మెయన్ ఫీచర్

దేశ రక్షణ గాలిలో దీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకీసంగతి తెలుసా?
కొద్ది రోజుల క్రితం చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్ కరాచీ తీరానికి చేరింది. చైనా పౌరులు యాభైవేల మంది బెలూచీస్థాన్‌లో కొన్ని సంస్థలు నడుపుతున్నారు. పిల్లలకు చైనా భాష నేర్పి చైనా ఆట వస్తువులు పంచుతున్నారు. తారక్‌పీర్జాదా (పాక్ నాయకుడు) ఒక ఇంగ్లీషు టీ.వి.్ఛనల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో (6-1-2017) పాకిస్తాన్‌లో హిందువులు, ముస్లిమేతర ఎథ్నిక్ గ్రూపులను చంపితే తప్పేమిటి? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి భారత ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ సమాధానం చెపుతుంది?? దేశ ప్రజలు జాగృతం కావలసిన సమయం వచ్చింది. ఉత్తరాన నేపాల్-పశ్చిమాన పాక్, తూర్పున చైనా, దక్షిణాన రెడ్‌కారిడార్‌ల మధ్య భారతదేశం చక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఈ విషమస్థితిలో దేశాన్ని ఎవరు రక్షిస్తారు? తూర్పున మమతాబెనర్జీ, దక్షిణాన పిన్నరాయ్ విజయన్, ఉత్తరంలో రాహుల్‌గాంధీ, పశ్చిమాన, శరత్‌పవార్‌లు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. దేశ రక్షణకన్నా వీరికి స్వంత పార్టీల ఎజెండాలు జెండాలే ముఖ్యమా?? టిబెట్‌కు పట్టినగతి భారత్‌కు పడితే దేశ ప్రజలు, రాజకీయ నాయకులు దలైలామా వలె కాందిశీకులు కావలసి వస్తుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇంతకూ ఏం జరుగుతున్నది? సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు ఇలా చెప్పారు. ‘ములాయంసింగ్ యాదవ్ ముసలివాడైపోయాడు (స్పెంట్ ఫోర్స్). జవసత్వాలు ఉడిగాయి కాబట్టి యువత మొత్తం అఖిలేశ్ వైపు చూస్తున్నది’ అని. ఇందులో నిజం ఉంది. ములాయం ఒంటరిగా పోటీచేస్తే పది అసెంబ్లీ స్థానాలకంటే ఎక్కువగా గెలువలేడు. ఈ పది సీట్లు అఖిలేశ్ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది సాధ్యమా? కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు - ఐదు సీట్లు మాత్రమే రాబోతున్నాయి. ఇక మాయావతి తృతీయ స్థానంలో ఉంది. అందుకని ఈసారి ముస్లిం వర్గాలతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నది. తద్వారా ‘‘దళిత మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి’’ అనే నినాదాన్ని ఇవ్వవచ్చు. కాకుంటే పెద్ద నోట్ల రద్దువల్ల స్వేచ్ఛగా డబ్బు ఖర్చుచేసి ఓట్లు కొనలేకపోవచ్చు. ఒకవేళ ములాయం, అఖిలేశ్, రాహుల్ కలిసి ఒక కూటమిగా మారితే బిజెపితో ‘నువ్వా? నేనా?’ అన్నట్లు తలపడవచ్చు. సంక్రాంతినుండి మహాశివరాత్రి లోపల మరికొన్ని రాజకీయ పరిణామాలు సంభవింపగలవు. రాజకీయ లబ్దికోసం మాయావతి, అఖిలేశ్, ములాయంలు పాక్ ఏజెంట్లతో బహిరంగంగా చేతులు కలుపుతున్నారు. ఇక దేశానికి రక్షణ ఎక్కడ?
* * *
చైనాలోని జిన్‌జియాంగ్‌లో 30 డిసెంబరు 2016నాడు ఒక సంఘటన జరిగింది. అక్కడి కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుమీదికి ముగ్గురు ఉగ్రవాదులు దాడిచేశారు. వెంటనే భద్రతాసిబ్బంది అప్రమత్తమై వారిని కాల్చి చంపారు. ఈ వార్త చైనా పత్రికలలో వచ్చింది. ఇక్కడ గమనించవలసిన అంశాలు రెండుమూడు ఉన్నాయి. మొదటిది ఉగ్రవాదులు చైనాలో కూడా ఉన్నారు. వారు చైనా ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఐతే చైనాలో వెదురు తెర ఉంటుంది. కాబట్టి బయట ప్రపంచానికి అక్కడి వార్తలు తెలియవు. ఈ ఉగ్రవాదులపై పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత వారి మూలాలు బయటపడుతాయి. అంటే చైనాలో ఉన్న వారు కూడా మనలాంటి మనుషులే. కాకుంటే అక్కడ సైనిక నియంతృత్వం ఉంది కాబట్టి వారికి భావస్వేచ్ఛ ఉండదు. ఏం జరుగుతున్నదో సెన్సారు చేసి విడుదల చేస్తారు. భారతదేశంలో అలాకాదు. ఇక్కడ అవసరానికి మించిన ప్రసార మాధ్యమాల స్వేచ్ఛ ఉంది. కొన్ని సందర్భాలల్లో అది దుర్వినియోగం చేయబడింది కూడా.
