మెయిన్ ఫీచర్

దూసుకుపోయే రాకెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం అంతరిక్ష విజ్ఞానంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భారతీయ శాస్తవ్రేత్తలు అంగారక గ్రహంపైకి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి తమ సత్తా చాటుకున్నారు. ఇలాంటి అద్భుతాల ఆవిష్కరణలో రాకెట్లు వలే దూసుకుపోయే అతివలు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆనాడు ఇస్రో విడుదల చేసిన ఫొటోల్లో పురుష శాస్తవ్రేత్తలతో పాటు మహిళలు కూడా కనిపించారు. పురుషాధిక్యమేలే అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు సైతం తామెవ్వరికి తీసుకుపోమంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగినవారు ఉన్నారు. వీరి విజ్ఞానం నేటి యువతరానకి ఆదర్శం..
**

పగలూ రాత్రి పనిచేశాం

నందిని హరినాథ్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్స్ మిషన్ ఆపరేషన్

ఆమె తల్లి మేథ్స్ టీచర్. తండ్రి ఇంజినీర్. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి టీవీలో సైన్స్ ప్రోగామ్స్ ఎక్కువగా చూసేది. తొలి దరఖాస్తు ఇస్రోకు చేసింది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం రావటం ఈ రంగంలోనే నిరంతర కృషి చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతుంది నందిని హరినాథ్. ప్రపంచమంతా ఇస్రో పరిజ్ఞానాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. మా ముందున్న పెద్ద సవాల్‌ను స్వీకరించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలనే సంకల్పంతో రోజుకు 10 గంటలకు పైగానే శ్రమించాం. ఒక్కొక్కసారి 12 నుంచి 14 గంటలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. పగలూ రాత్రి కష్టపడ్డాం. ఉదయమే స్పేస్ సెంటర్‌కు వచ్చేవాళ్లం. మరుసటి రోజూ మధ్యాహ్నాం వెళ్లి కొద్దిసేపు నిద్రపోయేవాళ్లం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఇంట్లో మా అమ్మాయిని ఉదయమే నాలుగింటికి నిద్రలేపి చదివించి స్పేస్ సెంటర్‌కు వచ్చేదాన్ని. ఆనాడు తాను పడిన కష్టానికి వృత్తి పరంగా మార్స్‌ను ప్రయోగించి గొప్ప విజయాన్ని సొంతం చేసుకోగా, మా అమ్మాయి వైద్యవిద్య అభ్యసిస్తుందని చెబుతారు. మార్స్ ఆకాశంలో ఉన్నా మేము మాత్రం భూమిపైనే ఉంటాం అని నందిని వినమ్రంగా చెబుతుంది.

సవాల్‌ను స్వీకరించాం

రీతు కరిదాల్, డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్, మార్స్ ఆర్బిటర్ మిషన్.

అందరి చిన్నారులకు కనిపించినట్లే ఆకాశంలోని చందమామ ఆ చిన్నారికి కూడా వింతగొల్పింది. ఒకరోజు పెద్దగా ఉంటుంది. కొన్ని రోజులకు తగ్గిపోతుందని ఆ చిన్నారి మనసు ఆలోచించింది. ఆ చందమామలో కనిపించే మచ్చలు ఎలా ఉంటాయో పెద్దయిన తరువాతైనా తెలుసుకోవాలని మనసులో శపథం చేసుకుంది. ఫిజిక్స్, మేథ్స్ విద్యార్థిగా రాణిస్తున్నప్పటికీ పేపర్లు, మ్యాగజైన్లలో అంతరిక్ష విజ్ఞానంపై వచ్చే క్లిప్పింగ్స్‌ని కత్తిరించి జాగ్రత్తగా దాచుకునేది. క్షుణ్ణంగా చదివేది. పోస్టుగ్రాడ్యూయేషన్ అవ్వగానే ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లయ్ చేసింది. నేనెందుకు స్పేస్ సైంటిస్ట్‌ను అవ్వకూడదు అని తనకు తాను ప్రశ్నించుకుంది. గట్టిగా ప్రయత్నించింది. విజయం సాధించింది. గత 18 ఏళ్ల నుంచి ఇస్రో చేపట్టిన ప్రాజెక్టులలో ఆమె కూడా భాగస్వామ్యురాలైంది. ఆమే కరిదాల్. అతి తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్ ఆపరేషన్ దిగ్విజయంగా నిర్వహించటంలో కరిదాల్ దాదాపు 18 నెలల పాటు శ్రమించింది. తమ ముందున్న పెద్ద సవాల్‌ను స్వీకరించి వీకెండ్స్ రోజుల్లోనూ శ్రమించామని, సమిష్టి కృషితోనే తక్కువ సమయంలో విజయ శిఖరాలను అందుకున్నామని మార్స్ మిషన్ ప్రయోగం సందర్భంగా ఆమె అనుభవాలను చెబుతూ అంటారు. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లయిన కిరిదాల్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త అందించిన ప్రోత్సాహంతో ఇస్రో విజయాల్లో పాలుపంచుకోగలుగుతున్నానని అంటారు. మార్స్ మిషన్ ప్రాజెక్టుకు ముందు ‘‘మగవారు మార్స్ నుంచి మహిళలు వీనస్ నుంచి అనేవారు.’’ కాని ఈ ప్రయోగంలో తాము పాలుపంచుకోవటంతో అంగారకం నుంచి అతివలు అని అంటున్నారని, భారతీయ మహిళగా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందుకోవటం గర్వంగా ఉందని అంటారు.

వివక్ష అనే మాటకు తావులేదు

అనురాధ, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇస్రో శాటిలైట్ సెంటర్

నీల్ ఆర్మెస్ట్రాంగ్ చందమామ మీదకు వెళ్లాడని చిన్నపుడు మా అమ్మానాన్న, టీచర్లు అంటే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఈ సందర్భంగా కన్నడంలో చిన్న కవిత కూడా రాశాను. ఇలా చిన్నప్పటి నుంచి అంతరిక్ష విజ్ఞానంపై ఏర్పరచుకున్న మక్కువ స్పేస్ సైంటిస్ట్‌ను చేసిందంటారు అనురాధ. ఇస్రోలో సీనియర్ అధికారిణి అయిన అనురాధ ఎంతోమంది యువ శాస్తవ్రేత్తలకు రోల్‌మోడల్‌గా ఉంది. సైన్స్‌తో మహిళకు విడదీయరాని అనుబంధం ఉందంటారు. ఇస్రోలో ఆమె 1982లో ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. ఆ బ్యాచ్‌లో ఆమెతో పాటు ఆరుగురు మహిళా ఇంజనీర్లు ఉండేవారు. ఇపుడు ఇస్రోలో 16,000మంది మహిళలు పనిచేస్తున్నారంటే ఇక్కడ వివక్ష అనే మాటకు తావులేదని అంటారు. ఇక్కడ పనిచేస్తున్నపుడు నేను మహిళను అనేది మర్చిపోతుంటాం. అమ్మాయిలు అంతరిక్ష విజ్ఞానంలో భాగస్వామ్యులవ్వటం చాలా సులభం అంటారు. కాబట్టి సన్నాహాలు చేసుకోమంటారు.

చిత్రం...నందిని హరినాథ్, రీతు కరిదాల్, అనురాధ