మెయిన్ ఫీచర్

పిల్లలకు.. ఇవి నేర్పాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు రాత్రి సమయంలో 9-10 గంటల మధ్య నిద్రపోయి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచే విధంగా అలవాటు చేయాలి. రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని ఉండటంవలన శరీరంలో వేడి పెరిగి పలు అనారోగ్య సమస్యలు కలుగుగతాయి. అంతేకాకుండా కళ్ళ సంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి. రాత్రి పూట కన్నా ఉదయం పూట మనస్సు, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. దీనివలన, వారి బుద్ధి కూడా చురుకుగా పనిచేస్తుంది. ఈ సమయంలో చదువుకొన్న అంశాలు బాగా జ్ఞాపకం ఉండిపోతాయి.

‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’ అని మన పెద్దలు ఊరక చెప్పలేదు. సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయని ప్రస్తుతం అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దురదృష్టం ఏమిటంటే ‘తిలా పాపం తలా కొంచెం’ అన్న చందాన, విలువలు తగ్గిపోవడానికి తాము కూడా కారణమనే విషయాన్ని గుర్తించకపోవడమే. మనం పిల్లల్ని సక్రమంగా పెంచకపోవడంవల్లనే, వారు పెద్ద అయిన తరువాత సంస్కారహీనులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను చూస్తే జాలేస్తుంది. తాము చిన్నతనంలో పడిన కష్టాలు, తమ పిల్లలు పడకూడదు అని తపన పడటం తప్ప వారికి చదువుతోపాటు సంస్కారం నేర్పుతున్నామా? అనే అంశాన్ని విస్మరిస్తున్నారు. మాటలు, నడక సక్రమంగా వచ్చీరాకముందే వారిని జైళ్ళవంటి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆటలు అంటే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్‌లలోవి మాత్రమే. ఫలితంగా పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతున్నది. ఊబకాయం అనేది ఉగ్రవాదం కన్న ప్రమాదకరమైనదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
పిల్లల్ని మంచి కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివించాలి. వారికి సకల సౌకర్యాలు కల్పించాలనే తపనతో భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో న్యూక్లియర్ కుటుంబాలు పెరిగిపోయాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు బయట ఆడకుండా ఇంట్లోనే ఉండడం కోసం వారికి టీవీ చూడటం, కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌లలో గేమ్స్ ఆడటాన్ని మనమే అలవాటు చేసి వాటికి బానిసలను చేస్తున్నాం. పిల్లలు గడుసుగా సమాధానం చెబితే చిరుప్రాయం సరదాగానే ఉంటుంది. అదే అలవాటుగా మారితే పెద్దలంటే వినయ విధేయతలు తగ్గిపోవటానికి కారణమవుతుంది.
పిల్లలు రాత్రి సమయంలో 9-10 గంటల మధ్య నిద్రపోయి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచే విధంగా అలవాటు చేయాలి. రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని ఉండటంవలన శరీరంలో వేడి పెరిగి పలు అనారోగ్య సమస్యలు కలుగుగతాయి. అంతేకాకుండా కళ్ళ సంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి. రాత్రి పూట కన్నా ఉదయం పూట మనస్సు, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. దీనివలన, వారి బుద్ధి కూడా చురుకుగా పనిచేస్తుంది. ఈ సమయంలో చదువుకొన్న అంశాలు బాగా జ్ఞాపకం ఉండిపోతాయి. పెద్దలపట్ల వినయంగా, మర్యాదగా, ప్రేమగా ఉండటం పిల్లలకు చిరుప్రాయంనుంచే నేర్పించాలి. మనం మన తల్లిదండ్రులను, ఇతర పెద్దలను గౌరవిస్తే, మన పిల్లలు కూడా అదేవిధంగా వ్యవహరించడం అలవాటుగా మారుతుంది. పిల్లల్ని అపురూపంగా పెంచండి ఎవరూ కాదనరు. అయితే, వారు మీకు ఇంటి పనులలో సాయం అందించేలా చూసుకోండి. దీనివలన పిల్లల్లో మన పని మనం చేసుకోవడం తప్పుకాదనే భావన పెరగడంతో పాటు పనిని గౌరవించే సంప్రదాయం అలవాటు అవుతుంది.
పిల్లలు ఎదురుచెప్పకుండా, పుస్తకాలు సక్రమంగా ఉంచుకొనేలా చూడండి. మరీ ముఖ్యంగా వారు అబద్ధాలు చెప్పకుండా చూడండి. వారు అబద్ధాలు చెబుతున్నట్లు గమనిస్తే, అబద్ధాలవలన కలిగే వైపరీత్యాలు గురించి వారికి వివరించి చెప్పండి. పిల్లలకు చిరుప్రాయం నుంచే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించే విధంగా నేర్పండి. దీనివలన వారికి మానసికంగా ప్రశాంతత కలగడంతోపాటు, ఆధ్యాత్మికత వారిలో పెరుగుతుంది. రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయానే్న నిద్రలేచేవారు దీర్ఘ ఆయుష్షు, మంచి ఆరోగ్యాన్ని కలిగివుంటారు. ప్రస్తుత పరిస్థితులలో మంచి ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. పిల్లలపట్ల అమిత ప్రేమ చూపిస్తే సరిపోదు, వారిని విలువలతో కూడిన మనుషులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

-పి.భార్గవరామ్