ఎడిట్ పేజీ

విమర్శలు తప్ప విలువలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటీ చమత్కారం..? నల్లధనం వెలికితీతకు దేశవ్యాప్తంగా దాడులు జరుపుతుంటే రెండువేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా వెలికివస్తున్నాయి. అహమ్మదాబాద్‌లో మహేశ్ షా అరెస్టుతో దేశ ఆర్థికరంగంలో మరో అధ్యాయం మొదలైంది. ఆయన తనవద్ద ఉన్న నల్లధనం 13,700 కోట్లు అని వెల్లడించి నాటకీయ ఫక్కీలో జైలుకు వెళ్లాడు. నిజానికి ఒక్క గుజరాత్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మరెందరో మహేశ్ షాలు ఉన్నారు. ఇలాంటి వారి ఆర్థిక సహకారం పాలకులకు అవసరమే. అయినా, నల్లకుబేరులపై మోదీ యుద్ధం ప్రకటించడంతో గుజరాత్‌లోని వ్యాపారవర్గాలు బిజెపిపై ఆగ్రహాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. దీన్ని ఓ సువర్ణావకాశంగా భావించి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, మిగతా విపక్షాలు కూడా మోదీ నిర్ణయాన్ని ప్రశంసించడానికి బదులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. తన ‘నలుపు’ను తాను తెలుసుకోని గురివింద గింజ మాదిరి నేడు విపక్ష నాయకులు వారి అక్రమాలను, అవినీతి కలాపాలను అంగీకరించడానికి బదులు మోదీపై విద్వేషం కక్కుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా నుండి పార్టీ నాయకత్వం రాహుల్‌కు పూర్తిస్థాయిలో సంక్రమించింది. సోనియా పరివారం ఆర్థిక నేరాల నుండి తప్పించుకోగలదా? ఇక్కడ ‘పరివారం’ అంటే కేవలం సోనియా కుమారుడు, అల్లుడు అని అర్థం కాదు. ఆమెకు చాలా పెద్ద వందిమాగధ గణం ఉంది. వీరందరూ మహేశ్ షా లాంటి వాళ్లే. ఇంకా మిగతా విపక్ష పార్టీల్లోనూ ఇలాంటి పరివారాలకు లోటులేదు. వీరంతా తమ గతం మరచి ఇప్పుడు నీతిమంతుల్లా సూక్తులు వల్లిస్తున్నారు. ఐటి అధికారులు దేశంలోని ప్రతి ఇంటి మీదికి వచ్చి దాడులు చేయబోతున్నారని, స్ర్తిల మెడలోని మంగళసూత్రాలు గుంజుకొనిపోతారని, ఎక్కువగా బంగారం ఉంటే పట్టుకుపోతారని ప్రతిపక్షాలు దుర్మార్గపు ప్రచారం మొదలుపెట్టాయి. నిజానికి 125 కోట్ల మంది ప్రజలున్న ఇంత పెద్ద దేశంలో అన్ని దాడులు నిర్వహించటానికి తగినంత ఐటి సిబ్బంది లేదు కూడా.
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకున్న తర్వాత దేశ ఆర్థిక రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నల్లకుబేరులంతా ఇప్పుడు స్వచ్ఛందంగా తమ ఆస్తులను వెల్లడించి, తమ డబ్బును బ్యాంకులలో జమచేసి తీరాలి. నల్లధనం వెలికివస్తే బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది. ఉగ్రవాదులకు, మావోయిస్టులకు ఇకపై నిధులు అందే అవకాశం లేదు. మోదీ దెబ్బకు ఇకపై ఎన్నికల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసే వీలుండదు.
దారిద్య్రరేఖకు దిగువన యాభైశాతం మంది ప్రజలున్న మన దేశంలో 600 కోట్లు ఖర్చుచేసి ఓ నల్లకుబేరుడు తన కుమార్తె వివాహం చేయటం ‘అనైతికత’ కావచ్చు. కానీ, ఆ మొత్తం డబ్బుకు ఆయన పన్నుకట్టి ఉంటే ఈ ఖర్చుకు చట్టబద్ధత లభిస్తుంది. కాబట్టి ఎవరూ ఆక్షేపించే అవకాశం ఉండదు. అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, గోయంకాలు భారీగా వ్యాపారాలు చేసుకోవడాన్ని ఎవరూ కాదనరు. కాకుంటే వచ్చిన లాభాలకు ఎకౌంట్ లేకపోయినప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కొడుకు కార్తి ఏయే దేశాల్లో ఎనె్నన్ని ఖాతాలు తెరిచాడో వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మంత్రి హోదాలో తండ్రి నుంచి ఎలాంటి సహాయం లేకుండా కార్తి ఈ వ్యాపారాలు జరగటం అసాధ్యం.
గణాంకాల గారడీ...
తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు ఎగవేసినట్టు ఒప్పుకున్న ఆదాయపు పన్ను రూ. 16 కోట్లు. ఇసుక వ్యాపారి శేఖరరెడ్డి దాచిన డబ్బు 107 కోట్లు, నూరు కిలోల బంగారం. 2016 నవంబర్‌లో బ్యాంకులకు చేరిన నోట్లు 10 లక్షల కోట్లు, డిసెంబరులో చేరిన మొత్తం 4 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న నకిలీ కరెన్సీ 400 కోట్లు. టోల్‌ప్లాజాల వద్ద వసూళ్లు ఆపివేయటంతో వచ్చిన నష్టం 1.28వేల కోట్లు. జిడిపి 2 శాతం తగ్గుదల. డాలర్ మారకం విలువ 0.5 శాతం పెరుగుదల. ప్రస్తుత అన్నా డిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాంమోహన్‌రావు హవాలా వ్యాపారం జరిపినట్లు ఆరోపణ. ఇంతకూ ఆయన డైరీలో ఉన్న వ్యక్తుల పేర్లు ఎవరివి? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లోని ముసద్దిలాల్ నగల దుకాణంలో నవంబర్ 8న రాత్రి- పెద్దనోట్లను రద్దు చేసిన మరుక్షణంలోనే - సుమారు 5,200 మంది భారీగా బంగారం కొన్నట్లు బిల్లులు చూపించారన్నది అబద్ధం. ఎందుకంటే వారు చూపించిన ఫుటేజ్‌లు అక్షయ తృతీయనాటి పుటేజీలు, వారు చేసిన వ్యాపారం 370 కిలోల బంగారం, వజ్రాల అమ్మకానికి రద్దు నోట్లు తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ కొనుగోళ్లు చేసిన వ్యక్తులు హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలకు ఎక్కడి నుండి వచ్చారు. వీరి సంఖ్య ఎంత? హైదరాబాదులో నవంబరు 8వ తేదీ రాత్రి ముసద్దీలాల్ అనే బంగారం వ్యాపారికి 100కోట్ల పాత నోట్లు ఇచ్చి, 107 కిలోల బంగారం ఖరీదు చేసింది ఎవరు?
దేశవ్యాప్తంగా బిజెపి ఆఫీసులపై దాడులు చేసి నల్లధనం వెలికితీయండని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ డిమాండ్ చేయడం విడ్డూరం. చట్టానికి ఏ పార్టీ అయినా సమానమే. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. అరవై ఏళ్లుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో, నేతల ఇళ్లలో దాడులు చేస్తే ‘నల్ల’తాచుపాములు బయటకువస్తాయి. మోదీ సాహసోపేతంగా పెద్దనోట్లను రద్దు చేశాక ఇపుడు సామాన్యుడికి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, ప్రీ పెయిడ్ కార్డు, స్వైపింగ్ యంత్రం వంటి వాటికి అర్థాలు, ప్రయోజనాలు తెలిశాయి. ఇక్కడికి అదే పదివేలు. పెద్దనోట్ల రద్దు ప్రాథమిక చర్య మాత్రమేనని, ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నట్లు నీతి ఆయోగ్ అధ్యక్షుడు అరవింద పనగరియా వెల్లడించారు. దేశవ్యాప్తంగా 8 వేల మంది బ్యాంకు డిఫాల్టర్లు ఉన్నారు. ఇందులో విజయ్ మాల్యా వంటి పెద్దలున్నారు. ప్రస్తుతం పన్ను విధానంలో లొసుగులు ఉన్నాయని, స్టాంపు డ్యూటీ సరళతరం కావాలని, ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే వాతావరణం కల్పించాలని నీతి ఆయోగ్ అధికారులు చెబుతున్నారు. అంటే ఆదాయపు పన్ను సవరణ చట్టం వంటి మరిన్ని చర్యలు త్వరలో రాబోతున్నాయని అర్థం. ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసి ఆర్థిక లావాదేవీలకు వేలిముద్ర వేసే ఆర్థిక విధానం రాబోతున్నదని ఒక ఆర్థిక శాస్తవ్రేత్త విశే్లషించారు.
విదేశాల్లోని 80 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు. విదేశాలలో దాక్కున్న మాల్యా, లలిత్ మోడీలను వెనెక్కి రప్పించాలని కూడా వారు కొత్తగా డిమాండ్ చేస్తున్నారు. కానీ అదానీ, అంబానీ ప్రభృతులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రుణాల విలువ విలువ లక్షాఎనభైవేల కోట్లు. ఇంత మొత్తం ఎలా ఇచ్చారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పవలసిందే! కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఏలుబడిలో ఆర్థిక నేరగాళ్ల అక్రమాలకు లోటే లేదు.
మోదీపై నిత్యం నిప్పులు చెరిగే నాయకులు ఎంతటి ఘన చరితులో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి అధికారంలోకి వచ్చిన ఆయనే ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయాడు. తన మంత్రివర్గం నుండి నలుగురిని తానే తప్పించాడు. సగం మంది ఆప్ ఎంఎల్‌ఎల మీద రకరకాల కేసులున్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ ఇన్‌కంటాక్స్ చిక్కుల్లోనూ ఇరుక్కున్నాడు. విదేశాల నుండి వచ్చిన నిధులకు లెక్క చూపించలేదు. సెక్షన్-13ఎ కింద పార్టీకి వచ్చే విరాళాలను రద్దుచేస్తామని ఐటి శాఖ బెదిరించిన తర్వాత కేజ్రీవాల్ నిజం బయటపెట్టాడు. ఇక ‘ఆప్’ను నమ్మవద్దు అని అన్నా హజారే, కెజ్రీవాల్‌ను ఎవరూ ఇక నమ్మరని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇక, ఢిల్లీలోని కరోల్‌బాగ్ బ్యాంకులో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎకౌంట్‌లో 140.38 కోట్ల నల్లధనం జమచేయబడింది. ఆమె పార్టీ మొత్తం నల్లధనం మీదనే నడుస్తున్నది.
ఇలాంటి నేతలకు ప్రజలు ఎలాంటి శిక్షలు విధించాలి? దేశాన్ని బాగు చేయాలని, ఆర్థిక వ్యవస్థను సంస్కరించాలని ముందడుగు వేసిన ప్రధాని మోదీని విమర్శించే నేతలు తమ లోపాలను దాచుకుని ప్రజల వద్దకు ఎలా వెళతారు?

- ముదిగొండ శివప్రసాద్