ఎడిట్ పేజీ

వైభోగం నేతలకు.. వైరాగ్యం ప్రజలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధుడు, అశోకుడు, గాంధీ, భగత్‌సింగ్, అల్లూరి, కొమురం భీమ్, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, పూలే, పెరియార్.. రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రొఫెట్.. వీరంతా ఎల్లప్పుడూ రాజకీయ నాయకులకు కవచ కుండలాలే! ఇలా రాసుకుంటూపోతే ఈ జాబితాకు అంతం లేదు. అవసరానికో, రాజకీయానికో, ఓట్లను రాబట్టుకోవడానికో వీరి పేర్లను వాడుకోని దినం లేదు. ఒకప్పుడు వీరంతా జాతీయ నాయకులు, దేశీయవాదులే. ఇప్పుడంతా తారుమారే! వీరంతా ఆయా కులాల, మతాలకు ప్రతీకలుగా మారిపోయారు. ఫలానా వ్యక్తి మన కులం వాడంటే, ఫ లానా నాయకుడు మా వర్గం వాడంటూ జయంతులు, వర్ధంతులు జరుపుతున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకే పరిమితంగా వున్న ఈ ‘మహానాయకుల ప్రస్తావన’ ఇప్పుడు బూరోక్రాట్లకు, అధికారులకు నిత్యపారాయణంగా మారింది. అధినాయకులు ఏది మాట్లాడితే, దేన్ని ప్రవచిస్తే అవే మాటల్ని జనాలపై, విద్యార్థులపై ప్రయోగించడం మామూలైపోయింది. మహావ్యక్తుల పుట్టుపూర్వోత్తరాలు, వారెంచుకున్న మార్గం, వారి జీవితాలు నేటి సమాజానికి ఎలా అన్వయించబడుతాయో వంటి వివరాలు కచ్చితంగా తెలిసిన వారెందరు? జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రి బాయిల పేర్లు దేశవ్యాపితమయ్యాయి. గాంధీ, నెహ్రూలకు ప్రత్యామ్నాయంగా మారిపోతున్నాయి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో చాకలి అయిలమ్మ సంబంధిత కులానికి ప్రతీక అయితే, ఈమధ్యనే కొండా లక్ష్మణ్ బాపుజీని మరో వర్గం స్వంతం చేసుకుంటున్నది. సర్దార్ పాపన్నను, జయశంకర్‌లను ఓ వర్గం వారు పోస్టర్లపై వారి కుల ప్రతినిధులుగా వేసుకుంటూ కులాల ఐక్యత పేరున రాజకీయాలు చేసుకుంటున్నారు. కుల ప్రస్తావన లేకుండా, సామాజిక, రాజకీయ మార్పు కోరిన ఈ నాయకులను ‘కుల చట్రం’లో బిగించడం, దీనికి అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు హాజరై పల్లకిని మోయడం సర్వసాధారణమైంది. ఈ నేతల అడుగులకు మడుగులొత్తడం ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లకు అలవాటుగా మారింది.
అంబేద్కర్‌ను పొగిడి, ఆయన భావజాలాన్ని వంటపట్టించుకోవాలని మాట్లాడే నాలుకలే పటేల్ ఆలోచనల్ని పుణికిపుచ్చుకోవాలంటాయి. మహిళా సాధికారిత వ్యతిరేక మేధస్సులే సావిత్రిబాయి పూలె భావాన్ని శిరోధార్యమంటాయి. అయిలమ్మలా తిరగబడాలంటాయి. భగత్‌సింగ్‌లా దేశభక్తిని కల్గివుండాలంటాయి. అల్లూరి తిరుగుబాటును వేనోళ్ళ పొగుడుతాయి. కొమురం భీంకు నివాళులు అర్పిస్తాయి. రేడియో, టీవీల్లోని ప్రకటనల్లా, విద్యార్థుల్ని వేదికలుగా చేసుకొని ఆల్‌రౌండ్ ప్రచారకులుగా మాట్లాడని రోజు లేదు. నినదించని దినం లేదు. వీరంతా ఏమి మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో బిక్కముఖం వెయ్యడం పిల్లల వంతైతున్నది.
మోదీ మొదలు పెట్టాడనో, ముఖ్యమంత్రి ప్రారంభించాడనో ఆయా పథకాలకు రాజకీయ నాయకులే కాదు, జిల్లాస్థాయి పాలనాధికారులు సైతం బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రచారాలు చేస్తుంటారు. రాష్ట్రాల్లో అయితే ప్రతిదీ ‘ముఖ్యమంత్రి ఆదేశం మేరకు’ అంటూ ఏ పథకం గూర్చి ప్రస్తావించినా, చెప్పకుండా ఉండని వైనం. చీపురు పట్టాలన్నా, మొక్కలు నాటాలన్నా, మరుగుదొడ్లు నిర్మించాలన్నా.. అన్నీ అధినాయకుల ఆదేశాల మేరకే! అక్షరాస్యత, అందరికీ విద్య, ఆరోగ్యం.. అంటూ అదరగొడుతారు. పౌష్టికాహారం గూర్చి, గర్భిణుల రక్షణ గూర్చి, శిశు సంరక్షణ గూర్చి తెగ మాట్లాడుతారు. పెన్షన్ పథకాల గూర్చి తామే దానకర్ణుల్లా, బలిచక్రవర్తుల్లా, శాంతి దేవుళ్ళలా ప్రచారం చేసుకుంటారు. ఏ పథకానికీ ఓ సామాజిక, రాజ్యాంగ స్ఫూర్తి కనపడదు. ఈ మధ్యన ‘దత్తత’ అనే నినాదం కొత్తగా మొదలైంది. రాష్ట్రానికంతటికీ బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి ఒకటి, రెండు గ్రామాలకే ఎందుకు పరిమితమైపోతాడో ఎవరికీ తెలియదు. తెలుసుకునే అవసరం ఎవరికీ లేకుండాపోయింది. పైగా ఇదో ప్రధాన ప్రచార సాధనంగా మారిపోయింది. వీటిని అనుచర గణమంతా గొప్ప విషయంగా పొగుడుతుంటే, మీడియా ప్రచారం సరేసరి! విమర్శంటేనే జడుసుకునే స్థితి. అన్ని ప్రాంతాలకూ సమంగా ఖర్చు చేయాల్సిన నిధులు ఏకపక్షంగా ఒకటి, రెండు ప్రదేశాలకే పరిమితం కావడం ప్రజాస్వామ్యపు మార్కుగా మారిపోయింది.
ఈమధ్యన సలహాదారుల సంఖ్య పెరిగిపోతున్నది. వ్యతిరేక పార్టీని దెబ్బతీయడానికి అవకాశవాదులను పార్టీ ఫిరాయింపచేయడం, అధికారికంగా అందలమెక్కించడం, లేకపోతే సలహాదారులుగా ప్రతిష్ఠించడం, లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం జరుగుతున్నది. పదవీ విరమణ పొందిన అధికారులకు కూడా ఈ అందలాలు దక్కడం గమనార్హం. ఇంతమంది ఉన్నత సలహాలు ఇస్తుంటే, కొన్ని విషయాలపై మధ్యమధ్యన హైకోర్టు, సుప్రీం కోర్టులు మొట్టికాయలు వేస్తూనే వున్నాయి. దీనికి ఈ సలహాదారులు చెప్పే సమాధానం ఏంటో వారికే తెలియదు. ముఖ్యమంత్రి సహా ఎంఎల్‌ఎల సమూహానే్న పార్టీ ఫిరాయింపులకు గురిచేస్తున్న వ్యవస్థలో ఇదో వింత కాకపోవచ్చు.
ఈ విధంగా ‘జాబ్ చార్ట్’ ఏంటో తెలియని సలహాదారులు, ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలతోపాటు అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వీరి అధికారిక, అనధికారిక విధి విధానాలేంటో తెలియదు. చెప్పేవాడికి వినేవాడు లోకువే అన్నట్లు వీరంతా హితబోధకులే! ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్దంగా పనిచేసే జిల్లా కలెక్టర్లు, మెజిస్ట్రేట్లు, ఎస్‌పిలు వెతికినా కానరారు. పాలక పక్షానికి అనుయాయులుగా బ్యూరోక్రాట్ ముసుగుతొడుక్కున్న రాజకీయవాదులుగా, ఈ ప్రధాన కార్యాలయాలు పాలకపక్ష రాజకీయ కేంద్రాలుగా మారిపోయాయి. ప్రజల సమస్యల్ని పట్టించుకొని పరిష్కరించడం కన్నా, వాల్‌పోస్టర్లను, గోడ పత్రికల్ని, క్యాలెండర్లని ఆవిష్కరించడం, అనధికారిక కార్యక్రమాల్లో అధికారిక సమయాల్లోనే హాజరుకావడం వీరికో అలవాటుగా మారింది. మధ్యమధ్యన గుళ్ళు, గోపురాల్ని సందర్శించి ఆయా దేవాలయాల ప్రచారకులుగా మారిపోయారు. వీరి నమ్మకాలే వీరి లౌకికవాద హక్కుగా మారిపోయాయి. పాలకుల భావజాలమే వీరి రాజ్యాంగంగా చెలామణి అవుతున్నది. వీరి నిజమైన ‘జాబ్ చార్ట్’ ఏమిటో కనీసం ముఖ్యమంత్రులకు కూడా తెలిసుండదు. ఏ గోడపైనా సిటిజన్ చార్టర్ రూపంలో కనపడదు. పైగా ఈ బాపతే కిందిస్థాయి సిబ్బందిని, అధికారుల్ని హెచ్చరిస్తూ వుంటుంది. వీటన్నింటికి అలవాటుపడిన యంత్రాంగం ‘జీ హుజూర్..’ అంటూ తలూపడం, అవసరానికి అనుగుణంగా పైఅధికారుల్ని పొగడ్డం, పుట్టినరోజుల పేరున గిఫ్టుల్ని ఇవ్వడం, ఇప్పించడం, పత్రికల్లో ప్రకటనల్ని ఇప్పించడం వంటివి చేస్తూ వుంటారు. నెయ్యిలో ముంచిన వేలును అధికారుల, రాజకీయ నాయకుల నోట్లో పెట్టడం, ప్రజల కంట్లో వేలునే గుచ్చడం మామూలైపోయింది. ఇదంతా ‘కర్మ’ అనుకోవడం జనాల వంతు అయింది.
