మెయిన్ ఫీచర్

జలసిరి ఆమె ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మదా నందకుమార్‌కు నీరంటే ప్రాణం.‘ప్రకృతి ప్రసాదించిన నీటిని వృథా చేయకండి, కాపాడుకోండి’ అని చెబుతాం కాని ఆచరించం. కాని నర్మద ఆచరించి చూపిస్తుంది. నీళ్లని అపరిశుభ్రంగా చేస్తే చాలు ఆమెకు ఎంతో బాధ. అందుకే ఎక్కడ నీటి ట్యాంక్‌లు కనిపించినా.. చెరువులు కనిపించినా.. అవి అపరిశుభ్రంగా ఉంటే చాలు వాటిని స్వయంగా బాగుచేసి నలుగురికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతుంది. చెన్నైకు చెందిన నర్మద కొనే్నళ్ల క్రితం ఎకనామిక్స్ టీచర్. పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పకుండా.. ఇలా పర్యావరణవేత్తగా మారటానికి కారణం ఆమెకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే.

ఒకప్పుడు చెన్నైలోని రాజుపాలెం పట్టణంలో నివశించే సమయంలో నర్మదా నందకుమార్ బిందెడు నీటి కోసం పడరాని పాట్లు పడింది. కొన్ని వారాల పాటు అసలు ఆ ఏరియాకు నీటి సరఫరానే జరిగేది కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఒకేఒక చెరువులో చెత్తాచెదారం వేయటం వల్ల ఆ నీరు కనీస అవసరాలకు ఉపయోగించలేని పరిస్థితి. 30 శాతం వరకు పిచ్చిమొక్కలు పెరిగిపోయింది. కలెక్టర్‌కు తానే స్వయంగా ఎన్నో విజ్ఞప్తులు చేసింది. ఏ అధికారి స్పందించలేదు. చూస్తాం..చేస్తాం అని చెప్పేవారే. విసుగుచెందిన నర్మద చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి పర్యావరణవేత్తగా మారింది. ప్రకృతి ప్రసాదించిన నీటిని నిల్వచేసే నీటి వనరుల సంరక్షణ బాధ్యత తన భుజ స్కందాలపై వేసుకుంది.
అంబత్తూరు చెరువుతో ఆరంభం
తన స్వచ్ఛంద సేవను అంబత్తూరు చెరువుతో ఆరంభించింది. ఆ చెరువునిండా కలుపుమొక్కలు, ఆ ప్రాంతవాసులు విసిరేసే వ్యర్థపదార్థాలతో కలుషితంగా ఉండేది. ఇక్కడ నుంచే తన మిషన్‌ను ఆరంభించాలని భావించింది. పెద్ద కర్ర, కొడవలి చేతబట్టి ప్రతిరోజూ చెరువు వద్దకు వచ్చి మొక్కలను, వ్యర్థపదార్థాలను తొలగించటం ఆరంభించింది. తొలుత ఆమె చేస్తున్న పనిని చూసి చుట్టుపక్కల వాళ్లు సహకరించక పోగా.. నవ్వేవారు. అయినప్పటికీ సిగ్గుపడకుండా.. ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేది. తాను చేస్తున్న పని వల్ల చుట్టుపక్కల వాళ్లు చైతన్యవంతులైతే చాలు అనేది ఆమె ఆశ. అనుకున్నట్లుగానే నర్మదా నందకుమార్ స్వచ్ఛంద సేవను గుర్తించిన పీడబ్ల్యూడీ అధికారుల్లో కదలిక వచ్చింది. ఆ శాఖ అధికారులు వర్కర్స్‌ను నియమించి చెరువును శుభ్రం చేశారు. నర్మద తీసుకువచ్చిన చైతన్యం వల్ల ఇపుడు ఈ చెరువుతో పాటు పూండి, చెంబరంబాక్కం చెరువులు శుభ్రపడ్డాయి. చెన్నై పట్టణవాసులకు ఈ రెండు చెరువుల నీరు సరఫరా చేస్తే చాలు నీటి సమస్యే ఉండదు. కాని అక్కడి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా నీటిని పాడుచేసుకుంటున్నారు. చెరువులను బాగుచేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన నిధులు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవటం వల్ల ఈ నీటి వనరులు ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉండేవి. నర్మద తీసుకువచ్చిన చైతన్యం వల్ల నేడు ఇవి వినియోగంలోకి వచ్చాయి. నీటి వనరుల అపరిశుభ్రత వల్ల ఆక్సిజన్ అందక ఇక్కడ చెరువుల్లోని చేపలు సైతం చనిపోతుండేవి. ఇపుడు చక్కగా చేపలు బతుకుతున్నాయి. స్థానికులకు నీళ్లు అందుతున్నాయి.
ఇలాగే తంజావూరులోని మొలై కందకాన్ని సైతం స్థానికులు సహకరించకపోయినా శుభ్రం చేసింది. ఇలా ఎక్కడ చెరువు కనిపించినా, నీటి ట్యాంక్ కనిపించినా వాటిని స్వచ్ఛందగా శుభ్రం చేస్తూ అధికారుల్లోనూ, ప్రజల్లోనూ చైతన్యం తీసుకువస్తుంది.
అలసత్వమే కారణం
రాష్ట్రంలో 30,400 వరకు నీటి వనరులు ఉన్నాయి. అధికారుల అలసత్వం వల్ల ఇవి ప్రజలకు ఉపయోగపడటం లేదని నర్మద ఆవేదన. నిధులున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దేవాలయాల్లోని సరస్సులు సైతం కలుషితమవుతున్నాయని అంటున్నారు. భర్త ఇస్తున్న ప్రోత్సాహంతో ఆమె తన సోషల్ వర్క్‌ను ఇతర జిల్లాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇపుడు కావేరీ డెల్టా జిల్లాల్లోని చెరువులను శుభ్రం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. చెన్నై నుంచి ఆ ప్రాంతాలకు వ్యయప్రయాసలకు గురైనా వెళతానని చెబుతుంది. నర్మదా బచావో అని రైలురోకు, రాస్తారోకులు చేసే బదులు ఇలా అందరూ సమిష్టిగా చెరువులను శుభ్రం చేసుకుంటే ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు కదా అనేది నర్మద అభిప్రాయం.
ఆర్థికంగా పేదరాలైనా..
నర్మద భర్త చిన్న కాంట్రాక్ట్ కార్మికుడు. ఆమెకు పనె్నండేళ్ల కుమార్తె, తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె సేవకు కన్నబిడ్డలు సైతం ఆటంకం కల్పించరు. వారి సంరక్షణ బాధ్యత తల్లి చూసుకుంటుంది. అంతేకాదు నర్మద ఇంటి వద్ద ట్యూషన్లు సైతం చెబుతుంది. వారి నుంచి ఫీజులు వసూలు చేయదు. కేవలం తన సేవకు అవసరమైన డబ్బును స్వచ్ఛందంగా ఇవ్వమని అడుగుతుంది. వారు సంతోషంగా ఇస్తే తీసుకుంటుంది. ఆమెకు ఉన్న ఆస్థి ఇల్లు మాత్రమే. అందులో ఓ ఫోర్షన్ అద్దెకు ఇచ్చి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటి అవసరాలకు వినియోగిస్తోంది. స్వామి వివేకానంద ఇచ్చిన సందేశమే తన స్వచ్ఛంద సేవకు ప్రేరణ అని నర్మద చెబుతుంది.
*