ఇక రెండవ అంశం ఉగ్రవాదులను పట్టుకోవాలి. న్యాయస్థానంలో విచారించాలి. కోర్టులకు తెలియజేయాలి. తర్వాత శిక్ష విధించాలి. అదేమీ లేకుండా ఎందుకు కాల్చి చంపారు? గుజరాత్‌లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను హత్య చేయడానికి ఇషత్ జహానా అనే బీహారీ ఉగ్రవాది మరి నలుగురితో కలిసి అహ్మదాబాదు వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మరణించారు. ఐతే అటు కాంగ్రెసు నాయకులు దిగ్విజయ్‌సింగ్, కపిల్‌సైబల్ ఇటు బిహారు నాయకుడు లల్లూప్రసాద్ యాదవ్ వంటివారు చేసిన అల్లరి ఇంతాఅంతా కాదు. ‘‘ఇతడు మాన్‌ఈటర్’’ అని మోదీని కసితీరా తిట్టారు. ఉగ్రవాదులను పట్టుకొని కోర్టుల్లో విచారించాలి కదా అన్నారు. లోగడ అఫ్జల్‌గురు వంటి వారిపై జరిగిన విచారణను గుర్తుచేశారు. జనగామవద్ద వికారుద్దీన్ అనే ఉగ్రవాది పోలీసు కస్టడీ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే అతనిని పోలీసులు కాల్చి చంపారు. ఇది బూటకపుఎన్‌కౌంటర్ అని అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కాంగ్రెస్ నాయకులు కోడై కూశారు. ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడల్లా వాటిని బూటకపు ఎన్‌కౌంటర్‌లు అనడం సామ్యవాదులకు అలవాటు. మరి ఈ చైనాలోని జిన్‌జియాంగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ నిజమైనదో దొంగదో ఎవరు నిర్ణయించారు? అక్కడికి పౌర హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కమిటీలు వెళ్లలేదు. ‘ఇది రాజ్యహింస’ అని ఒక్కడూ పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. ఎందుకని? అంటే చైనాకు ఒక న్యాయము ఇండియాకు మరొక న్యాయమా?
* * *
2014కు ముందు నారద స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన ఒక నిఘా సంస్థ రహస్యంగా రూపొందించిన వీడియోను విడుదల చేశారు. దీని ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడిఅయింది. సందీప్ బంధోపాధ్యాయ 15వేల కోట్ల స్కాంలో ఇరుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు చండీగఢ్ ఫోరెన్సిక్ లాబ్‌కు పంపి నిర్ధారణ జరిపారు. జస్టిస్ టి.చక్రవర్తి, నిషిత మహాత్రేలతో కూడిన ధర్మాసనం ఈ కేసును కలకత్తా హైకోర్టులో విచారించి సిబిఐ విచారణ జరిపించండి అని (7-1-2017) తీర్పు చెప్పింది. దీనితో మమతాబెనర్జీ మండిపడింది. డెరక్ ఒబ్రాయ్ (టిఎంసి ఎంపి) మతి స్థిమితం కోల్పోయి ‘మోదీ హటావో దేశ్‌బచావో’ అని పిలుపునిచ్చాడు. మమతాబెనర్జీ దేవత కాదు. ఆమె తన రాజకీయ అస్తిత్వంకోసం ముస్లిం ఉగ్రవాదుల ఓట్లమీద ఆధారపడుతున్నది. కమ్యూనిస్టుల మీద వ్యతిరేకతతో ప్రజలు ఈమెకు పట్టంకడితే ‘ఇదంతా తన గొప్పతనమే’నని భ్రమిస్తున్నది. ఇలాంటి వ్యక్తుల చేతిలో భారతదేశం సురక్షితమేనా?
