మెయన్ ఫీచర్

స్వభూమిపై వికసించిన స్వభావం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం ఒక జాతి స్వభావాన్ని వివరించే నిర్వచన పత్రం. ఒక జనసముదాయం, లేదా అనేక జనసముదాయాల సమాహారం జాతిగా వికసించిన తరువాత ఏర్పడే వివిధ వ్యవస్థలలో రాజ్యాంగం అతి ప్రధానమైంది. అందువల్ల రాజ్యాంగం జాతీయతను వ్యక్తం చేసే ఒక మాధ్యమం. ఒక జాతి తన ప్రస్థాన క్రమంలో రాజ్యాంగాన్ని రాసుకుంటుంది, మార్చుకుంటుంది, రద్దు చేసుకుంటుంది, కొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకుంటుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది, ఈ ప్రక్రియ రద్దయి కొత్త ప్రక్రియ మొదలయినప్పుడు కూడ జాతి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగం అంతకుపూర్వం నుంచి ఉన్న జాతీయతకు ఒక ధ్రువీకరణ మాత్రమే. జాతి ఏర్పడిన తరువాతనే రాజ్యాంగం ఏర్పడుతోంది. రాజ్యాంగ రచనతో జాతి ఏర్పాటు ఆరంభం కావడం లేదు. ఒక జాతి ఏర్పడిన తరువాత రాజ్యాంగం అనేకసార్లు ఏర్పడవచ్చు. ఒక రాజ్యాంగ వ్యవస్థకు, మరో రాజ్యాంగ వ్యవస్థకు మధ్య దశాబ్దులు గడచిపోవచ్చు, సహస్రాబ్దులు సాగిపోవచ్చు, యుగాలు, మహాయుగాలు గడచిపోవచ్చు, మన్వంతరాలు కదలి పోవచ్చు...ఒక జాతి ఏర్పరచుకొనే వ్యవహార నియమావళి రాజ్యాంగం. అందువల్ల అత్యంత వినూతన నియమావళిని జాతీయులు సహజంగానే పాటిస్తారు, పాటించాలి. రాజ్యాంగ నిబద్ధత అంటే ఇదీ. ఈ రాజ్యాంగ నిబద్ధత మరింత విస్తృతమైన వౌలికమైన జాతీయతా నిబద్ధతలో భాగం. భారతజాతికి అనాదిగా అనేక రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినాయి. కొన్ని సహజంగా అంతరించాయి, కొన్నింటిని జాతీయులు మార్చుకున్నారు, కొన్నింటిని విదేశీయుల ధ్వంసం చేశారు. అందువల్ల 1947లో విదేశీయులు చివరిగా నిష్క్రమించిన తరువాత అనాది భారతజాతి క్రీస్తుశకం 1950 జనవరి 26 నుండి కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకుంది. అప్పటినుంచి ఈ కొత్త రాజ్యాంగ నియమాల ప్రకారం మన సనాతన జాతీయ ప్రస్థానం కొనసాగుతోంది. అందువల్ల ఈ సనాతన జాతీయ ప్రస్థానంలో 1950 జనవరి 26వ తేదీ ఒక శుభంకరమైన ఘట్టం. అంతేకాని 1950 జనవరి 26న మనం ఒక జాతిగా ఏర్పడలేదు, భారతీయులు సృష్ట్యాదిగా ఒక జాతిగా ఏర్పడి ఉండటం వాస్తవ చరిత్ర..