ఈమధ్యన వృద్ధురాలైన ఓ ఎంఎల్‌ఎ తల్లి చనిపోతే స్వయాన ముఖ్యమంత్రే పరామర్శించడానికి రావడం, అధికార యం త్రాంగం హైరానా పడడం, రోడ్లతో పాటు ఆ గ్రామాన్ని తీర్చిదిద్దడం, ప్రత్యేకించి ఓ హెలిపాడ్‌నే నిర్మించడం పెళ్ళి వాతావరణాన్ని తలపించాయి. ఓ మహిళా ఎంపిటిసి సభ్యురాలి అత్త మరణం సందర్భంగా ఇదే రాజకీయ తంతు జరిగింది. బతికున్నప్పుడు ఆ మహిళలకు ఈ కుటుంబాలు ఎంత గౌరవాన్ని ఇచ్చాయో బయటకు తెలియని వైనం. చావో, రేవో అయితే తప్ప, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో విహరిస్తే తప్ప బాగుపడని మున్సిపల్, గ్రామీణ రోడ్లు, రాజకీయ నాయకులతో పాటు ఉన్నతస్థాయి అధికారులు దౌరా (్యఖూ) చేస్తూ హెచ్చరికలు చేసినట్లు నటించడం- తీరని ప్రజల కడగండ్లకు నిదర్శనం. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా, అధికార, అనధికార కార్యక్రమాలతో నిమిత్తం లేకుండా పెళ్ళికైనా, కర్మకాండకైనా ‘రాజువెడలె..’ చందంగానే వీరి పర్యటనలుంటాయి. ఇలాంటి వారి సంఖ్య ఈ దేశంలో 5,79,092గా ఈ మధ్యన తీసిన లెక్కల్లో తేలగా, బ్రిటన్‌లో వీరి సంఖ్య కేవలం 84, ఫ్రాన్సులో 109, జపాన్‌లో 125, జర్మనీలో 142, ఆస్ట్రేలియాలో 205, అమెరికాలో 252, దక్షిణ కొరియాలో 282, ఒకప్పటి రష్యాలో 312, చైనాలో 435గా తేలడం గమనార్హం. ఒకప్పుడు దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులే ప్రప్రముఖులుగా గుర్తించబడేవారు. ప్రధానమంత్రితోపాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాధారణ ప్రజాప్రతినిధులుగా గుర్తించబడేవారు. ఇప్పుడంతా తారుమారైపోయింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలే కాదు, చివరికి జిల్లా, మండల స్థాయి రాజకీయ నాయకులు సైతం ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. మున్సిపల్ కార్పొరేటర్లు కూడా ముందూవెనక కాన్వాయితో, అంగబలంతో వెడలడం, ఏదైనా ముద్రపడితే, ప్రభుత్వమే అంగరక్షకుల్ని కల్పించడం, ఇదో హోదా చిహ్నంగా మారిపోవడం మన ప్రజాస్వామ్యం మా ర్కుగా మారింది.
ఈమధ్యన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జు రాజకీయ నాయకులపై, న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యల్లో ఆలోచిస్తే నిజం లేదని అనిపించదు. ఈ ఆలోచనలు మరింతగా బలం పుంజుకుంటే తప్ప ఈ దేశ గతి బాగుపడదు..

*

- జి.లచ్చయ్య సెల్: 94401 16162