మెయిన్ ఫీచర్

రసవత్తరం..రావణ ఛరితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావణాసురుణ్ణి విష్ణుమూర్తి రామావతారం ఎత్తి సంహరించారని మనందరికీ తెలుసు. కాని మనలో చాలామందికి తెలియని విషయం- రావణునకుకూడా విష్ణుమూర్తి కుటుంబానికి చెందినవాడేననీ, విష్ణుమూర్తికి సాక్షాత్తు మునిమనుమడేననీ- ఎలా?
రావణుని వంశక్రమాన్ని పరిశీలిస్తే-
విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ, బ్రహ్మనుండి పులస్త్యమహర్షి పులస్త్య మహర్షినుంచి విశ్రావస్ మహర్షి
అతని నుండి రావణుడు జన్మించిన విషయం తెలుస్తుంది. విష్ణుమూర్తి తన వంశానికి చెందిన వాణ్ణి సంహరించడానికే సూర్యవంశంలో రాముడుగా జన్మించాడా? అని సందేహం వస్తుంది. ‘అవును’ అనేది దానికి జవాబు. ఎందువల్ల? అంటే-
ఉన్నది విష్ణుమూర్తి ఒక్కడే కాగా సృష్టికార్యక్రమ నిర్వహణకై తానే స్ర్తి రూపం దాల్చి లక్ష్మిగా మారి- తామిద్దరే సృష్టి ప్రారంభానికై బ్రహ్మ, సరస్వతిగా, సృష్టి విరమణకై శివపార్వతులుగా కూడా మారడం జరిగింది కాబట్టి.
విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు- ఈ ముగ్గురూ ఒక్కడే. అతడు జన్మ, మృత్యు, జరారహితుడు. జన్మ మృతిలాగానే వెలుగు- చీకటి, పగలు- రాత్రి ఇత్యాది ద్వంద్వాలు ఏవీ లేనే లేవు కాబట్టి కాని విష్ణుమూర్తి నుండి ఉద్భవించిన సృష్టి అనంతమైనది. దానిలో భాగంగానే రావణునికి ప్రత్యేకంగా వంశ చరిత్ర ఏర్పడింది. బ్రహ్మనుండి పులస్త్య మహర్షి, పులస్త్య మహర్షి నుంచి విశ్రావస్ మహర్షి ఉద్భవించగా- ఆ విశ్రావస్ మహర్షి కైకసి అనే ఋషి కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనే ముగ్గురు కుమారులు, శూర్పనఖ అనే కుమార్తె జన్మించారు.
విశ్రావస్ మహర్షికి దేవవాణి అనే మరో భార్య ద్వారా కుబేరుడు జన్మించాడు. అతడు దేవలోకం నుండి పుష్పక విమానాన్ని పొందాడు. లంకను తన రాజ్యంగా చేసుకొని పాలించసాగాడు. రావణుని తల్లి అయిన కైకసి ఈ పరిస్థితిని సహించలేకపోయింది. కుబేరుని సంపదను, అధికారాన్ని చూచి ఈర్ష్య చెందింది. తన సంతానమైన రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి పిలిచి కుబేరుని మించే సంపదనూ, అధికారాలనూ పొందడానికై తపస్సు చేయమని ఉద్బోధించింది. వారు బ్రహ్మను గురించి తపస్సు చేసి మెప్పించారు. రావణుడు ఆరోగ్యం, అధికారం, సంపద పొందేట్టు వరాలు పొందడమేకాక తమకు సృష్టిలో ఎవ్వరివల్లా మృత్యువు సంభవించకూడదు అని పేరుపేరునా చెబుతూ మానవుని వల్ల మృత్యువు సంభవించకూడదు అని అడగడం అనవసరం అనుకొని వదలివేశాడు. కుంభకర్ణుడు నిద్రను కోరుకున్నాడు. విభీషణుడు తమ వంశానికి మూల పురుషుడైన విష్ణువు పట్ల భక్తిని, ప్రపత్తిని కోరుకున్నాడు. దాని ఫలితంగా రావణుడు ఏడు లోకాలనూ జయించి అధిపతి అయినాడు. కుబేరుని సంపదను అంతనూ స్వాధీనం చేసుకొని లంకకు అధిపతి అయినాడు.