పాఠశాలలో చేరిన పిల్లవాడు, పాప, తమ ఇంటిపేరును నమోదు చేసుకుంటారు. తాము పుట్టినప్పటినుంచి ఆ ఇంటిపేరు తమకు ఉంది. అలా ఉండడానికి పాఠశాలలో జరిగే నమోదు ఒక ధ్రువీకరణ మాత్రమే. అంతేకాని పాఠశాలలో నమోదు చేసుకొనడం వల్ల ఆ పిల్లలకు ఆ ఇంటిపేరు, ఇంటితనం ఏర్పడడం లేదు. అంతేకాదు ఈ పిల్లలు ఆ ఇంటిలో పుట్టకపూర్వం కూడ వందల లేదా వేల ఏళ్లుగా ఆ ఇంటితనం ఉంది. అలాగే భరతమాత బిడ్డలైన భారతీయులు తమకు అనాదిగా ఉన్న ఇంటితనాన్ని-జాతీయతను-1950 జనవరి 26 నాడు రాజ్యాంగ పత్రం ద్వారా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకొనడానికి పూర్వం అనాదిగా ఇంటితనం, ఇంటిపేరు-్భరత జాతీయత-కొనసాగుతోండడం చరిత్ర. అందువల్ల మనది సనాతన జాతి. సనాతన జాతి అని అంటే ఆద్యంతము లేని శాశ్వతమైన జాతి...అందువల్ల వర్తమానంలోని మనం లేని సుదూర గతంలోను, మనం ఉండని సుదూర భవిష్యత్తులోను మన జాతి ఉంది, మన జాతీయత ఉంది! ‘‘తేరా వైభవ్ అమర్ రహే మా హమ్ రహే, న రహే..’’- నీ వైభవము నిరంతరం నిలచిపోవాలి, మేము ఉండవచ్చు, ఉండకపోవచ్చు-అన్న హిందీ కవిత భారత జాతి సనాతన తత్వానికి లేదా శాశ్వత తత్వానికి ఆధునిక ప్రతీక. ఇంటితనం అన్న వైయక్తిక వాస్తవానికి సమష్టి విస్తృతి జాతీయత...ఈ భారత జాతీయత ‘‘రక్షతి బ్రహ్మేదం భారతం జనమ్..’’ అని సృష్ట్యాదిలో వైదిక ఋషులు ప్రార్థించిన నాటిది, అప్పటి నుంచి కొనసాగుతున్నది, అనంతంగా కొనసాగుతున్నది. ఈ ఆద్యంత రహిత ధ్యాస సహజమైన మాతృభక్తికి పితృభక్తికి ప్రాతిపదిక. జాతికి ‘‘తల్లిదండ్రులు భూమి, ఆకాశం’’ అన్నది వౌలిక ప్రాతిపదిక. అందుకే తొలి భారతీయులు, తొలి మానవుడు, ‘‘తండ్రీ ఆకాశమూ, తల్లీ భూమీ! మిమ్ములను ప్రార్థిస్తూ నేను చేస్తున్న అభ్యర్థన నిజమగు గాక...మమ్ములను మాతో పాటు సమస్త జీవజాలమును మీరు రక్షించాలన్నది ఈ అభ్యర్థన..మీ ఇరువురి అనుగ్రహము వలన మేను జీవమును పెంపొందించునట్టి అన్నమును పొందుతున్నాము!’’ అని ప్రార్థించాడు. ఈ తొలి ప్రార్థన జాతీయతకు ప్రాతిపదిక. ఈ ప్రార్థనను ఇప్పుడు కూడ చేయడం ఎప్పుడూ చేస్తూ ఉండడం సహజమైన జాతీయత...
‘‘ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు
పితర్మాతర్యది హోపబ్రువేవామ్
భూతం దేవానాం అవమే అవోభిః
విద్యామేషం వృజనం జీరదానుమ్’’
ఈ వైదిక ఆకాంక్ష బంకించంద్రుని వందేవమాతరం లోను, రవీంద్రుని జనగణమన గీతంలోను పునరభివ్యక్తమైంది. వందేమాతరంలో మాతృభక్తి, జనగణమన గీతంలో పితృభక్తి ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ సనాతన ‘జాతిపిత’ ఆకాశం..జాతీయ మాత భూమి..్భరత మాత! ఈ జాతి ప్రజలు ఈ మాతా పితరుల వరాల బిడ్డలు. ఈ పుత్రభావం సహజమైన జాతీయత. ‘‘ద్యౌర్యఃపితా, పృథివీ మాతా..’’ ఆకాశం తండ్రి, భూమి తల్లి!