శారదా స్కాం, శారదా స్కాంలతోపాటు ఇప్పుడు రోజ్‌వాలీస్కాం తెరపైకి వచ్చింది. కలకత్తాలోని శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రమేయం ఉంది. రోజ్‌వాలీ చిట్‌ఫండ్‌లో ఆమె పార్టీకి చెందిన తపస్‌తేజ్‌పాల్ ప్రమేయం ఉంది. ఈ చిట్‌ఫండ్ అవకతవకల ఫలితంగా తపస్‌తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు. అంతేకాదు సందీప్ బంధోపాధ్యాయ అనే మరొక పార్టీ నాయకుణ్ణి సిబిఐ ప్రశ్నించింది. ఇదంతా కక్ష సాధింపు చర్య అంటూ మమతాబెనర్జీ తన అనుయాయులను వెనకేసుకొని వచ్చింది. షారుక్‌ఖాన్‌కు చిట్‌ఫండ్ కంపెనీవారు ఆతిథ్యం ఇచ్చినంత మాత్రాన ఓ క్రికెటర్ ప్రచారంకోసం ప్రకటనకు సహకరించినంత మాత్రాన వారు దొంగలు అవుతారా అని ప్రశ్నించింది. నిజమే కదా? తపస్‌తేజ్‌పాల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ బెంగాల్‌లోని సిపియం మహిళా కార్యకర్తలనందరినీ గాంగ్‌రేప్ చేయండి అని పిలుపునిచ్చాడు. ఇలాంటి వ్యక్తిని లోక్‌సభ సభ్యునిగా ఎలా కొనసాగనిచ్చారు? మమతాబెనర్జీ తృణమూల్ కాంగ్రెసులో అసాంఘిక శక్తులు, బంగ్లాదేశ్ అనుకూల వర్గాలు గణనీయంగా ఉన్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బెంగాల్‌లో తమ అస్తిత్వం కోల్పోవటంతో ఆ పార్టీ కార్యకర్తలు టియంసిలో చేరారు. ఐతే వారంతా తమ అరాచక ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిని మమతాబెనర్జీ బలపరచటం ఏమిటి? మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విరుచుకొని పడటం ఏమిటి? అంటే నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులకు గురిఐన వారిలో ఈమె కూడా ఒక్కతె అని తెలుస్తున్నది. బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రానికి ఇలాంటి చపలచిత్తం కలవారు పాలకులుగా ఉండటం ఎంతవరకు సబబు??
ఆంధ్రప్రదేశ్ డిజిపి నండూరి సాంబశివరావుగారి కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హత్య చేయాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొద్దికాలం క్రితం మల్కాన్‌గిరివద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు పెద్దసంఖ్యలో మరణించారు. అందుకు ప్రతీకారం తీర్చుకుంటాము అని వారు పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లోకి జర్నలిస్టుల ముసుగులో మావోయిస్టులు ప్రవేశించి రెక్కీ (రిహార్సల్) నిర్వహించినట్లు కేంద్ర హోంశాఖ వారికి సమాచారం అందింది. ఈ కారణం చేత ఎపి భవన్‌లోకి తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులను అనుమతించకూడదని నిశ్చయించారు. ముఖ్యమంత్రికి భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి అని డిజిపి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమంటే నారావారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం ఎన్నికై రాజ్యాధికారం స్వీకరించారు. ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన ఎంఎల్‌ఎ, ఎంపీల మీదా దాడి జరగటం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్లే భావించాలి. ఐతే భారతదేశంలోని జీహాదీలకు మావోయిస్టులకు క్రూసేడర్లకు భారత రాజ్యాంగంపై గౌరవం లేదు. ఇది బూటకపు ప్రజాస్వామ్యం అని వారు అంటారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఒకసారి ఇలా అన్నారు.‘ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వట్టి బూటకం, ఐనా మేము ఈ ప్రక్రియలో ఎందుకు పాల్గొంటున్నామంటే ఈ ప్రక్రియలోని డొల్లతనాన్ని నిరూపించటం కోసమే’ అని. పాకిస్తాన్‌లో భుట్టో, బేనజీర్ భుట్టో వంటి నాయకులను నిర్మూలించారు. ఇది జీహాదీ లక్షణం. రష్యాలో చైనాలో టిబెట్టులో ఇలాగే జరిగింది. అంటే మానవీయ మూల్యాలులేని సిద్ధాంతాలకు రాజకీయ పరిగణన కల్పించటం ఈ శతాబ్దంలో మనం చూస్తున్నాము. కాంగ్రెసు పార్టీ నాయకులు ఇందిర, రాజీవ్‌గాంధీలు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని వేలుపిళ్ళై ప్రభాకరన్‌కు తమిళనాడు నుండి చైనానుండి అందిన ఆయుధ సామగ్రి సహాయాన్ని కాదనగలమా? ఒకవేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నచ్చకపోతే ప్రత్యామ్నాయ పాలనామార్గం ఆలోచించుకోవటం మంచిది.

- ముదిగొండ శివప్రసాద్