రావణునికి పది తలలు ఉన్నాయి. వాటిలో నాలుగు మాత్రమే మంచి ఆలోచనులు చేసేవి. మిగతా ఆరు తలలూ దురాలోచనలకే అంకితమైనాయి. మంచివైన నాలుగు తలలు వల్లా నాలుగు వేదాలూ పఠించి పండితుడైనాడు, కాని దురాలోచనలు చేసే ఆరు తలలవల్ల తన ఐదు జ్ఞానేంద్రియాలైన త్వక్ (చర్మము) చక్షు (కళ్లు) శ్రోత్ర (చెవులు) జిహ్వా (నాలుక) ఆఘ్రణము (ముక్కు) పైనా ఐదు కర్మేంద్రియాలైన వాక్ (నోరు) పాణి (చేతులు) పాద (కాళ్లు) పాయు (మల ద్వారము) ఉపస్థ (మూత్ర ద్వారము) పైనా అదుపును కోల్పోయి భ్రష్టుడై అహంకార పూరితుడై ప్రతివారినీ అదరిస్తూ, బెదిరిస్తూ, భయపెడుతూ అందరి నుండీ దూషణలు పొందసాగాడు. రావణుడు ఒకసారి దేవనర్తకియైన రంభను అవమాన పరచే ప్రయత్నం చేయగా ఆమె భర్తయైన నలకూబరుడు అతణ్ణి శపించాడు. ‘నీ పది తలలూ శరీరం నుండి తెగి క్రిందపడి ముక్కలు ముక్కలు అయిపోవుగాక’ అని. అదుపు లేని అహంకారంవల్ల రావణుడు పొందిన దుష్ఫలితాలలో ఇది మొదటిది. రావణుడు దేనినీ లెక్కచేయదలచలేదు. మహర్షి కుశధ్వజుని కుమార్తె వేదవతి విష్ణుమూర్తి తనకు భర్త కావాలని కోరుకుంటూ తపస్సు చేస్తోంది. రావణుడు విష్ణ్భుక్తురాలైన ఆమెను నిందించి చెరబట్టబోయాడు. ఆమె ఆగ్రహించి ‘నీ అధికారం, సంపద అన్నీ నశించిపోతాయి. నువ్వు ఒక మానవుడి చేతిలో చస్తావు’ అని శపించింది. ఆమెయే సీతగా జన్మించి రాముని పెండ్లాడి రావణ వధకు కారణం అయింది. రావణుని అహంకారమే అన్ని విధాలా అతని అధఃపతనానికి కారణం అయింది. రావణుడు ఒకసారి శివుని ఆరాధించడానికై కైలాసానికి వెళ్లాడు. శివుని ఆరాధించదలచిన వారు ఎవరైనా ముందుగా నందికేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. రావణుడు అందుకు ఇష్టపడలేదు. శివుడు ధ్యాన నిష్ఠుడై ఉన్నందున నందికేశ్వరుడు రావణుణ్ణి అడ్డగించి శివునివద్దకు పోనివ్వలేదు. దానితో రావణుడు ఆగ్రహించి ‘ఒరే కోతీ! పక్కకు తొలగరా!’ అన్నాడు. నందికేశ్వరుడికి బాగా కోపం వచ్చింది. ‘రావణా’ నీ రాజ్యం కోతులవల్లనే ధ్వంసం అయిపోతుంది’ అని శపించాడు. రావణుడు ఒకసారి వశిష్ఠుని వద్దకు వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించి వేదాలు బోధించాలని కోరాడు. కాని వశిష్ఠుడు అందుకు అంగీకరించలేదా, దానిలో రావణుడు ఆగ్రహించి వశిష్ఠుని బంధించి తనతో తీసుకొనిపోయాడు. కాని వవిష్ఠుని శిష్యుడు సూర్యవంశపు రాజు అయిన కువలయస్థుడు రావణునితో యుద్ధంచేసి వశిష్ఠుని రావణుని బంధనాలనుండి విడిపించాడు. అప్పుడు వశిష్ఠుడు రావణుణ్ని శపిస్తూ ‘నువ్వు సూర్యవంశపురాజు చేతుల్లో చస్తావు’ అన్నాడు. అష్టావక్రమహర్షి తన గూను నడుముతో, శరీరంలోని అనేక వంకరలతో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండగా రావణుడు ఆ మార్గం గుండా వస్తూ అతణ్ణి చూచి ‘ఓ కోతీ!’ అని పరిహాసం చేశాడు. దానితో అష్టావక్రుడు కోపగించుకొని ‘కోతులే నీపైన దాడిచేసి నీ పొగరు అణుస్తాయి’ అని శపించాడు.