ఆకాశానికి మానవులకూ మధ్య గల ఈ పితాపుత్ర భావం, భూమికీ మానవులకూ మధ్య గల ఈ మాతా పుత్ర భావం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచానికి సకల జీవజాలానికి వర్తించే సృష్టిగత సత్యం ఇది. ఈ సత్యాన్ని భారతీయులు అనాదిగా గుర్తించడం తుది మొదలు లేని సనాతన సంస్కారం. అందువల్లనే భారతీయులది సనాతన జాతి-ఎటర్నల్ నేషన్- అయింది. ఈ సంస్కారం యుగాల తరబడి ప్రపంచమంతటా వ్యాపించి ఉండడం చరిత్ర! ఈ సంస్కారాన్ని భారత దేశానికి వెలుపలగల మానవులు మరచిపోవడం కూడ చరిత్ర. అలా మరచిపోయిన వారు రకరకాల వికృతులకు గురయ్యారు. అలా మరచిపోయిన విదేశీయులు కోట్లాది ఏళ్ల చరిత్రను కూడ మరచిపోయి ప్రపంచ చరిత్రను వేల ఏళ్లకు కుదించారు. ఇలా కుదించిన వారు ప్రచారం చేసిన చరిత్రను గత కొన్ని వందల ఏళ్లుగా మనదేశ ప్రజలు కూడ విశ్వసించి ప్రచారం చేయడం చారిత్రక వైపరీత్యం. ‘జాతి’, ‘జాతీయభావం’, ‘దేశభక్తి’, ‘ప్రజాస్వామ్యం’, ‘రాజ్యాంగ వ్యవస్థ’ వంటివి మనకు విదేశీయుల పాలన కారణంగా సంక్రమించాయన్న వక్రీకరణలు వాస్తవాలుగా చెలామణి అవుతుండడం కొనసాగుతున్న వైపరీత్యం. మానవులు భారతదేశంలో పుట్టి పెరిగి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం వాస్తవ చరిత్ర. తొలి మనువు నుంచి అభినవ మనువైన బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ వరకు గల భారతీయులెందరో ధ్రువీకరించిన చరిత్ర ఇది. మనువుకు సంబంధించిన వారు మానవులు, మానవులకు సంబంధించిన మానవీయ సంస్కారాలు కూడ భారతదేశం నుండి ఇతర ప్రపంచ ప్రాంతాలకు వ్యాపించడం చరిత్ర. అందువల్లనే భారత జాతి, మానవజాతికి ప్రతిరూపమైంది. ఈ దేశపు సనాతన సంస్కారమైన హిందుత్వం మానవ సంస్కారమైంది. ఈ దేశం నుంచి క్రమంగా బయటకు పోయిన ప్రజలు వేల ఏళ్లుగడిచిన తరువాత ఈ మానవీయ సంస్కారాలను మరచిపోయారు. అలా మరచిన వారు మనదేశానికి వచ్చి సంస్కారాలను నేర్చుకొని వెళ్లిన కాలఖండం కూడ చరిత్రలో ఉంది. కానీ భారతదేశం నుంచి బయటకి వెళ్లిన వారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోయి కొత్త జనసముదాయాలుగా ఏర్పడిన కాలఖండం కూడ ఉంది. ఈ కాలఖండం కలియుగం ఆరంభం నుంచీ కొనసాగుతోంది. కలియిగంలో ప్రస్తుతం 5,117వ సంవత్సరం నడుస్తోంది.
ఇలా భారతీయతను మరచి, ‘గ్రీకులుగా, రోమన్లుగా ఏర్పడిన వారికి, ఐరోపాలోని వారి వారసులకు కొన్ని శతాబ్దుల క్రితం వరకూ జాతి అంటే తెలియదు. భూమిని తల్లి అన్న అంశాన్ని తండ్రి అన్న వాస్తవాల పట్ల ధ్యాస లేదు. అందువల్లనే భారత దేశంలో సనాతన జాతి స్వర్ణశోభలతో వెలుగొంది సకాలంలో గ్రీకులు, రోమన్లు, నగర రాజ్యాలకు పరిమితమయ్యారు. ఆ తరవాత వారు తమకు నాగరికతను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నాగరికతలకు జాతి అంటే తెలీదు, జాతీయత తెలీదు. భూమి పట్ల మమకారం ప్రాతిపదికగా ఒక జనసముదాయం, లేదా జనసముదాయాలు జాతిగా వికసించిన భారతీయ సంతతి వారికి అర్థం కాలేదు. ఇలా అర్థం కాని ఐరోపా వారు మన దేశాన్ని దురాక్రమించడం, దురాక్రమణ దురహంకారంతో ఈ సనాతన జాతికి పాఠాలు చెప్పడం చరిత్రకు జరిగిన అన్యాయం, సృష్టికి జరిగిన అన్యాయం. భారతదేశంలోని ప్రజలు ఇతర దేశం నుంచి వచ్చిపడిన చిత్ర విచిత్రమైన తండాల వారసులన్నది ఐరోపా అజ్ఞానులు అహంకారంతో మనకు చెప్పిన అబద్ధాల పాఠం. ఈ పాఠం నమ్మిన వారికి ‘‘ఈ దేశం అనాదిగా తమదన్న’’ జాతీయ నిష్ఠ లేకుండా పోయింది. భరతమాతకు జయం కోరని దేశద్రోహులు ఐరోపావారు చెప్పిపోయిన అబద్ధపు పాఠానికి వారసులు. తాము దురాక్రమణను కొనసాగిస్తున్న కాలం నాటికి ‘‘్భరత దేశం ఒక జాతిగా ఏర్పడ లేద’’న్నది ఐరోపా ఆంగ్లేయులు నేర్పిన మరో అబద్ధపు పాఠం. ఈ పాఠం ఫలితంగా బ్రిటిష్ వ్యతిరేక సమరం జరిగిన సమయంలో, ‘‘మన దేశం పూర్వం ఒక జాతి-నేషన్-గా ఏర్పడి ఉండలేదని చరిత్రలో మొదటిసారిగా మన దేశ ప్రజలు ఒక జాతిగా ఏర్పడే ప్రక్రియ కొనసాగుతోంద’’ని ఈ సనాతన జాతీయులు విశ్వసించే దుస్థితి ఏర్పడింది. సురేంద్రనాథ బెనర్జీ వంటి మహనీయులు మేధావులు సైతం ఈ బ్రిటిష్ వారి అజ్ఞానపు అబద్ధాన్ని విశ్వసించారు.‘‘ఆవిర్భవిస్తున్న జాతి-ఏ నేషన్ ఇన్ ది మేకింగ్’’- అన్న పరిశోధక పత్రాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ వ్రాయడానికి ఈ భ్రాంతి కారణం. ఇలా ‘‘మనదేశం ఒక జాతిగా ఏర్పడడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను బ్రిటిష్ వారు ఇంగ్లీషు భాష ద్వారా, రైళ్లద్వారా సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయడం కారణమన్న’’ ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది! ‘బావి’ని సైతం చూడని వారు ‘మహానది’ని వర్ణించినట్టుగా ఐరోపావారు మనకు జాతీయత గురించి జాతి గురించి బోధించారు. భావదాస్యగ్రస్తులైన వారు ఇప్పటికీ ఈ బ్రిటిష్ వారి అబద్ధాలను నిజాలుగా విశ్వసిస్తున్నారు. అందుల్లనే ‘జాతీయత’, ‘దేశభక్తి’, బ్రిటిష్ ‘పాలన’ వల్ల ఏర్పడిన ‘ప్రభావాత్మక’ లేదా ‘ప్రతిక్రియత్మక’ భావోద్వేగాలని ప్రచారమైంది. దేశంలో స్వభావాత్మక జాతీయత అనాదిగా ఉండడం వాస్తవం...
ఇంగ్లీషు పుట్టడానికి పూర్వం అనేక యుగాలుగా ఈ జాతిని సంస్కృత భాష అనుసంధానం చేసింది. కలియుగాది నుంచి మూడువేల ఏళ్లకు పైగా ఈ దేశంలో ఏకీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండేది. జాతీయ రాజమార్గాలు, భౌగోళిక అనుసంధానాన్ని కూర్చాయి. కానీ ఈ వ్యవస్థలన్నీ జాతీయతలోని కొన్ని విభాగాలు మాత్రమే. ఈ స్వభావాత్మక జాతీయతకు ప్రాతిపదిక మాతృభూమి పట్ల బిడ్డలకు సహజంగా ఏర్పడే మమకారం. ఈ మమకారం నిండిన గుండెలవారు జాతీయులు, భారతీయులు, హిందువులు....

-హెబ్బార్ నాగేశ్వరరావు cell: 9951038352