ద పండక్కి బరిలో నిలిచే చిత్రాలు ఈ మూడే. మిగిలినవి సంక్రాంతి తరువాతే సందడి చేయనున్నాయి. కొత్త ఏడాది తొలి మాసం చివరి వారంలో స్క్రీన్స్‌కు వచ్చేందుకు వెంకటేష్ సిద్ధమవుతున్నాడు. బాక్సింగ్ ‘గురు’గా తనదైన స్టయిల్ చూపించేందుకు వెంకటేష్ గట్టి ప్రయత్నాలే చేశాడు. సంక్రాంతి టార్గెట్‌తోనే సినిమా షూటింగ్ పూర్తి చేసేసినా -సాంకేతిక కారణాల వల్ల విడుదలను వెనక్కి జరిపారు. జనవరి 26నే సూర్య ఎస్ 3 థియేటర్లకు వస్తుంటే, ఫిబ్రవరి 10న నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదల కాబోతోంది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ బడ్జెట్ మూవీ శంకర్ దర్శకత్వంలో రానున్న ‘2.0’ కూడా కొత్త ఏడాది ప్రథమంలోనే స్క్రీన్స్‌కు వచ్చే అవకాశం ఉంది. మరోపక్క రాజవౌళి కాంపౌండ్ నుంచి సీక్వెల్ పార్ట్ ‘బాహుబలి -ది కన్‌క్లూజన్’ ఏప్రిల్ 28న థియేటర్లకు రాబోతోంది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న ‘బాహుబలి’ ముగింపు పార్టు చూడ్డానికి దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో సంధించిన ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు ఉంటాయని ఊరిస్తూ వచ్చినప్పటికీ, ప్రాజెక్టు ఆలస్యం కావడంతో ఆ ఉత్కంఠ క్రమంగా చల్లబడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే, ఆసక్తి ఆవిరికాకముందే చిత్రాన్ని స్క్రీన్స్‌కు తెచ్చేందుకు ‘బాహుబలి’ వ్యూహాత్మక కాంపెయిన్ మొదలుకాబోతోంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు -మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా మార్చిలో ఉండే అవకాశాలు లేకపోలేదు. ఒకపక్క మహేష్ భారీ బడ్జెట్ చిత్రం, మరోపక్క గజని, ఠాగూర్, తుపాకీ, కత్తిలాంటి సూపర్‌హిట్‌లు ఇచ్చిన మురుగదాస్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది.
రిపీట్ కాంబినేషన్స్...
ఇక కొత్త ఏడాది సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ కాంబినేషనే్స రిపీట్ కానున్నాయి. ప్రాజెక్టుకు హైప్ రావాలంటే, సక్సెస్‌ఫుల్ క్రేజీ కాంబినేషనే్స బెటరన్న ఆలోచన పరిశ్రమలో ఉంది. హిట్టిచ్చిన దర్శకుడితో మళ్ళీ సినిమా చేయడానికి హీరోలు ఎక్కువ ఆసక్తి చూపించడం మామూలే. ఈ లిస్ట్‌లో ఫస్ట్ స్టెప్ తీసుకున్నది మెగాస్టార్ చిరంజీవి. ఠాగూర్‌తో చిరు కెరీర్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చిన దర్శకుడు వివి వినాయక్. ఈ సినిమా చిరు కెరీర్‌లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాంటి దర్శకుడికి ఎనిమిదేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తోన్న చిత్రం కోసం చిరు ఒకే చెప్పాడు. ఠాగూర్ రేంజ్ హిట్‌పై ఆశతోనే వినాయక్‌తో కాంబినేషన్‌కు చిరు ఓకే చెప్పాడన్నది ఇండస్ట్రీ టాక్. హీరోలకు హైవోల్టేజ్ యాక్షన్ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో వినాయక్‌ది అందెవేసిన చెయ్యి. అందుకే ప్రస్తుతం చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా ఖైదీ నెం 150ని వినాయక్ చేతిలో పెట్టాడు. చిరంజీవిని పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడానికి వినాయక్ కసరత్తులు చేశాడని అంటున్నారు. చిరు మార్క్ డాన్సులు, ఫైట్ల విషయంలో కొత్తదనం చూపేందుకు ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం ఉంది. రిపీట్ కాంబినేషన్‌తో మళ్లీ వస్తున్న మరో హీరో -నాగార్జున. కె రాఘవేంద్రరావుతో కమర్షియల్ సినిమాలు చాలానే చేశాడు. ఈమధ్య ఎక్కువగా చేసిన భక్తి సినిమాలూ కమర్షియల్‌గా నిలదొక్కుకుని బాక్సాఫీస్‌వద్ద ఫలితాన్ని రాబట్టాయి. ఆధ్యాత్మిక కథను చూపిస్తూనే, కమర్షియల్ ఫార్ములాలోకి తీసుకెళ్లడం కె రాఘవేంద్రరావు స్టయిల్. అందుకే వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి చిత్రాలతో నాగార్జున, కె రాఘవేంద్రరావు చూపించిన హిట్టు రూటునే మళ్లీ -ఓం నమో వెంకటేశాయతో చూపించవచ్చన్న ఆసక్తి కనిపిస్తోంది. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథీరామ్ బాబా జీవిత చరిత్రగా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. హాథీరామ్ గెటప్‌తో మంచి మార్కులు వేయించుకున్నాడు నాగార్జున. హిందీ టీవీ సీరియల్ దేవుడు సౌరభ్ రాజ్ జైన్ వేంకటేశ్వరునిగా, భక్తురాలు కృష్ణమ్మ పాత్రలో అనుష్క అలరించబోతున్న చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్లకు రావొచ్చు. హిట్ కాంబినేషన్‌తో వస్తున్న మరో హీరో -పవన్‌కళ్యాణ్. ‘గోపాలా గోపాలా’తో పవన్‌కు ఊపునిచ్చాడు దర్శకుడు డాలి. పవన్ ఆహార్యాన్ని దృష్టిలో పెట్టుకుని -కమర్షియల్ కృష్ణపరమాత్మగా క్యారెక్టర్‌ను డిజైన్ చేసి ఆడియన్స్‌కు కనెక్ట్ చేయగలిగాడు డాలి. ‘సర్ధార్’తో పెద్ద దెబ్బ పడటంతో -తరువాతి ప్రాజెక్టు కోసం పవన్ ఆచితూచి డాలిని ఎంపిక చేసుకోక తప్పలేదు. కిషోర్ పార్థసాని అలియాస్ డాలి తొలుత సిద్ధార్థ్ హీరోగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. తరువాత సునీల్, నాగచైతన్యతో తడాఖా చేశాడు. తమిళ్ వేట్టైకి రీమేక్ మూవీగా తెరకెక్కిన ఆ సినిమా మంచి మార్కులే సంపాదించింది. తరువాత డైరెక్టర్ డాలికి పవర్‌స్టార్ నుంచి పిలుపొచ్చింది. హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ రీమేక్ బాధ్యత అప్పగించాడు పవన్. డాలి డైరెక్షన్ స్టామినా చూపించటమే కాదు, పవన్‌కు స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా. అందుకే తాజా ప్రాజెక్టు డాలితో రిపీట్ కాంబోకు ఓకే అన్నాడు పవన్. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీగా రూపొందే ‘కాటమరాయుడు’ ఇప్పటికే ఆసక్తి పెంచింది.
తమిళంలోనూ హిట్ కాంబోలు రిపీట్ కానున్నాయి. రజనీకాంత్ ‘రోబో’ సౌత్‌లో సృష్టించిన సక్సెస్ సునామీ అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్‌ను తెస్తున్నాడు దర్శకుడు శంకర్. రోబో ఫస్ట్‌పార్టును కంటిన్యూ చేస్తూ దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో సీక్వెల్ తెరకెక్కుతోంది. రజనీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన రోబో -కోలీవుడ్, టాలీవుడ్లో రికార్డుల మోత మోగించింది. 2.0గా వస్తున్న రోబో సీక్వెల్ కూడా గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కేదే. రిలీజ్‌కు సిద్ధవౌతున్న ‘2.0’ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనితనాన్ని చూపారని అంటున్నారు.
మాస్ డైరెక్టర్ హరితో కలిసి హీరో సూర్య ‘సింగం’ సీక్వెన్స్‌లు కంటిన్యూ చేస్తున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్ బాక్సాఫీసుల్ని షేక్ చేసిన ‘సింగం’ సిరీస్‌లో -అనుష్క అందాలు, సూర్య పవర్‌ఫుల్ యాక్టింగ్ ప్రధాన ఆకర్షణ అయ్యాయి. రెండు డిఫరెంట్ కథాంశాలతో వచ్చిన రెండు భాగాల్ని తలదనే్నలా మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు హరి. ఇందులోనూ కథానాయిక అనుష్కే. పార్ట్-3లో శ్రుతిహాసన్‌కూ చోటుదక్కింది. జనవరి 26 రిపబ్లిక్ డేన ఎస్-3గా రాబోతున్న సూర్య ప్రాజెక్టుపై తెలుగు, తమిళంలోనూ అంచనాలు పెరిగుతున్నాయి. సక్సెస్ కాంబినేషన్లు తమ ప్రతాపాన్ని చూపించి ఏమేరకు హిట్లు అందుకుంటాయో చూద్దాం.

-శ్రీనివాస్