దత్తాత్రేయుడు గంగాజలాన్ని ఒక పాత్రలో నింపుకొని ప్రక్కన ఉంచుకొని తన గురువుల పాదాలు కడగబోతుండగా రావణుడు ఆ మార్గాన వచ్చి ఆ పాత్రలోని నీటిని దత్తాత్రేయుడి తలపై కుమ్మరించి వెకిలిగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. అందుకు అతడిపై దత్తాత్రేయుడు ఆగ్రహించి ‘నీ పది తలలూ తెగి రక్తం ఇలాగే కుండపోతగా కురియుగాక’ అని శపించాడు. ద్వైపాయన మహర్షి తన సోదరి సహకారంతో తపస్సు చేస్తుండగా రావణుడు ఆ ఆశ్రమంలో ప్రవేశించి, అతడి ప్రశ్నలకు జవాబులు చెప్పలేదని కోపగించి ఆమె పెదవుల్ని కోసివేశాడు. ఆమె బాధతో గోలపెడుతుండగా మహర్షి సమాధి నుండి మేల్కొని రావణునిపై ఆగ్రహించి నీ లంకపై దాడి చేసిన మానవుడు ఒకడు నీ సోదరి పెదవుల్ని, ముక్కును చెవుల్ని కూడా కోసివేస్తాడు అని శపించాడు. రావణుడు ఒకసారి నారదుని వద్దకు వెళ్లి ఓంకార మంత్రం ఉపదేశించమని కోరాడు. నారదుడు అందుకు నిరాకరిస్తూ అహంకారంతో హూంకరించే వారికి ఓంకార మంత్రాన్ని ఉపదేశించడం జరగదు అన్నాడు. ఉపదేశించకపోతే నీ తల తెగుతుంది అన్నాడు రావణుడు మరింత దర్పంతో. నారదుడు బెదరలేదు. నీ పది తలలూ ఒకేసారి తెగిపోతాయి జాగ్రత్త అని రావణుణ్ణి హెచ్చరించారు.
బ్రహ్మదేవుని కుమార్తెయైన పుంజికాదేవిని ఒకసారి రావణుడు చేతితో తాకబోతూ అవమాన పరచాడు. అందుకు ఆగ్రహించి ఆమే ‘పర స్ర్తి వ్యామోహంవల్లనే నీ పది తలలూ తెగిపడతాయి’ అని శపించింది. రావణుడు దేవతలపై దాడి చేసి అందరినీ బందీలుగా చేసి బృహస్పతి కుమార్తె సుఖదేవితో రమించబోగా బృహస్పతి ఆగ్రహించి ‘ఈ మన్మథ బాణమే రామబాణమై నిన్ను సంహరిస్తుంది’ అని శపించాడు.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి